Satish jarakiholi resignation
-
అసంతృప్తితోనే రాజీనామా
జారకీహోళీ నిర్ణయాన్ని మార్చుకుంటారు శాఖ మార్పుపై పరిశీలిస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బళ్లారి(కొప్పళ) : తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితోనే మంత్రి పదవికి సతీష్ జారకీహోళీ రాజీనామా చేశారని, త్వరలోనే ఆ నిర్ణయాన్ని ఆయన మార్చుకుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కొప్పళ జిల్లా కుష్టిగిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం విచ్చేసిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. సతీష్ జారకిహొళీతో చర్చలు జరి పామన్నారు. ఆయన ఎలాం టి షరతులు విధించలేదన్నారు. ఆయనతో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో కచ్చితం గా తెలియలేదని, అయితే శాఖల మార్పు విషయమై రాజీనామా చేసి ఉండవచ్చన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన శాఖ మార్పు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ అబద్ధాలకోరని విమర్శించారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడంలో ఆయన మహాదిట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవెగౌడ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు పొందడం వెనుక దేవెగౌడ ఆశీస్సు లు కాదని, అప్పట్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తనను బలపరచడం వల్లనే ఆ పదవులు తనను వరించాయన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఎక్కడైనా మంచి స్థానం దొరుకుతుందన్నారు. గృహనిర్మాణ శాఖా మంత్రి అం బరీష్తో తనకు వాగ్వాదం జరిగినట్లుగా మీడియాలో వెలువడిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఇటీవల మీడియాలో ఊహాజనిత వార్తలు, కథనాలు వెలువడుతున్నాయన్నారు. ఆర్కావతి డీ నోటిఫికేషన్ ఉదంతంలో తాను ‘రీడూ’ అనే పదాన్ని ఉపయోగించలేదని, అది హైకోర్టు ఉపయోగించిన పదమని పేర్కొన్నారు. -
అదంతా లోకల్
జారకీహోళీ రాజీనామాపై డిగ్గీ బెంగళూరు: సతీష్ జారకీహోళీ రాజీ నామా విషయం స్థానికమైనదని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ఈ సమస్యను పరిష్కరించుకుంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడి కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమితి సభలో పాల్గొనడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య, జారకీహోళీ మధ్య ఏర్పడిన మనస్పర్థలను వారిరువురు చర్చల ద్వారానే పరిష్కరించుకుంటారని పేర్కొన్నారు. ఈ విషయంలో హైకమాండ్ కలగజేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి జ యంతి నటరాజన్‌పై దిగ్విజయ్ సింగ్ విమర్శ లు గుప్పించారు. అధికారం ఉన్నన్ని రోజులు అ నుభవించి అధికారం పోయిన తర్వాత పార్టీని వీడడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ పా ర్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని జయంతి నటరాజన్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్ర శ్నించారు. సోనియాగాంధీ కానీ, రాహుల్‌గాం ధీ కానీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏ శాఖ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోలేదని అన్నారు. జయంతి నటరాజన్ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. -
శ్రమ ఫలించేనా?
రాష్ర్ట కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు తొలగించేందుకు నేటి నుంచి కసరత్తు మూడు రోజుల పాటు బెంగళూరుకు పరిమితం కానున్న డిగ్గీ రాజా బెంగళూరు : రాష్ర్ట కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలను తొలగించేందుకు శుక్రవారం నుంచి కసరత్తు మొదలు కానుంది. అయితే ఈ కార్యాచరణపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. నాయకుల మధ్య ఏర్పడిన పొరపొచ్ఛాలను కొలిక్కి తీసుకువచ్చేందుకు రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మూడు రోజుల పాటు బెంగళూరులో మకాం వేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృతస్థాయి చర్చ జరగనుంది. ఇందులో భాగంగా సతీష్ జారకీహోళీ రాజీనామా విషయం ప్రధానంగా ప్రస్తావనకు రానుంది. మంత్రులకు ఇష్టం లేకపోయినా వారి పనితీరుపై అధికారులతో ముఖ్యమంత్రి నివేదికలు సిద్ధం చేయించి హైకమాండ్‌కు పంపడంపై కొందరు సిద్ధరామయ్యపై గుర్రుగా ఉన్నారు. వీరు కూడా రాజీనామా అస్త్రంతో సీఎంను దెబ్బతీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు తమకు అందుబాటులో ఉండడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే గగ్గోలు పెడుతున్న వైనం కూడా చర్చకు రానుంది. వీటితో పాటు కొందరు మంత్రులు కమీషన్ ఏజెంట్లుగా మారిన వైనంపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే మధ్య ఏర్పడిన అఘాతం కాంగ్రెస్ పార్టీని రోజురోజుకూ బలహీనపరుస్తోంది. ఇలాంటి తరుణంలో సమస్యల పరిష్కారానికి తొలిరోజునే దిగ్విజయ్ సింగ్ ప్రాముఖ్యతనిచ్చినట్లు సమాచారం. ఆయన దౌత్యం ఎంత మేరకు ఫలితాన్ని చేకూరుస్తోందో వేచి చూడాలి.