Charlie Hebdo
-
టూరిస్టులపై ఆకస్మిక దాడి
పారిస్ : సరదాగా గడుపుదామని పారిస్ పర్యటనకు వచ్చిన టూరిస్టులపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఆదివారం అర్ధరాత్రి పారిస్‌లోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం... జన సమూహంలో ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా చుట్టూ ఉన్న వాళ్లపై కత్తి, ఐరన్ రాడ్‌తో దాడి చేశాడు. ఇద్దరు బ్రిటీష్ టూరిస్టులు సహా మరో ఐదుగురిని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు వెంబడించిన స్థానికులపై కూడా ఐరన్ రాడ్డుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు కూడా రాళ్లతో కొడుతూ అతడిని వెంబడించాడు. అయినప్పటికీ అతడు తప్పించుకున్నాడు. కాగా నిందితుడిని అఫ్ఘాన్ జాతీయుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా పరిగణించలేమని.. కేవలం అపరిచితులను లక్ష్యంగా చేసుకునే అతడు దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. హై అలర్ట్.. గత కొన్ని నెలలుగా పారిస్‌లో ఇలాంటి ఘటనలు అధికమవడంతో పోలీసులు హై అలర్ట్ విధించారు. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈఫిల్ టవర్ వంటి పర్యాటక స్థలాల్లో నిఘా పెంచారు. కాగా 2015లో చార్లో హెబ్డో పత్రికా కార్యాలయంపై దాడి జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు 240 మంది ఉగ్ర దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం ఇటువంటి ఉన్మాదుల చర్యలు ఎక్కువవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్ర దాడి, ఒకరు మృతి
సెయింట్-క్వెంటిన్-ఫల్లావియర్: ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్రవాది జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తూర్పు ఫ్రాన్స్ లోని లియాన్ ప్రాంతానికి సమీపంలోని ఉన్న గ్యాస్ ఫ్యాక్టరీలోకి చొరబడిన దుండగుడు ఈ దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఇస్లామిక్ జెండా చేతపట్టుకుని దుండగుడు గ్యాస్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డాడు. అయితే ఒక వాహనంలో పలువురు గ్యాస్ ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లారని మరో కథనం విన్పిస్తోంది. వీరు లోపలికి వెళ్లిన తర్వాత ఫ్యాక్టరీలో చిన్న పేలుడు సంభవించిన్నట్టు తెలుస్తోంది. ఫ్యాక్టరీకి సమీపంలో తలలేని మొండెం కనుగొన్నారు. అయితే ఇక్కడే హత్య చేశారా, ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి పట్టుకొచ్చి పడేశారా అనేది తెలియరాలేదు. ఇస్లామిక్ జెండాతో వచ్చిన హంతకుడిని అరెస్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇస్లామిక్ దాడితో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పారిస్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డోపై దాడి జరిగిన ఆరు నెలల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. జనవరిలో ఇద్దరు ఇస్లామిక్ ఉగ్రవాదులు చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి చేయడంతో 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
పారిస్ ఉగ్రవాద దాడి దృశ్యాలివీ!
-
నిమిషాల్లో హాట్ కేక్‌ల్లా అమ్ముడుపోయాయి..
ప్యారిస్ : ఫ్రాన్స్ వ్యంగ్య వార పత్రిక చార్లీ హెబ్డో తాజా సంచిక హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓ వైపు ఉగ్రవాద దాడులను ఏ మాత్రమూ లెక్కచేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను పాఠకులు అంచనాలకు మించి ఆదరిస్తున్నారు. ఉగ్రవాద దాడులకు ఏ మాత్రమూ భయపడకుండా తాజా సంచికలోనూ మహమ్మద్ ప్రవక్త చిత్రానే కవర్ పేజీపై ముద్రించారు. తల పాగ, గడ్డంతో ఉన్న క్యారికేచర్ 'అయామ్ చార్లీ' అనే స్లోగన్‌ను పట్టుకున్న డిజైన్‌తో రూపొందించిన కవర్ పేజీని ఆ పత్రికను ఈ-బే వెబ్ సైట్లో పెట్టారు. దాంతో ఆ సంచిక కొనేందుకు పాఠకులు ఆన్లైన్లో కొన్ని వేల యూరోలు ఖర్చు చేస్తున్నారు. ఆన్లైన్లో తక్షణ కొనుగోలు ధర 15 వేల యూరోలుగా నిర్ణయించారు. కేవలం నిముషాల వ్యవధిలోనే అన్ని కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. సాధారణంగా తాము ముద్రించే 60 వేల కాపీలను ఆ పత్రిక ఈసారి ఏకంగా 30 లక్షలకు పెంచింది . తాజా సంచిక విడుదల కాగానే ప్యారిస్‌లో హాట్ కేకుల్లాగా పాఠకులు కొనుగోలు చేశారు. దీంతో 50 లక్షల కాపీలను ముద్రిస్తామని చార్లీ హెబ్డో యాజమాన్యం ప్రకటించటం విశేషం. నిముషాల్లోనే అన్ని కాపీలు అమ్ముడు కావటమే కాకుండా తమకూ పత్రిక కావాలంటూ వేలాది మంది పాఠకులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. -
30 లక్షల కాపీలతో ‘చార్లీ హెబ్డో’
ప్యారిస్: ఇటీవల ఫ్రాన్స్ రాజధాని నగరం ప్యారిస్‌లోని తమ పత్రిక కార్యాలయంలో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో ‘చార్లీ హెబ్డో’ వ్యంగ్య వారపత్రిక వచ్చే సంచికను 30 లక్షల కాపీలతో మార్కెట్లోకి తెస్తోంది. తలపాగా, గడ్డంతో ఉన్న క్యారికేచర్ ‘అయామ్ చార్లీ’ అనే స్లోగన్‌ను పట్టుకున్న డిజైన్‌తో రూపొందించిన కవర్‌పేజీని పత్రిక సామాజిక వెబ్సైట్లో పోస్ట్చేసింది. -
పారిస్‌కు మద్దతుగా.. ప్రపంచదేశాలు..!
-
జర్మనీ పత్రిక కార్యాలయంపై దాడి
బెర్లిన్: పారిస్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డోపై దాడి మరవకముందే జర్మనీపై మరో పత్రికపై దాడి జరిగింది. హంబర్గ్ నగరంలోని హంబర్గర్ మోర్గాన్ పోస్ట్ కార్యాలయంపై రాళ్లు, మండే పదార్థాలతో దుండగులు దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో కొన్ని పత్రాలు ధ్వంసమయ్యాయి. ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చార్లీ హెబ్డో మేగజీన్ లో వచ్చిన కార్టూన్లను మళ్లీ ప్రచురించినందుకు ఈ పత్రికపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. -
ఫ్రాన్స్‌లో హై అలర్ట్
* మరిన్ని దాడులు చేస్తాం: అల్‌కాయిదా * పారిస్‌లో ఆదివారం సంఘీభావ ర్యాలీ * హాజరవనున్న జర్మనీ చాన్సెలర్, బ్రిటన్ ప్రధాని, * ఇతర యూరోప్ దేశాల ప్రతినిధులు పారిస్: ఫ్రాన్స్ చరిత్రలో గత బుధ, గురు, శుక్రవారాలు నెత్తుటి మరకలై నిలిచాయి. ఆ దేశంపై మరిన్ని దాడులు చేస్తామని యెమన్లోని ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా హెచ్చరించింది. చార్లీ హెబ్డొపై దాడి తమ ఆదేశాల మేరకే జరిగిందని ప్రకటించింది. కాగా, ఉగ్రదాడులు ఎదుర్కొన్న ఫ్రాన్స్‌కు సంఘీభావంగా దాదాపు అన్ని యూరోపియన్ దేశాల నేతలు పారిస్‌లో ఆదివారం జరిగే సంఘీభావ ర్యాలీలో పాల్గొననున్నారు. పారిస్‌లో జరిగిన ఘాతుకాన్ని పశ్చిమదేశాలంటే పడని ఉత్తరకొరియా, క్యూబా, ఇరాన్‌లు సైతం తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో అమెరికా తన పౌరులను అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించింది. మరిన్ని దాడులు చేస్తామంటూ అల్‌కాయిదా హెచ్చరికలు చేయడంతో పర్యాటక ప్రదేశాలు, ప్రార్థన స్థలాలు, కీలక ప్రాంతాల్లో భద్రతను ఫ్రాన్స్ మరింత కట్టుదిట్టం చేసింది. వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దింపింది. ఉగ్రదాడులపై దర్యాప్తులో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకుంది. ప్రపంచ దేశాల మద్దతు: సూపర్‌మార్కెట్‌పై ఉగ్రవాద దాడిని యూదు వ్యతిరేక చర్యగా ఫ్రాంకోయిస్ హోలండ్ అభివర్ణించారు. ఉగ్రవాదులు మత ఛాందసులని, వారికి ఇస్లాం గురించి తెలియదని వ్యాఖ్యానించారు. ఫ్రాంకోయిస్ హోలండ్ శనివారం ఉదయం తన మంత్రివర్గంలోని కీలక మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం పారిస్‌లో జరగనున్న ఉగ్రవాద వ్యతిరేక సంఘీభావ ర్యాలీకి వేలాదిమంది హాజరయ్యే అవకాశముంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్, జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్లతో పాటు స్పెయిన్, బెల్జియం, పోర్చుగల్, పోలండ్, స్వీడన్,డెన్మార్క్, నార్వే, ఉక్రెయిన్, యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ల ప్రతినిధులు హాజరుకానున్నారు. మహిళా ఉగ్రవాది కోసం గాలింపు.. శుక్రవారం తూర్పు పారిస్‌లోని సూపర్మార్కెట్లో పలువురిని బందీలుగా పట్టుకుని వారిలో నలుగురిని కాల్చి చంపిన ఉగ్రవాది అమెదీ కౌలిబలితో పాటు ఉన్న మహిళా ఉగ్రవాది హయత్ బౌమెదీన్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో అమెదీ చనిపోగా, ఆమె తప్పించుకుంది. ఆమె వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉండొచ్చని, ఏదో ఒక ప్రాంతంలో ఆమె మరోసారి దాడులకు దిగొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సూపర్‌మార్కెట్‌ను ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున సమయంలో మూడేళ్ల చిన్నారి సహా ఐదుగురు ఒక ఫ్రిజ్‌లో దాదాపు 5 గంటలపాటు దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నారు. ఉగ్రవాది అమెదీ సాయంత్రం ప్రార్ధనల కోసం మోకాళ్లపై కూర్చున్న సమయంలోనే ఫ్రాన్స్ కమెండోలు సూపర్మార్కెట్లోకి దూసుకొచ్చారని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. సిరియా, మాలిల్లో పశ్చిమదేశాల మిలటరీ చర్యలను అమెదీ తీవ్రంగా విమర్శిస్తున్నట్లుగా ఉన్న ఆడియోను ఫ్రెంచ్ రేడియో ప్రసారం చేసింది. అమెదీతో పాటు చార్లీ హెబ్డొపై దాడి చేసిన ఉగ్ర సోదరులు చెరిఫ్ కౌచీ, సయీద్ కౌచీలు జీహాదీలుగా ఇప్పటికే నిఘా వర్గాల దృష్టిలో ఉన్నారు. -
ముగిసిన ‘ఆపరేషన్ పారిస్’
► ఉగ్రవాదులను హతమార్చిన ఫ్రెంచ్ పోలీసులు ► మృతుల్లో చార్లీ హెబ్డోపై దాడి చేసిన టెర్రరిస్టులు ► సూపర్మార్కెట్లో మరో ఉగ్రవాది హతం ► పారిస్‌లో హై అలర్ట్; పోలీసుల అధీనంలో నగరం పారిస్: ఉగ్ర భూతం ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డోపై విరుచుకుపడి 12 నిండు ప్రాణాలు తీసి బుధవారం.. మహిళా కానిస్టేబుల్‌ను కాల్చిచంపి గురువారం.. తమ వికృత రూపం చూపిన ఉగ్రవాదులు శుక్రవారం మరోమారు విధ్వంసానికి వ్యూహం పన్నారు. కానీ ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టడాన్ని సవాలుగా తీసుకున్న ఫ్రెంచ్ పోలీసులు ఎట్టకేలకు అందులో విజయవంతమయ్యారు. చార్లీ హెబ్డేపై దాడి చేసిన ఉగ్ర సోదరులుగా భావిస్తున్న ఇద్దరిని ఉత్తర పారిస్‌లోని ఒక ప్రింటింగ్ ప్లాంట్‌లో హతమార్చారు. ఆ కర్మాగారాన్ని చుట్టుముట్టి, వారిని హతమార్చి, ఉగ్రవాదులు బందీగా పట్టుకున్న వ్యక్తిని సురక్షితంగా విడిపించారు. తూర్పు పారిస్‌లోని ఒక సూపర్మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదినీ చంపేశారు. రెండు బృందాలుగా..