Satakarni
-
ధీర వనితల్లో నాగనికది ముందు వరసే!
సాక్షి, హైదరాబాద్: ధీర వనితలు అనగానే చరిత్ర పుటల్లో రాణి లక్ష్మీబాయి, రుద్రమదేవి లాంటి వారి పేర్లు కనిపిస్తాయి. వారి వీరగాథలు తెరలు తెరలుగా కదలాడుతాయి. కానీ చరిత్రకు సజీవ సాక్ష్యాలు కనిపించటం మొదలైన తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని భావి తరాల మహిళలకు బాట చూపిన మహిళ నాగనిక. దేశంలో మూడొంతుల ప్రాంతాన్ని అప్రతిహతంగా ఏలిన శాతవాహన వంశానికి చెందిన ధీశాలి నాగనిక. శాతవాహన రాజు శాతకర్ణి భార్య. మూడు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన శాతవాహన సింహాసనాన్ని అంతే గంభీరంగా అధిష్టించి ఏలిన చక్రవర్తి శాతకర్ణి. ఆయన పాలనకు కూడా అంతే మంచి పేరుంది. అయితే మహారాష్ట్రలోని పుణే ఆవల నానేఘాట్ గుహలో వెలుగు చూసిన ఓ శాసనం మహిళల ధీరత్వానికి నిలువుటద్దం. అది నాగనిక వేయించిన శాసనం. శాతకర్ణి మరణించాక రాజ్యభారాన్ని ఆమెనే చూసుకున్నారని చరిత్రకారులు భావిస్తుంటారు. కానీ దానిని రుజువు చేసే ఆధారాలు పెద్దగా లేవు. కానీ నానేఘాట్ శాసనాన్ని నాగనిక వేయించటం ఆమె పాలనను బలపరుస్తోంది. ఈ శాసనంలో ఆమె శాతవాహన తొలి చక్రవర్తి చిముకుడు, తన భర్త శాతకర్ణి, కుమార భాయ, తన తండ్రి త్రణకయిరో, కుమార హకుసిరిల ప్రతిమలు, వారి కీర్తిని చెక్కించారు. ఆమె కీర్తికి తార్కాణం వెండి నాణేలు.. సాధారణంగా తమ పాలనకు గుర్తుగా చక్రవర్తులు, రాజులు నాణేలు చెలామణిలోకి తీసుకొస్తారు. ఏ ప్రాంతాన్నైనా ఓడించి తన పరిధిలోకి తెచ్చుకుంటే.. అక్కడ అప్పటివరకు ఉన్న నాణేలను పక్కనపెట్టేసి, తమ పేరు, గుర్తుతో ఉండే సొంత నాణేలు వేయిస్తారు. అప్పట్లో నాణేలకు అంత ప్రాధాన్యం ఉండేది. తమ పేర నాణెం వేయిస్తే.. ఆ ప్రాంతంలో తమ మాటకు ఎదురు లేదన్నట్టుగా భావించేవారు. అయితే చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ పేరుతో ఉన్న నాణెం జున్నూరు ప్రాంతంలో లభించింది. అది శాతవాహనుల వెండి నాణెం. దానిపై నాగనిక పేరు ఉంది. తన భర్త శాతకర్ణి పేరు కూడా అందులో వేయించింది. నాగనిక పాలించారనడానికి ఇదే గుర్తు అని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక పెద్దపెద్ద చక్రవర్తులు చేసే అశ్వమేధ యాగాన్ని కూడా ఆమె నిర్వహించినట్టు ఆ నాణేలు చెబుతున్నాయి. యాగ అశ్వం ఎంత దూరం వెళితే అంతవరకు తమ రాజ్యంగా పేర్కొనేవారు. ఇలా అశ్వమేధ యాగం నిర్వహించిన వారు.. తమ రాజ్య నాణేలపై గుర్రం బొమ్మను ముద్రిస్తారని చరిత్ర చెబుతోంది. నాగనిక పేరుతో దొరికిన కొన్ని నాణేలపై అశ్వం గుర్తు కనిపించటంతో ఆమె అశ్వమేధయాగం చేశారని భావిస్తున్నారు. మొత్తంగా సువిశాల శాతవాహన సామ్రాజ్యాన్ని ఆమె ధైర్యంగా ఏలారన్నది చరిత్రకారుల మాట. ఈ లెక్కన చరిత్రలో నిలిచిన ధీర వనితల్లో అమెది ముందు వరసే. చదవండి: కష్టాలను భరించి.. కరోనాను ఎదిరించి.. నారీ వారియర్ -
చరిత్రకు కొత్త ఊపునిచ్చిన 'శాతకర్ణి'
విశ్లేషణ మన తెలుగు సినిమాకు పెట్టినట్టు ఆ పేరును 'శాతవాహన' అని కాకుండా, 'సాతవాహన' అని చదువుకోవాలి. మన చరిత్ర గురించి చెప్పేటప్పుడు భావి తరాలను గుర్తుంచుకోవాలి. చరిత్ర తిరగరాసుకుంటూ ఉండాలి. అందులో ప్రధానంగా జరగవలసింది దోషాల నివారణ. శాతవాహన వంశీయుల మీద ఒక చలన చిత్రం నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగువారంతా ఆనందించవల సిన విషయం. 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఈ మధ్యనే విడుదలైంది. దర్శకుడు, నిర్మాత ఆ చరిత్ర పురుషునికి సంబంధించిన డాక్యు మెంటరీ నిర్మించలేదు. ఆ గాథను తెరకెక్కిం చారు. అందుకు తగ్గట్టు కొన్ని హంగులు ఉంటాయి. ఈ వంశీయుల జన్మస్థలి తెలం గాణలో గోదావరి తీరాన ఉన్న కోటిలింగాల. వీరు సగానికి పైగా భారతావని మీద తమ ఆధిపత్యం నెలకొల్పగలిగారు. కుషాణులు దక్షిణాపథం వైపు రాకుండా నిరోధించిన ఘనత కూడా వారిదే. 5 వేల ఏళ్ల భారత చరిత్రలో రెండు యుగాలు మాత్రమే శాంతి సౌభా గ్యాలతో వర్థిల్లాయని చరిత్రకారులు చెబుతారు. అందులో మొదటి యుగం సింధులోయ నాగరికత కాలం. రెండు శాతవాహనుల ఏలు బడి. సింధులోయ నాగరికతలో కనిపించే మహోన్నత అంశం–నలభై వేలమంది నివసించడానికి వీలుగా పట్టణాలను ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా నిర్మించుకోవడం. కారణాలు ఏమైనా సినిమా విడుదలైన తరువాత శాతవా హనుల మీద పరిశోధనకు కొత్త ఊపు వచ్చే దాఖలాలు కనిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలను గమనించడం అవసరం. సినీ కళాకారులు, చరిత్రకారులు కూడా ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిది. అందుకే కొన్ని వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. చరిత్ర మీద కొత్త వెలుగు గానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా నిర్మాణం గానీ జరిగితే ఈ ఆధారాలు మరింతగా ఉపకరి స్తాయి. ప్రజలకు ఈ మహోన్నత చరిత్ర మరింత చేరువవుతుంది. శాతవాహన వంశంలో నలుగురు మహనీయులు ప్రధానంగా కనిపిస్తారు. అందులో మొదట చెప్పుకోదగినవాడు చిముక శాతవా హనుడు. ఇంకా శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, ఆయన సోదరుడు గౌతమీపుత్ర యజ్ఞశాతకర్ణి. ఇక్కడే ఒక వాస్తవం గమనించాలి. వీరిలో చిముకుడు మాత్రమే శా(సా)తవాహన అని తనను తాను పేర్కొ న్నాడు. మిగిలిన వారంతా శాతకర్ణి అన్న పేరు పెట్టుకున్నారు (తల్లి పేరుతో పాటు). ఎందుకంటే ఇందులో శాతకర్ణి 56 సంవత్సరాలు సమర్థవంతమైన పాలనను అందించాడు. ఆయన పేరునే వీరు తమ పేర్లలో చేర్చుకున్నారు. ఈ వంశీయుల చరిత్రకు వాఙ్మయం నుంచి, నాణేలు, శిలాశాసనాల నుంచి ఆధారాలు దొరుకుతున్నాయి (ఇదే అంశాన్ని సినిమాలో ఒకచోట నాణేల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు కూడా). వాఙ్మయ ఆధారాలంటే ప్రధానంగా పురాణాలలో వీరి పేర్లు కనిపించడం విశేషం. మత్స్య, వాయు, విష్ణు, భాగవత, బ్రహ్మాండ అనే ఐదు పురాణాలలో వీరిపేర్లు కనిపిస్తాయి. వీటిలో భారతావనిని ఏలిన చాలా పూర్వ రాజవంశాల ప్రస్తావన ఉంది. అందులోనే శాతవాహనుల పేర్లు కూడా కనిపిస్తాయి. కానీ వీటిలో కొన్ని వివరాలు సమగ్రంగా అనిపించవు. సహేతుకంగా కనిపించవు. అందుకు కారణం శాతవాహనుల కాలం కంటే చాలా తరువాత ఈ పురాణాలను రాయడం జరిగింది. వీటి రచన గుప్తుల కాలంలో మొదలై వేయేళ్లకు ముగిసిందని చెబుతారు. ఇందులో రెండు పురా ణాలు మాత్రం ఒకే విధమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. మిగిలినవి ఈ వివరాలతో విభేదిస్తున్నాయి. మత్స్య పురాణం తీసుకుంటే, అందులో గౌతమీపుత్ర శాతకర్ణి ఆ వంశీయులలో 23వ చక్రవర్తి. కానీ వాయు, భాగవత పురాణాలు 16వ పాలకునిగాను, విష్ణు పురాణం 17వ పాలకునిగాను, బ్రహ్మాండ పురాణం 19వ ఏలికగాను పేర్కొం టున్నాయి. అలాగే వీరి పాలనా కాలంలోనూ కొన్ని తేడాలు కనిపిస్తాయి. కాబట్టి నాణేలు, శిలాశాసనాలే వీరి చరిత్రకు విశ్వసనీయ ఆధారాలు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలానికి చెందిన శిలాశాసనాలు నాసిక్, కార్లే, కన్హేరీలలో కనిపిస్తాయి. ఈ వంశీయులకు చెందిన వంద లాది నాణేలు హైదరాబాద్, చెన్నై పురావస్తు ప్రదర్శనశాలల్లో ఉన్నాయి. ఇంకా దేశంలోని కొన్ని ఇతర పురావస్తు ప్రదర్శనశాలల్లోనే కాకుండా, లండన్, న్యూయార్క్‌లలో కూడా వీరి నాణేలు ఉన్నాయి. కొందరు వ్యక్తుల అధీనంలో కూడా ఈ కాలపు నాణేలు ఉన్నాయి. 1989లో కోటిలింగాలలో జరిగిన తవ్వకాల్లో దొరికిన 987 నాణేలు ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నాయి. ఇవి చిముకుడు, శాతకర్ణి, గౌతమీ పుత్ర శాతకర్ణి, వాశిష్టీపుత్ర పులోమావి, వాశిష్టీపుత్ర శాతకర్ణి, స్కంద శాతకర్ణిలకు చెందినవి. అలాగే పెద్ద బంకూరు, ధూళికట్టలలో 1970 లలో తవ్వకాలు జరిగినా నివేదికలు వెల్లడి కాలేదు. పైఠాన్, కొండాపూర్‌లలో కూడా తవ్వకాలు జరిగాయి. కొండాపూర్‌లో 194042లలో, 2009–11లలో తవ్వకాలు జరిగాయి. మొదటి విడతలో 4,120 నాణేలు లభించాయి. ఇందులో పైన పేర్కొన్న చక్రవర్తుల నాణేలతో పాటు శివశ్రీ శాతకర్ణి, మధారి పుత్ర శాతకర్ణిల నాణేలు కూడా దొరికాయి. అమరావతిలో 1973– 75లో జరిగిన తవ్వకాలలో 63 నాణేలు దొరికాయి. వీటిలో ఎక్కువ ఇక్ష్వాకులకు, విష్ణు కుండినులకు చెందినవి. నాగార్జునకొండలో 1950లో తవ్వకాలు జరిగినప్పుడు 3,032 నాణేలు లభ్యమైనాయి. తన పేరులో కన్నతల్లి పేరును చేర్చుకునే సంప్రదాయం గౌతమీ పుత్ర శాతకర్ణితోనే ఆరంభమైంది. నాణేలను కూడా ఆ పేరుతోనే ఆయన ముద్రించాడు. శకులను, యవనులను, పల్లవులను తన కుమారుడు గౌతమీపుత్ర నాశనం చేశాడని, క్షాత్రపు వంశాన్ని కూడా తుదముట్టించాడని నాసిక్ దగ్గర వేయించిన శాసనంలో బాలాశ్రీ పేర్కొనడం కనిపిస్తుంది. జోగల్తంబి నాణేల నిధి మరో విశిష్ట కథ నాన్ని చెబుతోంది. ఈ నిధిలో 13,250 వెండి నాణేలు ఉన్నాయి. ఇవన్నీ క్షాత్రపు వంశీయుడు నహపాణునివే. అయితే విజేత గౌతమీ పుత్రుడు వీటి మీదే తన ముద్రను వేయించాడు. అంటే రెండు ముద్రలు వాటిపై కనిపిస్తాయి. విల్లు, ఒక పుష్పం ఆకారంలో ఉండే ఉజ్జయిని గుర్తును రెండువైపులా ఆయన ముద్రించాడు. నిజా నికి ఈ వంశీయులను గుర్తించడం తల్లి పేరును బట్టే జరిగింది. ప్రాకృతం, బ్రాహ్మీ లిపులలో వారు తమ వివరాలను నాణేల మీద చెక్కించారు. మన తెలుగు సినిమాకు పెట్టినట్టు ఆ పేరును 'శాతవాహన' అని కాకుండా, 'సాతవాహన' అని చదువుకోవాలి. ఒక సినిమా నిర్మా ణంలో ఇదొక పెద్ద అంశం కాకపోవచ్చు. కానీ మన చరిత్ర గురించి చెప్పేటప్పుడు భావి తరాలను గుర్తుంచుకోవాలి. అందుకే సరైన వర్ణ క్రమం ఉండాలి. చరిత్ర తిరగరాసుకుంటూ ఉండాలి. అందులో ప్రధా నంగా జరగవలసింది దోషాల నివారణ. దీనిని అంతా గమనించాలి. వ్యాసకర్త నాణేల నిపుణులు, ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ డి. రాజారెడ్డి -
ఖైదీ x శాతకర్ణి
♦ గత సంక్రాంతికి బాబాయ్, అబ్బాయి.. థియేటర్ల వార్ ♦ జూనియర్ సినిమా బెనిఫిట్‌షో అనుమతికి నిరాకరణపై వివాదం ♦ తాజాగా పండుగ బరిలో మెగాస్టార్, యువరత్న చిత్రాలు ♦ విజయవాడలో ఖైదీ నెంబర్–150 ట్రైలర్ రిలీజ్‌కు అనుమతించకపోవడంపై మెగా అభిమానుల ఆగ్రహం ♦ హాయ్‌ల్యాండ్‌లో ఈ నెల 7న ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ రిలీజ్ సాక్షి, అమరావతి: ఏడాదికో మారు వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి నందమూరి బాలకృష్ణకు సంకటంగా మారుతోంది. గడిచిన సంక్రాంతికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల రిలీజ్‌తో థియేటర్ల కొరత నందమూరి వారసుల మధ్య వార్‌కు తెరతీసిన సంగతి తెల్సిందే. ఈ సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య పోటీ సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ జనవరి 11 న, యువరత్న బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వియ్యంకుడి గా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినిమా రిలీజ్‌కు సినిమా హాళ్ల సమస్య ఉండ దు. అదే సమయంలో సినీ నిర్మాత అల్లు అర వింద్‌కు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లు ఉండటంతో ఆయన బావ చిరంజీవి సినిమా విడుదలకు ఇబ్బందిలేదు. అయితే రెండు చిత్రాల టీజర్, ఆడియో, ట్రైలర్, సినిమా విడుదల వరకు చోటు చేసు కుంటున్న వరుస పరిణామాలు మెగా అభి మానుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చిరు సినిమా ట్రైలర్ రిలీజ్‌పై మెగా వివాదం... చిరంజీవి సినిమా ట్రైలర్ రిలీజ్‌కు వేదిక విషయంలో తలెత్తిన సమస్య అధికార తెలుగుదేశం పార్టీపై మెగా అభిమానులు ఆగ్రహానికి దారితీసింది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఈ నెల 4 న విజయవాడలో ట్రైలర్ విడుదల చేయాలని భావించారు. అయితే అందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడానికి ప్రభుత్వ ఒత్తిడే కారణమని మెగా ఫ్యాన్స్ గత కొద్ది రోజులుగా సోషల్ నెట్‌వర్క్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చివరకు గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఈ నెల 7న ఖైదీ నెంబర్ 150 సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేలా సోమవారం నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 26 న తిరుపతిలో నిర్వహించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఈ సినిమా వెయ్యి రోజులకు పైగా ఆడాలని అభిలషించారు. ఈ నేపథ్యంలోనే తన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమాకు మెగాస్టార్ సినిమా ఖైదీ నెంబర్ 150 పోటీ కాకుండా ఉండాలనే ముందుచూపుతోనే అధికార పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఈ మేరకు పోస్టింగుల్లో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్‌తో... గత ఏడాది సంక్రాంతి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలయ్య ‘డిక్టేటర్’ల నడుమ థియేటర్ల వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా ఆగస్టు 31 అర్ధరాత్రి తరువాత బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతి రాకుండా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో జూనియర్ సినిమాలు చూడొద్దం టూ బాలయ్య అభిమానుల పేరుతో అధికార పార్టీ శ్రేణులు పలువురికి సెల్ మెసేజ్‌లు పంపడం, సోషల్ నెట్‌వర్క్‌లో పోస్టులు పెట్టడం వివాదాస్పదమయ్యాయి. చివరకు ఆ పంచాయతీ సీఎం వద్దకు చేరి అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా బెనిఫిట్ షో కి ప్రభుత్వం అనుమతి ఇవ్వక తప్పలేదు. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు చినకాకాని (మంగళగిరి): మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ కార్యక్రమం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకానిలో జరగనుంది. హాయ్‌ల్యాండ్ ఎదుట గల ఖాళీ భూములలో నిర్వాహకులు వేదికను ఏర్పాటు చేస్తున్నారు. చాలాకాలం అనంతరం చిరంజీవి సినిమాలలో నటిం చడం సినిమా ప్రీ రిలీజ్‌కు మంగళ గిరిని వేదికగా చేసుకోవడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. -
ప్రణయ గీతంలో రాకుమారి!
ఓ పక్క వర్షం.. మరోపక్క ప్రణయ గీతం. రాకుమారిగా శ్రీయ నృత్యం.. మధ్యప్రదేశ్‌లోని రాజదర్బార్‌లో జరుగుతున్న సందడి ఇది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసమే ఇదంతా. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న చారిత్రక చిత్రమిది. శాతకర్ణిగా బాలకృష్ణ, శాతకర్ణి అర్ధాంగి యువరాణి వశిష్ఠదేవిగా శ్రీయ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు నెల రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లో షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం సిరివెన్నెల సాహిత్యం అందించగా, చిరంతన్ భట్ స్వరపరిచిన గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ స్వర్ణ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. రోజుకి 18 గంటల పాటు యూనిట్ సభ్యులు కష్టపడుతున్నారు. బాలకృష్ణ, శ్రీయతో పాటు ఇతర నటీనటులు, ముంబయ్‌కు చెందిన క్లాసికల్ డ్యాన్సర్లపై పాటను తెరకెక్కిస్తున్నారు. శ్రీయ పార్ట్ సోమవారంతో పూర్తయింది. ఈ నెల 25తో ముగిసే ఈ షెడ్యూల్‌తో 80శాతం సినిమా పూర్తవుతుందట. వచ్చే నెల 3వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.