Sachin Waze
-
దేశ్‌ముఖ్, పరబ్‌లకు 40 కోట్లు ఇచ్చారు
ముంబై: బదిలీ ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు 10 మంది డీసీపీలు కలసి రూ. 40 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్ బీర్ సింగ్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవడానికి ఈ సొమ్ములు ముట్టజెప్పినట్టుగా వాజే ఈడీతో చెప్పారు. దేశ్‌ముఖ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్‌లపై నమోదైన కేసుకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటులో వాజే చేసిన ఆరోపణల్ని ప్రస్తావించారు. జులై 2020లో ముంబైలో 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ పరమ్ బీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులపై అప్పటి హోంమంత్రి దేశ్‌ముఖ్, రవాణా మంత్రి పరబ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని వాజే పేర్కొన్నారు. -
అంబానీ బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో నిండిన వాహనం లభించిన కేసుతో పాటు వాణిజ్యవేత్త మన్సుఖ్ హిరాన్ హత్య కేసులో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)అభియోగాలను నమోదు చేసింది. మాజీ పోలీసు అధికారులు సచిన్ వాజే, ప్రదీప్ శర్మ, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదు చేసిన పత్రాలను ప్రత్యేక కోర్టుకు శుక్రవారం సమర్పించింది. ఈ చార్జీషీటులో సచిన్ వేజ్, ప్రదీప్ శర్మ, వినాయక్ షిండే, నరేష్ గోర్, రియాజుద్దీన్ కాజీ, సునీల్ మానె, ఆనంద్ జాదవ్, సతీశ్ మోతుకూరి, మనీష్ సోని, సంతోష్ షెలార్ పేర్లు ఉన్నాయి. మరో కేసులో కూడా నిందితుడైన వినాయక్ షిండే పోలీసు శాఖ నుంచి సస్పెండ్ కాగా, కాజీ, మానెలను అరెస్ట్ చేసినప్పుడు వారు పోలీసు శాఖలోనే విధులు నిర్వహిస్తున్నారు. అరెస్టయిన వారంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. -
అంబానీ ఇంటి వద్ద కలకలం కేసు: సచిన్ వాజేకు షాక్
ముంబై: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో నిందితుడిగా ఉన్న సచిన్ వాజే ఇక మాజీ పోలీస్ అధికారిగా మారిపోయాడు. ఆయనను విధుల్లో నుంచి తొలగిస్తూ ముంబై పోలీస్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన అతడిని తాజాగా మంగళవారం పోలీస్ శాఖ నుంచి పంపించేశారు. పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా సచిన్ వాజే పేరు ప్రఖ్యాతులు పొందారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసుతో ఆయన ఉచ్చులో చిక్కుకున్నారు. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ ఫిబ్రవరి 25న ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల నిలిపి ఉన్న కేసు కొత్త కొత్త మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పేలుడు పదార్థాలతో పట్టుబడిన స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మృతి కేసులో వాజే.. ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా శాఖపరమైన చర్యలు ముంబై పోలీసులు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోంది. చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా -
సచిన్ వాజే కేసులో మరో కొత్త కోణం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ బెదిరింపుల కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే మరో ఇద్దరిని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వాజ్ వారిని చంపి ఈ కేసును పరిష్కరించినట్లు చెప్పుకోవాలనుకున్నాడు. కాని ఆ ప్లాన్ పనిచేయకపోవడంతో మరో ప్లాన్ అమలు చేసి పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని ముఖేష్ అంబానీ ఇంటి ముందు నిలిపారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతున్నా సమయంలో థానేలో ఉన్న వాజ్ ఇంటిని పరిశోధిస్తున్నప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందానికి ఒక వ్యక్తి పాస్ పోర్ట్ లభించింది. పాస్ పోర్ట్ హోల్డర్, మరో వ్యక్తిని "నకిలీ ఎన్కౌంటర్"లో చంపడానికి వాజ్ ప్రణాళిక వేసినట్లు ఎన్ఐఏ బృందం అనుమానిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వారిద్దరి సహాయంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం నుంచి దొంగిలించబడిన మారుతి ఈకో వాహనంలో పేలుడు పదార్థాలను అమర్చి అంబానీ ఇంటి ముందు నిలిపి, తర్వాత వారు దోషులను నిర్దారింఛి "ఫేక్ ఎన్కౌంటర్" చేయాలనీ మొదట ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఇలా పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ కేసును పరిష్కరించి తానే ప్రశంసలు పొందాలని వాజ్ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తుంది. అలాగే కొంత మొత్తం డబ్బులు కూడా డిమాండ్ చేయాలనీ చూసినట్లు సమాచారం. అయితే, ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏజెన్సీలలో జరిగిన "నకిలీ ఎన్ కౌంటర్" విషయాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ ఫిబ్రవరి 25న ముఖేష్ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల ఆపి ఉంచినట్లు కనుగొనబడింది. ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ వాహన యజమాని వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ మార్చి 5న థానేలోని అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. మార్చి 13న ఎన్ఐఏ సచిన్ వాజ్‌ను అరెస్టు చేసింది. చదవండి: సచిన్‌వాజే హైఎండ్ బైక్ స్వాధీనం -
15 రోజుల్లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారు: బీజేపీ
ముంబై: మహారాష్ట్రలో రెండు వారాల్లోపు మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ గురువారం జోస్యం చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనను సర్వీస్‌లో కొనసాగించేందుకు రూ. 2 కోట్లు డిమాండ్ చేశారని సస్పెండైన పోలీస్ అధికారి సచిన్‌వాజే బుధవారం ఆరోపణలు చేశాడు. అలాగే, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని మరో మంత్రి, శివసేన నాయకుడు అనిల్ పరబ్ తనను ఆదేశించారని వాజే వెల్లడించారు. వాజే ఈ ఆరోపణలు చేసిన మర్నాడు పాటిల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనపై వచ్చిన ఆరోపణలను అనిల్ పరబ్ తోసి పుచ్చారు. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రంలో భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఎవరైనా ఊహించగలరు. ఇద్దరు మంత్రుల అవినీతిపై కొందరు కోర్టుకు వెళ్తారు. ఆ మంత్రులు మరో 15 రోజుల్లో రాజీనామా చేస్తారు’ అని చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర ►శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్ర పన్నుతున్నారని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు సాగబోవని హెచ్చరించారు. జైల్లో ఉన్న వారి నుంచి లెటర్లు రాసుకొచ్చే కొత్త ట్రెండ్ నడుస్తోందని విమర్శించారు. వ్యక్తిత్వ హననానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను, ఆదాయపు పన్ను శాఖను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రూ.2 కోట్లు డిమాండ్ చేశాడని సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజే బు«ధవారం ఆరోపించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి పాలన?!: బీజేపీ నేత వ్యాఖ్యల కలకలం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన అధికారం చేపట్టింది మొదలు బీజేపీ, శివసేన మధ్య ఏదో ఒక రూపంలో విభేదాల సెగలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా స్థానిక బీజేపీ నేత శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధి(ఎంవీఏ) సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న పదిహేనురోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం ఖాయమని, దాంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం రానుందంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. కొంతమంది ఈ మంత్రులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతారు, ఇక ఆ తరువాత సదరు మంత్రులు వైదొలగవలసి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ మంత్రులు ఎవరనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో వాజ్‌ను సర్కార్ భారీగా వెనకేసుకొచ్చిందని ఆరోపించారు. దీంతో అసెంబ్లీని తొమ్మిది సార్లు వాయిదా వేయాల్సి ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో వ్యవస్ధీకృత నేరాలకు పాల్పడుతోందంటూ పాటిల్ ధ్వజమెత్తారు. (అనిల్ దేశ్‌ముఖ్ 2 కోట్లు అడిగారు) అవినీతి ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా నేపథ్యంలో , మరిన్ని అవినీతా ఆరోపణలతో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుందని బీజేపీ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రంలో పరిణామాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. తాను సర్వీసులో కొన సాగాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మాజీ రాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీకి చెందిన అనిల్ దేశముఖ్ డిమాండ్ చేశారని సస్పెన్షన్‌కు గురైన ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే ఆరోపించిన క్రమంలో చంద్రకాంత్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలుచేయాలని మరో మంత్రి అనిల్ పరాబ్ కోరారంటూ వాజే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. (ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు) కాగా ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించడంతో సోమవారం రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్‌దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. -
సచిన్‌వాజే హైఎండ్ బైక్ స్వాధీనం, కీలక సీసీటీవీ ఫుటేజీ
సాక్షి, ముంబై: ముంబై మాజీపోలీసు అధికారిక సచిన్‌వాజేకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సోమవారం హై ఎండ్ బైక్‌ను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 25 న పారిశ్రామికవేత్త ముఖ్‌శ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ, వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంలో సచిన్ వాజ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న వాహనాల సుదీర్ఘ జాబితాలో తాజాగా బైక్ చేరింది. అలాగే సచిన్ వాజేతో సంబంధంముందని భావిస్తున్న మహిళను కూడా ఎన్ఐఏ ప్రశ్నించింది. మహిళ ఆధీనంలో ఉన్న మీరా రోడ్ ఏరియాలోని ఒక ఫ్లాట్‌ను కూడా శోధించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అలాగే కీలకమైన సిసిటివి ఫుటేజ్‌ను కూడా సాధించింది. సచిన్ వాజే మార్చి 4 న రాత్రి 7 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళుతున్నట్లు వీడియోను గుర్తించారు. అదే రోజు సీన్ రీక్రియేషన్ కోసం థానే వెళ్లారు. అయితే మార్చి 5 న థానేలోని కల్వా లేక్ వద్ద మన్సుఖ్ హిరెన్ మృతదేహం పలు అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కేసును కూడా మన్సుఖ్ భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. అంబానీ ఇంటి ఎస్‌యూవీని పార్కింగ్ చేయడంలో వాజే పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు సంస్థ తన కదలికలను దాచడానికి నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. In CCTV footage (in pic), Sachin Waze was seen going to Chhatrapati Shivaji Maharaj Terminus at 7 pm on 4th March. He had taken a local train to Thane that day. He was brought to CSMT y'day for scene recreation Body of Mansukh Hiren was found at Kalwa creek in Thane on 5th March pic.twitter.com/gnMfdaMLLQ — ANI (@ANI) April 6, 2021 -
సచిన్‌వాజే కేసులో వెలుగులోకి కొత్త కొత్త అంశాలు
ముంబై: అంబానీ ఇంటిముందు పేలుడు పదార్ధాల కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్‌వాజే విషయంలో కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసిన ఐదు రోజుల అనంతరం ఆయన జాయింట్ అకౌంట్ నుంచి రూ.26.50 లక్షలు విత్‌డ్రా అయినట్లు ఎన్ఐఏ కోర్టుకు వెల్లడించింది. జాయింట్ అకౌంట్లో వాజేతో పాటు మరో వ్యక్తి ఉన్నారని, వీరికి సంబంధించిన జాయింట్ లాకర్ నుంచి నేరపూర్వక సామగ్రిని సైతం ఎవరో బయటకు తీసుకువెళ్లారని ఎన్ఐఏ తెలిపింది. కేసులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, వీటిని అధ్యయనం చేసేందుకు సమయం కావాలని ఎన్ఐఏ కోరడంతో వాజే కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 7వరకు పొడిగించింది. హిరేన్ మృతదేహం కనుగొనే ముందు రోజు వాజే ఆ ప్రాంతంలో కనిపించారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. అలాగే ముంబైలో ఒక బార్ నుంచి వాజేకు పెద్ద మొత్తంలో నగదు అందిందంటూ పేర్కొన్న ఒక డైరీని కూడా స్వాదీనం చేసుకున్నట్లు తెలిపింది. వాజే ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి పాస్‌పోర్ట్ ఒకటి లభ్యమైందని, అతనెవరో గుర్తించే వరకు వాజే కస్టడి పొడిగించాలని కోరింది. అయితే ఎన్ఐఏ అభ్యర్ధనను ఆమోదించవద్దంటూ వాజే లాయర్ కోర్టును కోరారు. వాజేను ఉపా కింద కస్టడీలో ఉంచేందుకు ఎన్ఐఏ ఒక్క సరైన కారణం చూపలేదన్నారు. జాయింట్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్‌ను చూపాలని ఆయన డిమాండ్ చేయగా, ఎన్ఐఏ నిరాకరించింది. ఎన్ఐఏ కావాలనే కొన్ని పరికరాలను నదిలో వేసి తన క్లయింట్‌పై ఆరోపణలు చేస్తోందని న్యాయవాది వాదించారు. మరోవైపు తనకు గుండె నొప్పి ఉందని కార్డియాలజిస్టుకు చూపాలని వాజే కోర్టును కోరారు. కానీ ఆయన గుండె మాములుగానే పనిచేస్తోందని తమ డయాగ్నోసిస్‌లో తేలినట్లు ఎన్ఐఏ తెలిపింద. వాదనలు విన్న కోర్టు వాజే కస్టడీని 7వరకు పొడిగించింది. చదవండి: మావోయిస్టుల కాల్పులు: దద్దరిల్లిన దండకారణ్యం -
సచిన్‌వాజేకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం రేపిన వివాదంలో సస్పెండైన పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే చుట్టూ అల్లుకున్న ఉచ్చు మరింత బిగిస్తోంది. తాజాగా ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే కస్టడీని ఏప్రిల్ 7వ తేదీవరకు పొడగించింది. అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పట్టుబడిన వాహనం స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మృతి కేసులో వాజే ఎన్ఐఏ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ఐఏ విచారణలో షాకింగ్ విషయాలు ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఎన్ఐఏ. ముఖ్యంగా ముంబైలోని నారిమన్ పాయింట్ ఫైవ్ స్టార్ హోటల్ లోని ఓ గదిని తన కోసం 100 రోజుల పాటు ఒక వ్యాపారవేత్త చేత 12 లక్షల వ్యయంతో బుక్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ తెలిపింది. నకిలీ ఆధార్ కార్డుతో స్టార్ హోటల్లో సదరు వ్యాపారవేత్త ద్వారా 1964 రూమ్ ను బుక్ చేసుకున్నాడని వెల్లడించింది. వంద రోజులకు 12 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని తమ అధీనంలో ఉంచుకున్నారనితెలిపింది. చాలా వ్యాపార వివాదాల్లో వాజే ఈ వ్యాపారవేత్తకు అండగా ఉంటున్నాడని తేలిందని ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నసంగతి తెలిసిందే.