జర్మనీ పత్రిక కార్యాలయంపై దాడి | German paper attacked for carrying Charlie Hebdo cartoons | Sakshi
Sakshi News home page

జర్మనీ పత్రిక కార్యాలయంపై దాడి

Published Sun, Jan 11 2015 2:15 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

German paper attacked for carrying Charlie Hebdo cartoons

బెర్లిన్: పారిస్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డోపై దాడి మరవకముందే జర్మనీపై మరో పత్రికపై దాడి జరిగింది. హంబర్గ్ నగరంలోని హంబర్గర్ మోర్గాన్ పోస్ట్ కార్యాలయంపై రాళ్లు, మండే పదార్థాలతో దుండగులు దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ దాడిలో కొన్ని పత్రాలు ధ్వంసమయ్యాయి. ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చార్లీ హెబ్డో మేగజీన్ లో వచ్చిన కార్టూన్లను మళ్లీ ప్రచురించినందుకు ఈ పత్రికపై దాడి జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement