senior bureaucrats
-
రక్షణ కార్యదర్శిగా రాజేష్ సింగ్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో పలువురు సీనియర్ బ్యూరోకాట్లను బదిలీ చేసి కొత్త స్థానాల్లో నియమించింది. రాజేష్ సింగ్ రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాజేష్ తొలుత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా చేరతారు. ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అరమానే గిరిధర్ అక్టోబరు 31న పదవీ విరమణ చేయనున్నారు. అప్పుడు గిరిధర్ స్థానంలో రాజేష్‡ బాధ్యతలు స్వీకరిస్తారు. పున్యా సలీలా శ్రీవాస్తవ ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. పస్తుతం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కటికిథల శ్రీనివాస్.. హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్ బ్యూరోకాట్ దీప్తి ఉమాశంకర్‌ను రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగరాజు బోగ్గుశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. -
రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు!
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పట్టుమని పది వేలు కూడా దొరకని పరిస్థితి. గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా రూ.20 వేలలోపే ఏ బ్యాంకుల్లో ఎంత ఇస్తారో కూడా తెలియదు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.ఐదు కోట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రెండు వారాల కిందటే విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్లలోనే దాదాపు ఈ డబ్బంతా ఉంది. ఈ సొమ్మంతా కూడా ఇద్దరు సీనియర్ అధికారులదంట. అంతేకాదు, ఆ ఇద్దరు అధికారుల ఇళ్లలో ఐదు కేజీల బంగారం, ఐదు కేజీల ఆభరణాలు, స్పోర్ట్స్ కార్లు, లాంబార్గినివంటివి కూడా లభ్యమయ్యాయి. బెంగళూరులోని ఓ ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించగా ఇవన్నీ బయటపడ్డాయి. జనాలకు డబ్బుల్లేక అల్లాడుతుంటే ఇంత పెద్ద మొత్తంలో కొత్త డబ్బు ఎలా చేతికొచ్చిందని ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ అధికారుల వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు.