రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
షాద్‌నగర్ : షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గహంలో ఆయన మాట్లాడారు. షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చడానికి అన్ని హంగులు ఉన్నాయన్నారు. అదేవిధంగా పరూఖ్‌నగర్ మండలంలోని చించోడ్, కొందుర్గు మండలంలోని చౌదర్‌గూడను మండల కేంద్రాలు చేయాలన్నారు. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో అధికశాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వారికి అనుకూలంగా ఉండడానికి షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. శంషాబాద్ రెవెన్యూ డివిజన్‌గా ఉంటే కొందుర్గు మండలంలో ఉన్న దూర గ్రామాలకు శంషాబాద్ 100 కిలోమీటర్ల అవుతుందన్నారు. షాద్‌నగర్ పాలమూరు జిల్లాలో ఉన్నపుడు చివరకే ఉందని, ఇప్పుడు శంషాబాద్ జిల్లాలో కూడా చివరికే ఉందన్నారు. షాద్‌నగర్ శంషాబాద్ జిల్లాలో కలపడం వల్ల కష్ణానీటికి, మహనీయులను మరిచిపోయే ప్రమాదముందన్నారు. వ్యక్తులపై ఆధారపడి జిల్లాలను విభజించొద్దన్నారు. షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే ప్రాణత్యాగాలు, నిరాహార దీక్ష, ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి విశ్వం, యాదయ్యయాదవ్, కట్ట వెంకటేష్, చెంది మహేందర్‌రెడ్డి, చెన్నయ్య, శంకర్, రామకష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.