rupa ganguly
-
ఆ సినిమాలను బాయ్‌కాట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చిత్రపరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. ఇండ్రస్ట్రీలో బంధుప్రీతి (నెపొటిజం) మూలంగానే యువ నటులకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు గొంతెత్తున్నారు. తామూ ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్ని మానసికంగా ఎంతో కుంగుబాటుకు గురయ్యామంటూ నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటున్నారు. సుశాంత్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెను దుమారాన్ని రాజేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి రూపా గంగూలీ ఘాటుగా స్పందించారు. చిత్రపరిశ్రమలో బంధీప్రతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తుల మూలంగా ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో బంధుప్రీతి తారాస్థాయికి చేరిందని ఆవేదన చెందారు. (నేనూ నెపోటిజమ్ బాధితుడినే) అన్ని రంగాల్లోనూ ఆ జాడ్యం వేళ్లూనుకుందని ఆమె అభిప్రాయడపడ్డారు. బంధుప్రీతి గలవారంటే తనకు అస్సలు గిట్టదని, ఆయా వర్గాలకు చెందిన వ్యక్తుల సినిమాలను చూడటం ఎప్పుడో మానేశానని చెప్పారు. చిత్రపరిశ్రమపై పట్టుకోసం కొందరు చేసే దుర్మార్గానికి ఎంతో మంది నటులు బలైపోతున్నారని ఆవేదన చెందారు. మరోవైపు సుశాంత్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని రూపా ఇప్పటికే డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే నెపోటిజాన్ని వెనకేసుకొస్తున్న వాళ్ల సినిమాలను బాయ్‌కాట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక గత నెలలో ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ మృతిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురుని విచారించిన పోలీసులు.. మరికొంత మందిని సైతం ప్రశ్నించే అవకాశం ఉంది. (ఆలియా, మహేష్ భట్‌పై కేసు నమోదు) -
నా కొడుకైతే మాత్రం?!
కూడబెట్టుకున్న సంపదను కరిగించేసినట్లే, కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని కూడా హరించేస్తుంటారు కొందరు పుత్రరత్నాలు. బీజేపీ ఎంపీ రూపా గంగూలి కుమారుడు ఆకాశ్ ముఖోపాధ్యాయ్ (20) కారు నడుపుతూ ఇంటి పక్కనే ఉన్న ఓ గోడను డీకొట్టాడు. ఆ ధాటికి గోడకు అవతల ఉన్న కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే గానీ ఏ దేవుడో చెయ్యి అడ్డు పెట్టి తృటిలో తప్పించేశాడు. గోడ మాత్రం కూలిపోయింది. కారు నడుపుతున్నప్పుడు అతడు తప్ప తాగి ఉండడాన్ని తాము చూశామని ఘటనాస్థలంలో ఉన్న వాళ్లు చెప్పడంతో పోలీసులు ఆకాశ్‌ని అరెస్ట్ చేశారు. ఎంపీ గారి తనయుడు కనుక శిక్ష లేకుండా బయటికి వచ్చేస్తాడని మనం అనుకోవచ్చు. కానీ రూపా గంగూలి ‘నో పాలిటిక్స్ ప్లీజ్’ అంటున్నారు. ‘దయచేసి ఈ ఘటనను రాజకీయం చేయకండి. నా కొడుకంటే నాకు ఇష్టమే. కానీ చట్టం తన పని చేసుకుపోతుంది’’ అని కొడుకు అరెస్ట్‌పై ఆమె ఒక ట్వీట్ పెట్టారు. కోల్‌కతాలోని గోల్ఫ్ గార్డెన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఆకాశ్ కారు గుద్దిన గోడ ఒక క్లబ్బుది. -
బీజేపీ మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో శాంతియుత పరిస్థితులు ఎంత బలహీనంగా ఉన్నాయో, మహిళలకు ఏపాటి రక్షణ ఉందో తెలియజేసే ఉద్దేశంతో అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారో, కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారో వారంతా తమ ఇళ్లలోని మహిళలను బెంగాల్‌కు పంపించాలని, అలా పంపిస్తే కచ్చితంగా వారిపై 15 రోజుల్లో అత్యాచారం జరుగుతుందని, ఈ విషయం తాను సవాల్ చేస్తున్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారికి ఏ హానీ జరగకుండా 15 రోజులు జీవించగలిగితే అది చాలా గొప్ప విషయం అని, ఒక వేళ నిజంగానే తాను చెప్పినట్లుగా 15 రోజుల్లో వారిపై ఎలాంటి లైంగికదాడి జరగకుండా సురక్షితంగా బయటపడితే తాను అన్న వ్యాఖ్యలను కచ్చితంగా వెనక్కు తీసుకుంటానని కూడా సవాల్ చేశారు. 'బెంగాల్‌లోని ప్రభుత్వానికి ఎవరు మద్దతిస్తున్నారో అది టీఎంసీ నేతలు కావొచ్చు, కాంగ్రెస్ నేతలు కావొచ్చు. నేను వారికి సవాల్ విసురుతున్నాను.. వాళ్లు తమ కూతుర్లను, వదినలను, భార్యలను బెంగాల్‌కు పంపించండి.. వారు మమతా బెనర్జీ నుంచి ఎలాంటి సహాయం పొందకుండా ఉండి లైంగిక దాడికి గురవ్వకుండా 15 రోజులు ఉండగలిగితే అప్పుడు నాకు చెప్పండి. కచ్చితంగా నా మాటలు వెనక్కు తీసుకుంటాను. బెంగాల్లో ఏ ప్రభుత్వాధికారి పనిచేయడం లేదు. గుర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో బెంగాల్ హింసకు కేంద్రంగా మారింది. డార్జిలింగ్‌లో అశాంతి పెరిగింది' అంటూ ఆమె మీడియాకు చెప్పారు. -
