Rs 200 notes
-
రూ.200, 2వేల నోట్లు.. కొత్త సమస్య
సాక్షి, ముంబై: పెద్ద నోట్లు రద్దు తరువాత దేశీయ బ్యాంకులను మరో కొత్త తలనొప్పి వేధిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత చలామణిలోకి తీసుకొచ్చిన కరెన్సీ వ్యవహారంలోనే ఈ కొత్త చిక్కు. పాడైపోయిన, లేదా చిరిగిపోయిన 200, 2000 రూపాయల నోట్ల మార్పిడి బ్యాంకర్లకు తాజాగా పెద్ద సమస్యగా పరిణమించింది. దీనికి సంబంధించిన ఆర్బీఐ చట్ట నిబంధనలను త్వరితగతిన సవరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బ్యాంకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజా కరెన్సీ నోట్లకు అనుగుణంగా ఆర్బీఐ ‘నోట్ రీఫండ్’ చట్ట నిబంధనల్లో కొత్తగా మార్పులు చేపట్టకపోవడంతో ఈ నోట్ల మార్పిడికి అవకాశం లేదు. దీంతో ఎక్స్చేంజ్ కౌంటర్లలో ఇలాంటి (పాడైపోయిన, మాసిన) నోట్లు పేరుకుపోతున్నాయి. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం రూ .5, రూ 10, రూ .50, రూ 100, రూ .500, 1,000, రూ .5,000, రూ. 10,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన 200 రూపాయలు, 2,000 నోట్లు ఈ జాబితాలో ఇంకా చేర్చలేదని, దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని వివిధ బ్యాంకులు వాపోతున్నాయి. అయితే, ఈ చట్ట సవరణ అవసరంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదించామని ఆర్బీఐ చెబుతోంది. మరోవైపు చలామణిలో రూ.500, రూ.200, రూ.100 నోట్లు చాలినన్ని ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఇటీవల( ఏప్రిల్,17న) ప్రకటించారు. సుమారు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపి వేసిందని కూడా స్పష్టం చేశారు. కాగా 2016, నవంబర్ 8వ తేది రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం, వీటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2,000, 200 నోట్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. -
ఏటీఎంల్లో రూ.200 నోట్లకు 3 నెలలు ఆగాల్సిందే
న్యూఢిల్లీ: ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన రూ.200 నోట్లు ఏటీఎం మెషిన్లలోకి రావడానికి ఎంత లేదన్నా మరో మూడు నెలల వరకు సమయం పట్టేట్టు ఉంది. రూ.200 నోట్లు పట్టే విధంగా ఏటీఎం మెషిన్లలో మార్పులు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. కొత్త రూ.200 నోటుకు అనుగుణంగా ఏటీఎం యంత్రాల్లో మార్పులు చేయాలంటూ ఆర్బీఐ నుంచి తమకు ఆదేశాలేవీ రాలేదని ఏటీఎం నిర్వహణా కంపెనీలు అంటున్నాయి. కొన్ని బ్యాంకులు అనధికారికంగా కొత్త నోటుకు అనుగుణంగా మార్పులు చేసి చూడాలని కోరినట్టు తెలిపాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 2.25 లక్షల ఏటీఎంలలోనూ మార్పులు చేయాలా? అన్నదానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. -
ఆ నోట్ల సరఫరాను పెంచుతున్న ఆర్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : వినాయక చవితి సందర్భంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబేలా కొత్త రూ.200 నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. చిల్లర కొరతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ ఈ నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ఉత్పత్తిని కూడా ఆర్బీఐ భారీగా పెంచనుందట. ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ల వద్ద రూ.200 నోట్ల ఉత్పత్తిని పెంచామని, కాలక్రమంలో మరిన్ని నోట్లు మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొంది. అవసరమయ్యే మేరకు ఈ నోట్లు ప్రజల్లోకి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా వీటిని ఆర్బీఐ సరఫరా చేయనుంది. ప్రస్తుతమైతే ఈ కొత్త నోట్లు ఎంపికచేసిన ఆర్బీఐ ఆఫీసుల వద్ద, బ్యాంకుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎప్పడి నుంచి ఈ నోట్లను ఏటీఎంలలో అందించనుందో ఇంకా సెంట్రల్ బ్యాంకు స్పష్టంచేయలేదు. ఈ నోట్లు ఏటీఎంలలోకి రావాలంటే కొత్త సమయం పట్టే అవకాశమే కనిపిస్తోంది. కొత్త ఈ నోట్లు లావాదేవీలు వేగవంతం అవడానికి దోహదం చేస్తుందని, ముఖ్యంగా సాధారణ ప్రజానీకానికి ఇవి ఎంతో సహకరిస్తాయని గత నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ చెప్పారు. రూ.200 కరెన్సీ నోట్ల పొడవు ప్రస్తుత కరెన్సీకి భిన్నంగా ఉందని, క్యాసెట్ క్యాలిబ్రేషన్(సవరించాలి) చేయవలసిన అవసరం ఉందని తెలిసింది. 200 నోటుతో పాటు భారత్లో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు 1, 2, 5,10, 20,50,100, 500, 2000 డినామినేషన్లో ఉన్నాయి. ఇప్పటివరకు 100కు 500కు మధ్యలో ఎలాంటి డినామినేషన్ నోటు లేదు. 200 రాకతో వీటి అంతరాన్ని తొలగించింది. అంతేకాక పౌరుల దైనందిన లావాదేవీల్లో ఇబ్బందులు తొలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి ఉత్పత్తిని మరింత పెంచి, పౌరులకు మరింత సహకరించాలని ఆర్బీఐ చూస్తోంది. -
రూ. 200 నోట్లు వచ్చేస్తున్నాయ్..
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో రూ.200 నోట్లను మార్కెట్లోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నోట్లకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐకి అనుమతినిచ్చింది. వ్యవస్థలో తక్కువ డినామినేషన్ ఉన్న కరెన్సీకి అధిక డిమాండ్ ఉంటున్న నేపథ్యంలో ఆర్బీఐ రూ.200 నోట్లను చలామణిలోకి తీసుకువస్తోంది. ఆర్బీఐ సెం ట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ.200 నోట్ల ముద్రణకు అనుమతినిచ్చిందని ఆర్థిక శాఖ తాజా ప్రకటనలో పేర్కొంది. -
ఈ నెల చివర్లోనే కొత్త రూ.200 నోటు...
సాక్షి, కోల్కత్తా : చరిత్రలోనే మొట్టమొదటిసారి 200 డినామినేటెడ్ బ్యాంకు నోట్లు మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ఆగస్టు చివరి రోజుల్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కొత్త రూ.200 బ్యాంకు నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చలామణిలోకి తీసుకు రాబోతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న అనంతరం రూ.50 కోట్ల నోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల చలామణిలో ఎలాంటి అక్రమ ట్రేడింగ్ జరుగకుండా ఉండేందుకు ఆర్బీఐ అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటి వరకు రూ.100, రూ.500 డినామినేషన్ నోట్లకు మధ్యలో ఎలాంటి ఇతర డినామినేషన్ నోట్లు లేవు. ఆర్బీఐ ప్రస్తుతం తీసుకురాబోతున్న రూ.200 నోట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. ఈ కారణంతోనే పకడ్బందీగా ఈ నోట్లను విడుదల చేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 200 రూపాయిల బ్యాంకు నోట్ల విడుదలకు ఇటు కేంద్రం కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.200 నోట్లను ఆర్బీఐ జారీ చేయనున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. పెద్ద మొత్తంలో ఈ నోట్లను విడుదల చేస్తుండటంతో, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కార్యాచరణ సమస్యలను ఇవి నిరోధిస్తాయని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోస్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం మొట్టమొదటిసారి ఆర్బీఐ తీసుకొచ్చిన రూ.2000 బ్యాంకు నోట్లలో తీవ్రంగా బ్లాక్ మార్కెటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు, ఏజెన్సీలు జరిపిన తనిఖీల్లో గుట్టలుగుట్టలుగా ఈ నోట్లు బయటపడ్డాయి.