SADHVI NIRANJAN JYOTHI
-
విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ: మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం దేశంలో ప్రత్యేకంగా 19 జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థలు (ఎన్ఎస్టీఐ) పనిచేస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 33 ఎన్ఎస్టీఐలు వాటికి అనుబంధంగా మూడు కేంద్రాలు నెలకొల్పినట్లు తెలిపారు. ఇందులో 19 ఎన్ఎస్టీఐలు ప్రత్యేకంగా మహిళల కోసం నెలకొల్పినవే. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ (హైదరాబాద్)లో మూడు ఎన్ఎస్టీఐలు నెలకొల్పగా అందులో ఒకటి మహిళల కోసం ప్రత్యేకించిందని మంత్రి చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఎస్టీఐ నెలకొల్పలేదని చెబుతూ విశాఖపట్నం గాజువాకలోని క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ట్రైనర్స్ (సీఐటీఎస్)ను అనుబంధ సంస్థగా ప్రకటించి 2022-23 నుంచి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి ట్రేడ్లలో శిక్షణను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ మూడు ట్రేడ్లలో 75 మందికి శిక్షణ పొందే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. చెంచులకు వేతనంతో కూడిన ఉపాధి కొనసాగుతుంది న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచు తెగకు చెందిన ప్రజలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనంతో కూడిన ఉపాధి కల్పించేందుకు క్రియాశీలకమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వకంగా తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలలో చేసిన మార్పుల కారణంగా నల్లమల అడవులలో జీవించే చెంచు తెగకు చెందిన ప్రజలు ఈ పథకం కింద వేతనంతో కూడిన ఉపాధి పొందడానికి అనర్హులవుతారా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మార్గదర్శకాలను సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్పారు. -
బాలిక హత్యపై స్పందించిన సాధ్వి నిరంజన్
లక్నో : సమాజంలో సంప్రదాయ విలువలు, సంస్కృతి మంటగలిశాయని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. అలీగఢ్‌లో రెండేళ్ల చిన్నారిని చంపిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని, కుటుంబ పెద్దలు తమ పిల్లల్లో మంచి విలువలు నెలకొల్పేలా చొరవ చూపాలని ఆకాక్షించారు. చిన్నారి మరణం దురదృష్టకరమని, ఈ తరహా ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం సత్వరమే స్పందిస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు అప్పు తీర్చలేదన్న కోపంతో వడ్డీ వ్యాపారి వారి రెండున్నరేళ్ల కూతురిని గొంతునులిమి చంపిన ఘటన అలీఘడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే . ఆ వ్యాపారి చిన్నారి కను గుడ్లు బయటకు పీకేసి పాశవికంగా హత్యచేశాడు. బాలిక హత్యపై అలీగఢ్ జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. నిందితుడికి మరణ శిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిందితుడి కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ దారుణం చోటుచేసుకున్నందున వారిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. -
సామాన్యుడూ ప్రధాని కావచ్చు
పాలకుర్తి: కుటుంబ పాలనకు చరమగీతం పాడి, సామాన్యుడు సైతం భారత ప్రధాని కావచ్చని నిరూపించిన ఘనత భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కే దక్కుతుందని కేంద్ర ఆహార ఉత్పత్తులు, పరిశ్రమల శాఖ మంత్రి సాద్వి నిరంజన్‌జ్యోతి అన్నారు. శనివారం పాలకుర్తి పట్టణంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యో««దlురాలు, చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బషారత్ ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు పెదగాని సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన అయిలమ్మ వర్ధంతి సభలో సాద్వి నిరంజన్ జ్యోతి మాట్లాడారు. యూపీఏ హయాంలో ఒ్కసారైనా కేంద్రమంత్రులు ఐలమ్మకు నివాళులర్పించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. అప్పట్లో దేశంలో రోజుకు సగటున 2 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగితే, ప్రస్తుతం 20 కిలోమీటర్ల మేర రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. నేటి యువత చేతిలో ఉండాల్సింది ఆయుధాలు కాదని పుస్తకాలు, కంప్యూటర్లు అని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. హామీలను విస్మరించిన కేసీఆర్ : లక్ష్మణ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వరంగల్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పటిదాకా అమలుకాలేదన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, జయపాల్, చాకలి అయిలమ్మ మనుమడు చిట్యాల రాంచంద్రం, అయిలమ్మ కుటుంబ సభ్యులు, సామాజిక తెలంగాణ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభంజన్ యాదవ్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్, కుమార్, రాజశేఖర్, నరేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.