Second T20 match
-
భారత కుర్రాళ్ల జోరు.. బంగ్లా పులుల బేజారు (ఫోటోలు)
-
ఆల్‌టైమ్ పర్ఫెక్ట్ టీ20 మ్యాచ్.. డజన్‌కు పైగా రికార్డులు బద్దలు
సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న (మార్చి 26) జరిగిన రసవత్తర మ్యాచ్ పొట్టి ఫార్మాట్లో పర్ఫెక్ట్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. హోరీహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా పరుగులు సాధించడంతో పాటు అదే స్థాయిలో రికార్డులు కూడా కొల్లగొట్టారు. ఇరు జట్ల ధాటికి నిన్నటి మ్యాచ్‌లో డజన్‌కు పైగా రికార్డులు బద్దలయ్యాయి. ఆ రికార్డులేవంటే.. అంతర్జాతీయ టీ20ల్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్ (సౌతాఫ్రికా- 259 టార్గెట్) అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ అత్యధిక టీమ్ స్కోర్- 258/5 అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికా అత్యధిక టీమ్ స్కోర్- 259/4 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 517 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు- 81 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు- 35 అంతర్జాతీయ టీ20ల్లో బౌండరీల ద్వారా ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 394 వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 హండ్రెడ్- జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో) సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి- క్వింటన్ డికాక్ (15 బంతుల్లో) పవర్ ప్లే (6 ఓవర్లు)లో అత్యధిక టీమ్ టోటల్- 102/0 (సౌతాఫ్రికా) అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 200 పరుగులు పూర్తి చేసిన జట్టు (సౌతాఫ్రికా-13.5 ఓవర్లలో) మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు (సౌతాఫ్రికా-149) -
India vs Sri Lanka Womens 2nd T20: భారత్‌దే సిరీస్
దంబుల్లా: సమష్టి ఆటతీరుతో రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు సాధించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. పూజా వస్త్రకర్ బౌలింగ్‌లో ఆటపట్టు అవుటయ్యాక లంక పతనం మొదలైంది. చివరి ఆరు ఓవర్లలో లంక 38 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రకర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (34 బంతుల్లో 39; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (32 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) చివరిదాకా నిలిచి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. చివరిదైన మూడో టి20 సోమవారం జరుగుతుంది. -
IND Vs SA: క్లాసెన్ కొట్టేశాడు
కటక్: వరుసగా రెండోది పాయే! సిరీస్‌కు ముందు వరుసగా 12 టి20 మ్యాచ్‌ల్ని గెలిచిన టీమిండియా ఇప్పుడు సఫారీ సవాల్‌కు నిలువలేకపోతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పవర్‌కు తొలి టి20 మ్యాచ్‌ను సమర్పించుకున్న టీమిండియా... రెండో టి20లో సఫారీ బౌలింగ్ దెబ్బకు తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. సిరీస్‌ను నెగ్గాలంటే భారత్ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మిగతా వారిలో తొలుత ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. నోర్జే 2 వికెట్లు తీశాడు. తర్వాత దక్షిణాఫ్రికా ఆరంభంలో భువనేశ్వర్ (4–0–13–4) స్పెల్‌కు ఘోరంగా దెబ్బతిన్నా... తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (46 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులతో సులువుగానే గెలిచింది. సిరీస్‌లోని మూడో టి20 మ్యాచ్ రేపు విశాఖపట్నంలో జరుగుతుంది. పేలవ ఆరంభంతో... రుతురాజ్ (1)ను తొలి ఓవర్లోనే రబడ అవుట్ చేయడంతో మొదలైన భారత్ కష్టాలు ఆఖరి దాకా సాగాయి. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తనశైలి మెరుపులతో అలరించాడు. కానీ ఇది కాసేపే! 28 పరుగుల వద్ద పార్నెల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన కిషన్ దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. మరుసటి ఓవర్లోనే నోర్జే బౌలింగ్‌లో డీప్‌స్క్వేర్ లెగ్‌లో డసెన్‌కు క్యాచ్ ఇచ్చి అతను నిష్క్రమించాడు. తర్వాత చప్పగా సాగిపోతున్న ఇన్నింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ఓవర్లో 4, 6 కొట్టి ఊపు తెచ్చాడు. కానీ పదో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ రిషభ్ పంత్ (5)ను కేశవ్ మహరాజ్ బోల్తా కొట్టించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు కీలక వికెట్లను కోల్పోయి 71 పరుగులే చేసింది. కాస్త గ్యాప్ తర్వాత 13వ ఓవర్లో పార్నెల్ వేసిన ఇన్‌స్వింగర్ హార్దిక్ పాండ్యా (9) లెగ్వికెట్ను పడగొట్టేసింది. ప్రధాన వికెట్లన్నీ పడిపోయిన ఈ దశలో మరింత బాధ్యతగా ఆడాల్సిన శ్రేయస్ అయ్యర్ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల వికెట్ కీపర్ చేతుల్లోకి వెళుతున్న బంతిని టచ్ చేసి అవుటయ్యాడు. వంద పరుగుల్లోపే ఐదో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ ఆఖర్లో కొట్టిన షాట్లతో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది. రబడ, ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. ఆశలు రేపిన భువీ భారత్ చేసింది తక్కువే. సఫారీ ఛేదించాల్సిన లక్ష్యం సులువైందే! కానీ సీనియర్ సీమర్ భువనేశ్వర్ వైవిధ్యమైన బంతులతో తన ప్రతీ ఓవర్లో వికెట్ తీయడం భారత శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. ఓపెనర్ హెండ్రిక్స్ (4), టాపార్డర్ బ్యాట్స్ర్లు ప్రిటోరియస్ (4), డసెన్ (1)లను భువీ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 29 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ బవుమా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన క్లాసెన్ నాలుగో వికెట్‌కు 64 పరుగులు, తర్వాత మిల్లర్ (15 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లపై క్లాసెన్ చెలరేగిపోయాడు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో క్లాసెన్ రెండు ఫోర్లు, అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు... చహల్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో క్లాసెన్ రెండు సిక్స్‌లు బాదాడు. గెలుపు వాకిట క్లాసెన్, పార్నెల్ అవుటైనప్పటికీ డేవిడ్ మిల్లర్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) కేశవ్ (బి) రబడ 1; ఇషాన్ కిషన్ (సి) డసెన్ (బి) నోర్జే 34; శ్రేయస్ (సి) క్లాసెన్ (బి) ప్రిటోరియస్ 40; పంత్ (సి) డసెన్ (బి) కేశవ్ 5; హార్దిక్ పాండ్యా (బి) పార్నెల్ 9; అక్షర్ (బి) నోర్జే 10; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 30; హర్షల్ పటేల్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–3, 2–48, 3–68, 4–90, 5–98, 6–112. బౌలింగ్: రబడ 4–0–15–1, పార్నెల్ 4–0–23–1, నోర్జే 4–0–36–2, ప్రిటోరియస్ 4–0–40–1, షమ్సీ 2–0–21–0, కేశవ్ మహరాజ్ 2–0–12–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (బి) చహల్ 35; హెండ్రిక్స్ (బి) భువనేశ్వర్ 4; ప్రిటోరియస్ (సి) అవేశ్ (బి) భువనేశ్వర్ 4; డసెన్ (బి) భువనేశ్వర్ 1; క్లాసెన్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) హర్షల్ 81; మిల్లర్ (నాటౌట్) 20; పార్నెల్ (బి) భువనేశ్వర్ 1; రబడ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.2 ఓవర్లలో 6 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–5, 2–13, 3–29, 4–93, 5–144, 6–147. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–13–4, అవేశ్ ఖాన్ 3–0–17–0, హార్దిక్ పాండ్యా 3–0–31–0, చహల్ 4–0–49–1, హర్షల్ 3–0–17–1, అక్షర్ 1–0–19–0, శ్రేయస్ 0.2–0–2–0. -
భారత్‌కు మరో సవాల్
సీనియర్లు లేకపోయినా ఐపీఎల్ కారణంగా భారత ఆటగాళ్ల తాజా ఫామ్, సొంతగడ్డపై అనుకూలతలు చూస్తే దక్షిణాఫ్రికాపై మనదే పైచేయిగా కనిపించింది. కానీ తొలి మ్యాచ్‌లో 211 పరుగులు చేసి కూడా భారత్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. దాంతో ఒక్కసారిగా టి20 సిరీస్ ఆసక్తికరంగా మారిపోయింది. బౌలింగ్ వైఫల్యంతో గత మ్యాచ్‌లో ఓడిన టీమిండియా ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందా లేక సఫారీ తమ జోరు కొనసాగిస్తుందా చూడాలి. కటక్: ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు ప్రత్యర్థికి బదులిచ్చేందుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో టి20లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో మన బ్యాటర్లు అద్భుతంగా చెలరేగగా... బౌలర్లు ఆశించిన స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. దాంతో లోపాలు సరిదిద్దుకోవడంపై జట్టు దృష్టి పెట్టింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం కొత్త ఉత్సాహంతో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. మార్పుల్లేకుండానే... తొలి మ్యాచ్‌లో భారత్ టాప్–5 బ్యాటర్లంతా ఆకట్టుకున్నారు. ఇషాన్ కిషన్ శుభారంభం ఇవ్వగా, రుతురాజ్, శ్రేయస్ రాణించారు. ఆ తర్వాత పంత్ దూకుడుగా ఆడగా, హార్దిక్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. వీరంతా మరోసారి చెలరేగితే మళ్లీ భారీ స్కోరు ఖాయం. అయితే ఇంత స్కోరు తర్వాత కూడా ఓడటం బౌలింగ్ పరిమితులను తెలియజేసింది. అందరికంటే సీనియర్ అయిన భువనేశ్వర్ గతి తప్పగా, ఐపీఎల్లో చెలరేగిన హర్షల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అన్నింటికి మించి పంత్ కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కేవలం ప్రత్యర్థి తప్పులు చేస్తారని వేచి చూడటమే తప్ప... ఏ దశలోనూ అతను చురుకైన వ్యూహాలతో జట్టును నడిపించినట్లు కనిపించలేదు. మంచి ఫామ్‌లో ఉన్న చహల్‌తో పూర్తి కోటా ఓవర్లు వేయించకపోవడం అందులో ఒకటి. అయితే కోచ్ ద్రవిడ్ సిరీస్‌కు ముందు చెప్పినదాని ప్రకారం చూస్తే రెండో మ్యాచ్‌కే మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. అదనపు పేసర్‌తో... 212 పరుగుల లక్ష్యం అంటే హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరును దక్షిణాఫ్రికా గత మ్యాచ్‌లో ఏకపక్షంగా మార్చేసింది. మూడే వికెట్లు కోల్పోయి ఐదు బంతుల ముందే ఆట ముగించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఐపీఎల్లో జోరు ప్రదర్శించిన మిల్లర్ దూకుడైన ఆటతో తన విలువేమిటో చూపించగా, డసెన్ కూడా విజృంభించాడు. తొలి పోరులో విఫలమైనా... డికాక్, ప్రిటోరియస్ ప్రమాదకరమైన ఆటగాళ్లు. బౌలింగ్‌లో రెగ్యులర్ పేసర్లు రబడ, నోర్జే భారత బ్యాటర్లను కట్టడి చేయగలరు. గత మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షమ్సీ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు చిత్తు చేశారు. బరాబతి పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక స్పిన్నర్ స్థానంలో అదనంగా మరో పేసర్‌గా ఆడించాలని సఫారీ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మహరాజ్ స్థానంలో పేస్ బౌలర్లు ఇన్‌గిడి లేదా జాన్సెన్కు అవకాశం దక్కవచ్చు. పిచ్, వాతావరణం పరుగుల వరద పారిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఇక్కడి పిచ్ బౌలింగ్‌కు అనుకూలించవచ్చు. గతంలో జరిగిన రెండు టి20ల్లోనూ తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాతో ఇదే మైదానంలో 2015లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 92 పరుగులకే కుప్పకూలింది. తుది జట్లు (అంచనా): భారత్: పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, అవేశ్, చహల్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, ప్రిటోరియస్, వాన్ డర్ డసెన్, మిల్లర్, స్టబ్స్, పార్నెల్, రబడ, నోర్జే, షమ్సీ, ఇన్‌గిడి/జాన్సెన్. -
ఇది గెలిస్తే చాలు...
కోహ్లి సేన ఆసీస్ గడ్డపై మొదట కంగారు పడింది. తర్వాత సిరీస్ (వన్డే) కోల్పోయింది. భారీ స్కోర్లను సమర్పించుకుంది. క్యాచ్‌ల్ని జారవిడిచింది. కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అట్టిపెట్టుకుంది. అందుకే చివరి వన్డేలో ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్ వేసింది. తొలి టి20లో ఆల్‌రౌండ్ పంజా విసిరింది. ఇప్పుడు సిరీస్‌నే పట్టాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది. సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు నాలుగు జరిగాయి. తొలి రెండు వన్డేలు ఆసీస్ గెలిచింది. సిరీస్‌ను పట్టేసింది. తర్వాత భారత్ కూడా రెండు నెగ్గింది. ఆఖరి వన్డే సహా, తొలి టి20లో భారత్ ప్రతాపం చూపింది. గెలుపోటముల పరంగా సమమైనా... సిరీస్ ఫలితమే భారత్‌కు బాకీ ఉంది. అందుకే ఆతిథ్య జట్టులాగే కోహ్లి సేన కూడా ఆఖరిదాకా లాక్కెళ్లకుండా రెండో మ్యాచ్‌లోనే పొట్టి సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే రెండో టి20లో భారత్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్ విజయాల జోరులో ఉంటే... ఆస్ట్రేలియాను గాయాలు కలవరపెడుతున్నాయి. ధావన్, కోహ్లి రాణిస్తే... వన్డే సిరీస్‌లో రాణించిన ధావన్, కెప్టెన్ కోహ్లి టి20 మ్యాచ్‌లో విఫలమయ్యారు. రెండో మ్యాచ్‌లో వీళ్లిద్దరు బ్యాట్ ఝుళిపిస్తే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద ఖాయం. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు ఈ ఇద్దరు జతయితే భారత్ దర్జాగా ఓ మ్యాచ్ ఉండగానే సిరీస్ గెలుచుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మిడిలార్డర్లో మనీశ్ పాండే బ్యాటింగ్ గతి తప్పింది. దీంతో మార్పు చేయాలనుకుంటే శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం లభించొచ్చు. కానీ వన్డేల్లో అయ్యర్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. హార్దిక్ పాండ్యా గత మ్యాచ్‌లో తక్కువ పరుగులే చేసినా... అతని ఫామ్ ఆసీస్‌లో బాగుంది. ఇతను కూడా మెరిపిస్తే భారత్ స్కోరును నిలువరించడం ముమ్మాటికి అసాధ్యమే! జడేజా లోటు... తొలి టి20లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వేగవంతమైన ఇన్నింగ్సే భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించడమే కాకుండా బౌలర్లు పోరాడేందుకు అవకాశం కల్పించింది. కానీ గాయంతో అతను మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ముగియగానే పెవిలియన్ చేరాడు. ఇప్పుడైతే సిరీస్‌కే దూరమైన పరిస్థితి. బౌలింగ్‌లో అతని లోటును స్పిన్నర్ చహల్ భర్తీ చేసి ఉండవచ్చు. కానీ బ్యాటింగ్‌లో ఎవరుంటారనేది ప్రశ్నార్థకం. చహల్ పూర్తిగా బౌలర్. ఇతని కోసం ఓ బ్యాట్స్‌మన్ లోటు ఏర్పడుతుంది. దీన్ని టీమ్ మేనేజ్మెంట్ ఏలా అధిగమిస్తుందో చూడాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే ధారాళంగా పరుగులు సమర్పించుకున్న షమీ స్థానంలో బుమ్రాను దించే అవకాశాలున్నాయి. వాషింగ్టన్ సుందర్ స్పిన్‌తో కట్టడి చేశాడు. వీళ్లిద్దరు సిడ్నీలోనూ అదరగొడితే భారత్‌కు విజయం సులువవుతుంది. కంగారూ... కంగారూ... ఆతిథ్య జట్టును గత ఫలితం, సిరీస్ భయమే కాదు... గాయాలు పట్టి పీడిస్తున్నాయి. ఇదివరకే డాషింగ్ ఓపెనర్ వార్నర్ పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్ ఫించ్ ఫిట్నెస్ సమస్యలతో ఈ మ్యాచ్ ఆడే అవకాశాల్లేవు. అతను గైర్హాజరైతే తాత్కాలిక సారథ్యాన్ని మాథ్యూ వేడ్‌కు అప్పగించవచ్చు. కానీ దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ స్థానాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారు. వన్డేల్లో చెలరేగిన స్మిత్, మ్యాక్స్‌వెల్‌లను గత మ్యాచ్‌లో భారత బౌలర్లు తెలివిగా ఔట్ చేశారు. ఇదే ఆసీస్ ఫలితాన్ని మార్చేసింది. 56 పరుగులదాకా అజేయంగా సాగిన ఇన్నింగ్స్ తర్వాత్తర్వాత చతికిలబడింది. అయితే వేదిక మాత్రం ఆసీస్‌ను ఊరడిస్తుంది. ఇక్కడే జరిగిన తొలి రెండో వన్డేల్లో కంగారూ జట్టు జయభేరి మోగించింది. కాన్బెర్రా నిరాశపరిచినా... మళ్లీ సిడ్నీకి రావడంతో తిరిగి పుంజుకుంటామని ఆస్ట్రేలియా జట్టు ఆశిస్తోంది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, సామ్సన్, మనీశ్ పాండే/అయ్యర్, హార్దిక్ పాండ్యా, సుందర్, దీపక్ చహర్, నటరాజన్, బుమ్రా/షమీ, చహల్. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్)/డార్సీ షార్ట్, వేడ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, క్యారీ, అబాట్, స్టార్క్, స్వెప్సన్/లయన్, జంపా, హజల్‌వుడ్. పిచ్, వాతావరణం బ్యాటింగ్ అనుకూలమైన పిచ్. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు 300పైచిలుకు పరుగుల్ని అవలీలగా చేశాయి. ఇక ధనాధన్‌గా సాగే టి20 ఫార్మాట్లో అంతకుమించే ఉంటుంది. వర్షం బెడద లేదు. -
గెలుపు బోణీ ఎవరిది?
కొత్త ఏడాది టి20 పరుగుల వానతో మొదలు అవుతుందనుకుంటే అసలు వర్షం ఆ ఆశలను తుడిచి పెట్టేసింది. దాంతో మూడు మ్యాచ్‌ల పొట్టి పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆధిక్యంలో నిలిచేందుకు భారత్, శ్రీలంక సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్ గెలిస్తే ఇక సిరీస్ కోల్పోయే అవకాశం ఉండదు కాబట్టి బోణీ కోసం ఇరు జట్లు సై అంటున్నాయి. గువాహటితో పోలిస్తే ఇండోర్‌లో మెరుగైన వాతావరణం ఉండటం అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ఇండోర్: వరుసగా నాలుగో ఏడాది దేశంలో ‘స్వచ్ఛమైన నగరం’గా గుర్తింపు పొందిన వేదికపై క్రికెట్ సమరానికి భారత్, శ్రీలంక సన్నద్ధమయ్యాయి. టి20 సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడి హోల్కర్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దు కావడంతో తుది జట్లలో ఎలాంటి మార్పు లేకుండానే రెండు టీమ్‌లు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ధావన్ ఆటపైనే... రోహిత్ శర్మకు సహచరుడిగా ఇటీవల రాహుల్ రెండో ఓపెనర్ పాత్రలో అద్భుతంగా ఆడుతున్నాడు. అతను చెలరేగుతున్న తీరును బట్టి చూస్తే పక్కన పెట్టే అవకాశమే లేదు. దాంతో సీనియర్ శిఖర్ ధావన్ కెరీర్‌కు సంకటం ఎదురైంది. రోహిత్ విశ్రాంతితో ఈ సిరీస్‌లో ధావన్ అవకాశం దక్కించుకున్నాడు. తనలో ఇంకా టి20 సత్తా ఉందని అతను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో నిలిచాడు. ధావన్ ఇక ఈ ఫార్మాట్‌కు పనికి రాడంటూ మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ సహా పలువురి నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో... ధావన్ తన పూర్తి సత్తాను ప్రదర్శించాల్సిందే. కోహ్లి, అయ్యర్, పంత్, దూబేలతో దుర్బేధ్యంగా కనిపిస్తున్న భారత బ్యాటింగ్ గురించి ఏ రకమైన ఆందోళన అవసరం లేదు. గువాహటి మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్టులో మార్పులు చేయడానికి కోహ్లి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి బుమ్రా, శార్దుల్, సైనీ రూపంలో ముగ్గురు రెగ్యులర్ పేసర్లూ ఆడే అవకాశం ఉంది. మలింగ ఆపగలడా! ఎక్కువ మంది యువ, అనుభవం లేని ఆటగాళ్లతోనే ఉన్న శ్రీలంక జట్టు భారత్‌తో పోలిస్తే బలహీనంగానే కనిపిస్తోంది. కుశాల్ పెరీరా మినహా మిగతా బ్యాట్స్‌మెన్ టీమిండియాను ఎక్కువగా ఎదుర్కొన్నది లేదు. అవిష్క ఫెర్నాండో, గుణతిలక లాంటి ఓపెనర్లు బుమ్రాను ఏ మాత్రం ఎదుర్కోగలరో చూడాలి. ఒషాడా ఫెర్నాండో, రాజపక్స ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. అయితే ఇలాంటి స్థితిలోనూ లంక తమ కెప్టెన్, సీనియర్ మలింగపైనే ఆశలు పెట్టుకుంది. భారత్‌పై రికార్డు అంత గొప్పగా లేకపోయినా ఒక స్పెల్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం అతని సొంతం. మలింగ కెప్టెన్సీలో గత పది మ్యాచ్‌లలో శ్రీలంక ఒకటే గెలిస్తే దానికి ఆ మ్యాచ్‌లో అతని నాలుగు వికెట్ల ప్రదర్శనే కారణం. 2008 తర్వాత భారత్‌పై మూడు ఫార్మాట్లలో ఏ ద్వైపాక్షిక సిరీస్‌ను నెగ్గని శ్రీలంక... ఈ మ్యాచ్‌లో గెలిస్తే కనీసం సిరీస్ చేజార్చుకునే ప్రమాదం నుంచి తప్పుకుంటుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్, శివమ్ దూబే, సుందర్, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, సైనీ. శ్రీలంక: మలింగ (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, గుణతిలక, కుశాల్ పెరీరా, ఒషాడా ఫెర్నాండో, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వ, షనక, ఉడాన, హసరంగ, లాహిరు. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. చిన్న మైదానం కూడా. భారీ స్కోరుకు అవకాశం ఉంది. సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేసిన మ్యాచ్ సహా వన్డేల్లో ప్రతీసారి భారీ స్కోర్లే నమోదయ్యాయి. హోల్కర్ స్టేడియంలో ఒకే ఒక టి20 మ్యాచ్ సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్, శ్రీలంక మధ్య జరిగింది. రోహిత్ (118) సెంచరీ చేసిన నాటి మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశం లేదని స్థానిక వాతావరణ శాఖ సమాచారం. మంచు ప్రభావం కనిపించకుండా ప్రత్యేక తరహా రసాయనాన్ని నిర్వాహకులు వాడనున్నారు. -
సూపర్ షఫాలీ
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): టీనేజ్ క్రికెటర్ షఫాలీ వర్మ (35 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మళ్లీ మెరిసింది. వరుసగా రెండో టి20 మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ బౌలర్ల భరతం పట్టింది. ఫలితంగా ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌పై భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళలు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 103 పరుగులు చేసింది. షెడీన్ నేషన్ (32; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... భారత స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 4 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. 104 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన (28 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడైన ఆటకు భారత్ 10.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. విండీస్‌పై తొలి టి20లోనూ షఫాలీ వర్మ (49 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసిన సంగతి విదితమే. మూడో టి20 మ్యాచ్ ఈనెల 14న గయానాలో జరుగుతుంది. -
న్యూజిలాండ్‌దే రెండో టి20
వెల్లింగ్టన్: తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి న్యూజిలాండ్ జట్టు తేరుకుంది. రెండో టి20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని ఇంగ్లండ్‌పై 21 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఆదివారం జరిగిన ఈ రెండో టి20 మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు సాధించింది. గప్టిల్ (28 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నీషమ్ (22 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్రాండ్‌హోమ్ (12 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్స్‌లు), రాస్ టేలర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ మూడు వికెట్లు, స్యామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. మోర్గాన్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), మలాన్ (29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోర్డాన్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా కీలకదశలో అవుటవ్వడంతో ఇంగ్లండ్ లక్ష్యానికి దూరంగా నిలిచింది. న్యూజిలాండ్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సాన్ట్నెర్ (3/25) రాణించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ ఫీల్డర్ గ్రాండ్‌హోమ్ నాలుగు క్యాచ్‌లు తీసుకోగా... ఇంగ్లండ్ ఫీల్డర్లు ఆరు క్యాచ్‌లను నేలపాలు చేశారు. -
సెంచురియన్లో భారత్ ఓటమి
-
ఇంతకంటే ఘోరమైన స్థితిలో ఆడాం!
రెండో మ్యాచ్ రద్దుపై ధోని వ్యాఖ్య లాడర్‌హిల్ (ఫ్లోరిడా): సిరీస్ సమం చేసే అవకాశం ముందుండగా, వర్షం కారణంగా రెండో టి20 మ్యాచ్ రద్దు కావడం భారత కెప్టెన్ ధోనిని అసహనానికి గురి చేసింది. ఆట కొనసాగించి ఉండాల్సిందని అతను అభిప్రాయ పడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో ముందుగా విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ మాట్లాడుతూ ‘పెవిలియన్‌నుంచి చూస్తే రెండు మూడు చోట్ల మైదానం ప్రమాదకరంగా కనిపించింది. ముఖ్యంగా రనప్ ఏరియా వద్ద పరుగెత్తి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అవుట్‌ఫీల్డ్‌లో కూడా బంతి కోసం పరుగెత్తి ఆటగాడు జారి పడితే అతని కెరీర్ ముగిసిపోవచ్చు. అంపైర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు‘ అని అన్నాడు. అయితే దీనితో ధోని విభేదించాడు. ‘పదేళ్లుగా ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో కూడా మైదానంలోకి దిగి మ్యాచ్‌లు ఆడాం. 2011 ఇంగ్లండ్ సిరీస్ అయితే మొత్తం వర్షంలోనే సాగింది. అయినా నీళ్లు నిలిచిన ప్రాంతం రనప్ ఏరియాకు చాలా దూరం ఉంది. మరీ అంత దూరంనుంచి పరుగెత్తుకు రావడానికి వారి జట్టులో షోయబ్ అక్తర్ లేడు. కాబట్టి అదేమీ పెద్ద సమస్య కాదు. కాకపోతే అంపైర్ల నిర్ణయాన్ని గౌరవించాల్సి వచ్చింది‘ అని అతను వ్యాఖ్యానించాడు. మరో వైపు రాబోయే రోజుల్లో సొంతగడ్డపైనే వరుసగా 13 టెస్టులు ఆడనున్న భారత జట్టు నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంటుందని ధోని ఆశాభావం వ్యక్తం చేశాడు.