ఈ పిల్లలకు చదువు తప్ప అన్నీ వచ్చు: ఎంపీ
బెంగాల్ యూనివర్సిటీలలోని కొంతమంది విద్యార్థులకు చదువు తప్ప అన్నీ వచ్చని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ నటి, గాయని రూపా గంగూలీ మండిపడ్డారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ సెమినార్ సందర్భంగా కొందరు విద్యార్థులు నిరసన తెలుపుతూ దేశవ్యతిరేక నినాదాలు చేయడంతో ఆమె మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల స్థితగతులపై చర్చించేందుకు యూనివర్సిటీలో ఈ సెమినార్ ఏర్పాటుచేశారు. దానికి బంగ్లాదేశ్, భారతదేశాల నుంచి పలువురు నాయకులు వచ్చారు. త్రిపుర గవర్నర్ తథగాత రాయ్ కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నియంత్రణ గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సెమినార్ దాదాపు ముగుస్తోందనగా కొందరు విద్యార్థులు వచ్చి అక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'ఆజాదీ' అని నినాదాలు చేశారు. బెంగాలీ విశ్వవిద్యాలయాల్లో చదువు తప్ప అన్నీ ఉంటున్నాయని రూపా గంగూలీ అన్నారు. వాళ్లు పేరు తెచ్చుకోవాలనుకుంటే మంచి పనులు చేయాలని, వాళ్లు మంచి శాస్త్రవేత్తలయితే అది బెంగాల్‌తో పాటు దేశానికి కూడా మేలు చేస్తుందని చెప్పారు. స్వాతంత్ర్యం కావాలని అంతగా కోరుకునేవాళ్లు ప్రభుత్వం తమకిస్తున్న డబ్బు నుంచి ఎందుకు స్వాతంత్ర్యం అడగట్లేదని ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతున్నారని, దాన్నుంచి ఎందుకు స్వాతంత్ర్యం కోరుకోవట్లేదని అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో దాదాపు ఏడాది కాలం నుంచి ఇలా జాతివ్యతిరేక ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. -
నవంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు రూపా గంగూలీ (నటి), రాఖీ సావంత్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడైన శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని సాధిస్తారు. సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. వీరు ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లలకు వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు, మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. పుట్టిన తేదీ 25. ఇది కేతు సంఖ్య కావడం వల్ల దైవకృపతో నీతి నిజాయితీలతో పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. యోగ, ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మంచి మార్పు వస్తుంది. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పుణ్యక్షేత్ర సందర్శన ఈ సంవత్సర తప్పక చేస్తారు. అయితే బీపీ, గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఉండటం వల్ల యోగ, మెడిటేషన్ చేస్తూ వైద్య సలహాలు తీసుకుంటూ ఉండటం మంచిది. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, గ్రే, క్రీమ్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం, కాకులకు, కోతులకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం,పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ద్రౌపది-ఎర్రకృష్ణుడు
మహాభారతంలో ద్రౌపదికి ఎప్పుడు కష్టం వచ్చినా కృష్ణుడు ఆదుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఆమెను తూలనాడితే నల్లనయ్య సహించడు. వర్తమాన భారతంలో మహాభారతం సీరియల్లో ద్రౌపదిగా నటించింది రూపా గంగూలీ. ఇప్పుడు కొందరు రూపా గంగూలీ సేవా కార్యక్రమాలకి అడ్డంపడి, ఆమెను అవమానపరిచే విధంగా మాట్లాడితే ఎర్రకృష్ణులు అండగా రావడం విశేషం. ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది. కాబట్టి ఎర్ర కృష్ణులు అంటే కామ్రేడ్లే. ఉత్తర 24 పరగణాల జిల్లా హబ్రా అశోక్‌నగర్ వరదలతో ముంపునకు గురైంది. అక్కడ బాధితులకు అత్యవసర వస్తువులు అందించడానికి రూపా గంగూలీ వెళితే, చేదు అనుభవం ఎదురైంది. దీనితో సురాజ్యకాంత్ మిశ్రా అనే నేత ఈ ధోరణిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వేతర సంస్థలకీ, ఆఖరికి మనసున్న ఎవరికైనా బాధితులను ఆదుకునే హక్కు ఉంటుంది. దీనిని ఎవరూ ఆపలేరు అని ఎలుగెత్తి చాటారు. అయితే రూపా గంగూలీ ఇప్పుడు బీజేపీ నాయకురాలు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఖండించిన మిశ్రా సీపీఎం నాయకుడు. తనను తూలనాడినవాళ్లు తృణమూల్ కార్యకర్తలేనని రూపా ఆరోపించడం దీనికి కొసమెరుపు. శుక్రవారం నాటి వరదలకు కోల్‌కతా మోకాలి లోతు నీళ్లలో నానుతోంది.