రెండు బృందాలుగా విడివడిన ఉగ్రవాదులు శుక్రవారం పారిస్‌లోని రెండు ప్రాంతాల్లో పలువురిని బందీలుగా పట్టుకున్నారు. ప్రింటింగ్ ప్లాంట్‌లోని ఉగ్ర సోదరులు ఒక బృందం కాగా, పారిస్‌కు తూర్పుగా చార్లీ హెబ్దే కార్యాలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక సూపర్మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకుని అమెడీ కౌలిబలి అనే మరో సాయుధ ఉగ్రవాది ఉన్నాడు. అతడితో ఒక మహిళ కూడా ఉంది. దాడి తర్వాత ఆమె పరిస్థితేమిటో తెలియడం లేదు. ఈ సమాచారంతో పారిస్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు పారిస్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. మేయర్ కార్యాలయం, నగరంలోని ప్రఖ్యాత మేరియస్ ప్రాంతాన్ని మూసేయించారు. పౌరులు, పర్యాటకులపై మరిన్ని దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణంగా మేరియస్ వీధి యూదుల ప్రార్థనకు కొద్ది గంటల ముందు యూదులు, పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రింటింగ్ ప్లాంట్‌లో..పారిస్‌కు ఈశాన్యంగా ఉన్న దమ్మార్టిన్ ఎన్ గోల్లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్లాంట్‌లో ఒక బందీతో చార్లీ హెబ్డోపై దాడి చేసిన ఉగ్రసోదరులు చెరిఫ్ కౌచి, సయిద్(32) కౌచి(34) ఉన్నారన్న సమాచారంతో ఆ భవనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భవనం దగ్గరలో ఒక సైనిక హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచారు. తాము అమరవీరులుగా మరణించేందుకు సిద్దంగా ఉన్నామంటూ ఆ ఉగ్రవాదులు ప్రకటించారని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. లోపలినుంచి పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్వాట్ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. భవనం పైనుంచి, నలువైపుల నుంచి లోపలికి దూసుకెళ్లి ఉగ్రసోదరులను హతమార్చాయి. అంతకుముందు వారిద్దరూ తప్పించుకునేందుకు విఫల యత్నం చేశారని ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులు తెలిపారు. ఆ ఉగ్రవాదులిద్దరూ అల్జీరియన్లుగా భావిస్తున్నారు. సూపర్మార్కెట్లో.. ప్రింటింగ్ ప్లాంట్‌లో ఆపరేషన్ ప్రారంభించడానికన్నా ముందు.. పారిస్‌లోని ఒక సూపర్మార్కెట్లో ఐదుగురిని బందీలుగా పట్టుకున్న అమెడీ కౌలిబలి అనే ఉగ్రవాది ప్రింటింగ్ ప్లాంట్‌లోని ఉగ్రసోదరులను హతమారిస్తే.. తన దగ్గరున్న బందీలను చంపేస్తానని పోలీసులను హెచ్చరించాడు. హెచ్చరికగా షాపులో కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. కొందరు గాయాలతోనే తప్పించుకోగలిగారని అధికారులు తెలిపారు. అనంతరం పోలీసులు కాల్పులు జరుపుతూ ఆ షాప్‌లోకి దూసుకెళ్లారు. పరస్పర కాల్పుల్లో ఆ సాయుధుడితో పాటు మరో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. ప్రింటింగ్ ప్లాంట్‌లో దాగిన ఉగ్రసోదరులపై దాడి చేయొద్దని అమెడీ కౌలిబలి హెచ్చరించడంతో.. ఆ రెండు బృందాలు ఒకరికొకరు తెలుసని, సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సమన్వయంతో ఈ చర్యలకు దిగాయన్న విషయం అర్థమైందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఐదుగురిని బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదే గురువారం ఒక మహిళా పోలీసును కాల్చిచంపాడని అనుమానిస్తున్నామన్నారు. ఆ సాయుధ ఉగ్రవాది అమెడీ కౌలిబలి, అతడితో ఉన్న మహిళ హయత్ బౌముదీన్ల ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మొత్తంమీద దాదాపు 48 గంటలకు పైగా ఫ్రాన్స్‌ను, పారిస్ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఉగ్రవాదులను ఫ్రాన్స్ పోలీసులు విజయవంతంగా హతమార్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ ఫోన్ ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో ఫోన్లో మాట్లాడారు. పారిస్ ఘటనను ఖండించిన మోదీ.. ఉగ్రవాదంపై పోరుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో వ్యూహాత్మక పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాల్సి ఉందని ఫ్రాంకోయిస్‌తో అన్నారు. -
కిల్లర్లకు మాజీ ఎమ్మెల్యే రూ. 51 కోట్ల నజరానా
లక్నో: పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి చేసిన వారికి బీఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే యాకూబ్ ఖురేషి నజరానా ప్రకటించారు. దాడి చేసిన దుండగులకు ఆయన వత్తాసు పలికారు. ఈ దాడి చేసినందుకు దుండగులకు ఆయన రూ. 51 కోట్ల నగదు కానుకగా ఇస్తానని యాకూబ్ ఖురేషి గురువారం ప్రకటించారు. ముస్లింలు పరమ పవిత్రంగా ఆరాధించే మహ్మద్ ప్రవక్తను ఎవరైనా అగౌరవపరచాలని చూసే వారికి ఇదే తరహా ఘటనలే ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య చిత్రాలు వేసిన వ్యక్తిని హతమారిస్తే రూ. 51 కోట్ల నజరానా ఇస్తానని 2006లో ఆయన ప్రకటించి... పెద్ద వివాదానికి తెరలేపారు. యాకూబ్ ఖురేషి వ్యాఖ్యలను బీఎస్పీ ఖండించింది. ఖురేషి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని పేర్కొంది. పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై బుధవారం ముగ్గురు ఉగ్రవాదులు దాడులకు తెగబడి పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు సుప్రసిద్ధ కార్టూనిస్టులుసహా 10మంది జర్నలిస్టులను, ఇద్దరు కానిస్టేబుళ్లనూ కాల్చిచంపిన సంగతి తెలిసిందే. -
ఉన్మాద చర్య
సంపాదకీయం సామాన్యుడు అసామాన్యుడై, శిరమెత్తి కళ్లెర్రజేసి రాజరికాన్ని తుత్తినియలు చేసిన గడ్డ అది. ఈ ప్రపంచంలో తొలిసారి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను మాటలుగా కాదు...ఆచరణలో ‘పారిస్ కమ్యూన్’గా ఆవిష్కరించి చూపిన ప్రాంతమది. మళ్లీ నియంత పోకడలను ప్రదర్శించబోయిన వ్యవస్థపై 1968లో అదే స్ఫూర్తితో తిరగబడి అధికార పీఠాన్ని వణికించిన చరిత్ర దాని సొంతం. ఈమధ్య ఫ్రాన్స్ ప్రభుత్వం ఇవ్వజూపిన దేశ అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరిస్తూ ‘పౌరుల్లో ఎవరు గౌరవనీయులో నిర్ణయించే అధికారం మీకెక్కడిద’ని తిరగ్గొట్టిన ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెటీ కొనసాగించింది ఆ సంప్రదాయాన్నే. స్వేచ్ఛను ప్రబోధించి, ఆచరించి...తిరుగుబాటును ఆశ్వాసించిన అలాంటి నేలపై నెత్తురొలికింది. పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక ‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపై బుధవారం ముగ్గురు ఉగ్రవాదులు దాడులకు తెగబడి పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు సుప్రసిద్ధ కార్టూనిస్టులుసహా 10మంది జర్నలిస్టులను, ఇద్దరు కానిస్టేబుళ్లనూ కాల్చిచంపారు. ఉన్మాదుల్లో ఒకడు తనంత తానే లొంగిపోయాడని వార్తలు వస్తుండగానే మరో ఇద్దరు ఉగ్రవాదులు రెండోరోజు కూడా పారిస్ రోడ్డుపై ఒక మహిళా కానిస్టేబుల్‌పై గుండ్ల వర్షం కురిపించి ప్రాణాలు తీశారు. ఒకటి రెండుచోట్ల పేలుళ్లు కూడా సంభవించాయి. అల్ కాయిదా ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా చెప్పుకున్న ఈ ఉన్మాదుల్లో ఒకరికి గతంలో జైలు శిక్ష కూడా పడిందంటున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఫ్రాన్స్ సరిగానే అర్ధంచేసుకుంది. ‘ఇది భావప్రకటనా స్వేచ్ఛపైనా, రిపబ్లిక్ స్ఫూర్తిపైనా జరిగిన దాడి’ అని అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ ప్రకటించారు. ఉదారవాద భావాలను సహించలేని వాతావరణం ప్రపంచవ్యాప్తంగా పెచ్చుమీరుతున్నవేళ ఒక మతాన్ని అనుసరించేవారి మనోభావాలను దెబ్బతీసేలా, వారి విశ్వాసాలను అవహేళన చేసేలా...ఒక్కసారి కాదు, పదే పదే కార్టూన్లు ప్రచురించి ‘చార్లీ హెబ్డో’ తప్పే చేసి ఉండొచ్చు. అలాగని ‘చార్లీ హెబ్డో’ అనుసరించే మతమేమీ లేదు. దానికి క్రైస్తవమైనా, ఇస్లామైనా, జుడాయిజమైనా, మరొకటైనా ఒక్కటే. చెప్పాలంటే అన్ని మతాలనూ, ఆ మతాలు ప్రబోధించే విశ్వాసాలనూ అది వెటకారం చేసింది. ‘అధికార రోగపూరిత బదిరాంధకుల’ను అసలే వదల్లేదు. అత్యున్నతస్థాయి నేతలైనా, అధికారులైనా, సెలబ్రిటీలైనా ఆ పత్రిక కార్టూనిస్టులకు లెక్కలేదు. అలాంటివారందరినీ తమ కుంచెలతో గిచ్చారు...ఎత్తిపొడిచారు...తలెత్తుకు తిరగలేనివిధంగా వ్యంగ్య ధోరణిలో ఎండగట్టారు. వీటన్నిటి వెనకా అపరిమితమైన స్వేచ్ఛ, అన్నిటినీ ఎదిరించే తిరుగుబాటు మనస్తత్వం, దేన్నీ లెక్కచేయనితనం వంటి భావనలే ఉన్నాయి. అయితే, పాశ్చాత్య సమాజం మునుపటిలా లేదు. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలూ వ్యవహరించిన తీరువల్ల ఉగ్రవాదం అదుపులోనికి రాలేదు సరిగదా...మరింతగా విస్తరించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికా చేసిందంతా దానికి బలం చేకూర్చడమే. ఇందుకు యూరప్ దేశాలన్నీ సహకరించాయి. ట్విన్ టవర్స్‌పై దాడికి బాధ్యులైనవారిని వెంటాడి పట్టుకోవడానికి బదులు ఆ వంకన ఇరాక్‌పై దండయాత్ర జరిపి, అటు తర్వాత మరిన్ని దేశాల్లో జోక్యం చేసుకుని వాటన్నిటినీ వల్లకాటి సీమలుగా మార్చాయి. ఉగ్రవాదాన్ని ఒంటరి చేసి, దాన్ని తుదముట్టించడానికి బదులు ఒక మతంపై దాడి చేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలగజేశాయి. గత పాతికేళ్లలో పాశ్చాత్య ప్రపంచం పోతున్న ఈ పోకడలపై ఉదారవాద మేథావులెందరో హెచ్చరించారు. దీనివల్ల ఉగ్రవాదానికి మరింత ఊపిరిపోసినట్టవుతుందని చెప్పారు. ఇలాంటి వాతావరణం ఉండటం కొందరు ఉన్మాదులకు అందివచ్చింది. తమను తాము మత రక్షకులుగా చెప్పుకుని తమతో ఏకీభవించనివారిని హతమార్చే పనికి పూనుకుంటున్నారు. వీరికి మతం ఒక సాకు తప్ప అది బోధించే ఉన్నతమైన విలువలతో, సంస్కృతితో సంబంధం లేదు. తోటి మనుషులపై కనీసమైన గౌరవం లేదు. ఇరాక్, యెమెన్, అఫ్ఘానిస్థాన్, నైజీరియా వంటి దేశాల్లో తుపాకులతో, కారు బాంబులతో, గ్రెనేడ్లతో, ఆత్మాహుతి దాడులతో నిత్యమూ వందలమందిని హతమారుస్తున్నవారు ఏ మతం పేరు చెప్పుకున్నా అది నిజం కాదు. మతాన్ని కాపాడుకోవడానికే తుపాకులను ఎక్కుపెట్టామని, హింసకు పాల్పడుతున్నామని అంటున్నవారు తామే ఆ మతానికి మొదటి శత్రువులమన్న సంగతిని మరుస్తున్నారు. అలాంటివారు మొత్తంగా మానవత్వానికీ, ఉదారవాద భావాలకూ, స్వేచ్ఛాసమానత్వాలకూ వ్యతిరేకులు. ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రతినిధులపై దాడులు ఇటీవలికాలంలో పెరిగాయి. నిరుడు వివిధ దేశాల్లో 66మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతే, 119మంది కిడ్నాపయ్యారు. మరో 178మంది నిర్బంధంలో మగ్గుతున్నారు. సిరియా, పాలస్థీనా, ఉక్రెయిన్, ఈజిప్టు, మెక్సికోవంటి ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో ప్రపంచానికి తెలియజెప్పాలన్న సంకల్పంతో పనిచేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు ఇలా హింసకూ, దౌర్జన్యానికీ, వేధింపులకూ లోనవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంతోసహా చాలా దేశాల్లో మతం పేరుచెప్పి ఉన్మాదాన్ని పెంచిపోషిస్తున్న శక్తులు తయారవుతున్నాయి. విద్వేషాన్ని, అసహనాన్ని ప్రబోధిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరిగిన ఉదంతం వీటన్నిటికీ పరాకాష్ట. ఇలాంటి శక్తులపట్ల అప్రమత్తంగా లేకపోతే పారిస్‌లో జరిగిందే రేపన్నరోజు అన్నిచోట్లా పునరావృతమవుతుంది. ఒక వ్యంగ్య రేఖాచిత్రమో, మనసును సూటిగా తాకేలా చెప్పిన ఒక మాటో ప్రాణాలు తీసేంతటి కారణాలుగా కొందరికి కనబడటమంటే మళ్లీ మనం మధ్యయుగాలనాటి పరిస్థితుల్లోకి జారుకుంటున్నట్టే లెక్క. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో సాధించుకున్న ఉదారవాద భావాలనూ, ప్రజాస్వామిక విలువలనూ ధ్వంసంచేయడానికి పూనుకుంటున్న ఇలాంటి శక్తులపై అప్రమత్తంగా ఉండటం...వారిని ఏకాకులను చేయటం ఈనాటి తక్షణావసరం. తమ చర్యలతో ఆ తరహా పోకడలకు పరోక్షంగా నారూ నీరూ పోస్తున్నవారిని సైతం నిలదీయగలగాలి. అప్పుడు మాత్రమే ఉగ్రవాదం నామరూపాల్లేకుండా కొట్టుకుపోతుంది. -
పారిస్ దాడి ఘటనలో అనుమానితుల ఫొటోలు విడుదల
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని 'చార్లీ హెబ్డో' అనే వ్యంగ్య పత్రికా కార్యాలయంపై బుధవారం ముష్కరులు జరిపిన దాడికి సంబంధించి ఫ్రాన్స్ పోలీసులు ఇద్దరు అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. ఉగ్రవాదుల దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఫ్రాన్స్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అనుమానిస్తున్నారు. ఫ్రాన్స్ దేశస్తులైన సోదరులు చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీలతోపాటు హమీద్ అనే 18 ఏళ్ల విద్యార్థిని అనుమానిస్తున్నారు. వారిలో చెరిఫ్ కౌచీ, సైద్ కౌచీ ఫొటోలను విడుదల చేశారు. పెట్రోల్ బంకు మేనేజర్ వారిని గుర్తించినట్లు తెలుస్తోంది. 2008లో ఉగ్రవాదులకు సహకరించిన కేసులో చెరిఫ్ కౌచీ 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. -
పారిస్ ఉగ్రవాద దాడి జరిగిందిలా..!
-
పారిపోతూ కూడా.. కాల్పులు జరిపారు!!
-
పారిపోతూ కూడా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
ప్యారిస్: ఉగ్రవాద దాడితో ప్యారిస్ లోని విశ్వవిఖ్యాత సందర్శనీయ కేంద్రం ఈఫిల్ టవర్ ను మూసివేశారు. ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. బుధవారం ప్యారిస్ లోని ఫ్రెంచ్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దాడి చేసిన మరుక్షణం ఉగ్రవాదులు ఘటనాస్థలం నుంచి తప్పించుకుని నల్ల రంగు కారులో పారిపోయారు. కారులో పారిపోతున్నప్పుడు కూడా రోడ్డుపైనున్నవారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ముష్కర మూకల దాడితో ప్యారిస్ ప్రజలు భీతిల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై పరుగులు తీశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, కనీసం 9 మంది జర్నలిస్టులున్నట్టు తెలుస్తోంది. -
పారిస్‌లో ఉగ్రదాడి : 11 మంది మృతి