Santoshnagar
-
హైదరాబాద్‌లో మళ్లీ ఐసిస్ కలకలం
-
హైదరాబాద్‌లో మళ్లీ ఐసిస్ కలకలం
బంగ్లాదేశ్‌లో పేలుళ్లకు పాల్పడి పలువురి ప్రాణాలు బలిగొన్న ఐఎస్ఐఎస్ తదుపరి లక్ష్యం భారతదేశమేనా? ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ సానుభూతిపరుల ద్వారా ఉగ్రదాడులు చేయించడానికి ఐఎస్ పావులు కదుపుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని సంతోష్‌నగర్ ప్రాంతంలో మరో ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈదీబజార్ ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్‌గా ఆ సానుభూతిపరుడిని గుర్తించారు. అతడిని విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయానికి తరలించారు. ఇటీవలే కేంద్ర నిఘా విభాగం నుంచి అందిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ వర్గాలు హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాలలో సోదాలు చేసి ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకోవడంతో నగరంలో ఐసిస్ వేళ్లూనుకోడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
నకిలీ బంగారం కేసులో వ్యక్తి అరెస్ట్
సంతోష్‌నగర్ (హైదరాబాద్) : ఓ గోల్డ్ షాపు యజమానిని నకిలీ బంగారంతో బురిడీ కొట్టించి అసలు బంగారం తీసుకెళ్లిన వ్యక్తిని మంగళవారం సంతోష్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ మూడవ తేదీన సంతోష్ నగర్ బంగారు నగల దుకాణంలోకి లక్ష్మణ్ అనే వ్యక్తి వచ్చి నకిలీ బంగారం పెట్టి అసలు బంగారంతో పరారయ్యాడు. మంగళవారం లక్ష్మణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి పదిహేడు తులాల బంగారం, ఒక మారుతీ కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.