రూ. 46 లక్షల పాతనోట్లు పట్టివేత ?
రాజానగరం :
జాతీయ రహాదారిపై స్థానిక బైపాస్‌లోని పెట్రోలు బంకు వద్ద రూ.46 లక్షలు విలువైన రద్దు చేసిన కరెన్సీని రాజానగరం పోలీసులు పట్టుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. పెట్రోలు బంకు వద్ద ఈ నోట్ల మార్పిడి జరుగుతుదంటూ ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు మారువేషాలలో కాపుకాచి పట్టుకున్నట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించి కరెన్సీతోపాటు ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.