serious allegations
-
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. -
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి: కాల్ లీక్ ప్రకంపనలు.. ఆ ఆడియోలో ఏముంది?
బనశంకరి(కర్ణాటక): ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య గత ఆదివారం నుంచి తలెత్తిన సంగ్రామం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. వివాదం నేపథ్యంలో వారిద్దరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా సర్కారు బదిలీ చేయడం తెలిసిందే. కాల్ లీక్ ప్రకంపనలు తాజాగా రూపా మౌద్గిల్– సామాజిక కార్యకర్త గంగరాజు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఇందులో రూపా తీవ్ర ఆరోపణలు చేయడం ఉంది. కబిని వద్ద ఒక స్థలం డీల్ చేయడానికి భూ రికార్డుల కోసం రోహిణి సింధూరి నా భర్త, ఐఏఎస్ మౌనీశ్ వద్ద సమాచారం తీసుకుందని రూపా ఆ ఆడియోలో చెప్పారు. రూపా గతంలో చేసిన ఆరోపణలను మళ్లీ ఈ కాల్లో ప్రస్తావించారు. ఆడియో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సారా మహేశ్ కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీకోసం హెచ్డీ.కుమారస్వామి, హెచ్డీ.దేవేగౌడ, ఇద్దరు ఐఏఎస్‌ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతేగాక ఆడియోలో గంగరాజుపైన రూపా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆమెను సపోర్టు చేస్తున్నారా, నువ్వు ఫైల్ పట్టుకుని పదేపదే ఆమె వద్దకు వెళ్లడం తప్పా ఏముంది, కాల్ రికార్డు చేసుకుంటావా, చేసుకో, నాకు వచ్చే కోపానికి.. అంటూ అసభ్య పదజాలంతో దూషించడం రికార్డయింది. మైసూరులో ఆడియో విడుదల ఐపీఎస్ రూపాతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను బుధవారం మైసూరులో సామాజిక కార్యకర్త గంగరాజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గొడవ మరింత జఠిలమయ్యే సూచనలే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో హాట్ టాపిక్‌గా మారింది. రోహిణి సింధూరి ఆమె పరిచయాలను ఉపయోగించుకుని భర్త అన్నను బీజేపీలోకి చేర్చాలని చూస్తోంది అని ఆడియోలో రూపా పేర్కొన్నారు. తన భర్త మౌనీశ్ తీరుపైనా, కుటుంబ వ్యవహారాలపైనా రూపా ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రూపా నన్ను పావుగా వాడాలని చూశారు. ఈ సందర్భంగా మీడియాతో గంగరాజు మాట్లాడుతూ ఐపీఎస్ రూపా నాపై కోపంతో మాట్లాడారు. నాతో 25 నిమిషాలు మాట్లాడారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా పోరాటం కోసం నన్ను ఉపయోగించుకునేందుకు ఆమె యత్నించారు. నాకు ఫోన్ చేసి భూ వ్యవహారాల గురించి సీబీఐ అధికారిలా ప్రశ్నించారు, రూపా నా మొబైల్ నుంచి ఫోటో తీసుకుని, వాట్సాప్ చాట్‌ను ఎమ్మెల్యే సా.రా మహేశ్‌కు పంపించారు. చదవండి: ఐపీఎస్ రూపా మౌద్గిల్‌ను కట్టడి చేయండి నన్ను అసభ్య పదజాలంతో మాట్లాడారు. రోహిణి అక్రమాల గురించి నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, మీడియా వద్ద వాటి గురించి మాట్లాడు అని చెప్పగా అందుకు నేను నిరాకరించానని ఆయన చెప్పారు. నా కుటుంబానికి ఏమైనా అయితే రూపానే కారణం. అధికారం మాటున ఆమె ఏమైనా చేయొచ్చని ఆయన ఆరోపించారు. ఆమె నా రాకపోకలను, కార్యకలాపాలపై నిఘా వేశారు, రూపాపై క్రిమినల్ కేసు వేస్తా అన్నారు. -
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి.. అసలు ఎందుకీ వివాదం?
బనశంకరి/ శివాజీనగర(కర్ణాటక): కన్నడనాట మహిళా ఐఏఎస్, మహిళా ఐపీఎస్ మధ్య సోషల్ మీడియా యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ డి. రూపా మౌద్గిల్ ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో ఆదివారం పలు పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూపా ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు. నాకు ఏజీ ఎందుకు వాదించలేదు? గతేడాది మైసూరు కలెక్టర్‌గా పనిచేసిన రోహిణి సింధూరి బదిలీ సమయంలో క్యాట్‌లో కేసు వేయగా, ఆమె తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వాదించి సహకరించారని, కన్నడిగులైన తమలాంటి వారికి ఎందుకు ఇటువంటి వెసులుబాటు ఇవ్వలేదని రూపా ప్రశ్నించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో అనేక ఫోటోలను, సుదీర్ఘమైన వాదనలను పోస్ట్ చేశారు. తాను 3 సంవత్సరాల కిందట యాదగిరిలో పనిచేసి, బెంగళూరుకు బదిలీ అయినప్పుడు మరో అధికారి క్యాట్‌లో కేసు వేస్తే అప్పుడు నా తరఫున ఏజీ ఎందుకు వాదించలేదు అన్నారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్‌లకు పంపించారని, ఇది సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించడమేనని, ఇంకా అనేక ఆరోపణలను రూపా సంధించారు. మానసిక వైద్యం చేయించుకో: రోహిణి ఆగ్రహం ఐపీఎస్ రూప నా ప్రైవేటు పోటోలు విడుదల చేయడం పై న్యాయపోరాటం చేస్తానని ఐఏఎస్ రోహిణి సింధూరి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ధ్వజమెత్తారు. రూపా మౌద్గిల్ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆమెపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. నేను వ్యక్తిగత ఫొటోలను ఎవరికి పంపించాను అనేది ఆమె బహిరంగపరచాలని, బాధ్యతాయుత స్థానంలో ఉంటూ ఇష్టానుసారం నా ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందని దుయ్యబట్టారు. కాగా, ఈ వ్యవహారం రాష్ట్ర పాలనా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి -
విద్వేష సిద్ధాంతాలతో దేశ పునాదుల్ని బలహీనపరిచే కుట్ర
న్యూఢిల్లీ: పటిష్ట పునాదులపై సమున్నతంగా నిల్చున్న భారత వారసత్వాన్ని బలహీనపర్చే కుట్రకు బీజేపీ తెర తీసిందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విభజన సిద్ధాంతాలతో దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ దేశానికి హాని తలపెడుతోందని బీజేపీని సోనియా తూర్పారబట్టారు. కాంగ్రెస్ 137 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ సోనియా వీడియో సందేశమిచ్చారు. ‘భారత దేశ సంస్కృతిలో ఒకటిగా కలిసిపోయి, అద్భుతంగా పరిఢవిల్లుతున్న హిందూ–ముస్లిం మత సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నియమాలను పక్కకుతోసి నియంత పాలన కొనసాగుతోంది’ అని సోనియా ధ్వజమెత్తారు. ‘ ఇకపై ఈ దారుణాలకు కాంగ్రెస్ మౌన సాక్షిగా ఉండబోదు. దేశ వారసత్వ భావాలను చెరిపేసే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుంది’ అని ఆమె హామీ ఇచ్చారు. ‘ భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం, పాత్ర లేని కొన్ని విభజన, విద్వేష శక్తులు ప్రస్తుతం దేశ లౌకికగుణాన్ని నాశనం చేసే దారుణానికి ఒడుగడుతున్నాయి’ అని పరోక్షంగా బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ‘ అర్హత లేకున్నా తమకూ దేశ చరిత్రలో స్థానం కల్పించుకునేందుకు చరిత్రను తిరగరాసే యత్నం చేస్తున్నారు’ అని సోనియా అన్నారు. కాగా, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండాను ఎగరేస్తుండగా హఠాత్తుగా జెండా నేలరాలింది. -
