selphies
-
నక్షత్రాలతో సెల్ఫీ కావాలా?
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని... అని పాడుకోవడమే కాదు.. ఇకపై నక్షత్రాలతో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. అంతరిక్షంలోకి టూర్.. జాబిలిపై ఇల్లు... అరుణ గ్రహంపై కాలనీ! తరచూ కనిపించే ఇలాంటి వార్తలను చూసినప్పుడల్లా ఆశ్చర్యంగా అనిపించ వచ్చుగానీ, ఇవన్నీ బాగా డబ్బున్న వారికే సాధ్యమయ్యే పనులని కూడా స్పష్టమైపోతుంది. కోట్లకు కోట్లు పోసి అంతరిక్షానికి అందరూ వెళ్లలేరుగా. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటంటారా? అంతరిక్షంలో ఉన్న ఫీలింగ్ ఇచ్చే సెల్ఫీలు తీసుకోవచ్చు అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ! విషయం ఏంటంటే.. స్పీట్జర్ స్పేస్ టెలిస్కోపును ప్రయోగించి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా నాసా ఓ వినూత్నమైన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఐఫోన్‌తోపాటు ఆండ్రాయిడ్‌కూ అందుబాటులోఉన్న ఈ యాప్‌ను ఓపెన్ చేసి కనిపించే ఫ్రేమ్ మధ్యలో మన ముఖం ఉండేలా చూసుకుని ఫొటో తీసుకుంటే చాలు. అంతరిక్ష వ్యోమగామి స్టైల్లో మన తలకు ఓ హెల్మెట్ అమరిపోతుంది. ఆ తరువాత గత 15 ఏళ్లలో స్పీట్జర్ తీసిన వందలాది అద్భుతమైన నక్షత్ర మండలాలు, అంతరిక్ష ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌తో సెల్ఫీ సిద్ధమైపోతుంది. చిన్న ఇబ్బంది కూడా ఉందండోయ్.. ఈ సెల్ఫీలను నేరుగా ఆప్ ద్వారానే షేర్ చేసుకునే వీల్లేదు. గ్యాలరీలోకి వెళ్లి ఫొటోలు సెలెక్ట్ చేసుకుని సామాజిక మాధ్యమాల్లోకి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ పేరు ఏంటంటారా? నాసా సెల్ఫీస్ అని ప్లేస్టోర్‌లో సెర్చ్ చేయడమే.. -
సెల్ఫీలతో ముఖంపై ముడతలు
లండన్: అధిక సంఖ్యలో సెల్ఫీలు తీసుకునేవారి చర్మం పాడవుతుందనీ, ముఖంపై ముడతలు పడతాయని చర్మవైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం తొందరగా వృద్ధాప్య ఛాయలను పొందుతుందని అంటున్నారు. చర్మానికి దెబ్బతిన్న చోట బాగుచేసుకునే సహజగుణం ఉంటుంది. రేడియేషన్ కారణంగా చర్మం ఆ గుణాన్ని కోల్పోతుంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలం రంగు కాంతి కూడా చర్మానికి హాని కలిగించగలదన్నారు. అక్కడా ప్రాణవాయువు! టోక్యో: ఆక్సిజన్ ఉన్న సుదూర గెలాక్సీని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది బిగ్‌బ్యాంగ్ జరిగిన 70 కోట్ల ఏళ్ల తర్వాత ఏర్పడింది. దీని ద్వారా అంతరిక్ష ప్రాథమిక చరిత్రను తెలుసుకోవచ్చని అంటున్నారు. చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న రేడియో టెలిస్కోపుల ద్వారా దీన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గెలాక్సీలోని భారీ రసాయన మూలకాల ద్వారా నక్షత్రాల ఏర్పాటు, విశ్వపునఃఅయనీకరణరహస్యాలను ఛేదించవచ్చంటున్నారు. ఇందులో సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఉండొచ్చని అంచనా. టాయిలెట్ ఉంది టీచర్! బరంపురం: పాఠశాలలో హాజరు (అటెండెన్స్) వేసుకునేటప్పుడు పిల్లలు సాధారణంగా ప్రెజెంట్/ఎస్ టీచర్ అని చెబుతారు. ఒడిశాలోని గంజాం జిల్లా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు మాత్రం ‘మా ఇంట్లో మరుగుదొడ్డి ఉంది/లేదు టీచర్’ అంటూ కొత్త పద్ధతిలో హాజరు పలుకుతున్నారు. ఎందుకంటే, ఈ రకంగానైనా ప్రజలు శౌచాలయాలు నిర్మించుకునేలా చేసి బహిరంగ మల విసర్జనను నిర్మూలించాలనేది అక్కడి అధికారుల ప్రణాళిక. గంజాంను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా మార్చేందుకు అన్ని పాఠశాలల్లో దీన్ని చేపట్టినట్లు డీఈఓ తెలిపారు. జిల్లాలో 30% ఇళ్లలోనే మరుగుదొడ్లు ఉన్నాయి. -
అభిమానులకు సినిమా దేవుళ్లు!
