ఏడో దశకు ముగిసిన ప్రచారం
7 రాష్ట్రాలు, 2 యూటీలలోని 89 స్థానాలకు రేపే పోలింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఏడో దశ ప్రచారానికి సోమవారం తెరపడింది. ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 89 లోక్‌సభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. సుమారు 13.9 కోట్ల మంది ఓటర్లు 1,200 మందికిపైగా ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలతోపాటు 119 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు, పంజాబ్‌లో 13 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలు, బీహార్‌లో 7, జమ్మూకాశ్మీర్, దాద్రా నగర్ హవేలీ, దామన్ దయూలలో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. గుజరాత్, పంజాబ్‌లలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
బరిలో హేమాహేమీలు...
ఏడో దశ ఎన్నికల బరిలో నిలిచిన వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (రాయ్‌బరేలీ), బీజేపీ అగ్ర నేత ఎల్.కె. అద్వానీ (గాంధీనగర్), ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (వడోదరా), బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ (లక్నో)ల భవితవ్యాన్ని ఓటర్లు నిర్దేశించనున్నారు. బరిలోని ఇతర ప్రముఖుల్లో కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా (శ్రీనగర్),