sabarimamla
-
ఓవైపు ఎల్ఎల్బీ చదువుకుంటూనే.. పరాటాలమ్మాయ్!!
మగవాళ్లు ఎంతో సులభంగా చేసే పరాటాను డిగ్రీ చదువుతోన్న 23 ఏళ్ల అమ్మాయి అలవోకగా చేసేస్తోంది. హోటల్ నడుపుతోన్న కుటుంబానికి సాయం చేసేందుకు కేరళకు చెందిన అనశ్వర పదేళ్ల వయసు నుంచే పరాటాలు తయారు చేస్తూ, మరోపక్క కాలేజికి వెళ్లి శ్రద్ధగా చదువుకుంటోంది. కేరళలోని ఎరుమెలి గ్రామానికి చెందిన అనశ్వర, ఆల్ అజర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ ఫైనలియర్ చదువుతోంది. తన రోజు వారి సమయంలో సగభాగాన్ని చదువుకు, మరికొంత భాగాన్ని తన కుటుంబం నడుపుతున్న ‘హోటల్ ఆర్యా’’లో పనిచేయడానికి కేటాయిస్తోంది. శబరిమల వెళ్లేదారిలో కురువమూజి జంక్షన్లో ఉన్న ఈ హోటల్‌ను యాభై ఏళ్ల క్రితం అనశ్వర అమ్మమ్మ, తాతయ్యలు నారాయణి కుట్టప్పన్‌లు ప్రారంభించారు. వాళ్ల తరువాత గత ముప్ఫై ఏళ్లుగా అనశ్వర అమ్మ, పిన్ని సత్య కుట్టప్పన్‌లు హోటల్‌ను నిర్వహిస్తున్నారు. వీరికి హోటల్ పనుల్లో అనశ్వర చేదోడు వాదోడుగా ఉంటోంది. చదవండి: నోరూరించే ఫిష్ కట్లెట్ విత్ రైస్, ఆనియన్ చికెన్ రింగ్స్ తయారీ..కొంచెం వెరైటీగా! పదేళ్ల వయసులోనే అనశ్వర... అమ్మ పరాటాలు ఎలా చేస్తుందో ఆసక్తిగా గమనించేది. పిండిని గుండ్రంగా ఉండలు చేసే టెక్నిక్‌ను తన కజిన్ నుంచి నేర్చుకుని పరాటాలు ఫర్ఫెక్ట్గా చేయడం మొదలు పెట్టింది. అప్పటినుంచి దాదాపు 13 ఏళ్లుగా రోజుకు దాదాపు రెండు వందల పరాటాలు చేస్తోంది. వేగంగా చక్కగా పరాటాలు చేయడంతో అనశ్వరని అందరూ ముద్దుగా ‘పరాటా’ అని పిలుస్తున్నారు. ఉదయం ఏడున్నర నుంచి అమ్మకు పరాటాలు చేయడంలో సాయంచేసి, తరువాత కాలేజికి వెళ్తుంది. కాలేజి నుంచి వచ్చాక మళ్లీ అమ్మకు భోజనం తయారీలో సాయం చేస్తుంది. హోటల్లో పనిచేయడానికి పనివాళ్లు ఎవరూ లేకుండా కుటుంబ సభ్యులే చూసుకోవడం విశేషం. అనశ్వర పరాటాల గురించి తెలిసిన స్నేహితులు కూడా వాటిని రుచిచూసేందుకు హోటల్‌కు వస్తుంటారు. పరాటాలు రుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబకి ఆర్డర్లు చేయడం, కస్టమర్ల కోరిక మేరకు డోర్ డెలివరి కూడా చేయడం విశేషం. ‘‘పరాటాలు చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈ పని చేయడానికి సిగ్గుపడను. భవిష్యత్‌లో చెఫ్ అయ్యే ఆలోచనలు ప్రస్తుతానికి ఏమిలేవు. తాతయ్యల కాలం నాటి హోటల్‌ను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్‌లో ఎల్ఎల్ఎమ్ తర్వాత, పీహెచ్డీ చేస్తాను’’ అని అనశ్వర చెప్పింది. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
‘అతడు బ్రాహ్మణుడు కాదు.. రాక్షసుడు’
శబరిమల : అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం రణరంగంగా మారింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనక దుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి.. అయ్యప్ప దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళలు ఆలయంలో ప్రవేశించడంతో.. పూజారి కందరు రాజీవేరు ఆలాయాన్ని మూసి వేసి శుద్ధి కార్యక్రమాలు జరిపారు. ఇవి కాస్తా వివాదాస్పందగా మారాయి. దీని గురించి కేరళ మంత్రి జీ సుధాకరన్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా తమ సోదరిని అపవిత్రురాలిగా భావిస్తారా’ అంటూ ప్రశ్నించారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన బ్రాహ్మణున్ని రాక్షసుడంటూ విమర్శించారు. ఈ పూజలు నిర్వహించిన వ్యక్తి అసలైన బ్రాహ్మణుడు కాదు. అతనికి అయ్యప్ప పట్ల ఎటువంటి భక్తి, మర్యాద లేవు. ఇతను బ్రాహ్మణుడు కాదు.. బ్రాహ్మణ రాక్షసుడు. ఇలాంటి వాడు తీవ్రవాదిగా కూడా మారతాడన్నారు. -
శబరిమల ప్రవేశం; స్మృతి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళలు ప్రయత్నించడాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కామెంట్ చేయాలనుకోవడం లేదన్న స్మృతి.. ‘ ఇది కేవలం వ్యక్తుల ఇంగిత ఙ్ఞానంపై ఆధారపడి ఉన్న అంశం. రుతుస్రావ సమయంలో వాడిన సానిటరీ న్యాప్కిన్లను కనీసం స్నేహితుల ఇంటికైనా తీసుకెళ్తామా. అలా చేయం కదా. మరి దేవుడు ఉండే చోటుకి అలా వెళ్లడం ఎందుకు. ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచిది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ప్రతీ ఒక్కరికీ దేవుడిని ప్రార్థించే హక్కు ఉంటుంది.. కానీ హక్కుల పేరిట అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ‘ఒక మహిళగా నాకు కూడా ఫైర్ టెంపుల్(జొరాస్ట్రియన్ల ప్రార్థనా స్థలం)లోకి ప్రవేశించే హక్కు లేదు. ఒకవేళ నా కుమారుడు ప్రార్థించడానికి వెళ్లిన సమయంలో బయటే అతడి కోసం ఎదురుచూస్తా. అలా అని దేవుడంటే నాకు నమ్మకం లేనట్లేనా’ అంటూ స్మృతి ప్రశ్నించారు. కాగా శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా తన ఇరుముడిలో సానిటరీ న్యాప్కిన్లను తీసుకువెళ్లారనే ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అది నిజమో కాదో తేలక ముందే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మహిళ ఈవిధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ స్మృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శబరిమల వెళ్లినందుకు బహిష్కరణ..!
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళ హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లిం సమాజం బహిష్కరించింది. హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆమె ప్రవర్తించారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫాతిమాను ముస్లిం సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ (సీఎంజే) ఎర్నాకులం కౌన్సిల్‌ను ఆదేశించింది. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మోజో టీవీ జర్నలిస్ట్ కవిత జక్కలతో కలిసి రెహానా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అనేక ఘర్షణలో నడుమ పోలీసు బందోబస్త్‌తో ఇరుముడితో ఇద్దరూ కొండపైకి చేరుకున్నారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే గుడిని ముసివేస్తామని ప్రధాన అర్చకుడు హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారు వెనుదిరిగారు. కొండపైకి వీరి ప్రవేశం తీవ్ర అల్లర్లకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ భక్తుల సాంప్రదాయలకు భంగం కలిగే విధంగా రెహానా వ్యవహించిందని.. ఆమెతో పాటు వారి కుటుంబాన్ని కూడా ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ ప్రకటించింది. రెహానా కొండపైకి చెరిన సమయంలో గుర్తుతెలియని కొంతమందివ్యక్తులు ఆమె ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. కాగా వ్యక్తిగతంగా సామాజిక కార్యకర్త అయిన రెహానా గతంలో కేరళలో వివాదస్పదంగా మారిన కిస్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నారు. ముస్లిం సాంప్రదాయనికి వ్యతిరేకంగా ఆమె కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొన్నారని జమాత్ కౌన్సిల్ గతంలో ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది. -
శబరిమల క్షతగాత్రుల వివరాలపై ఆరా
కొత్తపేట : శబరిమల స్వామి అయ్యప్ప ఆలయం వద్ద తొక్కిసలాట క్షతగాత్రులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆదివారం రాత్రి అయ్యప్ప ఆలయం వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటనలో కొత్తపేటకు చెందిన చొప్పెల్ల బుచ్చిరాజు, ఆయన బావ పసలపూడి శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వీరు కొట్టాయం ఆస్పత్రిలో కోలుకుంటున్నారని వారితో ఉన్న కంకటాల సాంబమూర్తి తెలిపారు. కాగా రాష్ట్ర దేవాదాయ శాఖ చర్యల్లో భాగంగా క్షతగాత్రుల వివరాలు, కొట్టాయం నుంచి వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధతో పాటు డీసీ రమేష్‌బాబు (కాకినాడ) స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు కొత్తపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ దూనబోయిన నారాయణరావు సోమవారం క్షతగాత్రుల ఇళ్లకు వెళ్లి, వివరాలు తెలుసుకున్నారు. బుచ్చిరాజు కుమారుడు నాగమణికంఠ అర్జు¯ŒSగుప్త (అయ్యప్ప)ను వెంటపెట్టుకుని మంగళవారం కొట్టాయానికి బయలుదేరనున్నట్టు ఆయన తెలిపారు.