అక్రమంగా తిరుగుతున్న రెండు బస్సులు సీజ్
ఎలాంటి అనుమతులు, రూట్ పర్మిట్ లేకుండా తిరుగుతున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను నల్గొండ జిల్లా భువనగిరిలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి మంగళవారం పట్టుకున్నారు. బ్లూమూన్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ప్యాసింజర్లను తరలిస్తుండగా భువనగిరిలో పట్టుకున్నారు. వీరిపై కేసులు బుక్ చేసి.. బస్సులను సీజ్ చేశారు.