Sakshi Telugu daily
-
ప్లాస్టిక్ నిజాలు
ప్రపంచంలో తొలిసారిగా 1907లో ప్లాస్టిక్‌ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం మొదలైంది. అయితే, భారీ స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తి 1952 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, పర్యావరణానికి బెడదగా మారింది. ఇటీవలి కాలంలో ఏటా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 80 లక్షల టన్నులు. ఇవే పరిస్థితులు కొనసాగితే, 2040 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాలు 2.90 కోట్ల టన్నులకు చేరుకోగలవని శాస్త్రవేత్తల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోగవుతోంది. 1952 నాటితో పోల్చుకుంటే, ప్లాస్టిక్ వినియోగం రెండువందల రెట్లు పెరిగింది. సముద్రంలోకి చేరే ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఏటా దాదాపు లక్షకు పైగా భారీ జలచరాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ఉత్పత్తిదారు. అమెరికా ఏటా 4,2 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తోంది. చైనా, యూరోపియన్ దేశాల్లో ఏటా జరిగే ప్లాస్టిక్ ఉత్పత్తి కంటే, అమెరికా చేసే ప్లాస్టిక్ ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువవ. అమెరికాలో ఏటా పోగుపడే తలసరి ప్లాస్టిక్ చెత్త 130 కిలోలు. ప్లాస్టిక్ నేలలోను, నీటిలోను ఎక్కడ పడితే అక్కడ పోగుపడి కాలుష్యానికి కారణమవుతోంది. ప్లాస్టిక్ నేరుగా మన పొట్టల్లోకే చేరేటంత దారుణంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి మనిషి పొట్టలోకి వారానికి సగటున ఐదు గ్రాముల ప్లాస్టిక్ చేరుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తి కారణంగా వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2030 నాటికి బొగ్గు కంటే ప్లాస్టిక్ కారణంగానే ఎక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రీసైకిల్డ్ ఫోమ్ ఫర్నిచర్ ఎక్స్పాండెడ్ పాలీస్టైరీన్ (ఈపీఎస్)– సాధారణ వ్యవహారంలో ఫోమ్‌గా పిలుచుకునే పదార్థం. దీనిని వస్తువుల ప్యాకేజింగ్ తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని ‘స్టరోఫోమ్’ సంస్థ ట్రేడ్‌మార్క్ పేరైన ‘డ్యూపాంట్’ పేరుతో కూడా పిలుస్తారు. ప్యాకేజీ పైనున్న ర్యాపర్లు, అట్టపెట్టెలతో పాటు దీనిని కూడా చెత్తలో పారేస్తుంటారు. దీనిని చెత్తలో పారేయకుండా, రీసైక్లింగ్ చేయడం ద్వారా అద్భుతమైన ఫర్నిచర్‌ను తయారు చేయవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు. జపాన్ ‘వీయ్ ప్లస్’ కంపెనీకి చెందిన నిపుణుల బృందం రీసైకిల్డ్ ఈపీఎస్‌ను ఉపయోగించి, సుదీర్ఘకాలం మన్నగలిగే అద్భుతమైన ఫర్నిచర్‌ను రూపొందించింది. ఇవి ఎక్కువకాలం మన్నడమే కాకుండా కలపతోను, లోహంతోను తయారుచేసిన ఫర్నిచర్ కంటే చాలా తేలికగా కూడా ఉంటాయి. ప్యాకేజీ అవసరాలకు ఉపయోగించే ఫోమ్‌ను చెత్తలో పారేసి కాలుష్యాన్ని పెంచకుండా, ఇలా రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగంలోకి తేవడం భలేగా ఉంది కదూ! -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డుల పంట
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (స్పాప్) ‘వరల్డ్ ఫొటో జర్నలిజం డే’ సందర్భంగా నిర్వహించిన ‘5వ ఇండియా ప్రెస్ ఫొటో అవార్డ్స్–2020’ జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఎ.సతీష్ తీసిన ‘అన్నకు గోరుముద్ద’ ఫొటోకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీ (ఎఫ్ఐపీ) గోల్డ్ మెడల్ లభించింది. ‘సాక్షి’ తెలుగు దినపత్రిక ఏపీ, తెలంగాణ ఫొటోగ్రాఫర్లు 19 అవార్డులు సాధించారు. 22 రాష్ట్రాల నుంచి 303 మంది ఫొటో జర్నలిస్టులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఓపెన్ కలర్ విభాగంలో వి.రూబెన్ (విజయవాడ)కు 3వ బహుమతి, ఫొటో జర్నలిజం విభాగంలో పి.లీలామోహన్ (వైజాగ్), ఎన్.రాజేష్‌రెడ్డి (హైదరాబాద్), ఎఫ్ఐపీ రిబ్బన్ విభాగంలో పి. విజయకృష్ణ (విజయవాడ). పి.శివప్రసాద్ (సంగారెడ్డి)లకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ)కు యూత్ అచీవ్మెంట్ అవార్డు లభించాయి. కె.మోహనకృష్ణ (తిరుపతి), జి.వీరేష్ (అనంత), డి.హుస్సేన్(కర్నూలు), ఎండీ నవాజ్ (వైజాగ్), జయశంకర్ (శ్రీకాకుళం), పి.సతీష్‌కుమార్ (కాకినాడ), రియాజుద్దీన్ (ఏలూరు), జె.అజీజ్ (మచిలీపట్నం), ఎన్.కిశోర్ (విజయవాడ) కె.చక్రపాణి (విజయవాడ), పి.మనువిశాల్ (విజయవాడ), సురేశ్‌కుమార్ (హైదరాబాద్), భజరంగ ప్రసాద్ (నల్లగొండ)లకు స్పాప్ నేషనల్ అచీవ్మెంట్ అవార్డులు దక్కాయి. -
ఈనాటి ముఖ్యాంశాలు
-
కార్టూనిస్టు శంకర్‌కు శేఖర్ స్మారక అవార్డు
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక చీఫ్ కార్టూనిస్టు పామర్తి శంకర్‌ను కార్టూనిస్టు కంబాలపల్లి శేఖర్ స్మారక అవార్డు వరించింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కూడిన నలుగురు సభ్యుల జ్యూరీ బృందం శంకర్‌ను 2018కి గాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. త్వరలో ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఆయనకు అవార్డు ప్రదానం చేయనున్నారు. 20 ఏళ్లుగా శంకర్ పలు దినపత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. కార్టూన్లకు ఆస్కార్ అనదగ్గ వరల్డ్ ప్రెస్ గ్రాండ్ ఫిక్స్ అవార్డుతో పాటు అనేక ఇతర అవార్డులను ఆయన అందుకున్నారు. సామాన్యుడి పక్షం వహించి మతోన్మాదం, అవినీతి, నీచ రాజకీయాలు, సామాజిక వివక్ష, అసమానత, ఆర్థిక సంస్కరణలపై కలం కుంచెతో జీవితాంతం పోరాటం చేసిన చరిత్ర కార్టూనిస్టు శేఖర్‌ది. ఆయన పేరిట నవ తెలంగాణ దినపత్రిక స్మారక అవార్డును 2016లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు ఎంపిక జ్యూరీ కమిటీలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ దినపత్రిక సంపాదకుడు కె.శ్రీనివాస్, తెలంగాణ టుడే ఎడిటర్ కె. శ్రీనివాస్‌రెడ్డి, ది హిందూ కార్టూనిస్టు సురేంద్రలు ఉన్నారు. -
అభిమానం...అదిరింది
జనగామ అర్బన్: సత్యమేవ జయతే అంటూ.తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ‘సాక్షి’ దినపత్రిక ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆదరించడ ంతో పాటు తనకు ఉన్న అభిమాన్ని చాటుతున్నాడు పెంబర్తి చెందిన కళాకారుడు మల్యాల జనార్దనాచారి. సాక్షి 9 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దివంగత నేత వైఎస్సార్‌తో పాటు వైఎస్సార్ సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యువనేత జగన్, సాక్షి మీడియా చైర్పర్సన్ వైఎస్.భారతిలతో కూడిన షీల్డ్‌ను ఉమ్మడి జిల్లా సాక్షి బృందానికి బహూకరించారు. -
తెలుగు పత్రికారంగ చరిత్రలో కొత్త అధ్యాయం
గుంటూరులో ఘనంగా ‘భవిత’ ఆవిష్కరణ సభ తెలుగు పత్రికారంగ చరిత్రలో సువర్ణాధ్యాయానికి ‘సాక్షి’ శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రతి గురువారం ఇస్తున్న ‘భవిత’ అనుబంధాన్ని ఇకపై మెయిన్ ఎడిషన్‌లో ప్రతిరోజూ పాఠకులకు అందించేందుకు మరో ముందడుగు వేసింది. సాహసోపేతమైన నిర్ణయాన్ని అనుకున్నదే తడవుగా అమల్లోకి తెచ్చింది. విద్యార్థులు, పోటీ పరీక్షల శిక్షణార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన సమాచారంతో ముస్తాబైన సాక్షి ‘భవిత’ మెయిన్ ఎడిషన్ కాపీలను గుంటూరు నగరంలోని విజ్ఞాన్ విద్యాసంస్థల ప్రాంగణంలో బుధవారం ఆవిష్కరించారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య ‘భవిత’ కాపీలను ఆవిష్కరించారు. - గుంటూరు ఎడ్యుకేషన్ ‘భవిత’తో ఉజ్వల భవిత విద్యార్థులు, ఉద్యోగార్థులకు విలువైన సమాచారాన్ని అందిస్తున్న ‘భవిత’ ఇకపై ప్రతిరోజూ వెలువడటం ఎంతో ప్రయోజనకరమని హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ డెరైక్టర్ డాక్టర్ డీఎన్ రెడ్డి పేర్కొన్నారు. కోర్సు ఏదైనప్పటికీ ఎంపిక దశలోనే అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ‘భవిత’లో నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలతో విద్యార్థులు ఉజ్వల భవితను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి అభిరుచి ఉన్న రంగంలో ప్రోత్సహించాలని హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్ డెరైక్టర్ ఆర్సీ రెడ్డి సూచించారు. ఇంజనీరింగ్, ఐఐటీలే జీవితంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు తమకు ఆసక్తి గల ఇతర రంగాలపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. టీఎంఐ నెట్వర్క్ చైర్మన్ టి.మురళీధరన్ మాట్లాడుతూ...లక్ష్యం ఏదైనా సరే, దాన్ని సాధించేందుకు కఠోర శ్రమ, ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమని స్పష్టం చేశారు. నూతన ఒరవడికి ‘సాక్షి’ నాంది తెలుగు పత్రికారంగ చరిత్రలో నూతన ఒరవడికి ‘సాక్షి’ నాంది పలికిందని ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు విద్య, ఉద్యోగ సమాచారాన్ని అం దించేందుకు ‘భవిత’ను వారానికోసారి మార్కెట్లోకి తీసుకురావడాన్ని పెద్దయజ్ఞంగా నిర్వహిస్తున్న పరిస్థితుల్లో మెయిన్ ఎడిషన్‌లో ప్రతి రో జూ 2 పేజీ లను ‘భవిత’కే కేటాయించడం సాహసోపేతమని చెప్పా రు. లక్షలాది మంది పాఠకుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నూతన ఆవిష్కరణలకు ‘సాక్షి’ శ్రీకారం గత ఎనిమిదేళ్లలో తెలుగు పత్రికారంగంలో ‘సాక్షి’ ఎన్నో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిందని ‘సాక్షి’ రెసిడెంట్ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షల శిక్షణార్థుల ప్రయోజనార్థం ‘భవిత’ ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తోందని చెప్పారు. పోటీ పరీక్షలు జరిగిన మరునాడే సమాధానాల ‘కీ’ని విడుదల చేయడమనే ఒరవడిని ‘సాక్షి’ ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల నిపుణులు డాక్టర్ బీజేబీ కృపాదానం, సీటీవో జయకృష్ణ, ‘సాక్షి’ డెరైక్టర్ పీవీకే ప్రసాద్, హెచ్ఆర్ వైస్‌ప్రెసిడెంట్ రాంప్రసాద్, విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్‌చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రిన్సిపాల్ పాతూరి రాధిక, విద్యార్థులు, పోటీ పరీక్షల శిక్షణార్థులు పాల్గొన్నారు. ‘సాక్షి’ది గొప్ప ప్రయత్నం ‘సాక్షి’ యాజమాన్యం ఎంతో శ్రమతో కూడిన గురుతర బాధ్యతను భుజానికెత్తుకుందని డాక్టర్ లావు రత్తయ్య ప్రశంసించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా ‘భవిత’ను తీర్చిదిద్దడం సామాన్యమైన విషయం కాదన్నారు. వారానికి ఒకసారి వచ్చే ‘భవిత’ను ఇకపై ప్రతిరోజూ మెయిన్ ఎడిషన్‌లో రెండు పేజీలు ఇవ్వనుండడం గొప్ప ప్రయత్నమన్నారు. ఇది ఓ సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. విద్యారంగ నిపుణులు, సబ్జెక్ట్ నిపుణులు అందించే సలహాలు, సూచనలు, సబ్జెక్ట్ మెటీరియల్‌తో పాఠకులను ఆకట్టుకునే విధంగా ‘సాక్షి’ ముందడుగు వేసిందని అభినందించారు. పాఠశాల స్థాయిలోనే ఐఐటీ కోచింగ్ అందిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి శిక్షణ పొందాలనే అంశాలపై విద్యార్థులు, యువతరాన్ని చైతన్యపరుస్తూ తల్లిదండ్రులను అప్రమత్తంగా చేసేవిధంగా ‘సాక్షి’ భవిత రూపుదిద్దుకోవడం మంచి పరిణామమని రత్తయ్య కొనియాడారు. -
ఉజ్వల భవిష్యత్తుకు ‘భవిత’
♦ నూతన ఆవిష్కరణలకు ‘సాక్షి’ నాంది ♦ సాక్షి భవిత ఆవిష్కరణ వేడుకలో చుక్కా రామయ్య ♦ ‘సాక్షి’ కృషిని అభినందించిన వక్తలు ♦ కరీంనగర్లో ఘనంగా ఆవిష్కరణోత్సవం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విద్యార్థులు, ఉద్యోగార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సాక్షి ‘భవిత’ పునాది వంటిదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. వార్తలే కాకుండా సమాజానికి ఉపయోగపడాలనే కాంక్షతో పత్రిక మెయిన్ ఎడిషన్‌లో రోజూ భవిత అనుబంధానికి 2 పేజీలు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేస్తోందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాక్షి తెలుగు దినపత్రిక మెయిన్‌లో రోజూ ప్రత్యేకంగా అందిస్తున్న భవిత పేజీలను బుధవారం కరీంనగర్లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జోయెల్ డేవిస్‌లతో కలసి ఆయన ఆవిష్కరించారు. నగరంలోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సాక్షి నెట్వర్క్ ఇన్చార్జి కె.శ్రీకాంత్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు కాలేజీల విద్యార్థులు, ఉద్యోగార్థులు తరలివచ్చారు. ఎడిటర్ వి.మురళి ప్రారంభోపన్యాసం చేస్తూ భవితకు సాక్షి మెయిన్ ఎడిషన్‌లో 2 పేజీలు కేటాయించడం వెనుక ముఖ్య ఉద్దేశాలను వివరించారు. కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్, సాక్షి ఫైనాన్స్, అడ్మిన్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు, సబ్జెక్టు నిపుణులు గురజాల శ్రీనివాసరావు, శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్ మనోహర్‌రావు, సాక్షి మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, సర్క్యులేషన్ జీఎం సోమ సురేందర్ తదితరులు హాజరయ్యూరు. సాక్షి భవిత... ఒక దీక్ష: చుక్కా రామయ్య సాక్షి దినపత్రికకు భవిత ఒక దీక్ష అని చుక్కా రామయ్య అన్నారు. ‘‘నాలెడ్జ్ సెంటర్‌గా పేరొందిన కరీంనగర్లో భవితను ఆవిష్కరించడం ముదావహం. విద్యారంగ బీజా లు వేయడానికి కరీంనగర్ జిల్లా అనువైన ప్రాంతం. ఈ డిజిటల్ యుగంలో వర్తమాన విషయాలే గాక భవిష్యత్తు అంశాలను కూడా భవిత ద్వారా విద్యార్థులు నేర్చుకోవచ్చు. విద్యా రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఎప్పటికప్పుడు పలు అంశాలపై సాక్షి భవిత అందిస్తున్న సమాచారం విలువైంది.’’ అని చెప్పారు. భవిత.. దిక్సూచి కావాలి: కలెక్టర్ నీతూప్రసాద్ ఏటా ప్రభుత్వోద్యోగాల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని విద్యార్థి లోకం గమనించి ప్రైవేటు ఉద్యోగాలపై దృష్టి సారించాలని కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. ఇక నుంచి ఆకాశమే హద్దుగా పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ‘భవిత’ ద్వారా సాక్షి విలువైన సమాచారం అందించడం అభినందనీయమన్నారు. డిజిటల్ యుగపు మార్పులకనుగుణంగా విద్యార్థులు పయనించాలని సూచించారు. అవగాహనలేని విద్యార్థులకు భవిత దిక్సూచి కావాలన్నారు. భవితతో భావి ప్రణాళిక: ఎస్పీ జోయెల్ డేవిస్ గ్రామీణ నిరుద్యోగ యువత ఉన్నత చదువులు, పోటీ పరీక్షలు, ఉద్యోగాలపై అవగాహన లేక నష్టపోతున్నారని ఎస్పీ జోయెల్ డేవిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రణాళిక రూపొందించుకునేలా సాక్షి భవిత దిశానిర్దేశం చేస్తోందని అభినందించారు. కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేనివారికి సాక్షి భవిత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాలకూ స్థానం: సాక్షి ఎడిటర్ మురళి విద్యా రంగానికే కాకుండా రైతులు తదితర అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యతతో అవసరమైన సమాచారాన్ని సాక్షి ఎనిమిదేళ్లుగా అందిస్తూనే ఉందని ఎడిటర్ మురళి అన్నారు. పోటీ పరీక్షలకు కీ పేపర్ తయారు చేయడం సాక్షితోనే ప్రారంభమైందని, చాలాసార్లు వంద శాతం సరైన సమాధానాలిచ్చి లక్షలాది మంది మన్ననలు చూరగొన్నామన్నారు. భవితకు అత్యధిక ప్రాధాన్యం: వైఈపీ రెడ్డి ఎనిమిదేళ్లుగా ఎన్ని ఇబ్బందులొచ్చినా విద్యార్థులకు, యువతకు ఉపయోగపడే సాక్షి భవితకు పత్రికలో అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఫైనాన్సియల్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భవిత వేదికగా మారాలని ఆకాంక్షించారు. నాలుగో తరగతి నుంచి మొదలుకుని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యతోపాటు ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి సమాచారమూ అందిస్తామన్నారు. పరీక్ష విధానంలో వినూత్న మార్పులు: గురజాల పోటీ పరీక్షల్లో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయని సబ్జెక్టు నిపుణులు గురజాల శ్రీనివాస్‌రావు అన్నారు. గ్రూప్స్‌తోపాటు అన్ని పోటీ పరీక్షల్లోనూ సమకాలీన అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. కాబట్టి భవిత మెటీరియల్‌నూ విశ్లేషణాత్మకంగా ఇవ్వాలని కోరారు. కాలేజీల ఎంపిక కీలకం: రమణారావు ఎంసెట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు భవిత ఎంతో ఉపయోగకరమని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కావాల్సిన ప్రశ్నలు, జవాబులతోపాటు కాలేజీలు, గ్రూప్‌ల ఎంపిక తదితర విషయాలను భవిత ద్వారా అందించాలని కోరారు. సాక్షి అందిస్తున్న భవితతో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ప్రొఫెసర్ మనోహర్ అన్నారు. సాక్షి భవిత అద్భుతమని తహసీల్దార్ జయచంద్రారెడ్డి అభినందించారు. ఉద్యోగ ఎంపికకు దోహదం ‘‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. క్యాంపస్‌లో ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కోచింగ్ సెంటర్‌కు వెళ్లాను. సాక్షి భవిత నాకెంతగానో ఉపయోగపడింది. భవిత, విద్య పేజీల ద్వారా ఎంతో ప్రాక్టీసైంది. పలు నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో భవిత పేజీలను ప్రతి రోజూ అందించడం అభినందనీయం’’ - అరుణశ్రీ, డీఆర్డీఏ పీడీ భవితతోనే ఉద్యోగం సాధించా ‘‘నేను సాక్షి భవిత చదివే ఉద్యోగాన్ని సాధించా. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పద్ధతులతో పాటు ఉద్యోగానికి సంబంధించిన అంశాలు భవితలో చాలా చక్కగా ఉంటాయిు. భవితతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం సామాజిక బాధ్యతగా స్వీకరించిన సాక్షికి ధన్యవాదాలు’’ - నవాబ్ శివకుమార్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్