satirical weekly
-
వడ్ల గింజలో...
మొత్తానికి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. గజనీ మహమ్మద్ దండ యాత్రల్లాగా పదమూడు సార్లు విఫలమై ఆ తర్వాత అవిశ్వాసానికి సఫలమ య్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీవల్ల ఘోర మరియు తీరని అన్యాయం జరిగిందని ఆలస్యంగా చంద్రబాబు దృష్టికి వచ్చింది. అంతే! అవిశ్వాసానికి భేరి వేశారు. ఇప్పు డేం జరుగుతుందని నాలాంటి సగటు ఓటర్లకి ఉత్కంఠగా ఉంది. ఏమీ జరగదు, వడ్లగింజలో బియ్యపు గింజ అంటున్నారు. తెలివిమీరిన కొందరు. సభ్యుల సంఖ్యని బట్టి సభలో సమయం కేటాయిం చారు. తెలుగుదేశం పార్టీకి పదమూడు నిమిషాల ‘టాక్ టైం’ వస్తే, బలవంతంగా ఇంకో రెండు నిమి షాలు వినిపిస్తారేమో. అయితే అవిశ్వాసంపై చర్చ మొదలయ్యాక టీడీపీకి 50 నిమిషాల పైనే మాట్లాడ టానికి అవకాశం ఇచ్చారు. ఈ కాస్త వ్యవధిలోనే గతమంతా తవ్వి పొయ్యాలి. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఒత్తిడి తగ లకుండా నేపథ్యాన్ని చెప్పుకు రావాలి. మోదీ పాల నలో ఏపీకి జరిగిన అన్యాయాలను, మోదీ వాగ్దాన భంగాలను తెలుగుదేశం సభ్యులు గడగడా అప్ప జెప్పాలి. ఈ సందర్భాన్ని అడ్డం పెట్టుకుని భారత ప్రధానిని ఉతికి, ఝాడించి పార్లమెంట్ హాల్లో ఆరేస్తారు. దాంతో అధికార పార్టీ సొమ్మసిల్లిపో తుంది. అరె! తెలుగు తమ్ముళ్లు మన ప్రభుత్వ వైఫ ల్యాలని, మోదీ సవతి తల్లి ప్రేమని ఓ క్రమంలో కడిగి ఆరపోశారని విస్తుపోతారు. నేరకపోయి మన మోదీ చంద్రబాబుతో పెట్టు కున్నందుకు కమల దళం నాలుకలు కరచుకుం టుంది. కొందరికి ఒడుపు తెలియక నోట్లో నెత్తుర్లొ స్తాయ్. ఇలాంటి దృశ్యాన్ని టీడీపీ వూహిస్తోంది. కానీ అనుభవజ్ఞులు ఈ సీన్ రివర్స్ అవుతుందంటు న్నారు. తెలుగుదేశం సభ్యులు పాడిన పాటే పాడి, ఎనభై నిమిషాలు హరించుకుంటారు. ఇంకో ఇరవై నిమిషాలు కోరస్‌లతో సరి. ఇంకా ఇప్పటికి ప్రధాని వంతు రాలేదు. మోదీ తనదైన శైలిలో నిలబడి, తనదైన స్టైల్లో ఉండగా, వూహాతీతంగా ప్రసంగం ఆరంభమవుతుంది. బాబు దక్షతని పొగుడుతారు. రాష్ట్రంపట్ల బాబుకి గల భక్తి శ్రద్ధల్ని నొక్కి వక్కాణిస్తారు. గడచిన నాలుగేళ్లలో ఏపీకి ఎన్నేసి కోట్లు నిధులు ఇచ్చిందీ వివరిస్తారు. ఏయే సంస్థలు మంజూరు చేసిందీ చెబుతారు. రైల్వే జోన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నామంటారు. మోదీ చాలా సమతూకంగా జవాబిస్తారు. మూడు గంటలసేపు నిండు హాల్లో మ్యాట్నీ సినిమా చూపిస్తారని ఒక వర్గం అభిప్రాయపడు తోంది. నిన్నటిదాకా తన మంత్రి వర్గంలో ఉండి సహకరించిన టీడీపీ మంత్రులని అభినందిస్తారట. ఆనక అసలు చిట్టాలు విప్పుతారట. ఎన్ని నిధులు దారిమళ్లాయో వివరిస్తారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ మోదీ వాగ్దానం కాదు. పోలవరం పూర్తి చేస్తారు. మోదీ ఆవేశపడరు. నా పరిధి భారతదేశంగానీ ఏపీ మాత్రమే కాదని చెబుతారు. తర్వాత లాంఛనప్రాయంగా ఓటింగ్ ముగు స్తుంది. నాలుగేళ్ల నా పాలన తర్వాత కూడా నాటి సభ్యులంతా నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ సంగతి తేల్చుకోడానికి పార్లమెంట్లో అవకాశం కల్పించిన చంద్రబాబుకి ధన్యవాద్! మోదీ సుదీర్ఘ సమాధాన ప్రసంగంలో అనేక విషయాలు వెలుగు లోకి వస్తాయి. ఉన్నత న్యాయస్థానానికి సమర్పిం చిన అఫిడవిట్లో కేంద్రం బోలెడు అబద్ధాలు ఉటం కించిందని బాబు ఆరోపణ. దీన్నెవరూ పట్టుకు ప్రశ్నించలేరా? అఫిడవిట్ సంతకం చేసిన వారికి శిక్ష ఉండదా? ఇవి సామాన్యుడి సందేహాలు. చాలామంది ఏమంటున్నారంటే– మోదీ బయ టపెట్టే నిజాలు బాబు ప్రత్యర్థులకు కొత్త బలాన్ని స్తాయి. వైఎస్సార్సీపీ తదితరపార్టీలకు వచ్చే ఎన్ని కల దాకా అవి ఇంధనంగా ఉపయోగపడతాయి. నిధులకు సంబంధించిన నిజాల్ని నిగ్గు తేల్చడం అసాధ్యమేమీ కాదు. ఇప్పుడేం జరిగింది? మాట్లా డిందే మాట్లాడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే అత్యంత విలువైన సభా సమ యం చాలా వృథా అయ్యింది. చంద్రబాబు మోదీని విలన్‌గా చూపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తు న్నారు. బీజేపీకి పెద్దగా ఓట్లు లేని ఏపీలో నష్ట పోయేదేమీ లేదని మోదీ ఉదాసీనంగా ఉన్నారు. వడ్ల గింజలో బియ్యపు గింజ! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
నిమిషాల్లో హాట్ కేక్‌ల్లా అమ్ముడుపోయాయి..
ప్యారిస్ : ఫ్రాన్స్ వ్యంగ్య వార పత్రిక చార్లీ హెబ్డో తాజా సంచిక హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓ వైపు ఉగ్రవాద దాడులను ఏ మాత్రమూ లెక్కచేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను పాఠకులు అంచనాలకు మించి ఆదరిస్తున్నారు. ఉగ్రవాద దాడులకు ఏ మాత్రమూ భయపడకుండా తాజా సంచికలోనూ మహమ్మద్ ప్రవక్త చిత్రానే కవర్ పేజీపై ముద్రించారు. తల పాగ, గడ్డంతో ఉన్న క్యారికేచర్ 'అయామ్ చార్లీ' అనే స్లోగన్‌ను పట్టుకున్న డిజైన్‌తో రూపొందించిన కవర్ పేజీని ఆ పత్రికను ఈ-బే వెబ్ సైట్లో పెట్టారు. దాంతో ఆ సంచిక కొనేందుకు పాఠకులు ఆన్లైన్లో కొన్ని వేల యూరోలు ఖర్చు చేస్తున్నారు. ఆన్లైన్లో తక్షణ కొనుగోలు ధర 15 వేల యూరోలుగా నిర్ణయించారు. కేవలం నిముషాల వ్యవధిలోనే అన్ని కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. సాధారణంగా తాము ముద్రించే 60 వేల కాపీలను ఆ పత్రిక ఈసారి ఏకంగా 30 లక్షలకు పెంచింది . తాజా సంచిక విడుదల కాగానే ప్యారిస్‌లో హాట్ కేకుల్లాగా పాఠకులు కొనుగోలు చేశారు. దీంతో 50 లక్షల కాపీలను ముద్రిస్తామని చార్లీ హెబ్డో యాజమాన్యం ప్రకటించటం విశేషం. నిముషాల్లోనే అన్ని కాపీలు అమ్ముడు కావటమే కాకుండా తమకూ పత్రిక కావాలంటూ వేలాది మంది పాఠకులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. -
30 లక్షల కాపీలతో ‘చార్లీ హెబ్డో’
ప్యారిస్: ఇటీవల ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లోని తమ పత్రిక కార్యాలయంలో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో ‘చార్లీ హెబ్డో’ వ్యంగ్య వారపత్రిక వచ్చే సంచికను 30 లక్షల కాపీలతో మార్కెట్లోకి తెస్తోంది. తలపాగా, గడ్డంతో ఉన్న క్యారికేచర్ ‘అయామ్ చార్లీ’ అనే స్లోగన్‌ను పట్టుకున్న డిజైన్‌తో రూపొందించిన కవర్‌పేజీని పత్రిక సామాజిక వెబ్సైట్లో పోస్ట్చేసింది. -
‘ఉగ్ర’ సోదరుల కోసం ఫ్రాన్స్ వేట
‘చార్లీ హెబ్డో’ పత్రికపై దాడికి పాల్పడింది వారే! ఇద్దరి ఫొటోలను విడుదల చేసిన నిఘా వర్గాలు వీరికి అల్‌కాయిదా నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు అనుమానం పోలీసులకు లొంగిపోయిన మరో అనుమానితుడు కలకలం సృష్టించిన మరో కాల్పుల ఘటన, మరోచోట పేలుడు పారిస్: ఫ్రాన్స్‌లో ఉగ్రదాడులకు పాల్పడిన వారి కోసం వేట మొదలైంది. పారిస్‌లోని వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపై జరిగిన దాడితో సంబంధమున్నట్లు భావిస్తున్న ఇద్దరు సోదరుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరిని ఫ్రాన్స్‌కే చెందిన సయీద్ కౌచీ, చెరిఫ్ కౌచీగా నిఘా వర్గాలు గుర్తించాయి. మరో అనుమానితుడైన 18 ఏళ్ల యువకుడు హమీద్ మౌరాద్ ఇప్పటికే లొంగిపోయినట్లు తెలుస్తోంది. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినట్లు భద్రతావర్గాల సమాచారం. పత్రికా కార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చి చంపిన ఉగ్రమూకకు యెమెన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అక్కడి అల్ కాయిదా గ్రూపే ఈ పని చేస్తున్నట్లు దాడి సందర్భంగా ఉగ్రవాదులు స్వయంగా చెప్పినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మరోవైపు ఉగ్ర సోదరుల ఫొటోలను భద్రతాధికారులు విడుదల చేశారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిస్తే చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సోదరులిద్దరితో సంబంధాలున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బుధవారం జరిగిన దాడిలో 8 మంది జర్నలిస్టులు, ఇద్దరు పోలీస్ అధికారులు, మరో ఇద్దరు పౌరులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 11 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దేశవ్యాప్తంగా విషాదం ఉగ్రవాదుల దాడితో ఫ్రాన్స్‌లో విషాదం అలముకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మందిప్రజలు వీధుల్లోకి వచ్చి మృతులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. పత్రికా స్వేచ్ఛకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించారు. దాడిపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్..అత్యవసరంగా కేబినెట్‌ను సమావేశపరిచి తాజా పరిణామాలపై చర్చించారు. పలు నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడవచ్చునని ఫ్రాన్స్‌తో పాటు యూరప్‌వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. దాడి నేపథ్యంలో ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీకి, అక్కడి సిబ్బందికి భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కిమూన్ ఖండించారు. మరింత ఆందోళన.. ప్రజల్లో నెలకొన్న భయాన్ని పెంచేలా ఫ్రాన్స్‌లో గురువారం మరో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. పారిస్ దక్షిణ ప్రాంతంలో ఓ పోలీస్ అధికారిని దుండగుడు కాల్చి చంపాడు. మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. ఈశాన్య పట్టణం విల్లేఫ్రాంచ్లోని ఓ మసీదు సమీపంలోని కబాబ్ దుకాణం వద్ద పేలుడు సంభవించింది. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రజల నుం మద్దతు లభిస్తుండటంతో ప్రత్యేక సంచికను విడుదల చేయాలని ‘చార్లీ హెబ్డో’ నిర్ణయించింది. ఈ నెల 14న పది లక్షల కాపీలతో స్పెషల్ ఎడిషన్‌ను ప్రచురించనున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ఈ పత్రిక వారానికి 60 వేల కాపీలనే ముద్రిస్తుంది. దాడిని సమర్థించిన యూపీ మాజీమంత్రి లక్నో: చార్లీ హెబ్డోపై జరిగిన దాడి సమంజసమేనని ఉత్తరప్రదేశ్ మాజీమంత్రి, బీఎస్పీ నేత హజీ యాకుబ్ ఖురేషీ అన్నారు. శాంతి సందేశాన్నిచ్చిన మహమ్మద్ ప్రవక్తపై ఎవరైనా వ్యంగ్యంగా కార్టూన్లు చిత్రీకరిస్తే వారికి పారిస్‌లోని జర్నలిస్ట్‌లు, కార్టూనిస్ట్‌లకు పట్టిన గతే పడుతుందన్నారు.