sai kumar reddy
-
పెళ్లికి నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య
బద్వేలు అర్బన్/అట్లూరు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కలసపాడు గ్రామానికి చెందిన బాలిరెడ్డి, వెంకట సుబ్బమ్మకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన పామూరి సాయికుమార్‌రెడ్డి (27) గోపవరం మండలంలో 108 వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. కలసపాడు మండలం సిద్ధమూర్తిపల్లెకు చెందిన ఓ యువతి, సాయికుమార్‌రెడ్డి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె అట్లూరు మండలం తంబళ్లగొంది రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో తంబళ్లగొందికి వెళ్లిన సాయికుమార్‌రెడ్డి తనను పెళ్లి చేసుకునేది, లేనిదీ తేల్చాలని.. లేదంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఉమామహేశ్వరిని నిలదీశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురైన అతను అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికి ఆమె సమీపంలోని వారి ఫ్యాన్సీ స్టోర్‌కు వెళ్లిపోగా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంటినుంచి దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా సాయికుమార్‌రెడ్డి తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఇనమడుగు వాసి ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు
కోవూరు (నెల్లూరు): మండలంలోని ఇనమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు పొన్నవోలు సుధీర్‌రెడ్డి అల్లుడు ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి లండన్ రాయల్ కమిషన్ ఫెలోషిఫ్ అవార్డు అందజేసింది. సాయికుమార్‌రెడ్డి 2018లో లండన్ ఇంపీరియల్ కళాశాలలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ సమయంలో ఆధునిక హైడ్రోజన్ వాయువుతో ఐదు రెట్లు వేగంతో నడిచే విమాన ఇంజిన్ల అభివృద్ధి మీద పరిశోధన చేశారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన పరిశోధనకు మెచ్చి 2021లో యంగ్ సెంటిస్ట్ అవార్డును ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆయన రాసిన ఆర్టికల్‌ను జనరల్ ఆఫ్ ప్లూయిడ్స్ మెకానిక్స్‌లో ప్రచురించారు. అదే ఏడాది ఇంగ్లాడ్ దేశ రాయల్ కుటుంబంచే నడపబడే రాయల్ కమిషన్ ఆయన ప్రతిభను గుర్తించి ప్రతిష్టాత్మకమైన రాయల్ ఫెలోషిఫ్ అవార్డును అందజేశారు. ఇటీవల బ్రిటన్æ రాణి ఎలిజిబెత్ కుమార్తె రాయల్ ప్రిన్సెస్ అన్నే డాక్టర్ ఎద్దుల సాయికుమార్‌రెడ్డిని కొద్దిరోజుల క్రితం ప్రెసిడెన్సియల్ విందుకు ఆహ్వానించి రాయల్ ఫెలోషిప్ అవార్డును అందించి ఘనంగా సత్కరించారు. అవార్డు దక్కించకునేందుకు తనకెంతో సహకరించిన తల్లిదండ్రులు, అత్తమామలు కుటుంబ సభ్యులు, స్నేహితులకు సాయికుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తనను ప్రోత్సహించిన అన్న స్వర్గీయ సాయిసందీప్రెడ్డికి డాక్టరేట్‌ను అంకితం ఇస్తున్నానని తెలిపారు. చదవండి: (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కలిసిన మంత్రులు కాకాణి, అమర్నాథ్) -
విద్యావనంలో రాలిపోతున్న సరస్వతీ కుసుమాలు
-
మరో మెడికో ఆత్మహత్య
ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన మరో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. -
ఆశలు సమాధి చేసి..
