satyaprabha
-
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత
సాక్షి, చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ (65) కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమెకు నివాళులు అర్పించడానికి జిల్లా నుంచి అభిమానులు, టీడీపీ నేతలు బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు. ఇటీవలే ఆమె కరోనా నుంచి కూడా కోలుకున్నారు. కాగా టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి అయిన సత్యప్రభ.. ఆయన మృతితో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే సత్యప్రభ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత
తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు హై బీపీ రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులోని తన స్వగృహంలో ఉండగా.. హై బీపీ రావడంతో ఆమె పడిపోయారు. దాంతో వెంటనే చిత్తూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అక్కడనుంచి ఆమెను బెంగళూరు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమెకు సంబంధించినవిగా చెబుతున్న నోట్ల కట్టలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం వల్లే ఆమెకు అస్వస్థత ఏర్పడిందా అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. గత సెప్టెంబర్ నెలలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమె నివాసం, కార్యాలయాలపై దాడులు చేసి రూ.265 కోట్లకు పైగా పట్టుకున్నారంటూ కొన్ని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. కానీ దానికి.. ప్రస్తుత నోట్ల రద్దు వ్యవహారానికి ఏమీ సంబంధం లేదని చెబుతున్నారు. -
ఎమ్మెల్యే సత్యప్రభ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
-
ఎమ్మెల్యే సత్యప్రభ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
చిత్తూరు(రూరల్): చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన కంపెనీలు, ఇళ్లలో జరుగుతున్న ఐటీ సోదాలు శనివారం సాయంత్రం ముగిసాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే కంపెనీలు, మెడికల్ కాలేజీల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించడం జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆదాయపు పన్ను శాఖ ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిపే సాధారణ తనిఖీలే అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు నోటు కేసులో సత్యప్రభ తనయుడు డీఏ శ్రీనివాస్‌ను విచారించిన తర్వాతే ఈ దాడులు జరిగాయని టీడీపీలోని ఓ వర్గం అంటోంది. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులు చాలా భాగం సత్యప్రభ కుటుంబం పేరుతో ఉన్నాయని అందుకే దాడులు జరిగాయని వాదన కూడా జిల్లాలో వినిపిస్తోంది. సాధారణ తనిఖీలే.. ‘స్వచ్ఛంద ఆదాయ వెల్లడి’ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగనే తనిఖీలు జరిగాయని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఆదాయపు పన్ను అధికారుల తనిఖీ ముగిసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తనిఖీల్లో భాగంగా 30 సంవత్సరాల ఆదాయ వివరాలు అడిగారని సత్యప్రభ తెలిపారు. ఆస్తుల వివరాలు, ఐటీ రిటర్న్స్ వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారని ఆమె చెప్పారు. ఈ నెల 30 తేదీలోపల ఆదాయ వివరాలు పూర్తిగా ఇవ్వాలని చెప్పారని.. గడువులోగా అధికారులు అడిగిన వివారాలు ఇస్తామని ఆమె పేర్కొన్నారు.