Sakshi Editorial Director
-
జెండా ఊంఛా రహే హమారా!
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఆయన విజయవాడ సమీపంలోని పెదకళ్ళేపల్లిలో మాతామహుల ఇంట జన్మించి, భట్లపెనుమర్రులో పెరిగారు. జైహింద్ నినాద సృష్టికర్త అబిద్ హాసన్. హైదరాబాద్ వాసి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ జెండాల రెపరెపలు, జైహింద్ నినాదాల హోరు దేశమంతటా అలుముకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజా హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఆజాద్ భారత్‌కు ఇది 75వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు బాగానే పనిచేసింది. ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని జనం ఆదరిస్తున్నారు. ఇళ్ళ మీదనే కాదు, వీధుల్లో సైతం జెండా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు మొబైల్ ఫోన్లలో వారి ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. జెండా ఉత్సవాల ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆక్రమించాయి. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఒక ఫోటో కొంత ప్రత్యేకంగా కనిపించింది. ఒక ఛాయాచిత్రం అనేక విషయాలను చెప్పగలదనేది నానుడి (Photo speaks volumes). ఈ ఫోటో చాలా ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నది. దాని బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే ఏజెన్సీ ప్రాంతంగా తోస్తున్నది. ఒక సన్నటి వెదురు కర్రకు ఒక జాతీయ జెండాను తొడిగారు. కర్రను మట్టిలో పాతి, దాని చుట్టూ ముగ్గు వేశారు. మందార పూలు పెట్టారు. చుట్టూ ఓ పదిమంది పిల్లలు నిలబడి జెండా వందనం చేస్తున్నారు. వారి వయసు నాలుగు నుంచి ఎనిమిదేళ్ల వరకుండవచ్చు. వాళ్ల నిక్కర్లు జీర్ణావస్థలో ఉన్నాయి. పైన చొక్కా ల్లేవు. అందరికంటే చిన్నవాడికి నిక్కర్ కూడా లేదు. జెండా ఎగరేసే తాడు వాని చేతిలోనే ఉన్నది. కనుక వాడే చీఫ్గెస్టయి వుంటాడు. అందరిలో పేదరికం తాండవిస్తున్నది. జెండాను తలకిందులుగా ఎగరేయడం వంటి తప్పులు వాళ్లు చేయలేదు. ఫ్లాగ్ కోడ్ పాటించారు. వారి సెల్యూల్లో ఏ వంకా లేదు. ఆ జెండా తమలాంటి వాళ్ల జీవితాల్ని మార్చివేస్తానన్న హామీని 75 ఏళ్ల కిందనే ఇచ్చిందన్న విషయం ఆ పిల్లలకు తెలియకపోవచ్చు. జెండా అంటే దేవుడితో సమానమని మాత్రమే తెలుసు. పూజించాలని మాత్రమే తెలుసు. ఈ ఫోటో మరోసారి కొన్ని మౌలికమైన ప్రశ్నల్ని మనముందు తెచ్చింది. అసలు స్వతంత్రం అంటే ఏమిటి? కేవలం మాట్లాడే స్వేచ్ఛ మాత్రమేనా? ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వాతంత్య్రాల మాటేమిటి? సామాజిక న్యాయం సంగతేమిటి? రాజ్యాంగం పూచీపడినట్టు అందరికీ ఆలోచనా, భావ ప్రకటనా, నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ సమకూరిందా? హోదాల్లో అవకాశాల్లో సమానత్వం సిద్ధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చిన నాటి రోజులతో పోలిస్తే దారిద్య్రం అంత తీవ్రంగా లేకపోవచ్చు. ఇప్పుడు ఆకలి చావుల మాటలు వినిపించకపోవచ్చు. అక్షరాస్యత పెరిగి ఉండవచ్చు. జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం పెరిగి ఉండవచ్చు. కానీ అసమానతలు కూడా పెరిగాయి. పేదలు – ధనికుల మధ్య పెరుగుతున్న అంతరాల్లో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉన్నది. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ లెక్క ప్రకారం దేశ సంపదలో 58% కేవలం ఒక్కశాతం కుబేరుల చేతిలోనే ఉన్నది. పది శాతం శ్రీమంతుల చేతిలో 80 శాతం జాతి సంపద పోగుపడింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ ఇండియాలో పది శాతం సంపన్నుల చేతిలో 54 శాతం సంపద ఉండేది. ఆ అంతరం ఇప్పుడు మరింత పెరిగింది. పేదలు, నిరుపేదలు, దిగువ, ఎగువ మధ్యతరగతులందరి ఉమ్మడి సంపద ప్రస్తుతం 14 శాతమే. ఆర్థిక అసమానతలు తొలగించలేక మరింత పెంచుకోవడం ఒక విషాదం. సామాజిక అసమానతలను కూడా పూర్తిగా రూపుమాపలేకపోయాము. సోషల్లీ రాడికల్ స్వభావం కలిగిన రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని కొందరు పరిగణిస్తారు. అయినప్పటికీ సామాజిక అసమానతలు 75 ఏళ్ల తరువాత కూడా కొనసాగుతున్నాయి. ‘ఎస్.సీ. కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని బాహాటంగా మీడియా గోష్ఠి లోనే కామెంట్ చేయగలిగిన ఒక కులదురహంకారి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదమూడేళ్లు ప్రతిపక్ష నేతగా చలామణి కాగలగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే విషయం. మెదళ్లకు బూజు పట్టించిన ఛాందస భావాలు ఇంకా సమాజాన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. దళితులు వండిపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినబోరంటూ బహిష్కరిస్తున్న ఘటనలు ఇంకా జరగడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అల్లుడిని కరకు కత్తులకు బలి ఇస్తున్నారు. పైగా దానికి ‘పరువు హత్య’ అనే ముద్దుపేరు పెట్టుకుంటున్నారు. వెనుకబడిన వర్గాలుగా పరిగణించే చేతివృత్తుల వారి వృత్తి వ్యాపారాల్లోకి క్రమంగా సంపన్నులు ప్రవేశించారు. చెప్పుల వ్యాపారం, బట్టల వ్యాపారం, పాల వ్యాపారం, లిక్కర్ బిజినెస్, కుండలు, బుట్టలు, ఫర్నిచర్, బంగారం వగైరాలన్నీ వెనుకబడిన వర్గాల నుంచి ఎప్పుడో చేజారిపోయాయి. వీధిన పడిన ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్ కోటాను అమలుచేయ ప్రయత్నించినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో తెలిసిందే. మనదేశంలో పొట్టకూటి కోసం రెక్కలమ్ముకుంటున్న వారి సంఖ్య 90 కోట్లు. ఇందులో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం రెండు కోట్లు మాత్రమే. ప్రైవేట్ సెక్టార్‌లోని వైట్‌కాలర్ ఉద్యోగాల్లో ఈనాటికీ ఎటువంటి రిజర్వేషన్ లేదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించి వారిని ఎంపవర్ చేయకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని కుల దురహంకార విషసర్పం వేయి పడగల్ని విప్పి రోజూ వేయిటన్నుల విషాన్ని విరజిమ్ముతున్న భయానక పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవులిస్తే గిట్టదు. మహిళలకు కీలక శాఖల్ని కేటాయిస్తే నచ్చదు. వారికి నామినేటెడ్ పదవులిస్తే కోపం. నామినేటెడ్ పనులు అప్పగిస్తే కోపం. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిస్తే పట్టరాని ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే తనువంతా కంపరం. పారదర్శకంగా ప్రజలకు నగదు బదిలీ చేస్తే పాపం. ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యనందించడం సహించరాని నేరం. ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఇంటింటికీ డాక్టర్‌ను పంపిస్తాననడం అపచారం. స్వపరిపాలనను గ్రామస్థాయికి వికేంద్రీకరించడం మహా పాపం. అవ్వాతాతల పెన్షన్ డబ్బులు ఠంచన్‌గా తలుపు తట్టడం అపరాధం... వేయి పడగల విషసర్పం దృష్టిలో ఇవన్నీ జగన్ ప్రభుత్వ నేరాలు. ఇటువంటి పడగల్ని కత్తిరించకుండా నిజమైన స్వాతంత్య్రం సాధ్యం కాదనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవంలోకి వచ్చింది. ఈ 75 సంవత్సరాల కాలంలో దేశం సాధించిన ఆర్థిక అభివృద్ధి తక్కువేమీ కాదు. పంపిణీలో అసమానతలుండడమే అసలు సమస్య. ప్రధానమంత్రి పెట్టుకున్న లక్ష్యం ప్రకారం వచ్చే రెండు మూడేళ్లలో దేశ సంపద ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలి. ఇంకో పది పన్నెండేళ్లలో పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కాబోతున్నదని ప్రసిద్ధ ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఇందుకు దోహదపడే కారణంగా మన మానవ వనరుల సంపదను వారు చూపెడుతున్నారు. ఈ వనరులకు నాణ్యమైన విద్యనిచ్చి నైపుణ్యాన్ని జతచేయడమే మనం చేయవలసిన పని. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెరవేర్చగలిగితే రాబోయే తరం యువకులు ఈ దేశాన్ని మరో రెండు దశాబ్దాల్లోగా అగ్రరాజ్యంగా నిలబెట్టగలుగుతారు. ఈ లక్ష్యసాధన కోసం మానవ వనరుల్ని సాధికారం చేయడానికి ప్రగతి శీల ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చును కొందరు ప్రబుద్ధులు తప్పుపడుతున్నారు. ‘ఉచితాలు అనుచితం’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న వారి జేబుల్లోనే సుజనా చౌదరి వంటి బ్యాంకు కేటుగాళ్లుండటం ఒక విచిత్రం. ఇటువంటి కేటుగాళ్లు ఎగవేసిన లక్షలకోట్ల రూపాయలను మాఫీ చేస్తున్న కేంద్రం ప్రజలను ఎంపవర్ చేసే పథకాలకు మోకాలడ్డాలనుకోవడం ఒక వైరుద్ధ్యం. ఇటువంటి వంకర విధానాలను సరిదిద్దుకోకుండా భారతదేశం తన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యంకాదు. కట్టుబట్టలు కూడా లేకున్నా సరే, దేశభక్తిలో ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్న మన ఏకలవ్య బాలల్ని మరవద్దు. వారికి చేయూతనిచ్చి ప్రధాన స్రవంతిలో నిలబెడితే మన ప్రగతి రథం పరుగులు తీస్తుంది. అట్లా కాకుండా మళ్లీ బొటనవేళ్లు నరకడానికే పూనుకుంటే ఇంకో వందేళ్లయినా ఈ దేశం అగ్రదేశం కాబోదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆదివాసీ హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత
-
సాక్షి కుటుంబానికి ఆత్మీయుడు
-
పాఠశాలల సమస్యలను ప్రభ్యత్వం దృష్టికి తీసుకెళ్తాం
-
ముగ్గురు కలల బేహారులే
-
కుటిల రాజకీయాలు మాను కోవాలి
-
సాక్షి ప్రసారాల నిలుపుదలపై కౌంటర్ కు ఆదేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా పడింది. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఎంఎస్‌వోలకు ఏ రకమైన ఆటంకాలు కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కేబుల్ టీవీ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఉత్తర్వులు ఇవ్వకుండా కేబుల్ టీవీ ప్రసారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అర్హమైన కేసుగా ఆయన స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. కాగా తమ టీవీ చానల్ ప్రసారాల నిలుపుదల విషయంలో న్యాయపోరాటానికి దిగిన సాక్షి టెలివిజన్ ... ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్లను ప్రతివాదులుగా పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఎంఎస్‌వోలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరింది. -
ఏపీలో ప్రసారాల నిలుపుదలపై ‘సాక్షి’ న్యాయపోరాటం
- ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించండి - సాక్షి టీవీ ప్రసారాలకు ఆటంకం కలిగించకుండా చూడండి - ప్రసారాలు వచ్చేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వండి - రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రసారాల నిలుపుదల - రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను అడ్డుకోండి - హైకోర్టులో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ చానల్ ప్రసారాల నిలుపుదల విషయంలో సాక్షి టెలివిజన్ న్యాయపోరాటం చేపట్టింది. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఎంఎస్‌వోలకు ఏ రకమైన ఆటంకాలు కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉండేం దుకు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని తన పిటిషన్లో ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఎంఎస్‌వోలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని రామచంద్రమూర్తి తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాక ఇది రాజ్యాంగ హక్కులనూ ఉల్లంఘించడమేనన్నారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఏదైనా టీవీ ప్రసారాల్ని నిలిపేయాలంటే మూడు వారాలముందు నోటీసులు జారీ చేసి, తగిన కారణాలను వివరించాల్సి ఉందన్నారు. అంతేగాక ప్రసారాలు నిలిపివేస్తున్న విషయాన్ని పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియచేయాల్సి ఉందన్నారు. అయితే తమ టీవీ ప్రసారాల నిలిపివేత విషయంలో ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. ప్రసారాల నిలిపివేత అధికారం ట్రాయ్‌కు మాత్రమే ఉందన్నారు. అయితే ఇక్కడ మాత్రం హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల ఆదేశాల మేరకు ఎంఎస్‌వోలు తమ చానల్ ప్రసారాలను నిలిపేశారని ఆయన కోర్టుకు నివేదించారు. ఇలా చేసే అధికారం వీరికి లేదన్నారు. గతంలోనూ చట్టవిరుద్ధంగా ఇలా ప్రసారాలను నిలిపేయడాన్ని టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్ఏటీ), సుప్రీంకోర్టులు తప్పుపట్టాయని గుర్తుచేశారు. చట్టనిబంధనలను ఏరకంగానూ సాక్షి టీవీ ఉల్లంఘించలేదని, అయినప్పటికీ తమ టీవీ ప్రసారాల్ని నిలిపివేయించారని తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో లోపాల్ని ఎత్తిచూపుతున్నామన్న కారణంతో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా తమ చానల్ ప్రసారాలను ఆపివేయించారన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పోలీసులను ఉపయోగిస్తున్నారని, అన్ని జిల్లాల ఎస్పీల ద్వారా ఆయా జిల్లాల్లోని ఎంఎస్‌వోలకు తమ టీవీ ప్రసారాల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేయించారని వివరించారు. ప్రసారాల నిలుపుదల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమవలేదని, ఎంఎస్‌వోల ప్రభావమున్న మూడు తెలంగాణ జిల్లాల్లోనూ ఉందన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. ప్రసారాల నిలుపుదల విషయాన్ని తాము లిఖితపూర్వంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల దృష్టికి తీసుకొచ్చామని, అయితే దీనిపై వారు ఏ రకంగానూ స్పందించలేదని, దీనివెనుక దురుద్దేశాలున్నాయని రామచంద్రమూర్తి తెలి పారు. సమాచార ప్రసరణ అన్నది భావ ప్రకటన హక్కులో భాగమని, దీనిని అడ్డుకోవడమంటే రాజ్యాంగ హక్కులను అడ్డుకోవడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపుతున్నామన్న కారణంతో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తమ టీవీ ప్రసారాలను నిలుపుదల చేయించారని తెలిపారు. తమ ప్రసారాలను ప్రభుత్వమే నిలుపుదల చేయిం చిన విషయాన్ని డిప్యూటీ సీఎం బహిరంగం గా అంగీకరించారన్నారు. ప్రసారాల నిలిపివేతకు శాంతిభద్రతలను కారణంగా చూపుతున్నారని, అయితే అందుకు ఆధారాల్ని మా త్రం చూపట్లేదని వివరించారు. ప్రసారాలవల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయని చెబితే సరిపోదన్నారు. ప్రభుత్వ విధానాల్ని విమర్శించే వారిని ఓ పద్ధతి ప్రకారం నియంత్రించాలన్న ఉద్దేశంతోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇలా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉచ్చులో చిక్కనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రత్యేక కోర్టుల చట్టం కింద సాక్షి పత్రిక, టీవీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి పత్రికాముఖం గా ప్రకటనలు చేశారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై వారు దురుద్దేశాలతోనే మాట్లాడారని తెలిపారు. మీడియా హక్కుల గురించి సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టమైన తీర్పులు వెలువరించిందని గుర్తుచేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా ప్రతివాదులకు ఆదేశాలివ్వాలని కోరారు. -
'బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి బాగుంది'
హైదరాబాద్: బౌద్ధం బలంగా ఉన్న దేశాల్లో ఆర్ధికపురోగాభివృద్ధి బాగుందని 'సాక్షి' దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్ర మూర్తి అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ రచయత డాక్టర్ కొల్లూరు వెంకట సుబ్బారావు రచించిన ‘ప్రాఫెట్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్కిటెక్స్ ఆఫ్ న్యూ ఇండియా’ అనే పుస్తక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పుస్తకాన్ని చదివానని భారతదేశం పట్ల, ఇక్కడి ప్రజలపట్ల రచయతకు విశాల దృక్పథం ఉందని తెలిపారు. బుధ్దుడు, కృష్ణుడు, చాణిక్యుడు చేసిన ఉపదేశాలు ఆదర్శంగా తీసుకుంటే మనం అనుకున్న విజన్ 20 - 20 అభివృద్ధి సాధించుకోవచ్చునని అన్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్య ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని సూచించారు. తూర్పున అనేక దేశాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాయని వాటిని ఏషియన్ టైగర్స్ అంటారని బౌద్ధ మతం బలంగా ఉన్నదేశాల్లో అభివృద్ధి బాగుందని అందుకే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నారని అన్నారు. (పంజగుట్ట) -
పంచ సూత్రాలతో అక్షరప్రస్థానం
-
వారధిలా పనిచేయాలి
తెలంగాణ పునర్వికాసంలో విద్యావంతుల వేదిక అర్థవంతమైన పాత్ర పోషించాలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి.. మార్గనిర్దేశకంగా నిలవాలని సూచన రాష్ట్రం వచ్చాక పోరాట సంఘాల పాత్ర మారుతుంది: కోదండరాం మంచిర్యాల: తెలంగాణ సమాజానికి, సర్కారుకు మధ్య తెలంగాణ విద్యావంతుల వేదిక వారధిగా పనిచేయాలని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అభిలషించారు. ఇందుకోసం అట్టడుగు వర్గాల నుంచి అభివృద్ధి ప్రారంభమయ్యేలా వ్యూహాలు రచించాలని సూచించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని జయశంకర్ ప్రాంగణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల స్వప్నాలను నెరవేర్చేందుకు, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించేందుకు మేధావులు, విద్యావంతులు పాటుపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు టీవీవీ నాయకత్వం వహించాలని, నిరంతరం ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తుకు మార్గదర్శకం వహించాలని రామచంద్రమూర్తి ఆకాంక్షించారు. ‘‘తెలంగాణ కోసం పోరాడేందుకు ఎవరూ సన్నద్ధంగా లేనపుడు ఆ స్ఫూర్తిని కలిగించింది ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరే. భావ ప్రచారం, ఉద్యమ నిర్మాణం, రాజకీయ కార్యాచరణ అనే మూడు లక్షణాలను పాటించడం వల్లే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ పునర్వికాసంలో సకల జనులు పాల్గొనేలా చేస్తూ టీవీవీ అర్థవంతమైన పాత్ర పోషించాలి. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అనే ప్రశ్నకు ‘సంభవం కాకపోయేది..’ అనే జవాబు వస్తుంది. టీవీవీ, టీ.జేఏసీ నాయకులు ఒక్కరే. ఇదే స్ఫూర్తిని తెలంగాణ వికాసం కోసం జరపాలి..’’అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 150 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బలవన్మరణాలు, ఫ్లోరైడ్ సమస్యలు, గల్ఫ్ మోసాలు వంటి సమస్యల పరిష్కారం కోసం సర్కారుతో పాటు సమాజమూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం విద్యావంతుల వేదిక మార్గనిర్దేశక సంస్థగా, నిఘా సంస్థగా ఉండాలని సూచించారు. పాత్ర మారుతుంది..: కోదండరాం తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి చైతన్యం అందించేలా టీవీవీ కృషి చేయాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సంఘాలు, వేదికల అవసరం లేదనే అభిప్రాయం సరికాదని... పాత్ర మారుతుందే తప్ప వాటి ఉనికిని కోల్పోవాల్సిన అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో ఓపెన్‌కాస్టుల ఏర్పాటు ఆంధ్ర ప్రాంతం వారి ఎత్తుగడని.. ఆ విధానంతో ఉత్పత్తి పెరిగి సింగరేణికి దక్కుతున్న ఆదాయం కంటే ఎక్కువ ఆ కాంట్రాక్టర్లకు చెందుతోందని విమర్శించారు. అడ్వొకేట్ జేఏసీ ైచె ర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణవాదుల్లో చైతన్యాన్ని రేకెత్తించడంలో విద్యావంతుల వేదిక పాత్ర అభినందనీయమన్నారు. ఈ కార్య క్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీవీవీ నేత శ్రీధర్ దేశ్‌పాండే, టీవీవీ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.