sana yadi reddy
-
నువ్వంటే నేను
‘పిట్టల దొర, బ్యాచిలర్స్, సంపంగి, ప్రేమ పల్లకి, జై బజరంగభళి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శక–నిర్మాత సానా యాదిరెడ్డి. చాలా సంవతర్సరాల గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నువ్వంటే నేనని’. సానా క్రియేషన్స్ పతాకంపై సానా భాగ్యలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా నకుల్, శ్వేత హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సానా యాదిరెడ్డి మాట్లాడుతూ– ‘‘2004లో హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రం సాగుతుంది. వరికుప్పల యాదగిరిని పాటల రచయితగా నా చిత్రాల ద్వారానే పరిచయం చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో అతన్ని సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాను. ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు. కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
వీళ్లు మంచి కిడ్నాపర్లు
అభిషేక్ కన్నెలూరు, మధుప్రియ, ప్రజ్వల్, మమతాశ్రీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శీను వేణు’. ‘వీళ్లు మంచి కిడ్నాపర్లు’ అన్నది ఉపశీర్షిక. రవి ములకలపల్లి స్వీయ దర్శకత్వంలో వసుంధర క్రియేషన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్స్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత సానా యాదిరెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత ముత్యాల రాందాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు ప్రేమ్‌రాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శక–నిర్మాత రవి మాట్లాడుతూ– ‘‘కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇద్దరు పల్లెటూరి అమ్మాయిలను ముంబై గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుం ది. వాళ్లు ఆ గ్యాంగ్ నుంచి ఎలా తప్పించుకున్నారన్న కథకు వినోదం జోడించి తీస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి. ఆర్యన్ (ఏడుకొండలు). -
మాజీ క్రికెటర్ కు జోడీగా 'రౌడీ' హీరోయిన్
హైదరాబాద్: మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా దక్షిణాదిలో తెరంగ్రేటం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి సరసన శాన్వి నటించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని సానా యాదిరెడ్డి సూచనప్రాయంగా ధ్రువీకరించారు. ఆమెతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, షూటింగ్ డేట్స్ గురించి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. శాన్వి ఇంతకుముందు లవ్ లీ, అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది. శ్రీశాంత్ తో నటించేందుకు శాన్వీ అంగీకరించిందని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆమెకు కథ బాగా నచ్చిందని తెలిపాయి. శ్రీశాంత్ లో సన్నిహితంగా మెలిగిన హీరోయిన్ పాత్రలో ఆమె ఈ సినిమాలో కనిపించనుందని వెల్లడించాయి. శ్రీశాంత్ జీవితంలో ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం శ్రీశాంత్ బరువు కూడా తగ్గాడు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీని కంటే ముందు 10 రోజుల పాటు నటీనటులకు యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. -
రాష్ట్రం విడిపోయాక పరిశ్రమ కలిసుండడం అసాధ్యం
‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. తెలంగాణ సినిమాను ప్రోత్సహించడానికి, తెలంగాణ సినీ కళాకారులకు చేయూతనివ్వడానికి హైదరాబాద్‌లోని ఏపి ఫిలిం ఛాంబర్ కార్యాలయంలోని ఓ భాగాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తక్షణం కేటాయించాలి’’ అని తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అన్ని రంగాల్లో జరిగినట్లే సినీరంగంలో కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇటీవలే ఫిలిం ఛాంబర్ పెద్దలు తెలంగాణ సినిమాను ప్రాంతీయ భాషా సినిమాగా వేరు చేసి చూపించారు. దీనిలోని ఆంతర్యమేంటో బయటపెట్టాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈ వివక్ష తగదు. ఇక్కడి నిర్మాతల సంఖ్య పెంచుకోవడం కోసం, తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు కల్పించాలి’’ అని కోరారు. తెలంగాణ నేలపై సినిమాలు తీస్తూ, తెలంగాణవారి సినిమాను ఓ ప్రాంతీయ సినిమాగా అభివర్ణించడం సరికాదని, ఇలాంటి చర్యలు తక్షణం విడనాడి తెలంగాణ సినిమాలను ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలని తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ దర్శక, నిర్మాతలు ఐక్యంగా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ట్విట్టర్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తక్షణం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయాక సినీ పరిశ్రమ కలిసి ఉండటం అసాధ్యమని సంగిశెట్టి దశరథ పేర్కొన్నారు. ఇంకా ప్రేమ్‌రాజ్, కుమార్ మాట్లాడారు. -
దేవుడు... దెయ్యం... మనిషి
మనిషి దేవుడికి భయపడతాడు. దెయ్యానికి భయపడతాడు. ఈ భయాలతో అసలు మనిషి పయనం ఎటువైపు వెళుతుంది? ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘దేవుడు... దెయ్యం... మనిషి’. కొమురవెల్లి శ్రీనివాస్ గౌలికర్ దర్శకుడు. ఎస్.ఎస్.ఎన్.మూవీస్ పతాకంపై కేశనకుర్తి శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీనివాస్ గౌలికర్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రాంభమైంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు ప్రేమ్‌రాజ్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి క్లాప్ ఇచ్చారు. భద్రాచలం, మణుగూరు, పాపికొండలు తదితర ప్రాంతాల్లో 40 రోజుల సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల శిరీష్, తులసి, నరేష్, మనస్విని సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: కోట తిరుపతిరెడ్డి, బేబి హరితశ్రీ.