seconde test
-
పాక్ కు భారీ లక్ష్యం
హామిల్టన్:పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ 369 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సోమవారం ఆటలో ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగుల వద్ద ఉండగా న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ వెటరన్ ఆటగాడు రాస్ టేలర్(102;134 బంతుల్లో 16 ఫోర్లు) శతకంతో మెరిశాడు. ఓవరాల్‌గా టేలర్ టెస్టు కెరీర్లో ఇది 16వ సెంచరీ కాగా, హామిల్టన్‌లో రాస్ టేలర్‌కు నాల్గో శతకం. తద్వారా ఈ వేదికలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టేలర్ గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉండగా దాదాపు మూడు నెలల తరువాత టేలర్ సెంచరీ సాధించాడు. ఈ ఏడాది ఆగస్టులో జింబాబ్వేతో బులావాయోలో జరిగిన టెస్టులో టేలర్ చివరిసారి శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో టేలర్ కు జతగా టామ్ లాధమ్(80;150 బంతుల్లో 12 ఫోర్లు) రాణించడంతో న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచకల్గింది. -
ఇంగ్లండ్ కు భారీ లక్ష్యం
-
ఇంగ్లండ్ కు భారీ లక్ష్యం
విశాఖ: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 204 పరుగుల వద్ద ఆలౌటైంది. 98/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 106 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. తద్వారా 405 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 455 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆట ఆరంభంలో అజింక్యా రహానే(26), అశ్విన్(7), సాహా(2)లను స్వల్ప వ్యవధిలో కోల్పోయిన భారత జట్టు ఆ తరువాత కాస్త ఫర్వాలేదనిపించింది. కాగా, విరాట్ కోహ్లి(81;109 బంతుల్లో 8 ఫోర్లు)ని రషిద్ బోల్తా కొట్టించాడు. విరాట్ దాటిగా ఆడిన బంతిని స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ అద్భుతమైన రీతిలో ఒడిసి పట్టుకున్నాడు. దాంతో విరాట్ ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం జడేజా(14) మోస్తరుగా ఇంగ్లండ్ ను ఎదుర్కొనే యత్నం చేశాడు. అయితే రషిద్ స్పిన్ వలలో చిక్కుకున్న జడేజా.. బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. చివర్లో జయంత్ యాదవ్(27 నాటౌట్;59 బంతుల్లో 4ఫోర్లు), మొహ్మద్ షమీ(19; 22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు)లు ఇంగ్లండ్ ను ప్రతిఘటించడంతో భారత తన రెండో ఇన్నింగ్స్ లో రెండొందల పరుగుల మార్కును చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రషిద్‌లు తలో నాలుగు వికెట్లు సాధించగా,అండర్సన్, మొయిన్ అలీలకు చెరో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. -
విరాట్ సేన చితక్కొట్టుడు!
-
విరాట్ సేన చితక్కొట్టుడు!
విశాఖ:ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు శతకాలతో కదం తొక్కారు. తొలుత పూజారా 184 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం చేయగా, ఆ తరువాత కాసేపటికి విరాట్ కోహ్లి 154 బంతుల్లో 12 ఫోర్లుతో సెంచరీ పూర్తి చేశాడు. ఇది పూజారా టెస్టు కెరీర్లో 10 వ సెంచరీ కాగా, విరాట్ కెరీర్లో 14వ టెస్టు శతకం. పూజారా సిక్స్ కొట్టి సెంచరీ మార్కును దాటగా, విరాట్ మాత్రం సెంచరీ చేయడానికి కొన్నిబంతులను వృథా చేశాడు. ఈ రోజు ఆరంభమైన ఆటలో భాగంగా మురళీ విజయ్(20) రెండో వికెట్ గా పెవిలియన్ చేరిన తరువాత పూజారాతో జత కలిసిన కోహ్లి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఒకవైపు మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో పాటు, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇంగ్లిష్ బౌలర్లకు పరీక్షగా నిలిచింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ శతకాలతో మెరిశారు. ఈ జోడి మూడో వికెట్ కు 200కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారత్ ను పటిష్టస్థితికి చేర్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో అందుబాటులోకి వచ్చిన కేఎల్ రాహుల్ డకౌట్ గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆపై స్వల్ప వ్యవధిలో విజయ్ కూడా నిష్క్రమించాడు. తొలి సెషన్ లో రెండు వికెట్లను కోల్పోయిన భారత్.. రెండో సెషన్ లో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. -
భువీ బౌలింగ్ కు కివీస్ విలవిల..
కోల్ కతా: న్యూజిలాండ్ తో ఇక్కడి ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వరుణుడు రెండో రోజు ఆట మధ్యలో ఆటంకం కలిగించక పోయుంటే తొలి ఇన్నింగ్స్ లో కివీస్ ఇప్పటికే ఆలౌటయ్యేది. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ చాలా రోజుల తర్వాత అద్భుత(5/33) ప్రదర్శన చేశాడు. రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి 34 ఓవర్లాడిన కివీస్ 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 239/7తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. కీపర్ వృద్ధిమాన్ సాహా అజేయ హాఫ్ సెంచరీ(54 నాటౌట్;7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పోరాడే స్కోరు చేయగలిగింది. షమీ(14)ని బౌల్ట్ ఔట్ చేయడంతో 316 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి వికెట్ గా కివీస్ ఓపెనర్ లాథమ్(1)ను షమీ ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. అక్కడ మొదలు భువీ విజృంభణతో కివీస్ కష్టాలు మొదలయ్యాయి. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో మొదట గప్టిల్(13)ని ఔట్ చేసిన భువీ, ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మరోసారి మెరిశాడు. ఆ ఓవర్లో నికోల్స్(1)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో భువీ చెలరేగగా, జడేజా(1/17) పొదుపుగా బౌలింగ్ చేస్తూ కివీస్ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచాడు. స్కోరుబోర్డుకు వేగంగా పరుగులు జోడిస్తున్న రోంచీ(52 బంతుల్లో 35 రన్స్, 5 ఫోర్లు, 1 సిక్స్)ని జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే వర్షం కారణంగా 24.4 ఓవర్ల వద్ద ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటికి కివీస్ నాలుగు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసి కష్టాల్లో ఉంది. 5 వికెట్లతో అదరగొట్టిన భువీ వర్షం ఆగడంతో మ్యాచ్ కొనసాగించగా కివీస్ కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. కెప్టెన్ టేలర్ ను (36)ను భువీ ఓ తెలివైన బంతితో బొల్తాకొట్టించగా, విజయ్ కి క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 33వ ఓవర్లో మళ్లీ భువీ మెరిశాడు. ఆ ఓవర్లో తొలి రెండు బంతుల్లో వరుసగా శాంట్నర్(11), హెన్రీ(0)లను ఔట్ చేశాడు. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 34 ఓవర్లు ఆడిన తర్వాత రెండో రోజు ఆట నిలిపివేశారు. వాట్లింగ్(12), పటేల్(5) నాటౌట్ గా క్రీజులో నిలిచారు. -
కివీస్ ఎదురీత: వర్షం ఆటంకం
కోల్ కతా:భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కల్గించాడు. రెండో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ కీలక వికెట్లను కోల్పోయి ఎదురీదుతున్న సమయంలో భారీ వర్షం పడటంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచి పోయే సమయానికి న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 24.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో గప్టిల్(13), లాథమ్(1), నికోలస్(1), ల్యూక్ రోంచీ(35)లు పెవిలియన్ చేరారు. ఈ నాలుగు వికెట్లలో రెండు వికెట్లు భువనేశ్వర్ కుమార్ సాధించగా, షమీ, జడేజాలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 316 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆటలో వృద్ధిమాన్ సాహా(54 నాటౌట్;7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.