Sanitation problems
-
పారిశుధ్య సమస్యలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. బోర్లు, బావుల వద్ద అపరిశుభ్ర వాతావరణం, ఇళ్ల మధ్య చెత్త కుప్పలు, మురుగు కాల్వలలో పారే నీరు రోడ్లపైకి చేరడం వంటి సమస్యలతో పాటు ‘క్లాప్’ మిత్రల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణకు సంబంధించిన సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారం కోసం అన్ని జిల్లాల్లోని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయాల్లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ప్రత్యేక కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపడతారు. ఫిర్యాదు అందిన వెంటనే దానిస్థాయి ప్రకారం 24 గంటల వ్యవధిలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారులకు వేర్వేరు స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి -
పేరులో భాగ్యం.. తీరులో దౌర్భాగ్యం
సాక్షి, లక్ష్మీపురం(గుంటూరు): పేరులో భాగ్యం ఉన్నా.. తీరులో మాత్రం దౌర్భగ్యంగా ఉంది. నగరంలోని భాగ్యనగర్ ప్రాంతంలో రోజు రోజుకు పారిశుద్ధ్య సమస్యలతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు పారి«శుద్ధ్య సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని వాపోతున్నారు. స్థానిక మారుతీనగర్ ప్రాంతంలో నుంచి భాగ్యనగర్ మహాప్రస్థానం మీదుగా స్వర్ణాంధ్రనగర్, తురకపాలెం వైపుగా వెళ్లే దారి మురుగు, చెత్తతో నిండిపోయి ఉంది. ఇటుగా వాహనదారులు ప్రయాణించాలంటే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయేనని ఆందోళన చెందుతున్నారు. తవ్వారు వదిలేశారు భాగ్యనగర్‌లో నగరపాలక సంస్థ అధికారులు ఇటివల కాలంలో యూజీడి పనులు కోసం గుంతలు తవ్వి పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో స్థానికంగా నివాసం ఉండే వారు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అంటున్నారు. అయితే పనులు పూర్తి అయిన తరువాత యథావిధిగా ఉంచాల్సిన రోడ్డును వదిలేసి వెళ్లి పోయారు. దీంతో నిత్యం ఈ ప్రదేశంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు రోడ్డు పైకి రావాలంటే ఆందోళన చెందుతున్నారు. నిత్యం చెత్త కుప్పలతో నిండిపోయి తినుబండారాలు సైతం దుర్వాసన వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రాంతం చెత్తకుప్పలతో నిండిపోవడం, పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో జరుగక పోవడంతో ఈ ప్రాంత వాసులు విషజ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన దుస్తుతి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగాలు వస్తున్నాయి పేరుకు భాగ్యనగర్ తమ ప్రాంతంలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఊరు మధ్యలో ఉన్న ఊరు చివరలో ఉన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. భాగ్యనగర్ ప్రాంతం నుంచి తురకపాలెం వెళ్లేందుకు నిత్యం భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీనికి తోడు పేరుకు పోయిన చెత్తతో ఇబ్బందులు పడుతున్నాం. – విజయలక్ష్మి, స్థానికురాలు రోడ్డు బురదమయం మహాప్రస్థానం నుంచి భాగ్యనగర్ ప్రాంతంలో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్డంతా బురదమయంగా మారుతుంది. దీనికితోడు చెత్త కుప్పలు, భరించలేని దుర్వాసనతో స్థానికంగా విషజ్వరాల పాలవుతున్నాము.నిత్యం చెత్త కుప్పలతో నిండిపోయి తినుబండారాలు సైతం దుర్వాసన వెదజల్లుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రాంతం చెత్తకుప్పలతో నిండిపోవడం, పారిశుద్ధ్య పనులు కూడా సకాలంలో జరుగక పోవడంతో ఈ ప్రాంత వాసులు విషజ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన దుస్తుతి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -జోసఫ్, స్థానికుడు -
రాజన్న పారిశుధ్య చేయూతకు శ్రీకారం
నెల్లూరు(సెంట్రల్): నగర వాసులకు ఎలాంటి పారిశుధ్య సమస్య రాకుండా ఉండేందుకు తన సొంత నిధులతో రాజన్న పారిశుధ్య చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించానని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో రాజన్న పారిశుధ్య చేయూత ఆటోలను శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాదీవెనలో భాగంగా ఇటీవల తాను నగర నియోజకవర్గంలో గడప గడపకూ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నానని, కార్పొరేషన్ వాళ్లు కాలువల్లో పూడికతీయడం లేదని, చెత్తను తొలగించడం లేదని 80 శాతం మంది తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని నాలుగన్నరేళ్లుగా అనేకమార్లు తెలిపినా పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తన వంతుగా ఆరు ఆటోలు, 100 మంది సిబ్బందిని నియమించానని వెల్లడించారు. 84484 45526 నంబర్‌కు సమస్యను తెలియజేస్తే, 24 గంటల్లో పరిష్కరిస్తామని ప్రకటించారు. విమర్శలు మానుకోవాలి తాను ప్రజల తరఫున వారి సమస్యలపై మాట్లాడుతుంటే కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆరు ఆటోలు, 100 మంది కార్మికులను ఏర్పాటు చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుందన్నారు. నగరంలో మెరుగైన పారిశుధ్యం అందించగలిగితే తాము ఇచ్చిన నంబర్ ఎవరీకి అవసరం ఉండదనే విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని కోరారు. తాము నియమించిన కార్మికులు నగరంలో పనిచేస్తున్నారంటే పారిశుధ్య విషయంలో పాలకులు, ప్రభుత్వం విఫలమైనట్లేనని చెప్పారు. నగరవాసులకు మెరుగైన పారిశుధ్యాన్ని అందించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నానని తెలిపారు. తొలుత గాంధీబొమ్మ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు కేక్‌ను కట్ చేశారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, రూప్‌కుమార్‌యాదవ్, వేలూరు సుధారాణి, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, వందవాసి రంగ, కొణిదల సుధీర్, కర్తం ప్రతాప్‌రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, సంక్రాంతి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు -
పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు
కోదాడ కాలనీని సందర్శించిన డీఎంహెచ్ఓ తొండంగి : కోదాడ పంచాయతీలోని కోదాడ కాలనీలో పారిశుద్ధ్య లోపం వల్లే విషజ్వరాలు ప్రబలినట్టు డీఎంహెచ్ఓ చంద్రయ్య పేర్కొన్నారు. విషజ్వరాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఆయన ఆదివారం కోదాడ కాలనీలో పర్యటించి, రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. పరిశుభ్రతపై ప్రజలు దృష్టి సారించాలని అవగాహన కల్పించారు. రామాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పలువురు గర్భిణులకు, బాలింతలకు వైద్యపరీక్షలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, దీనివల్ల విషజ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వైద్యశిబిరం కొనసాగించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వైద్యాధికారులు, సిబ్బందిని నియమిస్తాం జిల్లావ్యాప్తంగా 119 పీహెచ్‌సీలు ఉండగా, కొత్తగా మరో 9 మంజూరయ్యాయని డీఎంహెచ్ఓ తెలిపారు. వీటిలో వైద్యులు, ఇతర సిబ్బందిని త్వరలో నియమించనున్నట్టు వెల్లడించారు. తూరంగి, రాజపూడి, తేటగుంట, చేబ్రోలు, నాగాయలంక, పేరూరు, అడివి, వెల్ల, ఎస్.యానాంల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్రీ్టయ బాల ఆరోగ్య స్వాస్థ కార్యక్రమంలో భాగంగా 52 ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్టు వివరించారు. -