ఎంసెట్‌లో కుమారుడు ఉత్తమ ర్యాంకు సాధిస్తే ఆ తల్లిదండ్రి ఆనందానికి అవధుల్లేవు.. ఇక తమ కుమారుడు డాక్టర్ అవుతాడని ఎంతో మురిసిపోయారు.. ప్రజలకు వైద్య సేవలందించి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తుంటే చూసి తరించిపోవాలనుకున్నారు.. కానీ.. సున్నిత మనస్తత్వానికి క్షణికావేశం తోడైంది.. ఇంకేముంది.. ఆ దంపతుల ఆశలను సమాధి చేస్తూ మెడికో యానాల సాయికుమార్‌రెడ్డి(19) భవనంపై నుంచి దూకి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నల్లగొండ (నల్లగొండ క్రైం) : నల్లగొండ పట్టణంలోని మమత పాఠశాల కరస్పాండెంట్ యానాల ప్రభాకర్‌రెడ్డి రెండవ కుమారుడు సాయికుమార్‌రెడ్డి (19) సోమవారం రాత్రి బోయవాడ లక్ష్మీసాయి అపార్ట్మెంట్లోని 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వార్త సంచలనం కలిగించింది. కుటుంబంతో పాటు అపార్ట్మెంట్ వాసులను, పరిచయమున్న వారందరినీ ఈ ఘటన కలిచివేసింది. ఎంసెట్‌లో 167వ ర్యాంకు ఈ ఏడాది ఎంసెట్-3లో సాయికి 167వ ర్యాంకు వచ్చింది. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైద్య కళాశాలలో సాయి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరారు. ఎంసెట్-2లో కూడా మెరుగైన ర్యాంకు రావడంతో తొలుత విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో జాయిన్ అయి తర్వాత మళ్లీ ఉస్మానియాలో చేరాడు. అయితే, చదువుల్లో మొదటి నుంచీ మంచి ప్రతిభ కనబర్చే సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు కేవలం ఆత్మన్యూనతే కారణమని తెలుస్తోంది. ఎంబీబీఎస్‌లో సబ్జెక్టు అయిన అనాటమీ ప్రాక్టికల్స్ తాను ఆశించిన విధంగా లేకపోవడం, తన ఎత్తును దృష్టిలో ఉంచుకుని ప్రొఫెసర్లు ప్రాక్టికల్స్ జరుగుతున్న సమయంలో అతడ్ని వెనక నిలబడాలని ఆదేశించడం, తన వరకు ప్రాక్టికల్స్ రాకపోవడంతో సాయి మానసికంగా ఇబ్బంది పడ్డాడని, ఇదే విషయమై తన తండ్రితో కూడా చర్చించాడని తెలుస్తోంది. ఆత్మన్యూనతే కారణమా వాస్తవానికి సాయి మంగళవారం ఉదయం బయలుదేరి కళాశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే, సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన తండ్రి యానాల ప్రభాకర్‌రెడ్డి తన కుమారుడు సాయిని కళాశాలకు వెళుతున్నావా అని అడగ్గా రేపు ఉదయం వెళతానని చెప్పాడని, తండ్రి దుస్తులు మార్చుకునేందుకు వెళ్లడంతో పరుగున ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడని తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన తండ్రి ఐదో అంతస్తు నుంచి కిందకు వెళ్లి, అంబులెన్స్‌కు ఫోన్ చేసి వైద్యసాయం అందించే లోపే ఘటనా స్థలంలోనే సాయి మృతిచెందాడు. అయినా, తల్లిదండ్రులు, మరో సోదరుడు కలిసి ఆశతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు మంగళవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సాయికి అంత్యక్రియలు జరిపారు. ఇటీవల సన్మానం కాగా గత ఆదివారం చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నీట్ పరీక్షపై బైపీసీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడిసిన్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమానికి సాయికుమార్‌రెడ్డిని కూడా ఆహ్వానించి సన్మానించడం గమనార్హం. -
బిల్డింగ్‌పై నుంచి దూకి మెడికో ఆత్మహత్య
-
ప్రేమించట్లేదని ప్రాణం తీయబోయాడు
తెలిసీ తెలియని వయసులో ఆకర్షణకు లోను కావడం, స్నేహాన్ని ప్రేమనుకోవడం, వెంటపడడం, ప్రేమించకపోతే వేధించడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ప్రేమను నిరాకరిస్తే ఉన్మాదిగా మారి దాడులకూ తెగబడుతున్నారు. తనను ప్రేమించడం లేదనే కోపంతో బుధవారం కామారెడ్డిలో ఓ యువకుడు ఉన్మాదిగా మారి తరగతి గదిలోనే సహ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తనను తాను పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి : లింగంపేట మండల కేంద్రానికి చెందిన కౌడ స్నేహ, మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన సాయికిరణ్రెడ్డిలు ఇంటర్మీడియట్ ఒకే కళాశాలలో చదివారు. డిగ్రీలోనూ ఒకే కళాశాలలో చేరారు. కామారెడ్డిలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ ఒకే క్లాస్ చదువుతుండడంతో ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. ఇటీవల సాయికిరణ్‌రెడ్డితో స్నేహ స్నేహం చేయడం లేదని, ఇదే సమయంలో ఇతర విద్యార్థులతో సన్నిహితంగా ఉంటోందని సమాచారం. దీనిని సాయికిరణ్‌రెడ్డి తట్టుకోలేకపోయాడని, ఈ విషయంలో ఇతర విద్యార్థులతో గొడవలకూ దిగాడని తెలుస్తోంది. ఎంతో కాలంగా ప్రేమిస్తున్నా తనను స్నేహ పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకున్న సాయికిరణ్‌రెడ్డి.. బుధవారం మొదటి పీరియడ్ పూర్తైలెక్చరర్ బయటికి వెళ్లగానే తరగతి గదిలోనే స్నేహపై కత్తితో దాడి చేశాడు. ఆమెకు పలుచోట్ల గాయాలయ్యాయి. ఈ ఘటనతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో సాయికిరణ్‌రెడ్డి తనను తాను పొడుచుకున్నాడు. సంఘటన గురించి కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు స్నేహతోపాటు నిందితుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం స్నేహను నిజామాబాద్‌కు, సాయికిరణ్‌రెడ్డిని హైదరాబాద్‌కు పంపించారు. నిందితుడు సాయికిరణ్‌రెడ్డిపై 307, 309, 354, నిర్భయ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ సంఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. ముఖ్యంగా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉలిక్కిపడ్డ లింగంపేట లింగంపేట : మండల కేంద్రానికి చెందిన కౌడ స్నేహపై కామారెడ్డిలో కళాశాలలో కత్తిపోట్లు జరగడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హుటాహుటిన కామారెడ్డి వెళ్లారు. విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన సహ విద్యార్థి సాయికిరణ్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం.. కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో మూడేళ్ల క్రితం ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి విద్యార్థి బలైన విషయం తెలిసిందే. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని పదునైన కత్తితో గొంతుకోసి పాశవికంగా చంపాడు. ఆ సంఘటనలో నిందితునికి జీవితఖైదు పడింది. అయినా ప్రేమోన్మాదుల ఆగడాలు తగ్గడం లేదు. కుదిరితే ప్రేమ.. లేకుంటే వేధింపులు ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం కళాశాలలకు వచ్చే విద్యార్థినులు అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారు. తోటి విద్యార్థి అన్న ఉద్దేశంతో కొంచెం స్నేహంగా ఉంటే చాలు.. ఆ అమ్మాయి తనను ప్రేమిస్తుందన్న భావనకు లోనై వెంటపడేవారు కొందరైతే, అందమైన అమ్మాయి కనబడితే చాలు ప్రేమించమంటూ వేధించడం ద్వారా విద్యార్థినులను అల్లరి చేసేవారు ఇంకొందరు.. తమది ప్రేమో, ఆకర్షనో తెలియని పరిస్థితుల్లో కొంత కాలం స్నేహంగా ఉన్న అమ్మాయి.. తర్వాత దూరంగా ఉంటున్నదంటే భరించలేకపోతున్నారు. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే తాను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న వారు ఉన్మాదులుగా మారి దాడులకు పాల్పడుతున్నారు. వివేకం కలిగించడమే తరుణోపాయం ప్రేమ మైకంలో కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరు ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీరిలో వివేకం నింపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థిలోకంలో మార్పు తేవాలి. వారి దృష్టిని చదువు, లక్ష్యం వైపు మళ్లించాలి. నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను వివరించాలి. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికార యంత్రాంగం కృషి చేస్తే ఇలాంటి ఘటనలను నివారించవచ్చు.