హైదరాబాద్: సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా చాలామందికి కాస్తంత తక్కువ అభిప్రాయం. వాటి గురించి, వాళ్ల గురించి ఎంతో ఆసక్తి ఉన్నా... పైకి మాత్రం ఆ మాట చెప్పరు. కానీ, తీరా ఆ వ్యక్తులు అనుకోకుండా ఎదురుపడినప్పుడు అసలు ఆసక్తి బయటకొచ్చేస్తుంది. హైదరాబాద్‌లో ఇటీవల ఒక యువ హీరో పెళ్లి రంగరంగవైభవంగా జరిగినప్పుడు ఈ సంగతే మరోసారి స్పష్టమైంది. దక్షిణాదిలోని వివిధ భాషా సినీ పరిశ్రమల నుంచి భాగ్యనగరికి దిగివచ్చినవేళ... ఎర్రటి ఎండలోనూ జనంలో అభిమానం వెల్లువెత్తింది. తెల్లటి దుస్తుల్లో, మేకప్, విగ్గు లేకుండా ఆరు పదుల రజనీకాంత్ నడిచివస్తుంటే, ఆయనతో సెల్ఫీలు దిగడం కోసం కల్యాణ ప్రాంగణం వద్ద పెళ్ళికి వచ్చిన మహా మహా అతిథులు సైతం పోటీ పడడం కనిపించింది. ఇక, తెలుగునాట కూడా పాపులరైన తమిళ హీరో సూర్య వచ్చినప్పుడైతే, పెళ్లికి వచ్చిన పురోహితుల్లో ఒకరు... ఆ పనికి కాస్తంత గ్యాప్ ఇచ్చి, సూర్యను దగ్గరగా చూసి, మాట్లాడేందుకు ఉత్సాహపడ్డారు. చిన్నపిల్లవాడైన తన కుమారుణ్ణి తీసుకొచ్చి, సూర్య కాళ్ళకు నమస్కారం చేయించబోయారు. ఆ యువ కథానాయకుడి నుంచి ఆశీస్సులు తీసుకొనేందుకు పసివాణ్ణి ప్రోత్సహించారు. ఈ మొత్తం వ్యవహారం కాస్తం ఇబ్బందిగా అనిపించిన సూర్య చాలా వినయంగానే ఆ అభ్యర్థనల్ని ఒకటికి, రెండుసార్లు సున్నితంగా తిరస్కరించారు. పొరుగు తారల మీదే ఇంతటి ఆసక్తి కనబడితే, ఇక మన సూపర్‌స్టార్స్ మహేశ్, ప్రభాస్ లాంటి వారు వచ్చినప్పుడు అక్కడ ఎంత హంగామా జరిగిందో వేరే చెప్పాలా? సినిమా తారల్ని వెండితెర వేల్పులనేది బహుశా ఇందుకేనేమో!