Sathrucharla Vijayarama raju
-
టీడీపీలో ‘రాజ’ముద్ర
వారంతా రాజులే. అలాగని ప్రజాసంక్షేమమేధ్యేయంగా పాటుపడే పాలకులు కాదు. నిస్వార్థంగా జనానికి సేవ చేసే జవాబుదారీలు కాదు. తమను నిత్యం అంటిపెట్టుకునేవారి సంక్షేమమే వారి లక్ష్యం. స్వార్థ ప్రయోజనం... ఆశ్రిత పక్షపాతం... బంధుప్రీతి... వారి నైజం. అధికారం వారి చేతుల్లోనే ఉండాలి. పదవులు వారే అనుభవించాలి. మిగతా జనమంతా వారి కనుసన్నల్లోనే బతకాలి. అందుకే అత్యధిక బీసీలున్న ఈ జిల్లాలో టీడీపీ హయాంలో వారి ఎదుగుదల నామమాత్రమే. పథకాలన్నీ పెద్దలకే అందుతున్నాయి. బీసీలకు కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. తెలుగుదేశం పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తి రాజుకుంటోంది. సాక్షిప్రతినిధి విజయనగరం: రాజంటే... తన రాజ్యంలో సుస్థిర పాలనను అందించడం... తరతమ భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడటం... ఎలాంటి పక్షపాతాలకు, రాగద్వేషాలకు తావివ్వకుండా నిరంతరం ప్రజల యోగక్షేమాల గురించే ఆలోచించడం చేయాలి. కానీ అలాంటి రాజవంశ ముద్ర వేసుకున్న మన జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీనిని ఆ పార్టీవారే బాహాటంగా అంగీకరిస్తారు. జిల్లాలో అత్యధికంగాఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అధికారపార్టీ నేతలు పూర్తిగా విస్మరించారు. కేవలం రాజ సామాజిక వర్గానికి, వారి అనుచర గణానికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాలిలో కలసిన బీసీలకిచ్చిన హామీలు గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 లక్షల మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఆ హామీలను నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా, బీసీలపై సవతితల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు అనుచరులకు విజయనగరం ఏఎంసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను ఇచ్చారు. బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడాన్ని సుతరామూ అంగీకరించని అక్కడి పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడికి ఆర్టీసీ సంస్థ రీజనల్ చైర్మన్ పదవినిచ్చి కేవలం బుజ్జగించారు. ఈ మూడింటితోనే బీసీలకు ఎంతో చేసేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ నియోజకవర్గ, జిల్లా, రీజనల్ స్థాయి పదవులే కావడం విశేషం. రాష్ట్రస్థాయి పదవులకు నోచనీ బీసీలు ఇక రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం బీసీలకు దక్కనివ్వడం లేదు. సుజయ్‌కు ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన తూముల భాస్కరరావును రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడిగా నియమించుకున్నారు. రాష్ట్ర బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్‌గా భోగపురపు వాయునందన శర్మను వేసుకున్నారు. తాజాగా అశోక్ ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన ఐ.వి.పి.రాజును రాష్ట్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించుకున్నారు. విజయనగరంలో అశోక్‌గజపతిరాజు, సాలూరులో ఆర్పి భంజ్‌దేవ్, కురుపాంలో శత్రుచర్ల విజయరామరాజు, బొబ్బిలిలో ఆర్వి సుజయకృష్ణ రంగారావు రాజుల సామాజిక వర్గం నుంచి టీడీపీలో పెత్తనం చెలాయిస్తుండగా త్వరలోనే వీరికి మరోరాజు కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తోడవ్వనున్నారు. ఇలా విజయనగరం జిల్లా టీడీపీ మొత్తం రాజుల మయంగా మారుతోంది. పోనీ వీరు జనానిమైనా చేస్తున్నారా అంటే..అదీ లేదు. శత్రుచర్ల విజయరామరాజు, ఆర్పి భంజ్‌దేవ్, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికే కులనిర్థారణ వివాదాల్లో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. పదవి కోసం శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజకవర్గాన్ని వదిలి పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్‌దేవ్‌లు తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్‌దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇక ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్‌చంద్రదేవ్ ఇప్పుడు సడన్‌గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరుతున్నారు. వీరివల్ల జిల్లా ప్రజలు ఏ విధమైన ప్రయోజనం పొందలేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఇంటికి 2వేలు ఇచ్చా.. ఇంకెంత ఇవ్వాలి?
కార్యకర్తలపై టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల ఆగ్రహం ‘సాక్షి’ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిన వైనం క్రైం, న్యూస్‌లైన్: ‘‘ఒక్కో కుటుంబానికి రెండు వేలు ఇచ్చా.. మీ గ్రామానికి ఇప్పటికే రూ.15 లక్షలు పంపిణీ చేశా.. ఇంకెంత ఇవ్వాలి మీకు’’ అని ఒక టీడీపీ అభ్యర్థి సొంత పార్టీ కార్యకర్తలపైనే మండిపడ్డారు. ఆయన ఎవరో కాదు.. మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన డబ్బుల కోసం తన వద్దకు వచ్చిన కార్యర్తలను తన కార్యాలయం ఎదుటే పరుష పదజాలంతో తిడుతూ.. అదే ఊపులో డబ్బుల పంపిణీ గుట్టును బయటపెట్టేశారు. ఇదంతా సాక్షి టీవీ చానల్, పత్రిక జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. అసలేం జరిగిందంటే.. టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల ఆదివారం పాతపట్నంలోని తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి వాహనం ఎక్కుతుండగా ఎల్.ఎన్.పేటకు చెందిన కొంత మంది పార్టీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ‘అయ్యా.. ఏంటి మా గ్రామాన్ని అసలు పట్టించుకోవటం లేదు’ అని శత్రుచర్లతో అన్నారు. అంతే ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. మీ గ్రామానికి ఇప్పటికే రూ.15 లక్షలు ఇచ్చాను. మళ్లీ ఒక్కో కుటుంబానికి రెండు వేల చొప్పున రూ.40 వేలు ఇచ్చాను. ఇంకెంత ఇస్తాను.. అంటూ తనను ప్రశ్నించిన కార్యకర్తను కడిగేశారు. పూనకం వచ్చినట్టు ఊగిపోతూ అసభ్య పదజాలం ప్రయోగించడంతో కార్యకర్తలు బిత్తరపోయారు. ఈ దృశ్యాలను అక్కడే కాపు కాసిన సాక్షి టీవీ ప్రతినిధులు చిత్రీకరించారు. కొద్దిసేపటి తర్వాత దీన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు కెమెరాను అడ్డుకున్నారు. ఈలోగా శత్రుచర్ల నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకున్నారు. గెలుపు కోసం అడ్డదారులు.. పోలింగ్ తేదీ సమీపించింది. గెలిచే అవకాశాలు లేవని గుర్తిం చిన టీడీపీ నాయకులు.. అన్ని రకాల అడ్డదారులు తొక్కుతున్నారు. ఓ పక్క మద్యం.. మరోపక్క విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. వారి బరి తెగింపునకు శత్రుచర్ల ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. పాతపట్నం నుంచి పోటీ చేస్తున్న శత్రుచర్ల తన గెలుపు కష్టమన్న అంచనాకు వచ్చేశారు. దాంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇష్టారాజ్యంగా డబ్బులు పంపి ణీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎల్.ఎన్.పేటలో నివాసముంటున్న ఒక్కో కుటుంబానికి రూ.2వేల చొప్పున పంచి నట్లు ఆయన మాటల్లోనే వెల్లడైంది. అలా ఆ ఒక్క గ్రామంలోనే రూ.15 లక్షలు పంచారంటే నియోజకవర్గం మొత్తానికి ఎంత వెదజల్లుతున్నారో అర్థమవుతోంది. ఈసీకి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా: కలమట ఓటర్లను డబ్బులతో ముంచెత్తుతున్న టీడీపీ అభ్యర్థి శత్రుచర్ల విజయరామరాజుపై జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని పాతపట్నం వైఎస్సార్సీపీ అభ్యర్థి కలమట వెంకటరమణ పేర్కొన్నారు. ఓడిపోతానని తెలిసే శత్రుచర్ల ప్రలోభాలకు దిగడమే కాకుండా తన కార్యకర్తలపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
హ్యాట్రిక్ వీరులు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నారు. వారిలో నలుగురు డబుల్ హ్యాట్రిక్ సాధించా రు. పీవీజీ రాజు, గంట్లాన సూర్యనారాయణ, కె.వి.ఆర్.ఎస్. పద్మనాభరాజు తొలిసారి హ్యాట్రిక్ సాధించిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోయారు.పీవీజీ రాజు విషయానికొస్తే 1952లో ఆయన సోషలిస్టు పార్టీ తరఫున విజయనగరంలో ఎన్నికయ్యా రు. ఆ తర్వాత 1953లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఏకగీవ్రంగా విజయం సాధించారు. 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు సమకాలీకులుగా గంట్లాన సూర్యనారాయణ 1952లో విజయనగరం నుంచి, 1953లో పీఎస్పీ తరఫున ఉప ఎన్నికల్లో, 1955లో గజపతినగరం నుంచి పీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. అదేవిధంగా కె. వి.ఆర్.ఎస్. పద్మనాభరాజు 1952లో సోషలిస్టు పార్టీ తరఫున అలమండ నుంచి, 1953లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో ఏకగ్రీవంగా, 1955లో రేవిడి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక, వారి తరువాత హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న వారిలో వైరిచర్ల చూడామణి దేవ్, పెనుమత్స సాంబ శివరాజు, కోళ్ల అప్పలనాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు, శత్రుచర్ల విజయరామరాజు, లగుడు బారికి దుక్కు, తెంటు జయప్రకాశ్ ఉన్నారు. పెనుమత్స సాంబశిరాజు వరుసగా 1967, 1972 (గజపతి నగరం), 1978, 1983, 1985, 1989 (సతివాడ)లలో విజయం సాధించారు. కోళ్ల అప్పలనాయుడు వరుసగా 1983,1985, 1989, 1994 ,1999లో ఉత్తరాపల్లి నుంచి గెలుపొందారు. పూసపాటి అశోక్ గజపతిరాజు వరుసగా 1978,1983, 1985, 1989,1994,1999లలో విజయనగరం నుంచి విజయం సాధిం చారు. పతివాడ నారాయణస్వామినాయుడు వరుసగా 1983, 1985,1989, 1994, 1999, 2004లలో భోగాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే, గంట్లాన సూర్యనారాయణ 1952, 1953లో విజయనగరం నుంచి, 1955లో గజపతినగ రం, 1962లో రామతీర్థం, 1967,1972లో పాయకరావుపేట నుంచి వరుసగా ఎన్నికయ్యూరు. డబుల్ హ్యాట్రిక్ వీరులు.. డబుల్ హ్యాట్రిక్ సాధించిన వారిలో సాంబశివరాజు, అశోక్ గజపతిరాజు, పతివాడ నారాయణస్వామినాయుడు, గంట్లాన సూర్యనారాయణ రికార్డుకెక్కారు. శత్రుచర్ల విజయరామరాజు 1978, 1983,1985లలో వరుసగా నాగూరు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఎస్. కోట నుంచి లగుడుబారికి దుక్కు వరుస గా 1983,1985,1989,1994లో విజయం సాధించారు. తెంటు జయప్రకాశ్ తెర్లాం నుంచి 1983,1985,1989,1994లో గెలుపొందారు. వైరిచర్ల చూడామణి దేవ్ వరుసగా 1953, 1955, 1962లలో పార్వతీపురం నుంచి గెలుపొందారు. -
అబ్బో ‘రాజు’ దర్పం!
