
అదంతా లోకల్
జారకీహోళీ రాజీనామాపై డిగ్గీ
బెంగళూరు: సతీష్ జారకీహోళీ రాజీ నామా విషయం స్థానికమైనదని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ఈ సమస్యను పరిష్కరించుకుంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారమిక్కడి కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమితి సభలో పాల్గొనడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య, జారకీహోళీ మధ్య ఏర్పడిన మనస్పర్థలను వారిరువురు చర్చల ద్వారానే పరిష్కరించుకుంటారని పేర్కొన్నారు.
ఈ విషయంలో హైకమాండ్ కలగజేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి జ యంతి నటరాజన్‌పై దిగ్విజయ్ సింగ్ విమర్శ లు గుప్పించారు. అధికారం ఉన్నన్ని రోజులు అ నుభవించి అధికారం పోయిన తర్వాత పార్టీని వీడడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ పా ర్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని జయంతి నటరాజన్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్ర శ్నించారు. సోనియాగాంధీ కానీ, రాహుల్‌గాం ధీ కానీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏ శాఖ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోలేదని అన్నారు. జయంతి నటరాజన్ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు.