రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు! | Bengaluru Raids Reveal 5 Crores, Mostly In New Notes | Sakshi
Sakshi News home page

రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు!

Published Thu, Dec 1 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు!

రెండువేలకు గతిలేదు.. వారింట్లో కొత్తవి ఐదు కోట్లు!

బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పట్టుమని పది వేలు కూడా దొరకని పరిస్థితి. గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా రూ.20 వేలలోపే ఏ బ్యాంకుల్లో ఎంత ఇస్తారో కూడా తెలియదు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.ఐదు కోట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రెండు వారాల కిందటే విడుదల చేసిన కొత్త రూ.2000 నోట్లలోనే దాదాపు ఈ డబ్బంతా ఉంది. ఈ సొమ్మంతా కూడా ఇద్దరు సీనియర్‌ అధికారులదంట.

అంతేకాదు, ఆ ఇద్దరు అధికారుల ఇళ్లలో ఐదు కేజీల బంగారం, ఐదు కేజీల ఆభరణాలు, స్పోర్ట్స్‌ కార్లు, లాంబార్గినివంటివి కూడా లభ్యమయ్యాయి. బెంగళూరులోని ఓ ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించగా ఇవన్నీ బయటపడ్డాయి. జనాలకు డబ్బుల్లేక అల్లాడుతుంటే ఇంత పెద్ద మొత్తంలో కొత్త డబ్బు ఎలా చేతికొచ్చిందని ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ అధికారుల వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement