నువ్వంటే నేను | Nuvvante Nenani Movie Directed By Sana Yadireddy | Sakshi
Sakshi News home page

నువ్వంటే నేను

Published Tue, Jul 21 2020 7:56 AM | Last Updated on Tue, Jul 21 2020 7:56 AM

Nuvvante Nenani Movie Directed By Sana Yadireddy - Sakshi

‘పిట్టల దొర, బ్యాచిలర్స్, సంపంగి, ప్రేమ పల్లకి, జై బజరంగభళి’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శక–నిర్మాత సానా యాదిరెడ్డి. చాలా సంవతర్సరాల గ్యాప్‌ తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నువ్వంటే నేనని’.  సానా క్రియేషన్స్‌ పతాకంపై సానా భాగ్యలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా నకుల్, శ్వేత హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సానా యాదిరెడ్డి మాట్లాడుతూ– ‘‘2004లో హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను.

సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రం సాగుతుంది. వరికుప్పల యాదగిరిని పాటల రచయితగా నా చిత్రాల ద్వారానే పరిచయం చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో అతన్ని సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాను. ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో విడుదల చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు. కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో ఓటీటీ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement