రొమాంటిక్ భాగస్వామి లేకుంటే ..
న్యూయార్క్: రొమాంటిక్ భాగస్వామి లేనివారు పెట్టే పెట్టుబడులు నష్టాలను తెస్తాయట. వీరు భాగస్వామిని వెతికే క్రమంలో విచక్షణ కోల్పోయి అధిక ప్రమాదం-అధికాదాయం ఉన్న వాటిపై పెట్టుబడులు పెడతారని మిచిగాన్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. ప్రతికూల ఫలితాలను పొందే అవకాశమున్నవారు ప్రమాదాన్ని తగ్గించేందుకు పెట్టుబడులను వివిధ మార్గాల్లో పెడతారనీ, రొమాంటిక్ భాగస్వామి లేనివారు వ్యూహాత్మ పెట్టుబళ్లు పెట్టలేరని వెల్లడైంది.