పచ్చ చొక్కాలు వేసుకోలేం.. తేల్చిచెప్పిన నేతలు, కార్యకర్తలు శత్రుచర్లకు భంగపాటు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మూడు దశాబ్దాలకుపైగా ఉత్తరాంధ్రలో ప్రముఖ రాజకీయనేతగా గుర్తింపు పొందిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఝలక్ తగిలింది. కాంగ్రెస్ కుదేలు కావడం.. వైఎస్సార్సీపీలో స్థానం లేకపోవడంతో టీడీపీలో చేరాలన్న శత్రుచర్ల వ్యూహాన్ని ఆయన ప్రధాన అనుచరగణమే తిప్పికొట్టింది. పాతపట్నం నియోజకవర్గం లో ఐదేళ్లుగా తనతో పనిచేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలతో కలసి మూకుమ్మడిగా టీడీపీలో చేరాలని శత్రుచర్ల భావించారు. ఆ మేరకు టీడీపీతో ఒప్పందం కుదుర్చుకుని ఆ తరువాత తీరిగ్గా నేతలు, కార్యకర్తలతో పాతపట్నం పొరుగున ఉన్న ఒడిశాలోని పర్లాకిమిడిలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కానీ, శత్రుచర్ల వ్యూహం బెడిసికొట్టింది. సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తల్లో దాదాపు 75 శాతం మంది టీడీపీలో చేరాలన్న ఆయన ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారు. శత్రుచర్లకు ఆయన ప్రధాన అనుచరుడు, మెళియాపుట్టి మాజీ ఎంపీపీ సలాన మోహనరావు నుంచే వ్యతిరేకత ఎదురైంది. సమావేశం ప్రారంభమైన కాసేపటికే ఆయన లేచి ‘మేం 30 ఏళ్లుగా టీడీపీతో పోరాడుతున్నాం.. మీ రాజకీయ స్వార్థంకోసం మమ్మల్ని టీడీపీకి తాకట్టు పెట్టొద్దు.. మేం మీతోపాటు టీడీపీలో చేరలేం. పచ్చచొక్కా వేసుకోవడం మా వల్ల కాదు’ అని కుండబద్దలు కొట్టేశారు. ‘ఈ సమావేశంలో మేం కొనసాగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. కాబట్టి మేమంతా సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం’అని చెప్పి బయటకు వెళ్లిపోయారు. మెళియాపుట్టి మండలానికి చెందిన 40 మంది సర్పంచులు కూడా సలానకు సంఘీభావం తెలుపుతూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. వారంతా కూడా ‘జై జగన్... జై వైఎస్సార్ కాంగ్రెస్’అని నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోవడం గమనార్హం. అబ్బో ‘రాజు’ దర్పం! పాతపట్నం, న్యూస్‌లైన్: ఆయనో ప్రజాప్రతినిధి.. రెండుసార్లు రాష్ట్రమంత్రిగా పనిచేశారు. పైగా గిరిజనవర్గానికి ప్రతినిధి. అయితేనేం. ఆయన రాజు గారు. అందుకే రాచరికాలు పోయినా.. ‘రాజు’దర్పం ఇంకా పోలేదనడానికి ఈ ఫొటోయే నిదర్శనం. ఈ ఫొటోలో చెప్పు లు తొడిగించుకుం టున్న వ్యక్తి శుత్రుచర్ల విజయరామరాజు. చెప్పులు తొడుగుతున్న యువకుడు ఓ గిరిజనుడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మంగళవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. తన వర్గం కార్యకర్తల సమావేశానికి వెళ్లే ముందు శత్రుచర్ల సతీసమేతంగా నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చి ఓ గిరిజన కార్యకర్తతో చెప్పులు తొడిగించుకున్నారు. దీనిపై గిరిజన సంఘాల ప్రతి నిధులు, ప్రజలు మండిపడుతున్నారు.