'ఢీ ' బేట్ హిల్లరీదే
అమెరికాలో వాడివేడిగా అధ్యక్ష అభ్యర్థుల చివరి డిబేట్ ► పుతిన్ కీలుబొమ్మ ట్రంప్.. ఆయుధ చట్టంలో మార్పులు చేయాల్సిందే: హిల్లరీ ► ఆమె చెడ్డ మహిళ: డొనాల్డ్ ట్రంప్ లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా చివరిదైన మూడో డిబేట్ బుధవారం రాత్రి వాడివేడిగా సాగింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ట్రంప్ పూర్తిగా ఆరోపణలకే పరిమితం కావడంతో ఈ డిబేట్లోనూ హిల్లరీ ఆధిపత్యమే కొనసాగింది. లాస్‌వెగాస్‌లోని నెవడా యూనివర్సిటీలో జరిగిన చివరి డిబేట్లో హిల్లరీదే పై చేయిగా మీడియా సర్వేలు సైతం పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని అంగీకరించాలా? లేదా? అన్నదానిపై నవంబర్ 8న దృష్టిపెడతానని, అప్పటి వరకూ ఉత్కంఠ కొనసాగుతుందని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతే ఫలితాన్ని అంగీకరించబోనంటూ పరోక్ష సంకేతాలిచ్చారు. హిల్లరీ, ట్రంప్‌లు ప్రారంభంలో కానీ, కనీసం చివరలో కానీ కరచాలనం చేసుకోపోవడం చూస్తే డిబేట్ ఎంత వాడివేడిగా సాగిందో అర్థమవుతుంది. మీడియా ఓటర్ల మనసుల్ని విషపూరితం చేసింది: ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని అంగీకరిస్తారా? అన్న సమన్వయకర్త క్రిస్ వాలెస్ ప్రశ్నకు స్పందిస్తూ...‘ఫలితాన్ని అంగీకరించడంపై నవంబర్ ఎనిమిది వరకూ ఉత్కంఠ కొనసాగిస్తాను. దానిపై అప్పుడు దృష్టిపెడతాను.. ప్రస్తుతం దేనిపైనా దృష్టిపెట్టడం లేదు’ అంటూ ట్రంప్ సమాధానమిచ్చారు. ‘మీడియా నిజాయితీగా వ్యవహరించడం లేదు. అవినీతిమయంగా తయారైంది. వారు ఓటర్ల మనసుల్ని విషపూరితం చేశారు’ అంటూ ట్రంప్ ఒకస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హిల్లరీ జోక్యం చేసుకుని.. ‘ఫలితాన్ని అంగీకరించేందుకు ట్రంప్ ఒప్పుకోపోవడం చాలా భయంకరం. ప్రతీది తాను అనుకున్నట్టుగా లేకపోతే రిగ్గింగ్ జరిగిందని చెప్పడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. ఇది ప్రజాస్వామ్య విధానం కాదు. అమెరికన్లు చాలా తెలివైన వారు. ప్రతి విషయాన్ని గ్రహించగలరు’ అని హిల్లరీ సమాధానమిచ్చారు. అబార్షన్‌పై నిర్ణయం మహిళల హక్కు.. హిల్లరీ: క్లింటన్ వర్గం మహిళలతో వరుసగా తనపై ఆరోపణలు చేయించారని ట్రంప్ విమర్శించారు. ‘అమెరికా అధ్యక్షురాలు అయ్యేందుకు హిల్లరీని అనుమతించకూడదు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె ఏం చేసిందో, ఇతర విషయాల్లో ఏం చేసిందో అందరికీ తెలుసు... వాటి ప్రకారం ఆమె అధ్యక్ష పదవికి అనర్హురాలు. పది నిమిషాల పేరు కోసం నాపై 10 మంది మహిళలు ఆరోపణలు చేశారు. వారు చెప్పిందంతా అబద్ధం. నేను ఏ తప్పూ చేయలేదు అందుకే నా భార్యకు కూడా క్షమాపణ చెప్పలేదు’ అంటూ ట్రంప్ ఆవేశంగా మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఆదాయపు పన్ను చెల్లించకుండా ట్రంప్ మోసగించారంటూ హిల్లరీ ఆరోపించగా.... ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హిల్లరీ చెడ్డ మహిళ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలు, అబార్షన్ హక్కులు, ఆయుధ చట్టంపై చర్చ సందర్భంగా అసహనానికి లోనైన ట్రంప్ సంప్రదాయ ఓటర్లను ఆకట్టుకునేలా తన వాదన వినిపించారు. అబార్షన్ మహిళల చెత్త నిర్ణయమని, వలసదారులు నేర కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారని, ప్రజలు ఆయుధాలు కలిగిఉండే అంశం రెండో సవరణను నిలుపుదల చేయాలని ట్రంప్ డిమాండ్‌చేశారు. భారత్, చైనా అధిక వృద్ధి రేటులతో అమెరికాను పోల్చిన ట్రంప్... అమెరికా వృద్ధి రేటు పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్య విషయంలో నిర్ణయం తీసుకోవడం మహిళల హక్కని, ఆయుధ చట్టంలో సంస్కరణలు చేయాల్సిందేనని హిల్లరీ చెప్పారు. దేశ అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు సమర్థులు కారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. వికీలీక్స్ రష్యా పనే: హిల్లరీ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆటబొమ్మగా మారతారంటూ హిల్లరీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వికీలీక్స్ వ్యవహారం అమెరికన్లకు వ్యతిరేకంగా రష్యా ప్రభుత్వం చేయిస్తున్న పని. అమెరికన్ వెబ్సైట్లు, వ్యక్తుల, సంస్థల ప్రైవేట్ ఖాతాల్ని రష్యా ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది. ఆ సమచారాన్ని వికీలీక్స్‌కు అందచేస్తోంది’ అంటూ హిల్లరీ క్లింటన్ చెప్పారు. మహిళల్ని ఎక్కువ గౌరవించేది నేనే: ట్రంప్ చివరి డిబేట్లో తన వ్యాఖ్యలతో ట్రంప్ ఒక్కసారిగా నవ్వులు పూయించారు. తనక ంటే ఎక్కువగా ఎవరూ మహిళల్ని గౌరవించరంటూ వ్యాఖ్యానించగా ప్రేక్షకులు ఒక్కసారి ముసిముసి నవ్వులు కురిపించారు. మహిళల్ని అవమానించడం గొప్ప చేస్తుందని ట్రంప్ భావించారంటూ హిల్లరీ విమర్శించగా జోక్యం చేసుకుంటూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీనే విజేత: సీఎన్ఎన్ చివరి డిబేట్లోనూ హిల్లరీనే విజేత. సీఎన్ఎన్ సర్వే ప్రకారం హిల్లరీ 52% మద్దతు సాధించగా, ట్రంప్‌కు 39 శాతమే అనుకూలంగా ఉన్నారు. సీఎన్ఎన్ సర్వే ప్రకారం మూడు డిబేట్లలోను హిల్లరీదే గెలుపు. అలాగే బ్రెయిట్‌బార్ట్ ఆన్లైన్ పోల్ ప్రకారం హిల్లరీకి 59.3 శాతం, ట్రంప్‌కు 40.65 శాతం అనుకూలంగా ఉన్నారు. ఎన్నికల రోజు హింస: నిపుణులు న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రోజు హింస జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరించారు. నవంబర్ 8న జరిగే ఈ ఎన్నికల్లో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పిలుపునిస్తున్న నేపథ్యంలో అతని అనుచరుల నుంచి ఇబ్బందులు ఎదురుకావొచ్చని భావిస్తున్నారు. దీని వల్ల ఓటింగ్‌లో పాల్గొనే ప్రజల సంఖ్య తగ్గే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు.