S. A. Chandrasekhar
-
లియో ఎఫెక్ట్.. లోకేష్ కనగరాజ్‌పై విజయ్ తండ్రి విమర్శలు
కోలీవుడ్‌లో సీనియర్ దర్శకుడు, విజయ్ తండ్రి అయిన ఎస్ఏ చంద్రశేఖర్ ఒక డైరెక్టర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యాలు చేశారు. విమర్శలను అంగీకరించే ధైర్యం ఈ కాలంలో దర్శకులకు లేదని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. తన కుమారుడు హీరో విజయ్‌కు సంబంధించిన కథ వస్తే ఒక తండ్రిలా కాకుండా అభిమానిగా, ఒక దర్శకుడిగా వింటానని ఆయన చెప్పాడు. ప్రస్తుత రోజుల్లో స్క్రీన్‌ప్లేకి ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన చెప్పాడు. స్టార్ హీరో దొరికితే చాలు. కథ లేకపోయినా ఫర్వాలేదనుకునే దర్శకులు ఇప్పటిరోజుల్లో ఉన్నారని చెప్పారు. దర్శకుడి ప్రతిభలో లోపాలు ఉన్నా.. హీరో ఇమేజ్‌తో సినిమా హిట్ అయితే అది తన గొప్పతనమే అనుకుంటున్నారు. కథతో పాటు స్క్రీన్‌ప్లే ఉంటే ఆ సినిమా మరింత హిట్ సాధిస్తుందని తన అభిప్రాయం అంటూ ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. ఒక సినిమా విషయంలో ఇటీవల ఓ దర్శకుడికి ఫోన్ చేసి అభినందించానని ఆయన ఇలా చెప్పారు.' సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు ఆ సినిమా చూశాను. వెంటనే ఆ డైరెక్టర్‌కు కాల్ చేశాను. ఫస్ట్ హాఫ్ బాగుందని చెబుతున్నంత సేపు బాగానే నా మాటలు విన్నాడు. కానీ సెకండాఫ్‌లో కొంత భాగం బాగాలేదని చెప్పాను. కథలో భాగంగా కన్న కుమారుడినే తండ్రి చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటి సన్నివేశాలు అంతగా కనెక్ట్ కావడం లేదని సలహా ఇచ్చాను. దీంతో వెంటనే అతను సార్.. భోజనం చేస్తున్నాను.. కొంత సమయం తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. కనీసం తర్వాత కూడా కాల్ చేయలేదు. సినిమా విడుదలయ్యాక నేను ఏదైతే అభిప్రాయపడ్డానో ప్రేక్షకల నుంచి కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది. నేను చెప్పినప్పుడే కొంత సమయం పాటు ఆలోచించి మార్పులు చేసి ఉంటే ఆ సినిమా ఇంకా మరోస్థాయికి చేరుకునేది. విమర్శలను కూడా తీసుకునేంత పరిణీతి అతనిలో లేవు.' అని ఆయన చెప్పారు. విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించే అని కోలీవుడ్‌లో వైరల్ అవుతుంది. ఆయన చెప్పిన అంశాలన్నీ ఆ చిత్రానికి కనెక్ట్ అవుతుండటంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. లియోలో విజయ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అతని ఇమేజ్‌తోనే సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది, కానీ కథలో కొన్ని లోపాలు ఉన్నాయని మొదటిరోజు నుంచే ప్రచారం జరిగింది. దీంతో కొంతమేరకు కలెక్షన్స్ తగ్గాయని చెప్పవచ్చు. -
అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్‌కు, ఆయన తండ్రి చంద్ర శేఖర్‌కు మధ్య విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్న విషయం తెల్సిందే. విజయ్‌కు తెలియకుండా చంద్రశేఖర్.. ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పేరుతో ఆఫీస్ పెట్టడం నచ్చని విజయ్.. సొంత తండ్రి మీదనే పోలీస్ కేసు పెట్టాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ విబేధాల గురించి ఇప్పటివరకు తండ్రి కొడుకుల ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. (ఇదీ చదవండి: Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్‌బాస్ బ్యూటీ) తాజాగా తన తండ్రి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో తన పంతాలను విజయ్ పక్కనబెట్టేశాడు. చంద్రశేఖర్‌ను కలిసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. చాలా రోజుల తర్వాత తన కుమారుడు ఇంటికి రావడంతో విజయ్‌కు నచ్చిన వంటలను శోభా రెడీ చేయించారట. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన విజయ్ రెండురోజుల క్రితమే చెన్నైకి తిరిగొచ్చాడు. ఆపై వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించాడు. ఆ సమయంలో తన తల్లి శోభాతో కలిసి ఫోటోలు దిగాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత, నటుడు విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి ఫోటో దిగాడు. దీంతో ఆయన అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. అలాగే విజయ్ నటించిన వారసుడు చిత్రంలో తండ్రి సెంటిమెంట్ గురించి నటుడు విజయ్ మాట్లాడినప్పుడు.. నిజజీవితంలో తండ్రిని, తల్లిని పక్కన పెట్టాడని సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు ముగింపు పలికేలా నటుడు విజయ్ తన తండ్రి, తల్లిని కలుసుకుని వారితో ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియోలో విజయ్ నటిస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు షూటింగ్ పూర్తికావడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబర్ 19న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. -
కొత్త పార్టీ అంటే ఆత్మహత్యే...!
నటుడు విజయ్‌కి తండ్రి హితబోధ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించడం అంటే ప్రస్తుత పరిస్థితిలో ఆత్మహత్యతో సమానమని నటుడు విజయ్‌కి తండ్రి హితబోధ చేశారు. అసలు విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభిమానులుండడం వారంతా రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తీసుకురావడంతో నటుడు విజయ్‌కి రాజకీయ రంగ ప్రవేశంపై మోహం పెరిగింది. ఈయనకు రాష్ట్ర వ్యాప్తంగా 350 అభిమాన సంఘాలు వున్నాయి. సుమారు 10 లక్షల మంది వీరాభిమానులున్నారు. వీరంతా తమ నాయకుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నారు. దీంతో విజయ్ రాజకీయ ప్రయోజనాలను ఆశించే మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సంఘాన్ని నెలకొల్పారు. ఆ తరువాత రాజకీయల్లోకి రావడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కలిసి చర్చించారు. అదే సమయంలో రాష్ట్రంలో డీఎంకే పార్టీతో సన్నిహితంగా మెలిగారు. అలాంటి సమయంలో తన చిత్రం విడుదలకు ఎదురైన సమస్యలు, నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో విబేధాలతో మనస్థాపం వంటి కారణాలతో డీఎంకేకు వ్యతిరేకంగా గళం విప్పడం మొదలెట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా విజయ్, ఆయన తండ్రి ఎస్ ఎ చంద్రశేఖర్ ప్రచారం చేశారు. ఆ పార్టీ విజయం సాధించడంతో ఆ ఘనత తమదేనంటూ ప్రచారం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం పసిగట్టిన ఆ పార్టీ అధిష్టానం ఆదిలోనే మేల్కొని విజయ్ను పక్కన పెట్టింది. ఆ తరువాత తుపాకీ, కత్తి చిత్రాలు విడుదలలో పలు సమస్యలు తలెత్తాయి. దీంతో విజయ్ చాలా కలత చెందారు. దీంతో కొన్ని రోజులు మౌనంగా వున్న ఈ స్టార్ నటుడు ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అరెస్టు చేసిన జాలర్ల విషయంలో జోక్యం చేసుకుని ప్రధాని నరేంద్రమోదీకి తన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా జనవరిలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో విజయ్ తన తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్‌తో సంప్రదించారట. అందుకాయన ప్రస్తుత పరిస్థితుల్లో సొంతంగా పార్టీ పెట్టడం ఆత్మహత్యతో సమం అంటూ హితబోధ చేశారట. 50 ఏళ్ల దాటిన తరువాత రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచిద్దాం అప్పటి వరకు సినిమాలో నటించమని సలహా ఇచ్చారని కోలీవుడ్ వర్గాల టాక్.