The second T-20
-
ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఉతికేశాడు
-
మరోసారి ఆఖరి బంతికే
⇔గుణరత్నే మెరుపు బ్యాటింగ్ ⇔ రెండో టి20లో ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం గీలాంగ్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లోనూ శ్రీలంక జట్టు మరోసారి ఆఖరి బంతికే నెగ్గింది. తొలి మ్యాచ్‌లాగే ఈసారీ అసేల గుణరత్నే (46 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరి లోకి దిగిన లంక తొలి ఐదు ఓవర్లలోనే 41 పరుగులకు ఐదు వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితిలో బరిలోకి దిగిన గుణరత్నే మిగతా 15 ఓవర్లలో తన అసమాన బ్యాటింగ్‌తో లంకకు రెండు వికెట్ల తేడాతో గెలుపునందించి ఆసీస్ ఆటగాళ్లను షాక్‌కు గురి చేశాడు. చివరి రెండు ఓవర్లలో 36 పరుగులు కావాల్సిన దశలో ఐదు బంతుల్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 22 పరుగులు రాబట్టాడు. ఇక ఆఖరి ఓవర్లో 14 పరుగులు రావాల్సి ఉండగా తొలి బంతికే కులశేఖర (12) అవుటయ్యాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో ఫోర్, సిక్స్‌తో పాటు చివరి బంతికి రెండు పరుగులు రావాల్సి ఉండగా మరో ఫోర్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో మూడు టి20ల సిరీస్‌ను లంక 2–0తో మరో మ్యాచ్ ఉండగానే దక్కించుకుంది. బుధవారం అడిలైడ్‌లో చివరి మ్యాచ్ జరుగుతుంది. ఆసీస్ గడ్డపై తమ చివరి ఐదు టి20ల్లోనూ లంకకు పరాజయం లేకపోవడం విశేషం. అంతకుముందు ఆసీస్ 20 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హెన్రిక్స్ (37 బంతుల్లో 56; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), క్లింగర్ (37 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్స్కోరర్లు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కులశేఖర నాలుగు, మలింగ.. బండారులకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 176 పరుగులు చేసి నెగ్గింది. కపుగెడెర (32 బంతుల్లో 32; 4 ఫోర్లు) సహకారం అందించాడు. -
కసితీరా కొట్టారు
► రెండో టి20లో భారత్ ఘన విజయం ► రాణించిన ధావన్, రోహిత్, రైనా ► పెరీరా ‘హ్యాట్రిక్’ వృథా ► మూడో మ్యాచ్ రేపు వైజాగ్‌లో తొలి టి20లో ఘోర ఓటమి కసి పెంచిందేమో... భారత క్రికెటర్లు రెచ్చిపోయారు. వికెట్ కాస్త ఫ్లాట్‌గా కనిపించగానే వీర బాదుడు బాదేశారు. ఇక తమ శైలికి సరిగ్గా సరిపోయే పిచ్‌పై భారత స్పిన్నర్లూ పండగ చేసుకున్నారు. వెరసి... శ్రీలంకను కసితీరా కొట్టారు. రెండో టి20లో ఏకంగా 69 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి టి20 రేపు విశాఖపట్నంలో జరుగుతుంది. రాంచీ: సొంతగడ్డపై తమ బ్యాటింగ్ బలాన్ని చూపెట్టిన భారత్... ప్రతీకార మ్యాచ్‌లో రెచ్చిపోయింది. శిఖర్ ధావన్ (25 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరుకు, రోహిత్ శర్మ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్సర్) అండగా నిలవడంతో... శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 69 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రైనా (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది. కపుగెడెర (27 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. చండిమల్ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు), షనక (18 బంతుల్లో 27; 3 సిక్సర్లు) మోస్తరుగా ఆడారు. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరి టి20 ఆదివారం వైజాగ్‌లో జరుగుతుంది. ధావన్ జోరు భారత్‌కు రోహిత్, ధావన్ చక్కని శుభారంభం ఇచ్చారు. తొలి బంతిని రోహిత్ బౌండరీకి తరలిస్తే.. తర్వాతి రెండు ఓవర్లలో ధావన్ రెండు సిక్సర్లు బాదాడు. నాలుగో ఓవర్లో రజిత నాలుగు ఫోర్లు సమర్పించుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 70 పరుగులు చేసింది. అయితే 22 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్‌ను ఏడో ఓవర్లో చమీరా అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రహానే, రోహిత్ మంచి సమన్వయంతో ఆడినా.. లంక బౌలర్లు కుదురుకోవడంతో పరుగుల వేగం తగ్గింది. 12వ ఓవర్లో రోహిత్ ఒక్క సిక్సర్ బాదితే... తర్వాతి ఓవర్లో రహానే ఓ రెండు ఫోర్లతో అలరించాడు. అయితే ఆరు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు అవుట్‌కావడంతో భారత్ స్కోరు 127/3గా మారింది. ఈ దశలో రైనా, పాండ్యాల జోరుతో స్కోరు బోర్డు కదం తొక్కింది. 17వ ఓవర్లో పాండ్యా రెండు సిక్సర్లు, తర్వాతి ఓవర్లో రైనా నాలుగు ఫోర్లతో చెలరేగాడు. కానీ 19వ ఓవర్లో పెరీరా మ్యాజిక్ చేశాడు. వరుసగా మూడు బంతుల్లో పాండ్యా, రైనాతో పాటు యువరాజ్ (0)నూ అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. రైనా, పాండ్యా నాలుగో వికెట్‌కు 4.2 ఓవర్లలో 59 పరుగులు జత చేశారు. చివర్లో ధోని (9 నాటౌట్), జడేజా (1 నాటౌట్) ఓ మాదిరిగా ఆడారు. పెరీరా 3, చమీరా 2 వికెట్లు తీశారు. చకచకా వికెట్ల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లంకేయులు ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేదు. ఓపెనర్లు గుణతిలక (2), దిల్షాన్ (0), ప్రసన్న (1)లు స్వల్ప వ్యవధిలో అవుట్‌కావడంతో లంక 16 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. చండిమల్, కపుగెడెరా నిలకడగా ఆడినా భారీ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలమయ్యారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించాక వరుస బంతుల్లో అవుటయ్యారు. దీంతో లంక 68 పరుగులకు సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సిరివర్ధన (28 నాటౌట్), షనక భారీ షాట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ యువరాజ్, జడేజాలు నాణ్యమైన బంతులతో ఈ ఇద్దరినీ నిలువరించారు. ఆరో వికెట్‌కు 48 పరుగులు జత చేశాక షనక అవుటయ్యాడు. ఆ తర్వాత మరో మూడు పరుగుల వ్యవధిలో పెరీరా (0), సేననాయకే (0), చమీరా (0)లు అవుట్ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. అశ్విన్ 3, నెహ్రా, జడేజా, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు. ‘భారత క్రికెట్లో ప్రయోగాలు అనే మాటను నిషేధించాం. టాప్ ఆర్డర్లో అందరూ నిలకడగా ఆడుతున్నారు. కాబట్టి మిగిలిన వాళ్లకి అవకాశాలు కల్పించాలని అనుకున్నాం. ఈ మ్యాచ్ లో అందరూ అన్ని విభాగాల్లో రాణించారు.’ - ధోని స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) చమీరా 43; ధావన్ (సి) చండిమల్ (బి) చమీరా 51; రహానే (సి) దిల్షాన్ (బి) సేననాయకే 25; రైనా (సి) చమీరా (బి) పెరీరా 30; హార్దిక్ పాండ్యా (సి) గుణతిలక (బి) పెరీరా 27; ధోని నాటౌట్ 9; యువరాజ్ (సి) సేననాయకే (బి) పెరీరా 0; జడేజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-75; 2-122; 3-127; 4-186; 5-186; 6-186. బౌలింగ్: రజిత 4-0-45-0; పెరీరా 3-0-33-3; సేననాయకే 4-0-40-1; చమీరా 4-0-38-2; ప్రసన్న 3-0-21-0; సిరివర్ధన 1-0-6-0; షనక 1-0-12-0 శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) ధోని (బి) నెహ్రా 2; దిల్షాన్ (స్టంప్) ధోని (బి) అశ్విన్ 0; ప్రసన్న (సి) యువరాజ్ (బి) నెహ్రా 1; చండిమల్ (స్టంప్) ధోని (బి) జడేజా 31; కపుగెడెర (సి) పాండ్యా (బి) జడేజా 32; సిరివర్ధన నాటౌట్ 28; షనక (సి) రైనా (బి) అశ్విన్ 27; పెరీరా (సి) రహానే (బి) అశ్విన్ 0; సేననాయకే ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 0; చమీరా (బి) బుమ్రా 0; రజిత నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-2; 2-3; 3-16; 4-68; 5-68; 6-116; 7-117; 8-119; 9-119. బౌలింగ్: అశ్విన్ 4-0-14-3; నెహ్రా 3-0-26-2; యువరాజ్ 3-0-19-0; జడేజా 4-0-24-2; రైనా 2-0-22-0; బుమ్రా 3-0-17-2; పాండ్యా 1-0-5-0. -
సమం చేయాల్సిందే
►నేడు రెండో టి20 మ్యాచ్ ►ఒత్తిడిలో భారత్ ►ఓడితే సిరీస్ గల్లంతు ►ఉత్సాహంగా శ్రీలంక తొలి టి20 మ్యాచ్‌లో అనూహ్య ఓటమి భారత్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఈ పరాజయంతో వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా సొంతగడ్డపై జరగబోయే వరల్డ్ కప్‌కు ముందు ద్వితీయ శ్రేణి లంక జట్టుతో సిరీస్ ఓడితేఅదిఅవమానకరమే.కాబట్టిదానితప్పించుకోవాలంటే ముందు పోటీలో నిలవాలి. అందుకు రెండో మ్యాచ్‌లోనే తమదైన శైలిలో చెలరేగాలి. మన స్టార్లు స్థాయికి తగినట్లుగా ఆడితే విజయం కష్టం కాబోదు... కానీ మరోసారి ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే మాత్రం గత ఫలితం పునరావృతం అవుతుంది. రాంచీ: ఐపీఎల్లో మున్ముందు సొంత మైదానం కానున్న పుణే ధోనికి పరాజయభారం మిగిల్చింది. ఇక తన సొంత ఊరిలో దానికి అతను మందు రాయాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు (శుక్రవారం) జరిగే రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి మ్యాచ్ ఓడి సిరీస్‌లో ఇప్పటికే వెనుకబడిన టీమిండియా ఇది గెలిస్తేనే సిరీస్‌లో అవకాశం మిగిలి ఉంటుంది. మళ్లీ ఓడితే మాత్రం భారత గడ్డపై జట్టుకు వరుసగా రెండో సిరీస్ పరాజయం ఖాతాలో పడుతుంది. మరో వైపు తొలి గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో శ్రీలంక కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే జోరులో మళ్లీ ఇండియాను కంగు తినిపించాలని వారు పట్టుదలగా ఉన్నారు. మార్పులు ఉంటాయా..? ‘అందరికీ బ్యాటింగ్ అవకాశం రావడం మంచిదే’ అంటూ తొలి మ్యాచ్ తర్వాత కెప్టెన్ ధోని వ్యాఖ్యానించాడు. అయితే అందరూ ఆడటంతో మన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలంపై కూడా ఒక అంచనా వచ్చింది. ఆల్‌రౌండర్లు పాండ్యా, జడేజా ఇంకా కుదురుకోవాల్సి ఉందని అర్థమైంది. వరల్డ్‌కప్‌లోగా ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయని కెప్టెన్ నమ్మకంగా చెబుతున్నాడు. మరి ఇదే జట్టును ఈ మ్యాచ్ కోసం కొనసాగిస్తారా లేక మార్పులు చేసి మరొకరిని పరీక్షిస్తారా చూడాలి. బ్యాటింగ్ ఆర్డర్లో దీనికి పెద్దగా అవకాశం లేదు గానీ జడేజా స్థానంలో నేగిని ఆడించే అవకాశం ఉంది. అశ్విన్ ఆల్‌రౌండ్ నైపుణ్యం కూడా జట్టుకు బలంగా మారడంతో హర్భజన్ ఈసారి కూడా డగౌట్‌కే పరిమితం. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు సమర్పించుకున్న గత మ్యాచ్ అనుభవంతో మన ప్రధాన బ్యాట్స్‌మెన్ ఈ సారి కాస్త జాగ్రత్తపడతారు. టాప్-4 రోహిత్, ధావన్, రహానే, రైనా చెలరేగితే జట్టుకు తిరుగుండదు. వీరే మ్యాచ్ దిశను నిర్ణయించగలరు. మరో వైపు వ్యక్తిగతంగా బ్యాటింగ్ ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్న ధోని కూడా తన బ్యాట్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. పుణే వైఫల్యం అరుదుగా జరిగేవాటిలో ఒకటి. కాబట్టి దానిని పట్టించుకోకుండా సహజశైలిలో ఆడితే భారత్‌ను ఆపడం లంక బౌలర్లకు కష్టంగా మారుతుంది. దిల్షాన్‌కు చోటు గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన సీనియర్ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ రెండో టి20కి అందుబాటులోకి వచ్చాడు. అతని స్థానంలో ఆడిన కీపర్ డిక్వెలా లేదా స్పిన్నర్ ప్రసన్నలలో ఒకరిని తుది జట్టునుంచి తప్పిస్తారు. ఇది మినహా స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన యువ జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. పేస్ పిచ్‌పై తొలి మ్యాచ్‌లో రజిత, చమీరా, షనక చెలరేగిపోయారు. సాధారణంగా బ్యాటింగ్ వికెట్ అయిన రాంచీలో అంతగా అనుకూలించకపోయినా గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ ముగ్గురు మరోసారి మెరుగైన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాట్స్‌మెన్ కూడా ఒత్తిడి గురయ్యారు. అయితే దిల్షాన్ రాకతో వారి బ్యాటింగ్ కాస్త పటిష్టంగా మారింది. చండీమల్, కపుగెదెర దూకుడుగా ఆడగల సమర్థులు. సిరివర్దన, తిసార పెరీరా కూడా మంచి హిట్టర్లు. భారత జట్టుతో పోలిస్తే అనుభవం తక్కువగా ఉన్నా... ఒకటి, రెండు ఓవర్లలో మ్యాచ్ ఫలితం మారిపోయే ఫార్మాట్లో లంక ఆటగాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తుది జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రైనా, యువరాజ్, జడేజా/నేగి, అశ్విన్, నెహ్రా, బుమ్రా. శ్రీలంక: చండీమల్ (కెప్టెన్), డిక్వెలా/దిల్షాన్, గుణతిలక, కపుగెదెర, సిరివర్దన, షనక, ప్రసన్న, తిసార, సేననాయకే, రజిత, చమీరా. పిచ్, వాతావరణం రాంచీలో గతంలో టి20 మ్యాచ్ జరగలేదు. కానీ వన్డేల్లో భారీ స్కోర్లు వచ్చాయి. పొడిగా, బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అయితే హడావిడిగా వేదిక మార్చడంతో మైదానం పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి పిచ్ అనూహ్యంగా స్పందించవచ్చు కూడా. వాతావరణం బాగుంది. వర్షసూచన లేదు. పరిస్థితులను తొందరగా అంచనా వేయడమే కీలకం. గత మ్యాచ్ పొరపాటును ఇక్కడ పునరావృతం కానీయం. మైదానంలోకి దిగిన తర్వాతే ఎంత స్కోరు సరిపోతుందనేది చెప్పగలం. వరల్డ్‌కప్‌కు ముందు అందరు ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. ఎలాంటి పిచ్‌పైనైనా ఆటగల సామర్థ్యం భారత జట్టుకు ఉంది’ -రవిశాస్త్రి, టీమ్ డెరైక్టర్