Rural level
-
Child Marriages: 43 పెళ్లిళ్లకు అడ్డుకట్ట
సాక్షి, యాదాద్రి: చట్టవిరుద్ధమని తెలిసినా తల్లిదండ్రులు తమ పిల్లలకు పసిప్రాయంలోనే పెళ్లి చేస్తున్నారు. మంచి సంబంధం వచ్చిందని, కట్నకానుకలు లేకుండా దొరికడాని, మేనరికం ఓ కారణమైతే నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లంటే అభద్రతాభావం, సెల్‌ఫోన్ చాటింగ్‌లు, టీనేజ్‌లో ప్రేమ మరో కారణంగా తెలుస్తోంది. అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నిత్యం ఏదో ఒక మూలన బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో గడిచిన నాలుగేళ్లలో అధికారులు 100 బాల్యవివాహాలను అడ్డుకోగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 43 ఉన్నాయి. కరోనా వేళ కొన్నిచోట్ల గుట్టచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరిగిపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇలా.. జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్ (ఎం), భువనగిరి, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. హైసూ్కల్ స్థాయిలోనే బాలికలకు పెళ్లి చేస్తున్నారు. లో కం తెలియని వయసులో పెళ్లి చేయడం ద్వారా భార్యభర్త మధ్య వివాదాలు తలెత్తి విడాకులకు దారి తీస్తు న్నాయి. దీంతో మైనార్టీ వయస్సులోనే పెళ్లి పెటా కులవుతున్నాయి. బాల్య వివాహాలను అరికట్టేందుకు పోలీ స్, రెవెన్యూ, ఐసీడీఎస్, విద్యాశాఖ, బాలల పరిరక్షణ విభాగం, టీషీం అధికారులు విశేష కృషి చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాల్సి ఉంది. బాల్య వివాహాలకు కారణం బాల్య వివాహాలు జరుగడం వెనక పలుకారణాలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో కోవిడ్ మరణాల భయం, మంచి సంబంధాల నెపం, మేనరికం, లైంగికదాడులు, ప్రేమ వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత కారణంగా చిన్నతనంలోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. గతంలో గిరిజన తండాల్లో ఎక్కువగా బాల్యవివాహాలు జరగగా ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. అధికారుల అనుమతితో! కోవిడ్ సమయంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వద్ద తీసుకుంటున్న అనుమతితోనే వివాహం చేస్తున్నారు. ఎవరైనా బాల్య వివాహం ఎలా చేస్తున్నారంటే అనుమతిపత్రం చూపుతున్నారు. శుభలేఖ ఆధా రంగా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే ఆధార్‌కార్డు, పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆధారం చూపితే చాల వివాహాలను అడ్డుకోవచ్చు. అయితే అన్ని అనుమతులతోనే వివాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బాల్య వివాహాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన చైల్డ్ మారేజ్ ప్రొటక్షన్ కమిటీలు నామమాత్రంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో జరగుతున్న బాల్య వివాహాల గురించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆయాలకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారం చెబితే ఎక్కడ గొడవలు జరుగుతాయోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్లు బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. ఎలాంటి బిల్లు లేకుండా ఫోన్ చేస్తే అధికారులు వచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకొని కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తారు. చైల్డ్‌లైన్ నంబర్ 1098, పోలీస్ 100, సఖి సెంటర్ 181కు ఫోన్ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు. వివాహం జరిపిన కుటుంబ పెద్దలు, పెళ్లి పెద్ద, పురోహితుడు, వివాహానికి హాజరైన బంధువులు, స్నేహితులు, వివాహానికి సహకరిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారు. బాల్య వివాహాలు నేరం 10 తరగతి పూర్తికా గానే వివాహం చేస్తున్న ఘట నలు వెలుగు చూస్తున్నాయి. బాల్యవివాహాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అక్కడికి వెళ్లి అడ్డుకుంటున్నాం. సఖి కేంద్రానికి రప్పించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. బాల్య వివాహాలు, అక్రమ దత్తతపై సమాచారం ఇవ్వాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను జూమ్ మీటింగ్ ద్వారా కోరాం. హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచాం. బాల్య వివాహాలు చేస్తే చర్యరీత్యా నేరం. - బండారు జయశ్రీ, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సమాచారం ఇవ్వాలి ఎక్కడైనా బాల్యవివాహా లు చేస్తున్నా, అందుకు ప్రయత్నం జరుగుతున్నా వెంటనే సమాచారం ఇవ్వాలి. షీటీం, బాలల పరిరక్షణ విభాగం వెంటనే అక్కడికి చేరుకుంటుంది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం చిన్నతనంలో పెళ్లి చేయడం నేరం. కోవిడ్ సమయంలో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులను జూమ్ మీటింగ్ ద్వారా కోరాం. జిల్లాలో బాల్య వివాహాలపై నిరంతర నిఘా కొనసాగుతోంది. - పి.సైదులు, డీసీపీఓ -
మగ్గాల ఆకలికేకలు ఇంకెన్నాళ్లు?
పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగంపై భారం పడకుండా మనగలిగే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉంది. ఈ రంగం వృద్ధి చెందితే ప్రభుత్వం చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ వృద్ధి రేటు సాధించవచ్చు. తెలంగాణలో చేనేత రంగం విస్తృత స్థాయిలో ఉన్నది. నిజామాబాద్, ఆదిలా బాద్, ఖమ్మం జిల్లాల్లో మినుకు మినుకు మంటున్న ఈ పరిశ్రమ ఇతర జిల్లాల్లో పూ ర్తిస్థాయిలోనే ఉంది. తెలంగాణలో వలస వెళ్లిన మొట్టమొదటి కుటుంబాలు చేనేత రంగంనుంచే. వీళ్లు గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వెళ్లారు. కొందరైతే భివాండి వంటిచోట్ల పవర్లూమ్ పని నే ర్చుకుని వచ్చి ఇక్కడ మరమగ్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆధునిక కాలంలో చేనేతకు మంచి భవిష్యత్తు ఉంది. అయితే, ఆదుకోవాల్సిందీ, ఆసరా కల్పించాల్సిందీ తెలం గాణ సమాజమే. చేనేత కుటుంబాలకు ప్రధాన సమస్య చాలినంత ఆదాయం ఈ వృత్తిలో లభించకపోవడమే. యాం త్రికీకరణవల్లా, అనైతిక పోటీవల్లా, ప్రభుత్వాల వివక్ష వల్ల చేనేత ఎంతో నష్టపోతున్నది. ఇటు నూలు ధరల మధ్య విప రీత భేదం ఉండటం చేనేత వస్త్రాల ధరలను పెంచుతోంది. దీనివల్ల మార్కెట్లో దానికి తగినంత ఆదరణ కరువవుతు న్నది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ వృత్తిపట్ల మక్కువ, గౌరవం ఉన్న కుటుంబాలూ, వ్యక్తులూ అనేకం. ఇలాంటివారివల్లే ఈ రంగం ఇంకా నిలబడింది. అయితే, నిధుల లేమి, లోపిం చిన చిత్తశుద్ధి, సమన్వయ లేమి, అవగాహనాలోపం, వివక్ష, చట్టాల్లో లొసుగులవంటి కారణాలవల్ల అలాంటి కుటుం బాలకు అన్యాయం జరుగుతున్నది. అరకొర కేటాయింపులు చేనేత రంగానికి చేసే కేటాయింపులే అసలు సమస్య. స్వ ర్ణాంధ్రప్రదేశ్, విజన్ -2020 వంటి విధానాలతో చేనేతను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో చేనే తకు ఇచ్చే బడ్జెట్ చాలా తక్కువ. కేంద్ర నిధులు మురిగిపో తున్నాయి. పథకాల సంఖ్య తగ్గిపోయింది. ఆ పథకాల అమలులో కూడా అనేక లోపాలు, అవినీతి! పర్యవసానంగా చేనేత రంగాన్ని నమ్ముకున్న ఎన్నో కుటుంబాలు సంక్షో భంలో కూరుకుపోయాయి. ఎందరో ఆత్మహత్యలకు పాల్ప డ్డారు. ఈ ఆత్మహత్యలవల్ల పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. 2004లో వైఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అంతక్రితం సంవత్సరాలతో పోలిస్తే 2005-06, 2006-07 చేనేత రం గంపై చేసిన ఖర్చు కేటాయింపులకంటే ఎక్కువుంది. 2005- 06లో రూ. 76.68 కోట్లు కేటాయిస్తే, రూ. 80.27 కోట్లు ఖర్చయింది. 2006-07లో 99.52 కోట్లు కేటాయిస్తే రూ. 136.25 కోట్లు వ్యయం అయింది. ఖర్చు పెంచడమే కాక ఈ కాలంలో చేనేత కుటుంబాలకు అవసరమైన ఇల్లు, పింఛను పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2009లో ఓటాన్ అకౌంట్లో పెట్టి ఎన్నికల తర్వాత ఆమోదించిన రుణమాఫీ పథకం చేనేత కుటుంబాల్లో కొత్త ఆశలు నింపింది. అయితే, 2009-10లో దీని అమలు సరిగాలేక కేవలం 44.38 కోట్లు మాత్రమే ఖర్చయింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తత ఇందుకు కారణం. తెలంగాణలో అభివృద్ధికి మార్గాలు పర్యావరణాన్ని కాపాడుతూ, గ్రామీణ స్థాయిలో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగంపై భారం పడకుండా మనగలిగే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉంది. ఈ రంగం వృద్ధి చెందితే ప్రభుత్వం చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ వృద్ధి రేటు సాధించవచ్చు. తెలంగాణలో చేనేత రంగం అభివృద్ధికి సానుకూల రాజకీయ దృష్టి అవసరం. అందుకు ఈ అంశా లను పరిగణనలోకి తీసుకోవాలి. 1. చేనేత రంగంలో సర్కా రు పెట్టుబడులు పెరగాలి. కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరగాలి. చేనేతకు అవసరమైన రుణాలు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకి అందించాలి. 2. సహకార ఉత్పత్తి విధానాలకు ప్రథమ స్థానం ఇస్తూనే ఇతర ఉత్పత్తి పద్ధతులకు మద్దతివ్వాలి. 3. వికేంద్రీకృత టెక్నాలజీ ద్వారా చిన్న నూలు మిల్లులకు ప్రాధాన్యమివ్వాలి. ప్రత్తి రైతుకు, చేనేత కార్మికులకూ నేరుగా సంబంధం ఏర్పరచాలి. పట్టు రీలింగ్ పరిశ్రమకు ప్రోత్సాహమివ్వాలి. 4. చేనేత ఉత్పత్తుల మార్కెట్లను కాపాడటానికి రక్షణ చట్టాలను పటిష్టంగా అమ లుచేయాలి. మార్కెట్ వసతులు, సౌకర్యాలు కల్పించాలి. ఎగుమతులకు అవకాశం కల్పించాలి. 5. చేనేత సంక్షేమ పథకాలు చేపట్టి, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, పిల్లలకు అవసరమైన సంక్షేమ పథకాలు చేకూర్చాలి. విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలి. 6. తెలంగాణకు ప్రత్యేక అపెక్స్ సహకార సంస్థ ఏర్పాటుచేసి ఈ ప్రాంత సహకార సంఘాలకు తగిన వనరులు అందించాలి. ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలి. 7. చేనేత కార్మికులకు కనీస రోజు కూలీ వచ్చేవిధంగా కనీస వేతన చట్టం అమలు చేయాలి. - వ్యాసకర్త చేనేత రంగ నిపుణులు డాక్టర్ డి. నరసింహారెడ్డి -
గ్రామస్థాయికి బ్రహ్మకుమారీస్ సేవలు: హరీష్
హైదరాబాద్: ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనలను పెంపొం దించే విశ్వపిత బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయ సేవలను గ్రామీణ స్థాయికి విస్తరించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్‌లో ఆదివారం జరిగిన ‘అవేకింగ్ ది రూలర్ విత్ఇన్ ఎక్స్‌లెన్స్ ఇన్ అడ్మినిష్ట్రేషన్’ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. ధ్యానం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలు ప్రసంశనీయమమన్నారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ 14 ఏళ్లుగా హైకోర్టు న్యాయమూర్తిగా ఉండి 69 వేల కేసులను పరిశీలించానని, అప్పట్లో సైతం ఎలాంటి ఒత్తిడికి గురికాకపోవడానికి ధ్యానమే కారణమన్నారు. అనంతరం పలువురు విద్యార్థులు, విదేశీ యువతులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఢిల్లీ ఓంశాంతి రీట్రీట్ సెంటర్ డెరైక్టర్ బీకే ఆశా, విశ్రాంత విజిలెన్స్ కమిషనర్ రజనీకుమారి, గచ్చిబౌలి శాంతిసరోవర్ డెరైక్టర్ బీకే కులదీప్జీ, ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ సివిఆర్ రాజేంద్రన్, ఇన్‌కంటాక్స్ కమిషనర్ దత్తా తదితరులు పాల్గొన్నారు.