rover snaps
-
రెండు రోజుల్లో చంద్రుడిపై పగలు.. రోవర్, ల్యాండర్ పరిస్థితి?
బెంగళూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇప్పటికే కీలక సమాచారాన్ని అందించాయి. అయితే, చంద్రుడిపై లూనార్ నైట్ ప్రారంభం కావడంతో ఇస్రో.. ఈ నెల 2, 4 తేదీల్లో ల్యాండర్, రోవర్లను నిద్రాణ స్థితిలోకి పంపింది. రోవర్, ల్యాండర్ నిద్రలేచేనా? ఇదిలా ఉండగా.. తాజాగా చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణస్థితి నుంచి బయటకు రావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి పగలు మొదలయ్యాక 22న ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది. లూనార్ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్ మళ్లీ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అక్కడి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోవడం, రీఛార్జి కావడంపైనే ఇది ఆధారపడి ఉంది. అయితే, రోవర్, ల్యాండర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Chandrayaan-3 Mission: Vikram Lander is set into sleep mode around 08:00 Hrs. IST today. Prior to that, in-situ experiments by ChaSTE, RAMBHA-LP and ILSA payloads are performed at the new location. The data collected is received at the Earth. Payloads are now switched off.… pic.twitter.com/vwOWLcbm6P — ISRO (@isro) September 4, 2023 చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో విడుదల చేసింది. మరోవైపు.. రోవర్ ప్రజ్ఞాన్ సరైన దారిని వెతుక్కునే క్రమంలో అక్కడక్కడే తిరుగాడుతున్న దృశ్యాలను ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీడియో తీసింది. ఈ వీడియోను ఇస్రో తన అధికారిక ఖాతాలో పంచుకుంది. Chandrayaan-3 Mission: The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera. It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately. Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp — ISRO (@isro) August 31, 2023 విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్.. పరిశోధనలను కొనసాగిస్తోంది. చంద్రునిపై నీటిజాడ, వాయువులు, మట్టి, అక్కడ దొరుకుతున్న రసాయనిక పదార్థాల గురించి ఆరా తీస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సల్ఫర్ మూలకం పుష్కలంగా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే గుర్తించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా అక్కడ ఉన్నట్లు కనుగొంది. చంద్రునిపై ఉష్ణ్రోగ్రత 70 డిగ్రీల వరకు ఉంటోందని ఇస్రో తెలిపింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 -
Chandrayaan-3: ల్యాండర్ నుంచి చంద్రుడిపైకి ప్రజ్ఞాన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్ నుంచి ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తున్న వీడియోను, ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. వీటిని ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ వీడియో, ఫొటోలను విక్రమ్‌లోని ల్యాండర్ ఇమేజర్ కెమెరా వీటిని చిత్రీకరించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి ఇప్పటిదాకా 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో ప్రకటించింది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్ళకు కడుతూ...
న్యూయార్క్ : అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు స్ధిర నివాసం ఏర్పరచుకునే అనుకూల పర్యావరణ పరిస్ధితులు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆగస్టు 5న మార్టిన్ ఉపరితలంపై నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ 2012 కాలుమోపింది. రోవర్ 21.92 కిలోమీటర్లు ప్రయాణించి, రెడ్ ప్లానెట్‌లో మొత్తం 654,661 చిత్రాలను తీసింది. నాసా క్యూరియాసిటీ రోవర్ 2.43 .జీబీ ఫైలు పరిమాణాన్ని కలిగి ఉన్న మార్స్ యొక్క అత్యధిక-రిజల్యూషన్ కలిగిన అంగారక సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించే 1000 ఫోటోలను విడుదల చేసింది. 360-డిగ్రీల అనుభూతిని ఆస్వాదించేలా ఉన్న ఈ చిత్రాలు , 2019 నవంబర్ 24 - డిసెంబర్ 1 మధ్య తీసినవి. ఈ రోవర్ వ్యక్తిగత షాట్లను తీసేందుకు నాలుగు రోజులలో ఆరున్నర గంటలకు పైగా అవసరం. "మా బృందంలో చాలామంది టర్కీ అందాలను ఆస్వాదిస్తుండగా, క్యూరియాసిటీ అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్ళకు కడుతూ ఈ అద్భుత చిత్రాలను అందించింద’ని క్యూరియాసిటీ రోవర్ మిషన్‌కు నాయకత్వం వహించిన సంబంధిత ప్రాజెక్ట్ శాస్త్రవేత్త అశ్విన్ వాస్వాడ అన్నారు. ఇక 2013లోనే రోవర్ మాస్ట్‌క్యామ్ కెమెరాలతో పాటు నావిగేషన్ కెమెరాలను ఉపయోగించి 1.3 బిలియన్-పిక్సెల్ పనోరమా చిత్రాన్ని రూపొందించింది. క్యూరియాసిటీ ప్రయాణం క్యూరియాసిటీ అంగారక గ్రహంపై ప్రయాణిస్తున్న క్రమంలో ఈ బిలం కొన్ని వందల సంవత్సరాల కిందట ఓ సరస్సుతో పాటు సూక్ష్మజీవుల జీవనానికి అనుకూలమైన వాతావరణం కలిగి ఉందని కనుగొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో నాసా రెడ్ప్లానెట్పై క్యూరియాసిటీ తీసిన సెల్ఫీని అలాగే అంగారక గ్రహంపై పురాతన ఒయాసిస్ చిత్రాన్ని వెల్లడించిన క్రమంలోనూ ఇవే అంచనాలు వెల్లడయ్యాయి. అంగారక గ్రహంపై సూక్ష్మజీవుల ఆనవాళ్లను అందించేలా క్యూరియాసిటీ కొత్త సాక్ష్యాలను కూడా కనుగొంది, ఉప్పగా, నిస్సారమైన చెరువులు గతంలో ఉండేవని, క్రమంగా ఇవి ఎండిపోయాయనే సంకేతాలను పసిగట్టింది. చదవండి : 'నాసా'మిరంగా! రెడ్ప్లానెట్లో మీథేన్ రహస్యాన్ని ఛేదించేలా అంగారక గ్రహంపై మీథేన్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని కూడా ఇది వెల్లడించింది. ప్రస్తుతానికి, క్యూరియాసిటీ నాసా యొక్క చురుకైన మార్స్ రోవర్. కాగా, మార్స్ 2020 రోవర్ సైతం రెడ్ప్లానెట్పైకి వెళ్లనుంది. రెండు రోవర్లు కవలల్లా కనిపించినా ఇవి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.. ఈ రెండు రోవర్లు అంగారక గ్రహం గుట్టుమట్లను మరింతగా జనబాహుళ్యానికి చేరవేయనున్నాయి. చదవండి : నింగిలోకి సోలార్ ఆర్బిటర్ -
ఆ గ్రహం పై ఓ సెల్ఫీ
వాషింగ్టన్: సెల్ఫీల ట్రెండ్ భూమిని దాటి అంగారక గ్రహాన్ని కూడా తాకింది. క్యూరియాసిటీ రోవర్ అరుణ గ్రహంపై తీసుకున్న సెల్ఫీలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) విడుదల చేసింది. రోవర్‌కు ఉన్న ఏడు అడుగుల రోబోటిక్ చేయిని సెల్ఫీ స్టిక్‌గా ఉపయోగించి ఈ సెల్ఫీలను తీసుకుంది. మార్స్ పై పరిశోధనల కోసం నాసా, క్యూరియాసిటీ రోవర్‌ను పంపిన విషయం తెసిందే. అంగారక గ్రహంపై గతంలో ఉన్న ప్రదేశంలోనే చాలా వారాలు గడిపిన క్యూరియాసిటీ రోవర్ ఇటీవలే సిలికా, హైడ్రోజన్ సమృద్ధిగా ఉన్న జియలాజిక్ కాంటాక్ట్ జోన్, శిలలను పరీక్షించడానికి కొత్త ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుండి నైరుతి దిశగా కదులుతూ మౌంట్ షార్ప్ పర్వతం వైపు కదులుతుంది. 2012లో అంగారకుడిపై ల్యాండ్ అయినప్పటి నుంచి క్యూరియాసిటి అక్కడ 11 కిలోమీటర్లు ప్రయాణించింది.