sentenced jail
-
బుద్ధి మారలేదు.. జైలు తప్పలేదు..
సిడ్నీ: ఆస్ట్రేలియాలో నివాసముంటున్న భారత వృద్హ జంట తమ వద్ద మరో భారతీయ వృద్ధురాలిని బానిసగా చేసుకుని చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలో ఆస్ట్రేలియా న్యాయస్థానం వృద్ధ దంపతుల శిక్షా కాలాన్ని మరో రెండున్నరేళ్లకు పెంచుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. భారత్‌లోని తమిళనాడుకు చెందిన కుముదిని కణ్ణన్, కందసామి కణ్ణన్ జంట తమ వద్ద పని చేయడానికి ఒక భారతీయ మహిళను నియమించుకున్నారు. ఆమెకు ఇంటిపని వంటపని తోపాటు పిల్లలను చూసుకునే పని కూడా అప్పజెప్పి రోజుకు 23 గంటల పాటు పని చేయమని హింసించారు. ఒక పనిమనిషిలా కాకుండా మానవత్వం లేకుండా బానిసలా చూసినట్టు చూసి ఆమె అనారోగ్యానికి కారణమయ్యారు. పాపం ఆ మహిళ పోషకాహార లోపం, డయాబెటిస్, గాంగ్రీన్ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యింది. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు శాఖ ఈ జంటపై బానిసల వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని 2021లో జైలుకు తరలించారు. ఈ కేసులో వాదోపవాదనలు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియా న్యాయస్థానం వృద్ధ జంటకు మరో రెండున్నరేళ్ళపాటు శిక్షను పొడిగించింది. 2016లో నమోదైన ఈ కేసులో సాక్షిని భయపెట్టేందుకు ప్రయత్నించిన కుముదిని కణ్ణన్ కు మొత్తం 8 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించగా అందులో నాలుగేళ్ల పాటు బెయిల్ నిరాకరిస్తున్నట్లు, అలాగే కందస్వామి కణ్ణన్ కు ఆరేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించి అందులో మూడేళ్లు బెయిల్ మంజూరు చేయడం కుదరదని తీర్పునిచ్చింది. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ దంపతుల్లో కొంచెమైనా పశ్చాత్తాపం కనిపించడంలేదని.. వారిలో వీసమెత్తు మానవత్వం కూడా లేదని సాటి మనిషిని మనిషిగా కూడా చూడలేని కఠిన హృదయులని తెలిపారు. తప్పు చేసిన భావనే వారిలో కొరవడిందని చెబుతూ కఠిన శిక్షను అమలు చేయాల్సిందిగా కోరారు. ఇది కూడా చదవండి: కుటుంబంపై హత్యాయత్నం చేసిన డాక్టర్.. కారులో తీసుకెళ్లి.. -
చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష
ఒక వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు భారీ మూల్య చెల్లించుకున్నాడు. క్షణికావేశలోనూ లేక ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కూడా కాదు. ఒక వ్యక్తితో జరిగిన వివాదంలో కోపంలో తన వద్ద ఉన్న హ్యండ్ గన్‌తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అంతే అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదలైంది. అవతలి వ్యక్తి ఆ తూటా నుంచి తప్పించుకున్నాడు గానీ సమీపంలోని గదిలో ఆడుకుంటున్న చిన్నారి తలలో దూసుకుపోయింది. అభం శుభం తెలియని ఒక నిండు ప్రాణం ఆ తూటాకి బలైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తి ఏకంగా వందేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...ష్రేవ్పోర్ట్కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి సూపర్ 8 లగర్జీ హోట్లోని పార్కింగ్ వద్ద ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్ ఆవ్యక్తిపైకి ఎంఎం హ్యాండ్‌గన్‌ని ఎక్కుపెట్టారు. దీంతో విడుదలై బుల్లెట్ నుంచి సదరు వ్యక్తికి తప్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ హోటల్ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మయాపటేల్ తలలోకి దూసుకుపోయింది. దీంతో మయా పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..అక్కడ మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడి మార్చి 23, 2021న చనిపోయింది. దీంతో స్మిత్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ హోటల్ని విమల, స్నేహల్ పటేల్ యజామాన్యంలో ఉంది, వారే ఆ హోటల్ని నిర్వహిస్తున్నారు. వారు ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో తమ కూతరు మాయా పటేల్, ఆమె చిన్న చెల్లెలుతో కలిసి ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆ కుటుంబం ఒక బిడ్డను పోగోట్టుకోవలసి వచ్చింది. ఈ క్రమంలో కోర్టు సదరు వ్యక్తికి ఎలాంటి పెరోల్ లేదా శిక్ష తగ్గింపుకు అవకాశం లేకుండా 60 ఏళ్లు కఠిన కారాగారా శిక్ష విధించింది. అలాగే బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు గానూ 20 ఏళ్లు, అలాగే ఈ దారుణమైన ఘటనకు బాధ్యుడిగా మరో 20 ఏళ్ల కలిపి మొత్తం వందేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కాడో పారిష్ జిల్లా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సదరు నిందితుడు స్మిత్‌కి గతంలో కూడా కొంత నేర చరిత్ర ఉందని, దాన్ని పునరావృతం చేశాడే గానీ ప్రవర్తన మార్చుకోనందున ఈ శిక్ష విధించినట్లు సమాచారం. (చదవండి: క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు) -
ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!
కొన్ని దేశాల్లో చిన్న నేరాలకే పెద్ద పెద్ధ శిక్షలు విధిస్తారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారా? లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ ఆ శిక్షలు చూస్తే మనకే చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిందితుడు చేసింది నేరంగా పరిగణించేది కాకపోయినా..ఘోరమైన శిక్షలు విధిస్తుంటారు. అచ్చం అలానే 65 ఏళ్ల వృద్ధుడు దారుణమైన శిక్ష ఎదర్కొంటున్నాడు. అతడు చేసిన నేరం, పడిన శిక్ష! చూస్తే ఏంటిదీ?.. అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన 64 ఏళ్ల డేవిడ్ షెర్మాన్ పావెలన్స్ అనే వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేశారు. పైగా అతడిపై ఘోరమైన ఆరోపణలు చేస్తూ.. సీరియస్ కేసుగా నమోదు చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. తన సోదరుడి ముఖంపై కూల్ వాటర్‌ని పోశాడు. రెండు గ్లాస్‌ల వాటర్‌ని అతని ముఖంపై పోసి తనని చనిపోయేలా భయబ్రాంతులకు గురి చేశాడంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే అందువల్ల అతనికి ఎలాంటి హాని గానీ, గాయాలు గానీ కాలేదు. షెర్మాన్ చర్యకు తాను చాలా భయపడిపోయానంటూ కేసు నమోదు చేయించాడు. ఆ వృద్ధుడిని ఈ విషయమై విచారించగా.. ఫ్రిజ్‌లో ' కీ లైం పై' అనే కేకులాంటి స్వీట్ తినేందుకు అలా చేశానని చెబుతున్నాడు. ఆ స్వీట్‌ని తన సోదరుడు చాలా రోజులుగా ఫ్రిజ్‌లో ఉంచాడని, తనకు తినాలనిపించడంతో సోదరుడికి తెలియకుండా తినేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, తాను సోదరుడిని కూల్ చేసేందుకు చల్లటి వాటర్ అతడి నెత్తిమీద నుంచి పోసినట్లు తెలిపాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న షెర్మాన్ సోదరుడు అతడిని కటకటాల పాలు చేశాడు. అతను గనుక నేరం చేసినట్లు తేలితే గనుక అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష తోపాటు పెద్ద మొత్తంలో జరిమాన కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారుల కూడా అతడి దూకుడు ప్రవర్తన ఇతరుల ప్రాణాలను ప్రమాదకరంగా ఉందంటూ త్రీవమైన కేసుగా పరిగణించి మరీ నమోదు చేయడం గమనార్హం. Florida Man Faces Up to 30 Years for Dumping Water on Older Brother in Argument Over Key Lime Pie https://t.co/jYkWyrPF71 pic.twitter.com/4P2FVbtQVC — Florida Man (@FloridaMan__) February 24, 2023 (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్‌కు జైలుశిక్ష
సాక్షి, అమరావతి: కోర్టుధిక్కార కేసులో అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏపీఎండీసీ) చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.సుదర్శనరెడ్డిలకు హైకోర్టు ఆరు నెలల జైలుశిక్ష, రూ.రెండువేల జరిమానా విధించింది. అప్పీల్‌కు వెళ్లేందుకు తీర్పు అమలును వారం రోజులు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. మంగంపేట ప్రాంతంలో కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. ఏ నిర్మాణాలను కూల్చివేశారో తేల్చి, ఆ నిర్మాణాల విలువను తేల్చేందుకు ఇంజనీర్లను నియమించేలా ఆదేశాలివ్వాలంటూ ఓబులవారిపల్లెకు చెందిన ఎ.నరసమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు నిర్మాణాల విలువ తేల్చేందుకు ఇంజనీర్లను నియమించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో నరసమ్మ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి.. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడానికి రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఏపీఎండీసీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.సుదర్శనరెడ్డి కారణమని తేల్చి జైలుశిక్ష, జరిమానా విధించారు. చదవండి: (వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు) -
కామాంధునికి 20 ఏళ్ల జైలు
మైసూరు: మూడున్నరేళ్ల పసిపాపపై లైంగికదాడికి పాల్పడిన కామాంధునికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. హుణసూరు తాలూకాలోని జగదీష్ (45) దోషి. ఇతను 2019లో హుణసూరు తాలూకా బిళకెరె పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు. పోక్సో కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి శ్యామ్ కంరోస్.. 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష
జోహన్నెస్‌బర్గ్: అత్యాచారం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన ఒక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 40 ఇండ్లలో దొంగతనాలు చేయడంతో పాటు 41 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినందుకు వెయ్యేండ్లకు పైగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి (2014-19) మధ్య ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలతో పాటు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవాడు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్లలో చోరీలకు పాల్పడటంతో పాటు 41 మంది మహిళలపైగా అత్యాచారం చేసినట్టు ధృవీకరించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. చదవండి: లైవ్‌లో రిపోర్టింగ్.. అనుకోని అతిథి రావడంతో షాక్ భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు -
ట్రాన్స్ఫార్మర్ దొంగలకు జైలు
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్‌జిల్లా): వ్యవసాయ బావుల వద్ద ఉన్న ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లిన దొంగల ముఠాకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లి గ్రామ పరిధిలో ఐదు ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాను 2013 అక్టోబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించగా.. మంగళవారం నాడు నేరం రుజువు కావడంతో వారికి న్యాయమూర్తి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.