నిమిషాల్లో హాట్ కేక్ల్లా అమ్ముడుపోయాయి..
ప్యారిస్ : ఫ్రాన్స్ వ్యంగ్య వార పత్రిక చార్లీ హెబ్డో తాజా సంచిక హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓ వైపు ఉగ్రవాద దాడులను ఏ మాత్రమూ లెక్కచేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను పాఠకులు అంచనాలకు మించి ఆదరిస్తున్నారు. ఉగ్రవాద
దాడులకు ఏ మాత్రమూ భయపడకుండా తాజా సంచికలోనూ మహమ్మద్ ప్రవక్త చిత్రానే కవర్ పేజీపై ముద్రించారు.
తల పాగ, గడ్డంతో ఉన్న క్యారికేచర్ 'అయామ్ చార్లీ' అనే స్లోగన్ను పట్టుకున్న డిజైన్తో రూపొందించిన కవర్ పేజీని ఆ పత్రికను ఈ-బే వెబ్ సైట్లో పెట్టారు. దాంతో ఆ సంచిక కొనేందుకు పాఠకులు ఆన్లైన్లో కొన్ని వేల యూరోలు ఖర్చు చేస్తున్నారు. ఆన్లైన్లో తక్షణ కొనుగోలు ధర 15 వేల యూరోలుగా నిర్ణయించారు. కేవలం నిముషాల వ్యవధిలోనే అన్ని కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
సాధారణంగా తాము ముద్రించే 60 వేల కాపీలను ఆ పత్రిక ఈసారి ఏకంగా 30 లక్షలకు పెంచింది . తాజా సంచిక విడుదల కాగానే ప్యారిస్‌లో హాట్ కేకుల్లాగా పాఠకులు కొనుగోలు చేశారు. దీంతో 50 లక్షల కాపీలను ముద్రిస్తామని చార్లీ హెబ్డో యాజమాన్యం ప్రకటించటం విశేషం. నిముషాల్లోనే అన్ని కాపీలు అమ్ముడు కావటమే కాకుండా తమకూ పత్రిక కావాలంటూ వేలాది మంది పాఠకులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.