Saroj Pandey
-
ప్రియాంక గాంధీ ట్రంప్ కార్డ్ అయితే..
ముంబై: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బీజేపీ నాయకురాలు సరోజ్ పాండే ‘జోకర్’ వర్ణించారు. మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ పిల్లలు, భర్తను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోని తీసుకొస్తుందన్నారు. ప్రియాంక గాంధీని ట్రంప్ కార్డ్‌గా కాంగ్రెస్ నాయకులు అభివర్ణించడంపై స్పందిస్తూ.. ‘ప్రియాంక అంత గొప్ప నాయకురాలు అయితే ముందే ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాల్సింది. ఇంతకాలం సమయం ఎందుకు వృథా చేసుకున్నారు. ఇప్పటి వరకు జోకర్తోనే ఆట కొనసాగించార’ని రాహుల్ గాంధీని పరోక్షంగా ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ లాంటి అందమైన మహిళ తమ పార్టీలో ఉన్నారని మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ‘ప్రియాంక గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న తీరుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. మహిళల అందం గురించే వారు ఆలోచిస్తున్నార’ని విమర్శించారు. భూ కుంభకోణాల్లోఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆయన కోశాధికారి పదవి అప్పగించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
రాహుల్‌పై బీజేపీ ఎంపీ ప్రశంసలు
డెహ్రాడూన్ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై బీజేపీ మహిళా ఎంపీ సరోజ్ పాండే ప్రశంసలు కురిపించారు. రాహుల్‌లో ఇటీవల కొంత పరిణితి కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.చత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అయిన పాండే గతంలో రాహుల్‌కు మందబుద్ధి ఉందని పేర్కొనడం గమనార్హం. రాహుల్ ఇటీవలి రాజకీయ ఎత్తుగడలను ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు . కాగా గతంలో వ్యాపం స్కాంను రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ భుజాలకెత్తుకుందని, ఇది సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో విపక్షాలు రాఫేల్ స్కాంను తెరపైకి తెచ్చాయని సరోజ్ పాండే ఆరోపించారు. ఇక కోల్‌కతాలో విపక్షాల ఐక్యతా ర్యాలీపై ఆమె విమర్శలు గుప్పించారు. తన సొంత రాష్ట్రం బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని మమతా బెనర్జీ విపక్షాల ర్యాలీకి నేతృత్వం వహించడం విస్మయం కలిగిస్తోందన్నారు. బెంగాల్లో విపక్షాలను అణిచివేస్తున్న మమతా సమక్షంలో విపక్షాలన్నీ మోదీపై పోరాడతామని ప్రకటించడం అవివేకమని ఎద్దేవా చేశారు. బీజేపీ సత్తా ఏపాటిదో ఈ నేతలను చూస్తే అర్ధమవుతుందన్నారు. -
ఈ వయసులో నేర్చుకోవడమేంటి?
రాయ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు సరోజ్ పాండే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ‘మందబుద్ధి వ్యక్తి’గా ఆమె అభివర్ణించారు. ‘కాంగ్రెస్‌లాంటి అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఆయన రాజకీయాలను ఇప్పటికీ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారంట. ఆ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారు. కానీ, ఓ వ్యక్తి 40 ఏళ్ల వయసులో ఇంకా నేర్చుకోవటం ఏంటి? అలాంటి వారిని మందబుద్ధి వ్యక్తులనే పిలవాల్సి ఉంటుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసే క్రమంలో ఆ మధ్య రాహుల్ చేసిన ఓ ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ‘శిఖంజి వ్యాఖ్యలు’ తిరిగి రాహుల్‌నే విపరీతంగా ట్రోల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే గురువారం దుర్గ్ ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘మందబుద్ధి’ వ్యక్తిగా వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాహుల్‌కు క్షమాపణలు చెప్పాలని సరోజ్ ఇంటి వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. -
బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో యుద్ధబేరి