Satya Narayan
-
రజనీ సీఎం కావాలని యాగం
పెరంబూరు: నటుడు రజనీకాంత్ ముఖ్యమంత్రి కావాలని ఆయన సోదరుడు యాగం నిర్వహించారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి గత మూడు దశాబ్దాలుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అదిగో వస్తున్నా, ఇదుగో పార్టీ పెడుతున్నా అంటూ రజనీకాంత్ కాలం వెలబుచ్చుతూనే వచ్చారు. కాగా ఎట్టకేలకు గత ఏడాది రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు బహిరంగంగా వెల్లడించిన రజనీకాంత్ ఆ తర్వాత ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. తన పాటికి తను కొత్త చిత్రాలను ఒప్పుకుంటూ నటిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఆయన సోదరుడు సత్యనారాయణన్ మాత్రం రజనీకాంత్ రాజకీయ పార్టీని నెలకొలపడం ఖాయం అనీ, ఈ జూన్ నెల తర్వాత పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారనీ పలు మార్లు చెబుతూవచ్చారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ ముఖ్యమంత్రి కావాలని యాగం చేశారు. చిదంబరంలోని నటరాజ ఆలయంలో సత్యనారాయణన్ శుక్రవారం ఈ ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితుల వేదమంత్రోచ్ఛరణ నడుమ యాగం కొనసాగింది. రజనీకాంత్ పూర్తి ఆయురారోగ్యాలతో 2021లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలో అమోఘ విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలని సత్యనారాయణన్ పూజలు చేశారు. ఈ యాగంలో ఆయనతో పాటు కర్ణాటక రాష్ట్ర రజనీకాంత్ అభిమాన సంఘం అధ్యక్షుడు చంద్రకాంత్ పాల్గొన్నారు. -
షార్ట్‌సర్క్యూట్ - నాలుగు ఇళ్లు దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణ శివారులోని ఈదరపల్లిలో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి. బండి సత్యనారాయణ, బండారు సుబ్బారావు, మాసగిరి కుమారి, కళింగరాజు విశ్వనాథంకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. యితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు చెలరేగిన వెంటనే ఇళ్లలో నిద్రిస్తున్న వారంద రూ సురక్షితంగా బయటికి వచ్చారు. ఇళ్లలో ఉన్న వస్తువులు, తిండిగింజలు, దుస్తులు అన్నీ కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అమలాపురం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సర్వం కోస్పోయిన తమను ప్రభుత్వం తమను ఆదికోవాలని బాధితులు కోరుతున్నారు. -
యాంకర్ ఉదయభాను అభినందించారు
పాటలు మధురంగా ఆలపించడమే కాదు ఒకేసారి రెండు స్వరాలను పలికించడంలో ఆయన దిట్ట. ఆయన పేరు దండుమేను గోవిందరాజు. రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన గోవిందరాజు వృత్తిరీత్యా కార్మికుడు. ఆయన చూపిస్తున్న ప్రతిభను ఎందరో ప్రముఖులు అభినందించారు. గోవిందరాజును ‘న్యూస్‌లైన్’ పలకరించగా, సాధన వల్ల గుర్తింపు లభిస్తోందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. చెల్లూరు(రాయవరం) సంగీతంపై ఆసక్తితోనే.. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే నాకు ఎంతో ఆసక్తి. ప్రతి పాటనూ అనుకరిస్తూ పాడేవాడిని. నా ఆసక్తిని గమనించిన సంగీత గురువు వెన్నేటి సత్యనారాయణ ప్రోత్సహించారు. ఆయన వద్ద శిష్యరికం చేశా. నాకు సంగీతంలో మెలకువలు నేర్పుతూ పాటలను పాడడంలో శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి పలు చోట్ల పాటలు పాడుతున్నా. కార్మికుడిగా పనిచేస్తూనే.. చెల్లూరు సర్వారాయ చక్కెర కర్మాగారంలో టర్బైన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. ఖాళీ సమయాల్లో సంగీత విభావరుల్లో పాడతాను. సాంఘిక నాటకాలు, వివిధ శుభకార్యాల్లోనూ పాడుతుంటా. ఓ టీవీచానల్ కార్యక్రమంలో నేను పాడిన పాటకు ముగ్దురాలైన యాంకర్ ఉదయభాను అభినందించారు. బహుమతి కూడా అందజేశారు. పలువురు ప్రముఖుల మెప్పు కూడా పొందాను. మురళీమోహన్, జయసుధ సమక్షంలో రామచంద్రపురంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాటలు పాడా. వారి ప్రశంసలను నేను ఎన్నటికీ మరువలేను. సాధనతోనే.. పురుష గొంతుతోపాటు స్త్రీ స్వరాన్ని ఒకే సమయంలో పలికించడంలో సాధన చేశా. చక్కెర కర్మాగారంలో పనిచేసే వెంకట్రావు, మరో కార్మికుడు స్త్రీ గొంతుతో కూడా పాడడం చూసి సాధన చేశా. అది ఫలించింది. ఒకే పాటలోని స్త్రీ, పురుష చరణాలను మధురంగా పలికించగలను. ఇదే నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. -
మృత్యుఒడికీ కలిసే..
మూలపాడు,(ఇబ్రహీంపట్నం రూరల్) : ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. 65వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విజయవాడకు చెందిన గొల్లపల్లి పురుషోత్తమ చౌదరి పోలీస్ కానిస్టేబుల్‌గా ఐతవరంలో విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నారు. పురుషోత్తమ చౌదరి కుమారుడు గొల్లపల్లి రాజేష్(19), అంబారుపేటకు చెందిన కట్ర సత్యనారాయణ(19) స్నేహితులు. వీరిద్దరూ మోటారుసైకిల్‌పై విజయవాడకు బయలుదేరారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద మరమ్మతులకు గురై రహదారికి కుడి వైపున రాంగ్రూట్లో నిలిపి ఉన్న కంటెయినర్‌ను వెనక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. రాజేష్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం, సత్యనారాయణ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎస్ఐ కృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించి సమాచారాన్ని బంధువులకు తెలియజేశారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.