రైళ్లలో కొరవడిన పారిశుధ్యం
- పుష్కర స్టేషన్లలోనూ అపరిశుభ్రతే - మరుగుదొడ్లలోనూ నిలబడి ప్రయాణం సాక్షి, విజయవాడ : గోదావరి మహా పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలిరావడంతో అటు రైళ్లు, ఇటు పుష్కర స్టేషన్లలోనూ పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా రాజమండ్రి, కొవ్వూరు, గోదావరి స్టేషన్ల వరకు రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ సరి పోవడం లేదు. ప్రతి రైలులోనూ రెట్టింపు సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. మరుగుదొడ్ల వద్ద ఉన్న జాగాలోనూ కిక్కిరిసి ఉంటున్నారు. కొందరైతే మరుగు దొడ్లలోనూ నిలబడి వెళుతున్నారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరుగుదొడ్ల వాడకం బాగా పెరిగింది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో నీటి కొరత ఏర్పడుతోంది. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో మరుగుదొ డ్లను పూర్తిస్థాయిలో క్లీనింగ్ చేయకుండానే రైళ్లను స్టేషన్ నుంచి పంపివేస్తున్నారు. స్టేషన్లలోనూ చెత్తాచెదారం రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు రైల్వేస్టేషన్లకు వేలాది మంది ప్రయాణికులు తరలిరావడంతో శానిటేషన్ సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, టిఫిన్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, పండ్ల తొక్కలు, టీ, కాఫీ కప్పులను ప్లాట్ఫారాలపైన, రైల్వేట్రాక్‌లపైన పడవేస్తున్నారు. పాడైపోయిన ఆహార పదార్థాలను సైతం అక్కడే పడేయడంతో ఈగలు, దోమలు ముసురుతున్నాయి. రంగంలోకి దిగిన అధికారులు పారిశుధ్యం లోపిస్తే రోగాలు ప్రబలుతాయని భావిస్తున్న రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. డీఆర్ఎం అశోక్‌కుమార్, ఏడీఆర్ఎం ఎన్.సీతారాంప్రసాద్, పుష్కరాల ప్రత్యేక అధికారి రమేష్‌బాబు స్వయంగా రైళ్లను, పుష్కర స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. రైల్వే శానిటేషన్ సిబ్బందితో మూడు షిప్టులలోనూ పనిచేయిస్తున్నారు. రైల్వే ట్రాక్, స్టేషన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. అవకాశాన్ని బట్టి బోగీలను శుభ్రం చేయిస్తున్నారు. -
ఆ వాసనకు... విరుగుడు!
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు... వీటన్నింటిలో ఉండే సామాన్య లక్షణమేమిటి? ముక్కుపుటలు అదరగొట్టే దుర్వాసన వెదజల్లే శౌచాలయాలు.. అవేనండి టాయిలెట్లు! డబ్బు మిగుల్చుకునే కక్కుర్తో... సిబ్బంది కొరతో స్పష్టంగా చెప్పలేముగానీ... వాసన మాత్రం నిజం. ఓ స్విట్జర్లాండ్ కంపెనీ ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం త్వరలో ఈ కంపునకు మంగళం చెప్పేయవచ్చు. అదెలాగంటారా? ఈ దుర్వాసనను పీల్చేసుకుని సువాసనలు వెదజల్లే సరికొత్త పెర్ఫ్యూమ్నొకదాన్ని వీరు తయారు చేశారు మరి! శుభ్రం చేయకపోయినప్పటికీ కొద్దికాలంపాటైనా దుర్వాసనను అరికట్టడం ద్వారా ప్రజలు పబ్లిక్ శౌచాలయాలను విసృ్తతంగా వాడతారని, తద్వారా పారిశుద్ధ్య సమస్య కొద్దిగానైనా తగ్గుతుందని ఈ కంపెనీ అంచనా. భారత్‌తోపాటు, కెన్యా, ఉగాండాల్లోని శౌచాలయాల నుంచి నమూనాలు సేకరించి వాటిద్వారా వెలువడే రసాయనాలను గుర్తించి మరీ తాము కొత్త పెర్ఫ్యూమ్ను అభివృద్ధి చేశామని కంపెనీ చెబుతోంది. గంధకం వాయువు మోతాదు ఎక్కువగా ఉండటం వల్లనే భారత్‌లోని శౌచాలయాల ద్వారా దుర్గంధం భరించలేనంత ఉంటుందని వీరు తమ పరిశోధనల ద్వారా తేల్చారు కూడా! -
సామాన్యుడిని పట్టించుకోరా?
అధికారులపై హైకోర్టు ఆగ్రహం పునరాభివృద్ధి ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకతవిచారణ వాయిదా న్యూఢిల్లీ: సామాన్యుడి ఇబ్బందులు, ఆరోగ్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టించుకోకుండా వాణిజ్య ప్రాజెక్టులకు ఇష్టమొచ్చినట్టు అనుమతులు ఇవ్వడం సరికాదని హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. ‘మనమంతా ఇప్పటికే చిక్కుల్లో ఉన్నాం. బడాబాబులు మాత్రం భారీ భవనాలు కట్టుకుంటున్నారు. సామాన్యుడి బాధల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులకు ప్రాజెక్టుల అనుమతులే ముఖ్యం. ప్రజలు ఏమైనా ఫర్వాలేదు’ అని న్యాయమూర్తి మన్మో హన్ వ్యాఖ్యానించారు. కిద్వాయ్‌నగర్, సౌత్ ఎక్స్టెన్షన్ 2 వంటి ప్రాంతాల పునరాభివృద్ధి ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెం బర్ 29కి వాయిదా వేశారు. ఈ ప్రాజెక్టులు అమలైతే ఈ రెండు ప్రాంతాల్లో పేదరికం పెరుగుతుందని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. పునరాభివృద్ధి ప్రాజెక్టు గురించి వివరిస్తూ సంబంధిత అధికారులు విడుదల చేసిన బ్రోచర్లు చూస్తుంటే ఈ ప్రాంతం ఒక పట్టణ మురికివాడలా మారగలదని అనిపిస్తోందని న్యాయమూర్తి మన్మోహన్ పేర్కొన్నారు. నగరాల్లో మురికివాడలను పెంచే ఇలాంటి ప్రాజెక్టులను అనుమతించకూడదని అభిప్రాయపడ్డారు. కిద్వాయ్‌నగర్ ప్రాజెక్టు ప్రతిపాదనను పునఃపరిశీలించాలని ఆయన సూచించారు. ప్రస్తుతమున్న రోడ్లు, నీరు, విద్యుత్ ఈ ప్రాజెక్టుకు సరిపోతాయో లేదో ఆలోచించాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఆదేశాలు జారీ చేయకపోయినా, ఎల్జీ వివరణ అందిన తరువాత స్పందిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రణాళికలను మంజూరు చేసింది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎమ్సీ) కాబట్టి ఈ కేసులో దానిని కూడా వాదిగా చేర్చాలని హైకోర్టు సూచించింది. సౌత్ ఎక్స్టెన్షన్, దాని పరిసర ప్రాంతాల సహజత్వం దెబ్బతినే చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిలువరించాని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి పైవ్యాఖ్యలు చేశారు. కిద్వాయ్‌నగర్, సౌత్ ఎక్స్టెన్షన్ 2 పునరాభివృద్ధి ప్రాజెక్టు అమలు ప్రమాణాల ప్రకారం జరగడం లేదని, అందుకే దానిని రద్దు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల పెరిగే వాహన సంచారానికి సరిపడా రహదారులు లేవనే విషయాన్ని పోలీసుశాఖ ఇది వరకే తెలిపిందని న్యాయవాది అమన్ లేఖీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. వ్యాపారీకరణకు భారీగా స్థలం కేటాయించడం వల్ల గృహవసతి సదుపాయాలు తగ్గి మురికివాడలు ఏర్పడతాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.