
సరోజ్ పాండే, రాహుల్ గాంధీ
ముంబై: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బీజేపీ నాయకురాలు సరోజ్ పాండే ‘జోకర్’ వర్ణించారు. మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ పిల్లలు, భర్తను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోని తీసుకొస్తుందన్నారు. ప్రియాంక గాంధీని ట్రంప్ కార్డ్‌గా కాంగ్రెస్ నాయకులు అభివర్ణించడంపై స్పందిస్తూ.. ‘ప్రియాంక అంత గొప్ప నాయకురాలు అయితే ముందే ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాల్సింది. ఇంతకాలం సమయం ఎందుకు వృథా చేసుకున్నారు. ఇప్పటి వరకు జోకర్‌తోనే ఆట కొనసాగించార’ని రాహుల్ గాంధీని పరోక్షంగా ఎద్దేవా చేశారు.
ప్రియాంక గాంధీ లాంటి అందమైన మహిళ తమ పార్టీలో ఉన్నారని మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ‘ప్రియాంక గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న తీరుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనం. మహిళల అందం గురించే వారు ఆలోచిస్తున్నార’ని విమర్శించారు. భూ కుంభకోణాల్లోఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆయన కోశాధికారి పదవి అప్పగించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment