సచిన్... సచిన్... సూపర్‌హిట్టే!
సచిన్ టెండూల్కర్... ఇండియన్స్‌కి క్రికెట్ గాడ్! ఏఆర్ రెహమాన్... చాలామందికి మ్యూజిక్ గాడ్! వీళ్లిద్దరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సచిన్ జీవితకథతో ‘సచిన్ ది ఫిల్మ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. దీనికి రెహమాన్ సంగీత దర్శకుడు. రెండు రోజుల క్రితం ఈ సినిమాలో సెకండ్ సాంగ్ ‘సచిన్... సచిన్..’ను రిలీజ్ చేశారు. ఇప్పటికి 23 లక్షలమందికి పైగా ఈ పాటను నెట్టింట్లో విన్నారు. సినిమా గ్రౌండ్లోనూ సచిన్‌కు ఎంత క్రేజ్ ఉందనేదానికి ఇదే ఎగ్జాంపుల్. ఈ నెల 26న ఈ సినిమా విడుదల కానుంది.