అత్తాపూర్లో రూ.1.9 లక్షలు స్వాధీనం
అత్తాపూర్ (హైదరాబాద్) : రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ 123వ నెంబర్ పిల్లర్ దగ్గర సోమవారం సాయంత్రం ఓ వాహనంలో తరలిస్తున్న నగదును ఎన్నికల సంఘం బృందం స్వాధీనం చేసుకుంది. జీహెచ్ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నగదు పంపిణీని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. అత్తాపూర్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఓ ఆటోలో తరలిస్తున్న సుమారు 1.90 లక్షలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.