టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత | tdp mla suffers high bp, gets admitted to hospital | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

Published Thu, Nov 17 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభకు హై బీపీ రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులోని తన స్వగృహంలో ఉండగా.. హై బీపీ రావడంతో ఆమె పడిపోయారు. దాంతో వెంటనే చిత్తూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అక్కడనుంచి ఆమెను బెంగళూరు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఆమెకు సంబంధించినవిగా చెబుతున్న నోట్ల కట్టలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం వల్లే ఆమెకు అస్వస్థత ఏర్పడిందా అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. గత సెప్టెంబర్ నెలలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమె నివాసం, కార్యాలయాలపై దాడులు చేసి రూ.265 కోట్లకు పైగా పట్టుకున్నారంటూ కొన్ని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. కానీ దానికి.. ప్రస్తుత నోట్ల రద్దు వ్యవహారానికి ఏమీ సంబంధం లేదని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement