sectors
-
ఈ రంగాలపైనే మోదీ 3.0 బడ్జెట్ ఫోకస్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆర్థికవేత్తల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి సీతారామన్, ప్రణాళికా మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ మొదలైనవారు హాజరయ్యారు.త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మోదీ 3.0 మొదటి బడ్జెట్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాబట్టి బడ్జెట్లో ఏ అంశాలను వెల్లడించబోతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. ముడి పదార్థాలపై సుంకాలను తగ్గించడం వంటివి కూడా ఉండవచ్చు. ప్రస్తుత బేసిక్ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు పెంచడం సహా మధ్యతరగతికి మరింత ఉపశమనం కలిగించేలా వ్యక్తిగత ఆదాయపు పన్నులో సంస్కరణలు ఉండే అవకాశం ఉంది.లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత ఏడాది నుంచి 2 లేదా 3 సంవత్సరాలకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: 1950లో బడ్జెట్ లీకయ్యిందా? తర్వాత ఏం జరిగిందంటే..ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ట్యాక్స్ బెనిఫీట్ కల్పించే అవకాశం ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది. భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
వీటిలో అయితే పనిచేస్తాం.. మహిళల ఛాయిస్ ఇవే..
ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ), టెలికం, ఈ-కామర్స్ రంగాల్లో కెరీర్ అవకాశాల పట్ల ఎక్కువ మంది మహిళా ఉద్యోగార్థులు సుముఖంగా ఉన్నారు. అలాగే మెజారిటీ మహిళలు ఇంటి నుంచి పనిచేసే అవకాశాల కోసం చూస్తున్నారు. ఈ వివరాలను ఆప్నా డాట్ కో ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. కెరీర్లో సౌకర్యం, అంకిత భావానికి మధ్య సమతుల్యం ఉండాలని చాలా మంది మహిళలు కోరుకుంటున్నారు. నైట్ షిఫ్ట్‌లలో 18 లక్షల మంది మహిళలు అప్నా డాట్ కో ప్లాట్‌ఫామ్‌పై మహిళల ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 18 లక్షల మంది మహిళలు రాత్రి షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారని.. సవాళ్లను అంకిత భావంతో ఎదుర్కొనేందుకు వారు సంసిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అప్నా ప్లాట్‌ఫామ్‌పై 1.38 కోట్ల మంది మహిళలు సభ్యులుగా ఉంటే, అందులో 67 లక్షల మంది టైర్–2 పట్టణాలకు చెందిన వారు. గతేడాదితో పోలిస్తే 33 శాతం మేర పెరిగారు. చండీగఢ్, పాట్నా, లక్నో, అజ్మీర్, వదోదర పట్టణాల నుంచి సభ్యుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ పట్టణాలకు చెందిన మహిళా ఉద్యోగార్థులు ఎక్కువగా బిజినెస్ డెవలప్మెంట్, హెచ్ఆర్, బ్యాక్ ఆఫీస్, బోధన, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరగడం కేవలం జనాభాపరమైన మార్పు కంటే కూడా ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించినది. ఇది కుటుంబాల శ్రేయస్సు, సామాజిక పురోగతికి తోడ్పడుతుంది’’అని అప్నా డాట్ కో వ్యవస్థాపకుడు, సీఈవో నిర్మిత్ పారిఖ్ తెలిపారు. -
దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణే నెంబర్ వన్ : కేసీఆర్
-
55% వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రంగాలు, విభాగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణుల్లో 55 శాతం మంది పని ప్రదేశాల్లో ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గత 18 నెలలుగా కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, ఎదురైన ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిళ్లకు కారణమవుతున్నట్లు లింక్డ్ఇన్ సంస్థ చేపట్టిన ‘ద వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జూలై 31 నుంచి సెస్టెంబర్ 24 వరకు దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులపై నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని మొత్తం వృత్తి నిపుణుల్లో (ఉద్యోగాలు చేస్తున్న వారు) 55 శాతం మంది పనిచేసే చోట్ల ఒత్తిళ్లకు గురవుతున్నట్లు ఈ పరిశీలన తేల్చింది. ఈ 55 శాతం మందిలో వృత్తిధర్మంలో భాగంగా చేసే పనులు–వ్యక్తిగత అవసరాల మధ్య తగిన సమన్వయం, పొంతన సాధించకపోవడం వల్ల 34 శాతం మంది, ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాల్లో తగినంతగా సంపాదించలేకపోతున్నం దువల్ల 32 శాతం మంది, వృత్తిపరంగా పురోగతి చాలా నెమ్మదిగా సాగడం వల్ల 25 శాతం మంది వృత్తినిపుణులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. నిత్యం ఆఫీసుల్లో పనిని నిర్ణీత కాలానికి ముగించాలని 47 శాతం మంది భావించినా పనిఒత్తిళ్ల కారణంగా వారిలో 15 శాతం మందే అనుకున్న సమయానికి పని ముగించుకోగలుగుతున్నట్టు సర్వే తెలిపింది. అయితే ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు, పనిప్రదేశాలపట్ల ప్రతి ముగ్గురిలో ఒకరు (36 శాతం) సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న ఖర్చులపై పట్టు పెంచుకోగలిగామని 30 శాతం మంది తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో మార్కెట్లో ఉద్యోగాలు సాధించే విషయంలో పోటీ పెరిగినా క్రమంగా పరిస్థితులు మెరుగవుతున్నాయనే భావనను పలువురు వెలిబుచ్చారు. పని–జీవితం మధ్య సమతూకం సాధించాలి వృత్తి నిపుణులు, ఇతర ఉద్యోగుల పని ఒత్తిళ్లను పైస్థాయిలో యజమానులు అర్థం చేసుకొని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ సర్వే ద్వారా వెల్లడైందని లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ ఘోష్ పేర్కొన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి వృత్తి నిపుణుల ప్రాధాన్యతలు మారుతుంటాయని, రాబోయే కాలానికి అనుగుణంగా భారతీయ వృత్తి నిపుణులు తమ పని–జీవితం మధ్య సమతూకాన్ని సాధించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందన్నారు. -
రంగమేదైనా మహిళలే రాణిస్తున్నారు..
చిత్తూరు: వంటింటి నుంచి మొదలైన అతివ అడుగులు అంతరిక్షాన్ని స్పృశిస్తున్నాయి. సాగరం కన్నా లోతైన ఆమె మదిలో పుడుతున్న ఆలోచనలు ప్రపంచ దిశను మార్చేస్తున్నాయి. ఇంటా బయట ఆమె తల్లిగా.. చెల్లిగా.. భార్యగా.. కోడలిగా.. ఎలాంటి బాధ్యతనైనా నిర్వర్తించడంలో ఆమె నిరుపమాన ప్రేమమూర్తి. కలెక్టర్.. డాక్టర్..డ్రైవర్.. రచయిత.. సమాజసేవకురాలు.. రాజకీయనేత.. రంగం ఏదైనా ఇంతింతై రాణించగల సత్తా ఆమె సొంతం. తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తూ, విభిన్న రంగాల్లో విజయగీతిక ఆలపిస్తున్న మహిళల గాధలు మహిళాదినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. పల్లె నుంచి ఆర్థిక రాజధానికి.. ఈమె పేరు ఉషారాణి. పెద్దతిప్పసముంద్రం మండలంలోని మారుమూలపల్లెలో పుట్టింది. ప్రభుత్వ పాఠశాలల చదువుకుంది. అయితేనేం.. దేశ ఆర్థిక రాజధాని మంబైలోని ఎస్బీఐ పధాన కార్యాలయంలో డీజీఎంగా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్థానం విద్యారి్థనులకు స్ఫూర్తిదాయకం. బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన కొటికె మీనాక్షమ్మ, పట్టాభి రామచంద్రారావ్ దంపతులకు ఏడుగురు సంతానం. వీరిలో ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. చిన్న కుమార్తె ఉషారాణి స్వగ్రామం బడికాయలపల్లె నుంచి మదనపల్లెకు మకాం మారింది. ఏడో తరగతి వరకు మదనపల్లె మున్సిపల్ స్కూల్, పదో తరగతి ప్రభుత్వ జీఆర్టీ స్కూల్, ఇంటర్, డిగ్రీ బీటీ కాలేజీలో చదివారు. అనంతపురం ఎస్కే. యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. మదనపల్లెలో ఏడేళ్లు లా ప్రాక్టీస్ చేశారు. 1995లో ఎస్బీలో లా ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2018 వరకు వరంగల్, హైదరాబాద్ బ్రాంచ్‌ల్లో డిప్యూటీ మేనేజర్, మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2019 నుంచి ముంబయిలోని ఎస్బీఐ కార్పొరేట్ సెంటర్లో డీజీఎంగా కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లా చెన్నుపల్లెకు చెందిన మురళీమోహన్‌తో ఉషారాణికి వివాహం జరిగింది. భర్త హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాది. ఒక్కకే కుమార్తె యశస్విని ఢిల్లీ వర్సిటీలో ఎంఎస్సీ సైకాలజీలో పీహెచ్డీ చేస్తోంది. – పెద్దతిప్పసముద్రం మహిళలే పాలకులు మదనపల్లె : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం. ఈ మాట మున్సిపల్ పాలకవర్గంలో సార్థకమైంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రపంచ మహిళా దినోత్సవ కానుకగా వారికే అధిక సీట్లు కేటాయింది. దీంతో మున్సిపాలిటీలో 58 ఏళ్ల చరిత్ర తిరగరాశారు. సుదీర్ఘకాల యానంలో ఏడుగురు పురుషులే ఇప్పటి వరకు చైర్మన్లుగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ప్రాధాన్యం వల్ల తొలిసారి మహిళ చైర్పర్సన్ పాలన సాగించనున్నారు. పట్టణంలో 35 వార్డుల్లో మహిళలు 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 9వార్డుల్లో పోటీలో ఉన్నారు. దీంతో మహిళల సాధికారితకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. -
బడ్జెట్లో మహబూబ్‌నగర్‌కు మోదం..ఖేదం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహకం..అంగన్వాడీలకు సెల్ఫోన్లు, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు, విద్యుత్, స్వచ్ఛభారత్, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు తదితర వాటిపై ఆశాజనకంగా ఉంది. అయితే హైదరాబాద్ నుంచి బెంగళూర్ హైవేకు ఇండస్ట్రీ కారిడార్ గురించి ప్రస్తావించకపోవడం.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకపోవడం నిరాశే. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా.. వారి సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు రూ.15లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.83లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 6.11కోట్ల మందికి ఫసల్ బీమా యోజన వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 8,51,385 మంది రైతుల్లో ఆశలు చిగురించాయి. మహబూబ్‌నగర్‌లో 1,78,012 మంది రైతులు ఉండగా, నారాయణపేటలో 1,28,905, నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 2,58,000, గద్వాలలో 1,44,445, వనపర్తిలో 1,42,023 మంది రైతులు ఉన్నారు. కేంద్రం కురిపించిన వరాల్లో ఏఏ జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యం లభిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. అయితే.. కేంద్ర బడ్జెట్‌పై జిల్లా రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అలాగే బంజరు, తడి భూములు కలిగిన రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేలా వారి భూముల్లో సౌర యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. సౌర విద్యుత్‌ను గ్రిడ్లకు సరఫరా చేసి.. తద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. యువ మత్స్య కారి్మకుల ప్రోత్సాహంలో భాగంగా ‘సాగర్ మిత్రాస్’ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే దీనితో ఎంత మంది లబి్ధపొందుతారో అనేది స్పష్టమవుతుంది. అయితే.. ప్రస్తుతం మత్స్య కారి్మకులకు బాసటగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం చెరువులను పునరుద్ధరించి అందులో చేపల పెంపకానికి చేయూతనిస్తోంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షలకు పైగా మంది ప్రస్తుతం లబి్ధపొందుతున్నారు. ‘సాగర్ మిత్రాస్’ పథకం ద్వారా మరింత మందికి లబి్ధచేకూరే అవకాశముంది. చిగురించిన ఆశలు.. దేశంలో ఆరు లక్షల మంది అంగన్వాడీలకు సెల్ఫోన్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రాజెక్టుల పరిధిలో 5,003 అంగన్వాడీ కేంద్రాలు.. అంతే మంది టీచర్లు ఉన్నారు. వీరిలో ఎంత మందికి సెల్ఫోన్లు వస్తాయో చూడాలి. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి.. పౌష్టికాహార పథకానికి రూ.35.6కోట్లు కేటాయించినట్లు వివరించారు. అయితే.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య ఉమ్మడి పాలమూరు జిల్లాలో 50వేలకు పైనే ఉంది. వీరిలో 20వేలకు పైగా మంది వివిధ రోగాలతో బాధపడుతున్నారు. మహిళా సంక్షేమ పథకాలకు రూ.28,600కోట్లు కేటాయించడంతో జిల్లాలో మరింత మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. పర్యాటక రంగ ప్రోత్సాహానికి ఈ సారి బడ్జెట్లో రూ.2,500 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌గౌడ్ సైతం మన జిల్లా పరిధిలోని మయూరి పార్కు, మన్యంకొండ, కోయిల్‌సాగర్ ప్రాంతాలతో పాటు వరంగల్‌నూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఇది వరకే రూ.450 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాకు ఏ మేరకు నిధులు వస్తాయో అనే ఆసక్తి నెలకొంది. అలాగే క్రీడల అభివృద్ధికి రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. అందులో మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్ హాస్టల్, ఇండోర్ స్టేడియం, క్రీడా మైదానాల అభివృద్ధి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో ఏ మేరకు మంజూరవుతాయో చూడాలి. ఆశలకు రెక్కలు.. వచ్చే నాలుగేళ్లలో దేశంలో వంద కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలను మళ్లీ చిగురింపజేసింది. ఇప్పటికే పాలమూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కసరత్తు మొదలైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అడ్డాకుల మండలం గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించారు. తర్వాత దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి.. అలాగే భూత్పూర్ మండలంలోని పోతులమడుగు, రావులపల్లి, కప్పెట గ్రామాల పరిధిలోని భూముల్లో అనువుగా ఉన్న భూములను ఎంపికతో పాటు మ్యాప్‌ను రూపొందించి ప్రతిపాదనలు కూడ సిద్ధం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో దేవరకద్ర నియోజకవర్గంలో ఏదో చోటా విమానాశ్రయం రాబోతుందనే ఆశలు ఉమ్మడి జిల్లా ప్రజల్లో చిగురించాయి. ఆశలకు రెక్కలు.. వచ్చే నాలుగేళ్లలో దేశంలో వంద కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలను మళ్లీ చిగురింపజేసింది. ఇప్పటికే పాలమూరులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కసరత్తు మొదలైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితమే ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఈ క్రమంలో దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అడ్డాకుల మండలం గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించారు. తర్వాత దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి.. అలాగే భూత్పూర్ మండలంలోని పోతులమడుగు, రావులపల్లి, కప్పెట గ్రామాల పరిధిలోని భూముల్లో అనువుగా ఉన్న భూములను ఎంపికతో పాటు మ్యాప్‌ను రూపొందించి ప్రతిపాదనలు కూడ సిద్ధం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో దేవరకద్ర నియోజకవర్గంలో ఏదో చోటా విమానాశ్రయం రాబోతుందనే ఆశలు ఉమ్మడి జిల్లా ప్రజల్లో చిగురించాయి. ఏదీ ‘జాతీయ హోదా’? ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఈ సారీ జాతీయ హోదా వరించలేదు. నిధుల సమస్యతో నత్తకు నడక నేర్పుతోన్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.10వేల కోట్ల రుణం తీసుకున్నా.. ఇంకా నిధుల సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేంద్ర నిధులూ వస్తాయనే ఆశతో ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని ప్రతి ఏటా కేంద్రాన్ని అభ్యరి్థస్తూనే ఉంది. ఇటు లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ ప్రాంత ప్రజల సమస్యలు తనకు తెలుసని.. వాటిని తీరుస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ సారైనా జాతీయ హోదా వస్తుందనే ఆశతో ఉన్న ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. జాతీయ హోదాను విస్మరించారు కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాటిని పట్టించుకోకపోవడం కేంద్రం వ్యవసాయాన్ని విస్మరించడమే. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2008 నుంచి కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా కేవలం పశుగ్రాసం పండించే వారికి మాత్రమే ఉపాధిహామీ అనుసంధానం చేస్తామనడం సరికాదు. కూలీల కొరత వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. జిల్లాకో పంట కాలనీకి సహకారం అందిస్తామని బడ్జెట్లో కేంద్రం తెలిపింది. మరి దేశంలోని ఎన్ని జిల్లాలకు ? ఏఏ రాష్ట్రాలకు అన్న వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం పంటకాలనీల ప్రాధాన్యతను గుర్తించి ఇప్పటికే దాదాపుఓ ప్రణాళికను సిద్ధం చేసింది. దానికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో వేచిచూడాలి. తాజా బడ్జెట్ కూడా వ్యవసాయ రంగం విషయంలో కంటితుడుపుగానే వ్యవహరించింది. – నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి జిల్లాకు ఎన్నొస్తాయో చూడాలి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌ను పురస్కరించుకుని.. జిల్లాలో మయూరి పార్కు, మన్యంకొండ, కోయిల్‌సాగర్ తదితర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ఇది వరకే కోరాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.450 కోట్లు అడిగాం. ఈ రోజు ప్రకటించిన టూరిజం ప్రోత్సాహక బడ్జెట్లో రూ.2,500 కేటాయింపులు జరిగాయి. ఇందులో మన జిల్లాకు, రాష్ట్రానికి ఎంత వస్తుందో చూడాలి. – శ్రీనివాస్‌గౌడ్, ఎౖక్సైజ్ శాఖ మంత్రి -
బడ్జెట్లో ప్రాధాన్యతా రంగాలు
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్ర మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ►రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి పలు సంస్కరణలను చేశారు. ►2019-20 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ జీడీపీలో ద్రవ్యలోటుకు 3.3శాతం కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్ (2020-21)ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంశంలో ప్రభుత్వం సరళీకృత విధానం అవలంభించే అవకాశాలు ఉన్నట్లు బడ్జెట్ స్పష్టం చేస్తుంది. ►ప్రభుత్వం కాలుష్య నివారణ, డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, నదులను శుభ్రపరచడం తదితర అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చింది. ►ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తు ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండించడంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా కృషి చేస్తున్నట్లు బడ్జెట్ స్పష్టం చేస్తుంది ►దేశం బాగుండాలంటే అందరి ఆరోగ్యాలు బాగుండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను మరింత మెరుగుపరుచే విధంగా కృషి చేసస్తామని బడ్జెట్ స్పష్టం చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా మహిళలు, శిశువులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ►బడ్జెట్లో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, రక్షణ శాఖ, తయారీ రంగం, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, వైద్య పరికరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. -
28వేల దిగువకు పసిడి?
ముంబై: డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తో బంగారం పరుగుకు పగ్గాలు పడనున్నాయి. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం వివిధ రంగాలపై అనుకూల, సానుకూల ప్రభావాన్ని చూపనుంది. ఈ క్రమంలో దేశీయ బంగారం ధరలు క్రమంగా దిగిరానున్నాయి. కొనుగోలు దారుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో పసిడి ధరలు డిసెంబర్ తరువాత పది గ్రా. పసిడి ధర రూ28,000 క్రిందికి దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు డీమానిటైజేషన్ ప్రభావంతో బంగారం ధరలు గణనీయంగా పడిపోనున్నాయని, ప్రస్తుతం రూ.28,750 (పది గ్రాములు) గా ఉన్న ధరలు రూ 28,000 (పది గ్రాములు) కిందికి పడిపోనున్నాయంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు వివిధ రంగాల మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా ముంబై ప్రఖ్యాత బంగారం మార్కెట్ జవేరీ బజార్ లో సగటున విక్రయాల నమోదు భారీగా క్షీణించింది. నోట్ద రద్దు తర్వాత రోజూ సగటున రూ 125 కోట్లుగా ఉండే అమ్మకాలు ప్రస్తుతం రూ .13 కోట్ల విలువ పడిపోయిందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పాత బంగారం రీ సైకిల్, పెళ్లిళ్ల సందర్భంగా నెలకొన్న స్వల్ప కొనుగోళ్లు తప్ప పెద్దగా విక్రయాలు లేవని, డిమాండ్ గణనీయంగా తగ్గిందని ముంబై జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ కుమార్ జైన్ చెప్పారు. అలాగే నల్లకుబేరులు ఎక్కువగా బంగారం కొంటున్నారన్న నివేదికల నేపథ్యంలో ఐటీ దాడుల భయం కూడా తమని వెంటాడుతున్నట్టు వర్తకులు చెబుతున్నారు.అయితే నవంబరు డిశెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు 29 వేల పెళ్లిళ్లు జరగుతాయని, ఈ అంచనాలతోనే జవేరీ బజార్ లో 70 టన్నుల బంగారాన్ని స్టాక్ ఉంచుకున్నారు. సాధారణంగా త్రైమాసికంగా 30 టన్నులు బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటారు. కాగా డాలర్ ధరలు బాగా పుంజుకోవడంతో దేశంలో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు స్తబ్దుగా ఉన్నాయి. అయితే సోమవారం డాలర్ కొద్దిగా వెనక్కి తగ్గడంతో వెండి, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. -
ప్రైవేటు సెక్టార్లను అధిగమించాలి
వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించాలి.. కేబుల్ ఆపరేటర్లను వాటాదారులుగా చేర్చాలి.. ఆరు ప్రాంతాల్లో త్వరలో వైఫై సౌకర్యం టెలికం అడ్వైజరీ కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం గాంధీచౌక్ : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సేవల్లో ప్రైవేటు సెక్టార్లను అధిగమించాలని జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా బీఎస్ఎన్ఎల్ భవనంలో జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సమావేశాల్లో చర్చించిన అంశాలు, వాటి పురోగతిపై అధికారులు వివరించాలని సూచించారు. రహదారుల అభివృద్ధి వల్ల కేబుల్ వైర్లు దెబ్బతింటున్నాయని, దీంతో సేవలకు అంతరాయం కలుగుతుందని అధికారులు వివరించారు. మిషన్ భగీరథ వల్ల కూడా కేబుల్ వైర్లు దెబ్బతింటున్నాయని వివరించారు. కొందరు కమిటీ సభ్యులు మాట్లాడుతూ అధికారులు కొత్త స్కీంలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారని, కనీసం కమిటీ సభ్యులకు కూడా తెలియపరచటం లేదన్నారు. బ్రాడ్‌బ్యాండ్ సేవలు సక్రమంగా లేవని, మార్కెటింగ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని పలువురు సభ్యులు ఆరోపించారు. దీంతో ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులకు ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడంతో వ్యవస్థ నానాటికి వెనకబడుతుందన్నారు. బీఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అని, ప్రజలకు సేవలందించకపోతే సంస్థ మనుగడ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. సాంకేతికంగా వ్యవస్థను అభివృద్ధిపరిచే దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ప్రైవేటు కేబుల్ ఆపరేటర్లను సంస్థలో భాగస్వాములను చేస్తే వ్యవస్థ మెరుగుపడుతుందని సంస్థ అధికారులు చెబుతున్నారని, ఆ దిశగా కృషి చేయాలన్నారు. కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో లక్ష కనెక్షన్లు గిరిజనులకు ఉచితంగా ఇచ్చే విధంగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఉచిత వైఫై కనెక్షన్లు తొలుత ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 100 మీటర్ల రేడియస్‌లో వైఫైలు పని చేస్తాయన్నారు. జీతానికి న్యాయం చేయాలి : కోచైర్మన్ సీతారాంనాయక్ టెలికం శాఖ ఇచ్చే జీతానికి న్యాయం చేయాలని జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ కోచైర్మన్, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఎక్కడ ఉంటే మనం అక్కడకు వెళ్లి మాట్లాడాల్సిన దుస్థితి ఉందని, అదే ప్రైవేటు సిగ్నల్స్ మన చుట్టూ ఉంటాయని అన్నారు. దీనిపై పార్లమెంట్లో కూడా చర్చ జరిగిందన్నారు. బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు ఉన్న వారు ఆదివారం ఉచితంగా మాట్లాడుకోవచ్చని ఎంతమందికి తెలుసు? ఎన్ని గ్రామాల వారికి తెలుసు? అధికారులు ఈ విషయాన్ని ప్రచారం చేశారా? అని అధికారులను ప్రశ్నించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్ కల్పించే విధంగా అధికారులు కృషి చేయటం లేదని విమర్శించారు. టెలికం జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ నరేందర్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లకు 35 శాతం వాటా కల్పించి.. వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే అవకాశం ఉందని తెలిపారు. మన పక్కనే ఉన్న మహబూబాబాద్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. సమావేశంలో బీఎస్ఎన్ఎల్ జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
23% పెరగనున్న కొలువులు
ముంబై: భారత కంపెనీలు వచ్చే ఏడాది 23 శాతం అధికంగా ఉద్యోగాలనివ్వనున్నాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2015 వెల్లడించింది. అంతర్జాతీయ టాలెంట్ అసెస్మెంట్ కంపెనీ వీబాక్స్, భారత హెచ్ఆర్ అవుట్సోర్సింగ్, రిక్రూట్మెంట్ కంపెనీ పీపుల్ స్ట్రాంగ్, ప్రొఫెషనల్ ఆన్లైన్ నెట్వర్క్ లింకెడిన్, సీఐఐలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నివేదిక ప్రకారం..., వచ్చే ఏడాది ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అధికంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ రంగాల్లో 50 శాతం అధికంగా ఉద్యోగాలు వస్తాయి. ఈ రెండు రంగాల తర్వాత బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రంగాలు అధికంగా ఉద్యోగాలు కల్పిస్తాయి. తయారీ, టెలికాం, ఫార్మా రంగాల్లో హైరింగ్ తక్కువ స్థాయిలో ఉంటుంది. కార్యకలాపాలు నిర్వహించడానికి న్యూఢిల్లీ, ముంబై నగరాలు అనువైనవిగా పలు కంపెనీలు భావిస్తున్నాయి. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలు కూడా ప్రాధాన్యతా ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించడానికి అనువైన విధానాల కోసం ఈ రెండు రాష్ట్రాలు సంస్కరణలు తెస్తున్నాయి. యువకులకే ఉద్యోగాలివ్వాలని 72 శాతానికి పైగా కంపెనీలు భావిస్తున్నాయి. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది హైరింగ్‌లో పురుషులు, మహిళ ఉద్యోగుల వాటా 76:24 గా ఉండగా, ఈ ఏడాది 68:32 శాతంగా ఉంది. అయితే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, బీపీఓ, ఆతిధ్య రంగాల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. 2.7 లక్షల ఉద్యోగవకాశాలు ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ కొత్త కార్యాలయాల స్పేస్ లీజింగ్ 23 మిలియన్ చదరపుటడుగులుగా ఉందని ప్రోపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తెలిపింది. హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ముంబై, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, పుణేలో వచ్చిన ఈ కొత్త ఆఫీస్ స్పేస్ లీజింగ్ కారణంగా 2.7 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించింది. ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు అధికంగా కొత్త కార్యాలయాలను ప్రారంభించాయని ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, తయారీ, ఇంజినీరింగ్, కన్సల్టింగ్, రీసెర్చ్ రంగాలు ఉన్నాయని వివరించింది. బెంగళూరులో అధికంగా ఉద్యోగావకాశాలు వస్తాయని, ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్లు ఉంటాయని పేర్కొంది. -
ఏపీ మంత్రుల శాఖలివే!