Screamed
-
మొక్కలు కూడా అరుస్తాయి..శబ్దాలు చేస్తాయ్.!
మొక్కలకు భాష ఉంటుందని, నీళ్లు పోసినపుడు ఆనందంతో కొమ్మలు ఊపూతూ ఆనందాన్ని ప్రకటిస్తాయని చాలా సార్లు విన్నాం. తాజాగా మొక్కలకూ బాధ ఉందనే విషయాన్ని తొలిసారిగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా గట్టిగా అరుస్తాయని పరిశోధకులు వెల్లడించారు. చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా వాటి కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఆక్రోశిస్తాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాలను గుర్తించారు. సెల్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నిశ్శబ్దమైన మైదానంలో కూడా మనకు వినబడని శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలకు అర్థం ఉంటుంది. ఈ శబ్దాలను వినగలిగే జంతువులూ ఉన్నాయి. కాబట్టి చాలా శబ్ద పరస్పర చర్య జరిగే అవకాశం ఉందని పరిణామాత్మక జీవశాస్త్రవేత్త లిలాచ్ హడానీ తెలిపారు. సాధారణ సమయాల్లో కూడా మొక్కలు కొన్ని రకాల శబ్దాలు చేస్తాయని, మనిషి వినలేని ఈ శబ్దాలను కొన్ని జంతువులు, కీటకాలు గుర్తిస్తాయని తేల్చారు. లిలాచ్ హడానీ డా. హడానీ , ఆమె బృందం ఈ ప్రయోగాల కోసం టమాటాలు, పొగాకు మొక్కలను పరిశీలించారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ద్వారా ఒత్తిడి లేని మొక్కలు, కాండం పెకిలించిన మొక్కలు, నిర్జలీకరణ మొక్కలు ఉత్పత్తి చేసే శబ్దాల మధ్య తేడాను గుర్తించానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయాల్లో మొక్కలు మీటరు దూరం మేర వినబడేలా హై పిచ్ శబ్దాలు చేస్తాయని గుర్తించారు. ఒత్తిడి లేని మొక్కలు ప్రశాంతంగానే ఉంటున్నట్టు గుర్తించారు. ఒత్తిడిలో ఉన్న మొక్కలు చేసిన శబ్దాలు అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు లేదా క్లిక్ చేసినట్టుగా ఉంటాయని, మనుషులకు వినబడవని పేర్కొన్నారు. మొక్కలు తమ బాధలను తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగించే మార్గాలలో ఇదొకటి కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి సమయాల్లో చెట్లు, మొక్కలు తమ రంగులు మార్చుకోవడం, లేదా ముడుచుకుపోవడం, ఇతర మార్పులకు లోనవుతాయని తెలుసు. అయితే, ఇవి శబ్దాలను కూడా వెలువరిస్తాయో లేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.. అయితే, మొక్కలు ఈ శబ్దాలను ఎలా చేస్తాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. -
వైరల్ వీడియో: అధికారి ముందు కుక్కలా అరుస్తూ నిరసన తెలిపిన వ్యక్తి..
-
పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని యజమాని హత్య
బంజారాహిల్స్: పెంపుడు పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని ఆగ్రహించిన ఓ యువకుడు దాని యజమానిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మిథిలానగర్‌లో డాక్టర్ మీనన్ ఇంట్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నల్లాపూర్‌కు చెందిన ఓ బాలుడు(17)తోపాటు హరీశ్వర్‌రెడ్డి అలియాస్ చింటూ(20) అద్దెకు ఉంటున్నారు. అసోంకు చెందిన ఎజాజ్ హుస్సేన్ (20), బ్రాన్ స్టిల్లింగ్(20) కూడా ఇదే ఇంట్లోని ఓ గదిలో అద్దెకుంటూ సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న రాత్రి ఎజాజ్, బ్రాన్ ఇద్దరూ విధులు ముగించుకొని గదికి వెళ్తుండగా దారిలో కనిపించిన ఓ పిల్లిని వెంట తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లి అరుస్తుండటంతో పక్కనే ఉన్న హరీశ్వర్రెడ్డితోపాటు సదరు బాలుడు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తుండటంతో మద్యం మత్తులో ఉన్న బాలుడు కోపంగా ఎజాజ్ గదికి వెళ్లాడు. అక్కడే ఉన్న బాటిల్లోని పెట్రోల్‌ను ఆయనపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఎజాజ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారంరాత్రి మృతి చెందాడు. అయితే ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని చనిపోయాడంటూ మొదట ఆ బాలుడితోపాటు హరీశ్వర్‌రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి స్నేహితుడు బ్రాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును తిరగదోడిన పోలీసులు బాలుడితోపాటు హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (చదవండి: దంపతుల ఆత్మహత్య) -
వైరల్ వీడియో: స్కూల్లో విద్యార్థుల వింత ప్రవర్తన
-
Viral Video: స్కూల్లో విద్యార్థుల వింత ప్రవర్తన.. అసలేం జరిగింది?
ఉత్తరాఖండ్: స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా ఏడుపులు మొదలు పెట్టారు. క్లాస్ రూం నుంచి బయటకు వచ్చి అరుపులు, కేకలతో హడలెత్తించారు. విద్యార్థుల వింత ప్రవర్తనతో టీచర్లు ఆందోళన చెందారు. దుష్ట శక్తులు ఆవహించాయంటూ దిష్టి తీశారు. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! ఉత్తరాఖండ్‌లోని భగేశ్వర్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన వీడియోను ఓ జాతీయ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్.. ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే డాక్టర్ల బృందాన్ని పంపించింది. వింత ప్రవర్తనను మాస్ హిస్టీరియాగా వైద్యులు భావిస్తున్నారు. -
ఆమె అరిస్తే డబ్బులొస్తాయ్...
చెవులు చిల్లులు పడేలా కీచుమని అరిస్తే చిరాకనిపిస్తుంది. కానీ యాష్లే పెల్డన్ అస్సలు చిరాకు పడదు. సరికదా గంటల తరబడి అరుస్తుంది. ఎందుకంటే ఆమెకు ఎంత అరిస్తే అంత డబ్బులొస్తాయ్. అరిస్తే డబ్బులెందుకొస్తాయనే కదా మీ సందేహం. హాలీవుడ్ సినిమా, టీవీ ప్రొడక్షన్ సంస్థలిస్తాయి. స్క్రీమ్ ఆర్టిస్ట్ అయిన పెల్డన్ అలా మొత్తుకునేది సినిమాలు, టీవీ షోల కోసం. హీరోహీరోయిన్లకు డబ్బింగ్ చెప్పినట్టుగా, వాళ్లకు బదులు స్టంట్స్ చేసినట్టుగా... హీరోయిన్లకు బదులుగా ఆమె అరుస్తుంది. మీరు చూసిన చాలా హాలీవుడ్ సినిమాల్లో ఆ అరుపులను అత్యంత సూక్ష్మగ్రాహకాలైన మైక్రోఫోన్స్‌తో రికార్డు చేస్తారు. అరుపులకు నటీనటులు డబ్బింగ్ చెప్పడం వల్ల వాళ్ల గొంతు పాడయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ స్థాయిలో వాళ్ల గొంతు ఉండకపోవచ్చు. అలాంటప్పుడే పెల్డన్లాంటివాళ్ల గొంతును వాడుకుంటారు సినిమా వాళ్లు. అరుపుల్లో పెల్డన్ నైపుణ్యాన్ని చిన్నవయసులోనే కనిపెట్టారు తల్లిదండ్రులు. ఏడేళ్ల వయసులోనే కోపగొండి బాలికగా అవకాశం దక్కించుకుంది. బాల్యంలోనే వేధింపులకు గురైన బాలిక నిజజీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో... ఆ బాలిక పాత్ర గట్టిగా కీచుమని అరుస్తూ ఉంటుంది. అదే ఆమెకు కెరీర్‌ను నిలబెట్టింది. అదేమంత గొప్పపని... గట్టిగా అరిచేస్తే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ భయంవేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆవేశంతో, సంతోషం ఎక్కువైనప్పుడు, ఏదైనా సాధించినప్పుడు.. ఇలా రకరకాల అరుపులుంటాయి. ప్రత్యేకించి నొప్పితో, బాధ కలిగినప్పుడు... వచ్చే అరుపులు చాలా కష్టమైనవి. ఒక్కోసారి వరుసగా కొన్నిగంటలపాటు అరవాల్సి వస్తుం ది. అవన్నీ అవలీలగా చేసేస్తుంది పెల్డన్. అదెలా అంటే... ‘చిన్న కీటకాన్ని చూసినా నేను గట్టిగా మొత్తుకుంటా. నాకది సహజంగా వచ్చింది’ అని చెబుతుంది. 20 ఏళ్లొచ్చేసరికి చాలా సినిమాలు, టీవీ సిరీసులకు తన అరుపులను ఇచ్చేసిన పెల్డన్ ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్పేస్తోంది. -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి... వాడండి.. ఈ అరుపు మాత్రలు
Scream To Release Stress: డాక్టర్ రాసే మాత్రలు వేరు. మనం వాడుకోవాల్సిన మాత్రలు కూడా ఉంటాయి. అమెరికాలో స్త్రీలు ఇప్పుడు ‘స్క్రీమ్ గేదరింగ్స్’లో పాల్గొంటున్నారు. అంటే ఒక మైదానంలో చేరి పెద్ద పెద్దగా అరిచి తెరిపిన పడుతున్నారు. ఎందుకు? ఒత్తిడి దూరం చేసుకోవడానికి. మన దేశంలో కూడా కోవిడ్ వల్ల, కుటుంబ సభ్యుల అనారోగ్యాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల స్త్రీలు లోలోపల వొత్తిడి పేరబెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. డాబా మీదకో, గ్రౌండ్లోకో వెళ్లి ‘స్క్రీమ్’ చేయడం ఒత్తిడికి ఒక మందు. ‘లాఫింగ్ థెరపీ’లా ఈ థెరపీ ఇప్పుడు అవసరమే సుమా. సంప్రదాయ చైనీయ వైద్యంలో కొండ చిటారుకో, ఏదైనా ఏకాంత ప్రదేశానికో వెళ్లి పెద్ద పెద్దగా అరవడం కూడా ఒక ఆరోగ్య సాధనం అని నమ్ముతారు. చైనా సంగతేమో కాని అమెరికాలోని స్త్రీలు మా అసహనాన్ని పెద్దగా అరచి పారదోలుతాం అని ఇటీవల ఏదో ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్లోనో పార్క్‌లోనో ‘స్క్రీమ్ గేదరింగ్స్’ నిర్వహిస్తున్నారు. అంటే ఒక పదీ పదిహేను నిమిషాల సేపు పెద్దగా అరిచి తమ మనసులో, శరీరంలో ఉన్న అలజడిని తగ్గించుకోవడం అన్నమాట. దానికి కారణం గత రెండేళ్లుగా కోవిడ్ వారిపై ఏర్పరుస్తున్న ఒత్తిడిని వాళ్లిక సహించలేని స్థాయికి చేరడమే. కోవిడ్‌ను పూర్తిగా నిర్మూలించే వాక్సిన్ ఇంకా రాకపోవడం, వాక్సిన్ వేసుకున్నా దాని బారిన పడుతూ ఉండటం, చంటి పిల్లలకు ఇంకా వాక్సిన్ లేకపోవడం, కోవిడ్ వల్ల అందరూ ఇంట్లో ఉండిపోవాల్సి రావడం, ఉద్యోగాలు ఊడటం, రెట్టింపు పని చేయాల్సి రావడం... ఇవన్నీ పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా గూడు కట్టుకుని పోతున్నాయి. అవి అలాగే లోపల సాంద్రపడటం ప్రమాదం అని నిపుణులు అంటారు. వొత్తిడిని సాటివారితో పంచుకుని రిలీఫ్ పొందాలి. కాని సాటివారు కూడా అలాంటి వొత్తిడిలో ఉంటే ఏమిటి చేయడం. ‘పదండి... అందరం కలిసి అరుద్దాం’ అని అమెరికాలోని స్త్రీలు స్క్రీమ్ థెరపీని సాధన చేస్తున్నారు. అయితే ఈ అరుపులు ఇతరులు వినకపోవడమే మంచిది. పెద్దగా గట్టిగా అరిచే మనిషిని చూడటం, వినడం ఎదుటి వారికి ఆందోళన కలిగించవచ్చు. అందుకే వీలైనంత ఏకాంత ప్రదేశంలో వీటిని సాధన చేయడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. యోగాలో కూడా ‘జిబ్రిష్’ వంటివి సాధన చేయిస్తుంటారు. అంటే ఒక ఐదు పది నిమిషాలు గొంతులో నుంచి ఏ పిచ్చి అరుపులు వస్తే ఆ అరుపులను అలౌ చేస్తూ వెళ్లడం. దీని వల్ల సబ్కాన్షియస్ మైండ్‌లో గూడు కట్టుకుని ఉన్న గాఢమైన భావాలు వదిలిపోతాయని చెబుతారు. మరో పద్ధతి ‘ట్రీ షేక్’. అంటే ఒక చెట్టు గాలికి ఎలా గలగలలాడిపోతుందో అలా మూడు నాలుగు నిమిషాలు నిటారుగా నిలబడి ఒళ్లంతా గలగలలాడించాలి (కదిలించాలి). దాని వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు అంటారు. మన దేశంలో అమ్మలు, పెద్దవాళ్లు ఏదైనా ఒత్తిడి పెరగడం వల్ల గట్టిగా తిట్టడం, అరవడం చూస్తూ ఉంటాం. అది ఒక రకంగా స్ట్రెస్ నుంచి దూరమవడమే. ఎన్నో చేదు సంఘటనలు, అయిష్టమైన పరిణామాలు చూసిన స్త్రీలు ‘గయ్యాళి’ ముద్రతో ఉండటం కూడా మన సమాజంలో ఉంది. నిజానికి అదంతా లోపలి ఒత్తిడికి ఒక బయటి ప్రతిఫలనం. ఆ ఒత్తిడి ఏమిటో కనుక్కుని దూరం చేయగలిగితే వారు కూడా శాంత స్వభావులు అవుతారు. గత రెండేళ్లుగా ఇళ్లల్లో ఉగ్గ పట్టుకుని ఉన్న స్త్రీలు ఏ మేరకు ఒత్తిడిలో ఉన్నారో కుటుంబం మొత్తం పట్టించుకోవాలి. ఇవాళ రేపూ అంటూ కోవిడ్ ముగింపు వాయిదా పడే కొద్దీ వారి మనసులో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయో కూడా పరిశీలిస్తూ ఉండాలి. వారు విసుక్కుంటూ ఉంటే, ఒక్కోసారి పని వైముఖ్యం చూపుతుంటే కుటుంబం సంపూర్ణంగా ఆ మూడ్స్‌ను అర్థం చేసుకోవాలి. మగవాళ్లు స్ట్రెస్‌ను తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. వారికి కనీసం బయట ఒకరిద్దరు స్నేహితులను కలిసే వీలు ఉంటుంది. స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యే అనివార్య పరిస్థితులు ఈ రెండేళ్లలో వచ్చాయి. అందుకే వారి మానసిక ఆరోగ్యం కూడా శ్రద్ధ పెట్టక తప్పదు. మంచి నిద్ర, ఉల్లాసం, ఆశావహమైన భవిష్యత్తు కనిపించకనే తాము పార్కుల్లో చేరి కేకలేస్తున్నాం అంటున్నారు అమెరికా వనితలు. ‘మా మీద మేము అరుచుకోలేము. కుటుంబం మీద అరవలేము. పిల్లల చదువు సరిగ్గా సాగకపోవడం మాకు చాలా వొత్తిడి కలిగిస్తోంది. వాళ్ల మూడ్స్ కూడా మాకు కష్టమే. మాకు వొత్తిడిగా ఉంది. అందుకే ఏడ్చి తెప్పరిల్లే బదులు అరిచి తెరిపిన పడుతున్నాం’ అని బోస్టన్‌లో స్క్రీమ్ థెరపీలో పాల్గొన ఒక గృహిణి అంది. ‘కోపం పోవడానికి పంచింగ్ బ్యాగ్‌ను పంచ్ చేయడం ఎలాగో ఒత్తిడి పోవడానికి ఇలా పెద్దగా అరవడం అలాగా’ అని కొందరు నిపుణులు అంటున్నారు. యుద్ధ సైనికుడు గెలుపు నినాదం ఇచ్చినట్టు, కుంగ్‌ఫూ ఫైటర్ పంచ్ ఇచ్చే ముందు అరిచినట్టు, కింగ్ కాంగ్ శత్రువు మీద దాడి చేసే ముందు గుండెలు చరుచుకున్నట్టు మామూలు మనుషులు కూడా ఏదో ఒక పార్కులో చేరి తమ లోపల ఉన్న ఒత్తిడి అనే శత్రువును ఈ పద్ధతుల్లో ఓడించవచ్చని నిపుణులు అంటున్నారు. స్క్రీమ్ థెరపీ వల్ల ప్రయోజనం ఎలా ఉన్నా దాని వంకతో తమ లాంటి కొంతమంది స్త్రీలతో ఏదో ఒక మేరకు కొత్త స్నేహం, సంభాషణ కూడా ఒత్తిడి తగ్గిస్తాయి. కాబట్టి కొత్త మార్గాలు వెతకండి. ఆరోగ్యంగా ఉండండి. ఒత్తిడిని ఒంట్లో నుంచి ఖాళీ చేయండి. -
వైరల్: అమ్మో ఇంజక్షన్! గట్టిగా కేకలు, రచ్చ చేసిన మహిళ
కోవిడ్‌ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. యువత నుంచి పండు ముసలి వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్ వేసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ అనంతరం స్వల్ప అనారోగ్యానికి గురవుతుండంతో కొంతమంది భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో టీకా తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే సూదులంటే భయపడేవారు వ్యాక్సిన్ వేయించుకునే సమయంలో వ్యాక్సినేషన్ సెంటర్లో భయంతో నానా హంగామా చేస్తున్నారు. తాజాగా టీకా కేంద్రంలో కూర్చున్న ఓ మహిళా రచ్చ రచ్చే చేసింది. వ్యాక్సిన్ వేయించుకుంటుండగా గట్టిగట్టిగా అరుస్తూ కేకలు వేసింది. నర్సు మహిళ వద్దకు వస్తుంటే ఎక్కువ అరవడం ప్రారంభించింది. ఇక ఆమెను ఆపేందుకు ఇద్దరు మనుషులు కావాల్సి వచ్చింది. చివరికి నర్సు టీకా వేసింది. కాగా ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘నాకు కూడా ఇంజక్షన్ అంటే భయం.. నేనూ ఇలాగే ఏడ్చేదాన్ని.’ అంటూ కామెంట్ పెడుతున్నారు. మరికొంతమందేమో.. ‘ఇంజక్షన్‌కే ఇంత భయమా, చిన్న పిల్లల కంటే ఎక్కవ అరుస్తుంది’ అంటున్నారు. చదవండి: ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టిన ప్రియురాలు ఒక ఎండ్రికాయ.. ఐదు సింహాలు రౌండప్.. ఆ తర్వాత #VaxPhobia 😢😢😢😢😢😢HUMOUR again...☺️☺️☺️😊☺️ Perhaps she would have more pain where others "held" her than at PRICK. pic.twitter.com/0W3yvkQrtg — Rupin Sharma IPS (@rupin1992) June 29, 2021 -
ఆ ఒంటెల కథ
అది 1606 సంవత్సరం. డచ్ అన్వేషకుడు విలియమ్ జాన్స్జూన్ మొదటిసారిగా ఆస్ట్రేలియా దేశాన్ని కనుగొన్న యూరోపియన్‌గా చరిత్రకెక్కాడు. అప్పట్లో ఆ దేశంలో ఆయనకి ఒక్క ఒంటె కూడా కనిపించలేదు. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం 2020 సంవత్సరం. ఒంటెలతో విసిగి వేసారిపోయిన ఆస్ట్రేలియా వాటిని సామూహికంగా కాల్చి చంపే ఆపరేషన్ చేపట్టింది. అయిదు రోజుల్లోనే 10వేలకు పైగా మూగజీవాలను హెలికాప్టర్ నుంచే కాల్చి చంపేసింది. అసలు ఆ ఒంటెలు ఎలా వచ్చాయి ? ఎందుకు వచ్చాయి ? మెల్బోర్న్: కార్చిచ్చులతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియాలో ఒంటెల హనన కాండ ప్రపంచ దేశాల గుండెల్ని పిండేస్తున్నాయి. కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ఆస్ట్రేలియా తమకు ఈ ఒంటెలు మోయలేని భారంగా మారాయంటూ హెలికాప్టర్ల నుంచి గురి చూసి కాల్చి చంపేస్తోంది. వివిధ దేశాలకు చెందిన జంతు ప్రేమికులు ఆస్ట్రేలియా ప్రభుత్వం చేస్తున్న పనిని తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ ఆ దేశం వినిపించుకునే స్థితిలో లేదు. దానికి కారణం ఒంటె అక్కడి స్థానిక జంతువు కాదు. అదీ వలస జంతువే. భారత్ సహా ఎన్నో దేశాల నుంచి ఆస్ట్రేలియా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలనలోనే ఉండేది. అప్పట్లో బ్రిటీషియన్లు తమ రవాణా సౌకర్యాల కోసం ఈ ఒంటెల్ని వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గం ద్వారా తీసుకువచ్చారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పొడి వాతావరణం కలిగిన ప్రాంతం. ఆ వాతావరణంలో గుర్రాలు సరిగ్గా పరిగెత్తలేకపోయేవి. కానీ ఒంటెలు అలా కాదు. అలాంటి వాతావరణమే ఒంటెలకు అనుకూలం. అంతేకాదు రెండు, మూడు వారాలు నీళ్లు తాగకపోయినా ఒంటెలు ప్రయాణించగలవు. అందుకే బ్రిటిష్ పాలకులు ఒంటెల్ని తీసుకురావాలని అనుకున్నారు. 18వ శతాబ్దంలో మొదటిసారి భారత్, అఫ్గానిస్తాన్, అరబ్ దేశాల నుంచి ఒంటెల్ని తెచ్చారు. స్థానిక రవాణా అవసరాల కోసం ఒంటెల్ని వినియోగించేవారు. అలా అలా ఆ ఒంటెలు ఆస్త్రేలియన్ల జీవనవిధానంలో ఒక భాగమైపోయాయి. అనూహ్యంగా పెరిగిపోయిన సంతతి 19వ శతాబ్దంలో రవాణా అవసరాల కోసం మోటార్ వాహనాలపై ఆధారపడ్డాక ఒంటెల అవసరం ప్రజలకి తీరిపోయింది. దీంతో వాటిని పెంచడం మానేశారు. ఆ ఒంటెలు చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్లిపోయాయి. ఆస్ట్రేలియా వాతావరణం ఒంటెలు పెరగడానికి అనుకూలంగా ఉండడంతో వాటి సంతతి విపరీతంగా పెరిగిపోయింది. 1969లో కేవలం 20 వేలు మాత్రమే ఉండే ఒంటెలు, 1988 నాటికి 43 వేలకి చేరుకున్నాయి. 2001–08 మధ్య కాలంలో వాటి సంఖ్య ఏకంగా 10 లక్షలకు చేరుకుంది. ఒంటెలు పెరిగిపోతూ ఆహారం కోసం, నీళ్ల కోసం జనావాసాలపై పడడం, పంటపొలాల్ని నాశనం చేస్తూ ఉండడంతో ఆస్త్రేలియా ప్రభుత్వం ఒంటెల్ని చంపే కార్యక్రమం చేపట్టింది. 2012లో ఏకంగా ఏడాదికి 75 వేల ఒంటెల్ని కాల్చేసింది. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో ఆహారానికి, నీటికి కటకటగా ఉంది. అందుకే వాటిని చంపేయడమే పనిగా పెట్టుకుంది ఆస్ట్రేలియా. అలా వాటి సంఖ్యను తగ్గించుకుం టూ వస్తోంది. పాపం ఆ మూగజీవాలు, అప్పుడెప్పుడో వలస పాలకులు తమ అవసరం కోసం చేసిన పని ఇప్పుడు వాటికి పెనుశాపమైంది. ► ప్రస్తుతం ఒంటెల సంఖ్య: దాదాపు 3 లక్షలు ► ఆక్రమించిన ప్రాంతం: ఆస్ట్రేలియా భూభాగంలో 37 % ► కలిగిస్తున్న నష్టం: పంట పొలాల ధ్వంసం, సాంస్కృతిక, చారిత్రక కట్టడాల విధ్వంసం, ఒంటెల సంతతి పెరిగిపోతూ ఉండడంతో దెబ్బ తింటున్న జీవ వైవిధ్యం ► దేశానికి కలిగిస్తున్న నష్టం: ఏడాదికి కోటి డాలర్ల నష్టం -
అల్లరి చేస్తోందని వాతలు
ఓ తల్లి ఘాతుకం బాపూజీనగర్‌లో ఘటన బంజారాహిల్స్: అల్లరి చేస్తున్న చిన్నారిని లాలించి.. బుజ్జగించాల్సిన తల్లే రాక్షసిలా మారింది... కన్నబిడ్డ అనే కనికరం లేకుండా గరిటెతో వాతలు పెట్టింది. తీవ్రగాయాలకు గురైన ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్పీఆర్ హిల్స్ బాపూజీనగర్‌లో నివసించే వాణి, ఆంజనేయులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మద్యానికి బానిసైన భర్త ఇంటికి రాకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో వాణి ఓ ఇంట్లో పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. పెద్ద కూతురు సోని (5) ఇదే బస్తీలో అంగన్వాడి కేంద్రంలో చదువుతోంది. ఈ చిన్నారి ఎక్కువగా అల్లరి చేస్తుంది. చుట్టుపక్కల చిన్నారులతో ఆడుకొనే సమయంలో తన కొంటెతనాన్ని చూపించి తల్లికి తలనొప్పి తెస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి సోనిని రోజూ దండిస్తోంది. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం తల్లి దిండు కింద దాచిన రూ. 100ను సోని తీసుకొని సమీపంలోని షాపులో తినుబండారాలు కొనుక్కుంది. తనకు తెలియకుండా డబ్బులు తీసుకుందని, రోజు రోజుకూ కూతురు అల్లరి ఎక్కువైందనే కోపం.. భర్త ఇంటిపట్టున ఉండటం లేదన్న బాధ.. ఈనేపథ్యంలో సహనం కోల్పోయిన వాణి సోమవారం ఉదయం గరిటెను బాగా కాల్చి చిన్నారి సోని కాళ్లు, చేతులు, కడుపు, బుగ్గలపై రెండువైపులా వాతలు పెట్టింది. చిన్నారి పెద్దగా ఏడుస్తూ బయటకు పరుగు తీయబోగా... లోపలి నుంచి గడియపెట్టి మళ్లీ వాతలు పెట్టింది. దీంతో చిన్నారి కుప్పకూలిపోయింది. వెంటనే వాణి కూతురిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి.. ఇంట్లోనే బంధించింది. చిన్నారి పరిస్థితి చూసి చలించిన స్థానికులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మీడియా పోలీసుల సహకారంతో బాలికకు విముక్తి కలిగించారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తల్లిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అత్యంత దారుణం: బాలాల హక్కుల సంఘం సిటీబ్యూరో: చిన్నారి సోనిపై తల్లి వాతలు పెట్టిన ఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తల్లిదండ్రలే కన్న బిడ్డను హింసించడం అత్యంత దారుణమని సంఘం అధ్యక్షురాలు అనురాధరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు త్వరగా విచారణ జరిపి శిక్ష విధిస్తే మరొకరు నేరం చేయరని ఆమె పేర్కొన్నారు.