sabir
-
90 శాతం భారతీయ ఆవిష్కరణలు ’కాపీలే’
ముంబై: దాదాపు 90 శాతం భారతీయ ఆవిష్కరణలన్నీ ’కాపీక్యాట్ ఐడియాలే’నని హాట్మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా విమర్శించారు. క్రియేటర్ల దేశంగా మారేందుకు భారత్ ఇంకా సన్నద్ధంగా లేదని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టెస్లా వంటి ఆధునిక సంస్థల ప్లాంట్లలో 300–400 మంది మాత్రమే పనిచేస్తున్న నేపథ్యంలో దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల పెద్ద ఉపయోగం ఉండదని భాటియా చెప్పారు. చైనా ఇప్పటికే తయారీ దేశ స్థానాన్ని ఆక్రమించినందున భవిష్యత్తులో తయారీ రంగానికి కాకుండా క్రియేటర్ల దేశానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అయితే ఆ స్థాయికి ఎదిగేందుకు భారత్ ఇంకా సన్నద్ధంగా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో సమస్యలను స్వతంత్రంగా గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు ఐడియాలను రూపొందించే దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వికేంద్రీకరణ విధానం అవసరమని భాటియా సూచించారు. ప్రజలు తమ సమస్యలను గుర్తించి, తామే పరిష్కరించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఎయిర్బీఎన్బీ, టెస్లా, ఉబర్ వంటి ఆవిష్కరణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. -
స్టోరేజ్ ట్యాంకులో పడి విద్యార్థుల గల్లంతు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని బత్తలాపురం సమ్మర్స్టోరేజ్ ట్యాంకులో పడి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుమలనగర్కు చెందిన సాబిర్(13), శివశంకరనగర్కు చెందిన జిలాని(14) మరో ముగ్గురు స్నేహితులు శుక్రవారం సాయంత్రం ఈతకొట్టేందుకు వెళ్లారు. సాబిర్, జిలాని ఇద్దరూ ఈత కొడుతూ నీటిలో మునిగిపోయారు. గట్టున చూస్తున్న మిగిలిన ముగ్గురు పిల్లలు భయంతో పారిపోయారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. సాబిర్, జిలాని రాత్రి ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అర్థరాత్రి తరువాత పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఈ హడావుడి చూసిన మిగిలిన పిల్లలు భయంతో అసలు విషయం చెప్పారు. శనివారం ఉదయం పోలీసులు, కుటుంబసభ్యులు సమ్మర్ స్టోరేజి ట్యాంకు వద్దకు వెళ్లి పిల్లల కోసం గాలింపు చేపట్టారు. వారి ఆచూకి ఇంకా దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటిలో మునిగిపోయిన ఇద్దరు విద్యార్థులు మున్సిపల్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు.