Sabarimala Ayyapppa shrine
-
Sabarimala: నేడు మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. ఈ నేపథ్యంలో స్వాములు భారీగా తరలి వస్తున్నారు. శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ బోర్డ్ ప్రకటించింది. కానీ, నాలుగు లక్షల మంది దాకా వీక్షించే అవకాశం ఉండొచ్చని ఒక అంచనా. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. శబరిమల మకరజ్యోతి/మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు/ శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. #WATCH | Kerala: Devotees throng Sabarimala Temple in large numbers to offer prayers to Lord Ayyappa ahead of the Makaravilakku festival. pic.twitter.com/n2UXCMOkTP — ANI (@ANI) January 14, 2024 మకర జ్యోతి దర్శన నేపథ్యంలో.. నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు స్వామి దర్శనం కోసం శబరిమలకు పోటెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఉంటుంది ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. -
శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
తిరువనంతపురం: మలయాళ నెల కుంభం సందర్భంగా ఈనెల 12 నుంచి 17 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనుండటంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం పట్టుదలతో ఉండటం, సంప్రదాయ విరుద్ధంగా ఆలయంలోకి వచ్చే రుతుస్రావం వయస్సు మహిళలను అడ్డుకునేందుకు హిందూ సంస్థలు ప్రయత్నించడంతో మండల పూజల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి ఆలయంలోకి భక్తులను దర్శనానికి అనుమతించనుండటంతో పోలీసుల ఆంక్షలు, హిందూ సంస్థల నిరసనల ఎలాంటి పరిణామాలకు దారితీయనుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంగళవారం సాయంత్రం ముఖ్య పూజారి వాసుదేవన్ నంబూద్రి సమక్షంలో ప్రధాన ఆలయ ద్వారాలను తెరిచి పూజలు ప్రారంభిస్తారు. శబరిమల ఆలయం పరిరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నలుగురు మించి గుమికూడరాదని ఆదేశాలు జారీచేశారు. -
మహిళల పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ప్రవేశించి హిందూ సంస్ధల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందు అమ్మిని తమకు 24 గంటల పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్లను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. కన్నూర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిలువరిస్తూ హిందూ సంఘాలకు చెందిన నిరసనకారులు అడ్డుకున్నారు. అయ్యప్ప ఆలయంలోకి తమను అనుమతించాలని డిమాండ్ చేస్తూ వీరు నిరవధిక దీక్షకు దిగడం కలకలం రేపింది. మరోవైపు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై ఆగ్రహిస్తూ కనక దుర్గపై ఆమె అత్త కర్రతో దాడి చేసింది. దీనిపై ఐపీసీ సెక్షన్ 341, 324 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా అయ్యప్ప ఆలయంలోకి ఇరువురు మహిళలు దుర్గ, బిందులు ప్రవేశించడంతో ఆలయ ప్రధాన పూజారి ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేయడం వివాదాస్పదమైంది. -
వెనుతిరిగిన తృప్తి దేశాయ్
తిరువనంతపురం : భక్తుల శరణు ఘోషతో మారుమోగాల్సిన అయ్యప్ప సన్నిధానం నిరసనకారుల నినాదాలతో హోరెత్తుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తరువాత శబరిమల ఆలయాన్ని ఇప్పటికి మూడు సార్లు తెరిచారు. కానీ ప్రతి సారి అయ్యప్ప సన్నిధానం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా వార్షిక మండల దీక్ష సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఈ సందర్భంగా తాను శబరిమలలో ప్రవేశించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకునే తీరతానని శపథం చేసి శుక్రవారం కొచ్చి చేరుకున్నారు సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్. కానీ నిరసనకారులు ఆమెను కొచ్చి విమానాశ్రయం వద్దే అడ్డుకున్నారు. ఆలయానికి వెల్లనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. 14 గంటల నిరసనల అనంతరం తృప్తి దేశాయ్, ఆమెతో పాటు వచ్చిన మరో 6గురు కార్యకర్తలు ముంబై తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వీరికి ముంబై విమానాశ్రయంలో కూడా నిరసనల సెగ తగిలింది. ఎందుకు ఇంత అత్యుత్సాహం : తస్లిమా నస్రీన్ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ శబరిమల వివాదంపై స్పందించారు. ‘మహిళా కార్యకర్తలంతా శబరిమల ఆలయాన్ని సందర్శించడానికి ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. శబరిమల బదులు గ్రామాలకు వెళ్లి అక్కడ మహిళ పట్ల జరుగుతున్న గృహహింస, అత్యాచారం, వేధింపులు, నిరక్షరాస్యత, సమాన వేతనం, ఆరోగ్యం, ఉద్యోగం చేసే స్వేచ్ఛ వంటి అంశాల గురించి పోరాడితే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. I do not understand why women activists are so eager to enter Sabarimala. Better they should enter the villages where women suffer from domestic violence, rape, sexual abuse,hate, where girls have no access to education, heath-care,and no freedom to take a job or get equal pay. — taslima nasreen (@taslimanasreen) November 16, 2018 -
శబరిమలపై మహిళ పోస్టు.. తీవ్ర ఉద్రిక్తత
కన్నూర్ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు అనుమతిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కోర్టు తీర్పుని కొందరు సమర్ధిస్తుండగా పలు హిందూ ధార్మిక సంస్థలు మాత్రం అయ్యప్ప ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా కోర్టు తీర్పు ఉందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తే అడ్డంగా నరికేస్తానని కేరళకు చెందిన సినీ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు కొల్లం తులసి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’) మరోవైపు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తాననీ, 18 మెట్లెక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటానని కేరళకు చెందిన రేష్మా నిశాంత్ (32) ప్రకటించారు. సుప్రీం కోర్టు 10 నుంచి 50 ఏళ్ల వయసు వారికి శబరిమల ఆలయంలోకి అనుమతి ఇచ్చినందున అయ్యప్ప దర్శనం చేసుకుంటానని ఆదివారం తన ఫేస్బుక్ అకౌంట్లో పేర్కొన్నారు. దీంతో పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఎట్టిపరిస్థితుల్లోను అమెను అయ్యప్ప ఆలయానికి వెళ్లనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నిటిపై స్పందించిన రేష్మా... మహిళగా పుట్టడం తన తప్పుకాదనీ, కోర్టు అందరికీ సమాన హక్కులుండాలనే మహిళలు శబరిమలకు వెళ్లొచ్చొనే తీర్పునిచ్చిందని తెలిపారు. పవిత్రమైన అయ్యప్ప మండల దీక్ష (41 రోజులు) ధరించినా కూడా అయ్యప్ప దర్శనం చేసుకోకుండా మహిళలను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. తను గతంలో మండల దీక్ష వేసుకున్నప్పుడు రుతుస్రావం అయిన రోజులను మినహాయించి 55 రోజులు దీక్షలో ఉన్నానని గుర్తు చేశారు. ఏదేమైనా శబరిమలలోని అయ్యప్ప దర్శనం చేసుకుంటానని స్సష్టం చేశారు. రేష్మా డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి : ‘శబరిమల’ తీర్పుపై రివ్యూ పిటిషన్లు) -
’అయ్యప్ప ఆలయంలోకి మహిళలు’
సీనియర్ బీజేపీ నేత మద్దతు తిరువనంతపురం: ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి అన్ని వయస్సులకు చెందిన మహిళల ప్రవేశానికి బీజేపీ సీనియర్ నేత ఒకరు మద్దతు పలికారు. అయ్యప్పస్వామి స్త్రీ ద్వేషి కాదని పేర్కొన్నారు. మహిళల్లో రుతుస్రావక్రమం ప్రకృతి ధర్మమని, దానిని పవిత్రంగా చూడాలని ఆయన కోరారు. కేరళ బీజేపీ జనరల్ సెక్రటరీ కే సురేంద్రన్ ఈ మేరకు ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టారు. అంతేకాకుండా అయ్యప్ప ఆలయాన్ని భక్తుల దర్శనం కోసం ఏడాది పొడుగుతా తెరిచి ఉంచాలన్న సూచనను ఆయన సమర్థించారు. ఆలయాన్ని ఏడాది పొడుగుతా తెరిచి ఉంచడం వల్ల వార్షిక మాలధారణ యాత్ర సమయంలో (నవంబర్-జనవరి)లో భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశముందని చెప్పారు. ‘అయ్యప్పస్వామి నైష్ఠిక బ్రాహ్మచారి. కానీ, ఆయన స్త్రీ ద్వేషి కాదు. శబరిమలలో తన పక్కనే దేవత అయిన మల్లికాపురతమ్మకు చోటు కల్పించిన విషయాన్ని మనం మరువకూడదు’ అని 46 ఏళ్ల సురేంద్రన్ పేర్కొన్నారు. హిందూమతం తార్కికతను ఒప్పుకోవడానికి సదా సిద్ధంగా ఉంటుందని, కాబట్టి మహిళలకు ఆలయ ప్రవేశం విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశం అంశంపై కేరళలో రాజకీయా పార్టీల నేతలు, స్వచ్ఛంద కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయాలను వెలువరించారు.