Sarojamma
-
నాకు తెలియాలి
సిటీ కార్పోరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నిటికీ సరోజమ్ దరఖాస్తు పెట్టింది.. ‘‘నా దుకాణం కూలగొట్టమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని. ‘‘నేను ఇచ్చిన కంప్లయింట్ స్టేటస్ ఏంటి? దర్యాప్తు చేయడానికి పురమాయించారా? ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ కాపీ చూపించండి. దర్యాప్తు కోసం నియమించిన ఆఫీసర్ ఎవరు? దర్యాప్తు జరిగి ఉంటే దానికి సంబంధించిన రిపోర్ట్ కాపీని సంబంధిత అధికారికి అందచేశారా?..ఈ ప్రశ్నలతో దరఖాస్తు అందగానే ఆగమేఘాల మీద కదిలారు పోలీసులు ఆ కేస్ ఇన్వెస్టిగేషన్‌కు.ఈ ప్రశ్నలు సంధించిన వ్యక్తి పేరు సరోజమ్. ఓ సగటు మహిళ. షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వ్యక్తి. ఏ విషయం పట్ల ఆ ఆగ్రహం? మామూలు ఆగ్రహం కాదు ధర్మాగ్రహం! మొదట పట్టించుకోలేదు సరోజమ్.. తిరువనంతపురం నివాసి. 20 ఏళ్లుగా అక్కడే ఎమ్ఎస్కె నగర్లో అట్టుకల్ దేవీ గుడి దగ్గర పాత ఇనుప సామాన్ల దుకాణం నడిపిస్తూ ఉంది. 2014 అక్టోబర్ 11న సిటీ కార్పొరేషన్‌కు చెందిన కొంతమంది మనుషులు వచ్చి ఆమె దుకాణాన్ని కూలగొట్టారు. అందులో ఉన్న వస్తువులన్నిటినీ ఊడ్చుకెళ్లారు. ఎందుకలా చేస్తున్నారు అని ఆ సరోజమ్ అడిగితే.. ఆ దుకాణం పక్కనే ఉన్న చెరువును శుభ్రం చేయమని ఆర్డర్స్ వచ్చాయని.. చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ క్లీన్ చేయమన్నారని.. పైగా ఆమె దుకాణం పోరంబోకు భూమిలో ఉంది కాబట్టి దాన్నీ తీసేశామని చెప్పారనీ అన్నారు. వెంటనే ఆమె భర్త నాగరాజన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, వాళ్లపై కంప్లయింట్ ఇచ్చాడు. ఎప్పటిలాగే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ నెల అయినా వ్యవహారం అంగుళం ముందుకు సాగలేదు. ఈసారి సరోజమ్ వెళ్లి ఇంకోసారి కంప్లయింట్ ఇచ్చింది. రిసీట్ ఇవ్వమనీ డిమాండ్ చేసింది. అయినా పోలీసులు స్పందించలేదు. తరచుగా పోలీస్ స్టేషన్ వెళ్తూనే ఉంది. దాదాపు పదినెలలు గడిచాయి. బతుకు దెరువు పోయింది. చేతిలో ఇంకో పనిలేదు. పోలీసుల తీరులో మార్పులేదు. తర్వాత పరుగులు తీశారు సరోజమ్ వాళ్లుండే ప్రాంతంలో ‘ది సేవా’ (సెల్ఫ్ ఎంప్లాయ్డ్ విమెన్స్ అసోసియేషన్) ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) మీద అవగాహనా తరగతులను నిర్వహించింది. దానికి సరోజమ్ కూడా వెళ్లింది. అంతా విని తన సమస్య గురించి తను ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ కథాకమామీషు కూడా ఈ ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చా? అని నిర్వాహకులను అడిగింది. తెలుసుకోవచ్చని చెప్పారు. ఎలాగో కూడా వివరించారు. అలా వాళ్ల సలహా ప్రకారం తను ఇచ్చిన కంప్లయింట్‌కు సంబంధించి పైన ప్రశ్నలతో పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీఐ దరఖాస్తును ఫైల్ చేసింది. మీడియా వాళ్లొచ్చారు ఆ రోజు వరకు ఎప్పుడు సరోజమ్ వెళ్లినా.. అసలు ఎమ్ఎస్కె నగర్లో.. అట్టుకల్ దేవీ గుడి దగ్గరున్న చెరువు ఒడ్డున పాత ఇనుప సామాన్ల షాపే లేదని.. అదంతా పోరంబోకు ల్యాండ్ అని సరోజమ్‌ను బెదిరించి పంపిన పోలీసులు ఆమె ఆర్టీఐ దరఖాస్తు చూసి అంతకుమించిన బెదురుతో హుటాహుటిన కదిలారు.. కేస్ సాల్వ్ చేయడానికి! దాంతో అప్పటిదాకా నిద్రాణంగా ఉన్న ఆ కేస్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నిరుపేదల, షెడ్యూల్డ్ కులాల ప్రజల అజ్ఞానాన్ని ప్రభుత్వోద్యోగులు ఎలా ఆసరాగా మలచుకుంటున్నారో సరోజమ్ కేసుతో ప్రజలకు చూపించింది స్థానిక మీడియా. పదినెలలుగా సరోజమ్ కుటుంబం పడ్డ అవస్థ వార్తగా వైరల్ అయింది. వార్తా చానెళ్లు కెమెరా, మైక్‌లతో ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. కూల్చినవాళ్లే కట్టించారు సిటీ కార్పొరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నిటికీ సరోజమ్ దరఖాస్తు పెట్టింది.. ‘‘నా దుకాణం కూలగొట్టమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని. ‘‘సరోజమ్ దుకాణం కూల్చివేతతో మాకు ఎలాంటి సంబంధం లేదని, మేమెలాంటి ఆర్డర్స్నూ పాస్ చేయలేదు’’ అని కార్పొరేషన్, జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. మరెవరు ఆదేశాలు ఇచ్చారో తెలపమని సంబంధిత ప్రభుత్వ శాఖలకు నోటీసివ్వమని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌కు మరో దరఖాస్తు పెట్టుకుంది సరోజమ్. చెరువును శుభ్రం చేయమనే ఉత్తర్వు షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ శాఖ నుంచి వచ్చినట్టు తేలింది. ‘‘స్వయం పర్యాప్త గ్రామం’ (సెల్ప్ సఫీషియెంట్ విలేజ్) ప్రాజెక్ట్ కింద చెరువును శుభ్రం చేసే పనిని చేపట్టాం తప్ప, ఒడ్డున ఉన్న షాప్‌ను కూల్చమనే ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు’’ అని వివరణ ఇచ్చాడు ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇక్కడి నుంచి కథ ఇంకా చకచకా కదలడం మొదలైంది. ఎవరు కూల్చమన్నారు? ఎందుకు కూల్చారు నుంచి అసలు ఎమ్ఎస్కె నగర్ స్వరూప స్వభావాల మీద అధ్యయనం దాకా వెళ్లింది వ్యవహారం. చివరికి ఈ ఏడాది ముప్పయ్ అంటే ముప్పయ్ రోజుల్లో.. సరోజమ్ ఆర్టీఐ దరఖాస్తుతో ఆమె దుకాణాన్ని ఎక్కడైతే కూల్చారో.. అక్కడే కొత్త దుకాణాన్ని కట్టి ఇచ్చారు. ఎమ్ఎస్కె నగర్‌ను కూడా అత్యవసర సదుపాయాలతో కొత్తగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ కాలనీ వాసులంతా సరోజమ్‌ను విజేతగా.. నేతగా అభిమానిస్తున్నారు. – శరాది -
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే...నగలు ఎత్తుకెళ్లారు
ఏర్పేడు ఘటనలో మృతి చెందిన సుమతి తల్లి సరోజమ్మ ఆవేదన ఏర్పేడు(శ్రీకాళహస్తి): తన కూతురు తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. ఎవరో ఆమె ఒంటి మీద ఉన్న నగలను అపహరించారని ఏర్పేడు ఘటనలో మృతిచెందిన సుమతి తల్లి సరోజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మునగలపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియా వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతుండటంతో న్యాయం కోసం గ్రామంలోని రైతులంతా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కో వ్యక్తి తహసీల్దారు కార్యాలయంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు రావాలని.. లేకుంటే రూ.500 అపరాధ రుసుం కట్టాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అయితే 21వ తేదీన తన అల్లుడు ఇంటి వద్ద లేకపోవడంతో సుమతి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిందని చెప్పారు. రైతులంతా పోలీస్‌స్టేషన్ వద్ద ఉండగా లారీ దూసుకురావడంతో సుమతి తీవ్రంగా గాయపడిందన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎవరో వ్యక్తి సుమతి మెడలోని 4 సవర్ల బంగారు చైను, తాళిబొట్టు, చెవులకున్న బంగారు కమ్మలను అపహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిధంగా అతినీచంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సరోజమ్మ కోరారు. -
చావులో కూడా కలిసే సాగారు
తిరుపతి: కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాన్ని వారు మరిచిపోలేదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కలిసే ఎదుర్కొన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారు చావులో కూడా కలిసే గంటల వ్యవధిలో కన్నుమూశారు. భార్య అకస్మాత్తుగా మృతిచెందడంతో కుంగిపోయిన భర్త నీవెంటే నేనంటూ తనువు చాలించాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని కాశిరాళ్ల గ్రామంలో ఎం క్రిష్ణపిళ్లై(87) రైల్వేలో గార్డుగా పనిచేస్తూ 25 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. చెన్నై, వేలూరు, బెంగళూరు తదితర ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేదు. ఆయనను భార్య కె. సరోజమ్మ(80) కంటికి రెప్పలాగా చూసుకుంటోంది. భర్త ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆమె ఎంతో మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కళ్లుతిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు ఆమె మృతిచెందినట్టు తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న భర్త క్రిష్ణపిళ్లై తీవ్ర ఆవేదనకు గురై గంట వ్యవధిలో తనువు చాలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంతాపం తెలిపారు. -
జగన్‌తోనే సంక్షేమం సాధ్యం
శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్ : జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం సాయంత్రం పొన్నాంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ, పిల్లల ఉన్నత చదువులు, అర్హులకు పింఛన్లు అందాలంటే వైఎస్సార్సీపీకి ఓటేయాలన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మండలం నుంచి పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చిట్టి జనార్థనరావు, నీలంశెట్టి సౌమ్యను గెలిపించాలని కోరారు. బాబు సంక్షేమమేమిటంటే... ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడమే చంద్రబాబు మార్కు సంక్షేమమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. ప్రజాదరణతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దించిన ఘనత బాబుదన్నారు. రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.25కు పెంచడం, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి గ్రామగ్రామాన బెల్టు షాపుల ఏర్పాటు చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలను తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చిట్టి జనార్ధనరావు, నీలంశెట్టి సౌమ్య, గ్రామ సర్పంచ్ బైరి రాజేశ్వరీరామారావు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మాజీ జెడ్పీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు, కొర్ను గోవిందరావు, నీలంశేట్టి రామకృష్ణ, మొదలవలస శ్రీనివాసరావు, సనపల శ్రీనివాసరావు, రావాడ ధరణీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే నేతలను తరిమికొట్టాలి ఆమదాలవలస : కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్, టీడీపీ నేతలను తరిమికొట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాంతో కలిసి మున్సిపాలిటీపరిధిలోని 22వ వార్డు లక్ష్ముడిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేస్తే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి బి.అజంతాకుమరి, కౌన్సిలర్ అభ్యర్థి దుంపల చిరంజీవి, పార్టీనాయకులు అందవరపు సూరిబాబు, రవికుమార్, కూన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సరోజనమ్మకు ఓటేయండి మండలంలోని నెల్లిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెడ్డి శాంతి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొడ్డేపల్లి సరోజనమ్మకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎస్.అనిల్‌కుమార్, పార్టీ నాయకులు ఎస్.సీతారాం, కేవీ రమణ, జి.గిరి, తదితరులు పాల్గొన్నారు.