shadnagar constituency
-
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదు : రాహుల్ గాంధీ
-
భారత్ జోడో యాత్రలో రాహుల్ రన్నింగ్
-
రెండింట్లో షాద్‌నగర్
1952లో మహబూబ్‌నగర్‌ను లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు. అప్పట్లో షాద్‌నగర్ మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోనే ఉండేది. ఆ తర్వాత 1967లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కేంద్రంగా ఏర్పాటుచేసి షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను దానిలో కలిపారు. అప్పటి నుంచి 2004 వరకు నాగర్‌కర్నూల్ పరిధిలోనే షాద్‌నగర్ ఉండేది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్‌కర్నూల్, పరిగి, కొడంగల్, అచ్చంపేట, షాద్‌నగర్ నియోజకవర్గాలు ఉండేవి. అయితే 2009లో తిరిగి షాద్‌నగర్‌ను మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా మహబూబ్‌నగర్ పరిధిలో షాద్‌నగర్ ఉంది. అయితే 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిపేశారు. అసెంబ్లీ రంగారెడ్డి, లోక్‌సభ మహబూబ్‌నగర్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఓటువేసిన షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు లోక్‌సభ ఎన్నికలకు మాత్రం ఓటును మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వేస్తున్నారు. దీంతో షాద్‌నగర్ రెండు జిల్లాల రాజకీయాలకు వారధిగా మారింది. పలు సందర్భాల్లో ఎంపీల గెలుపోటములను శాసించిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో షాద్‌నగర్ 1952లో పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సమయంలో మూడు ఎన్నికలు జరిగాయి. 1952లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.జనార్దన్‌రెడ్డి, 1957, 62లో రామేశ్వర్రావు ఎంపీగా విజయం సాధించారు. వారి గెలుపులో షాద్‌నగర్ నియోజకవర్గానికి కూడా భాగస్వామ్యం ఉంది. 1967లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాక అదే ఏడాది కాంగ్రెస్ పార్టీకి చెందిన జేబీ ముత్యాలరావు విజయం సాధించడంలో షాద్‌నగర్ కీలక పాత్ర పోషించింది. 1971, 77లలో వరుసగా రెండుసార్లు తెలంగాణ ప్రజా సమితి నుంచి పోటీ చేసిన భీష్మదేవ్ విజయం సాధించారు. 1980లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు అనంతరాములు, 1984లో తులసీరాం, 1989లో మల్లు అనంతరాములు విజయం సాధించారు. 1989లో మల్లు అనంతరాములు మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు మల్లు రవి గెలుపొందారు. మల్లురవి విజయంలోనూ షాద్‌నగర్ భాగమైంది. 1996లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మందా జగన్నాథం విజయం సాధించారు. 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మల్లురవి తిరిగి విజయాన్ని అందుకున్నారు. 1999, 2004లో వరుసగా రెండుసార్లు మందా జగన్నాథం విజయం సాధించగా ఈ విజయాల్లోను షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కీలక పాత్ర పోషించింది. 2009లో తిరిగి షాద్‌నగర్ నియోజకవర్గాన్ని మళ్లీ మహబూబ్‌నగర్ పార్లమెంట్లో కలిపారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆయన గెలుపులోను షాద్‌నగర్ కీలకంగా మారింది. అయితే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి పోటీ చేసిన జితేందర్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అత్యధిక మెజార్టీ ఇచ్చిన షాద్‌నగర్‌కే దక్కడం గమనార్హం. ప్రత్యేక శ్రద్ధ షాద్‌నగర్ నియోజకవర్గంలో వలస కార్మికులు, గ్రామీణ ప్రాంతం వారు ఎక్కువ ఉండడంతో ఎంపీ అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు షాద్‌నగర్ నియోజకవర్గానికి అభ్యర్థులు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఆయా పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
నామినేషన్ ఏరోజు వేద్దాం !
పెళ్లి చేయాలన్నా.. ఇల్లు నిర్మించాలనుకున్నా.. కుర్చీలో కూర్చోవాలనుకున్నా... ఇలా ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా తిథులు... వారాలు.. నక్షత్రాలు.. రోజులు, గడియలు చూస్తారు. అసలే ఎన్నికల సమయం కావడం నామినేషన్ల పర్వం సోమవారం నుంచి ప్రారంభం అవుతుండటంతో అభ్యర్థులు నామినేషన్లపై ప్ర«ధానంగా దృష్టి సారించారు. పుణ్యమాసమైన కార్తీక మాసంలో నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుండటంతో మంచి ముహూర్త కాలంలో నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు గాను అభ్యర్ధులు జ్యోతిష్యులు, పండితులతో ముహూర్త బలం గురించి చర్చలు జరుపుతున్నారు. సాక్షి, షాద్‌నగర్ టౌన్: అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నుంచి నామినేషన్ల పర్వానికి తెరలేవనుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులందరూ నామినేషన్లను దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 12 నుంచి 19 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 20న «నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సెంటిమెంటుకు విలువ ఇస్తూనే.. ఇప్పటి వరకు పార్టీలు ప్రకటించిన అభ్యర్థులతో పాటు పార్టీల నుంచి టికెట్ వస్తుందని ధీమాలో ఉన్న నేతలు, స్వతంత్ర అభ్యర్థులు, నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. అభ్యర్థులు సెంటిమెంటుకు విలువ ఇస్తూనే తమ పేరుపై రాజకీయ బలం ఎలా ఉందో చూసి చెప్పాలని జ్యోతిష్యులను అడుగుతున్నారు. జనంలో మంచి పేరు ఉంటే చాలు అన్ని రోజులు మంచివేననే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ముహూర్తాలు ఇలా.. 12వ తేదీ సోమవారం, పంచమి తిథి, పుర్వాషాడ నక్షత్రం కావడంతో అభ్యర్థులకు అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 13వ తేదీ మంగళవారం తిథి షష్టి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటడం, మంగళవారం కావడంతో కొందరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆసక్తి కనబర్చరు. 14వ తేదీ బుధవారం, సప్తమి తిథి, శ్రవణా నక్షత్రం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు అధికంగా వేసే అవకాశాలు ఉన్నాయి. 15వ తేదీ గురువారం, ఉదయం 8.45నిమిషాల వరకే సప్తమి తిథి ఉంది. ఆ తర్వాత అష్టమి వస్తుండటంతో ఆ రోజున నామినేషన్లు వేసే అవకాశాలు చాలా తక్కువ. 16వ తేదీ శుక్రవారం, తిథి అష్టమి ధనిష్ట నక్షత్రం కావడంతో నామినేషన్లు వేయడానికి అంతగా ఎవరు సాహసించకపోవచ్చు. 17వ తేదీ శనివారం, తిథి నవమి శతభిషా నక్షత్రం ఉండగా మధ్యాహ్నం 2.26 గంటల వరకు నవమి ఉంటుంది. వెంటనే దశమి వస్తుండటంతో ఆ రోజు ఎక్కువగా నామినేషన్లు పడే అవకాశాలు ఉంటాయి. 18వ తేదీ ఆదివారం 19వ తేదీ సోమవారం నామినేషన్ల చివరి రోజు. ఆ రోజు తిథి ఏకాదశి, ఉత్తరాభాద్ర నక్షత్రం కావడంతో ఆరోజు మంచి రోజుగా భావించి ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశాలు ఉంటాయి. మంచి ముహూర్తాలు ఉన్నాయి కార్తీక మాసం ప్రారంభం కావడంతో మంచి శుభ ముహూర్తాలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల కోసం ఈ వారం రోజులూ మంచి దివ్యమైన ముహుర్తాలే.. అభ్యర్థులు వారి వారి జాతక రీత్యా సుముహూర్త సమయంలో నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. – రవిశర్మ, బ్రాహ్మణ సేవా సమాఖ్య అడహక్ కమిటీ అధ్యక్షుడు, షాద్‌నగర్ -
భారీ వర్షం
- జిల్లాలో 5.2 సెం.మీ వర్షపాతం నమోదు - షాద్‌నగర్‌లో అత్యధికంగా 45 మి.మీ - కాగ్నా ఉరకలు.. దుందుబీ పరుగులు - రిజర్వాయర్, చెరువు, కుంటలకు జలకళ ‘సాక్షి’ నెట్వర్క్: వరుణుడు ఆలస్యంగైనా కరుణించడంతో జిల్లావ్యాప్తం గా ఐదురోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు అలుగుపారగా.. ఇప్పటివరకు చుక్కనీరు చేరని చెరువులు జలకళ సంతరించుకుంది. జిల్లాలో కాగ్నా, దుందుబీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికితోడు పలు ప్రాంతాల్లో లోతట్టుకాలనీల్లోకి వరదనీరు వచ్చిచేరడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షపాతం 5.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా నారాయణపేట పేట మండలంలో 45 మి.మీ. వర్షం నమోదైంది. షాద్‌నగర్ నియోజవర్గంలోని కొందుర్గు, కొత్తూరు మండలాల్లో భారీవర్షం పడింది. కొందుర్గు మండలం లాలాపేట శివారులోని వాగు పొంగి ఇళ్లలోకి వరద నీరు వ చ్చిచేరింది. లాలాపేట, ఉమ్మెంత్యాల, లచ్చంపేట, తుమ్మలపల్లి, ముట్పూర్, రేగడిచిల్కమర్రి, టేకులపల్లి, ఉత్తరాసిపల్లి, బైరంపల్లి, మహదేవ్పూర్ తదితర గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గుర్రంపల్లి ఊరచెరువు అలుగుపారుతోంది. రావిర్యాల ఏటిచెరువు, జాకారం తుర్కచెరువులు అలుగుకు దగ్గరలో ఉన్నాయి. కొత్తూరు మండలంలోని మల్లాపూర్ వాగు పొంగిపొర్లుతుంది. చేగూరు, మల్లాపూర్, మామిడిపల్లిలో పంటలు నీట మునిగాయి. మల్లాపూర్ శివారులోని కప్పకుంట చెరువుకు గండిపడటంతో నీరు వృథాగా పోతోంది. షాద్‌నగర్ మండలంలో 4.5సెం.మీ., కొత్తూరులో 2.82 కేశం పేటలో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొడంగల్‌లో ఐదు గంటల పాటు భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్- తాండూరు అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న కాగ్నా బ్రిడ్జిపై వరదనీరు ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహించింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న కోట్‌పల్లి డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహం పెరిగింది. ధారూర్, అనంతగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం వల్ల కాగ్నా నదికి వరద మరింత ఉధృతమైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, మానవపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కాశీపురంలో వర్షం నీటి ఉధృతి పెరిగి, గ్రామంలోని వీధుల్లో మూడు అడుగుల ఎత్తు మేర ప్రవహించింది. - దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్, అడ్డాకుల, దేవరకద్ర మండలాల్లో వర్షం పడింది. నారాయణపేట మండలంలో 3 సెం.మీ., కోయిల్‌కొండ, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో ఒక సెంటీమీటర్ లోపు వర్షపాతం నమోదైంది. పేట మండలంలోని సింగారం, పేరపల్లిలో రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. - కొల్లాపూర్ మండలంలోని ఉడుముల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మల్లేశ్వరం, పెంట్లవెల్లి, మొలచింతలపల్లి, ముకిలిగుండం ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బిజినేపల్లిలో అత్యధికంగా 2.14 సెం.మీ. వర్షం కురవగా తాడూరులో 1.58, తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌లో ఒక సెంటీమీటర్ లోపు వర్షంకురిసింది. - మక్తల్ మండలం పంచదేవ్‌పహాడ్, ఆత్మకూర్‌లోని కుమ్మరివీధి, అమరచింతలో మూడు మట్టిమిద్దెలు కూలిపోయాయి. సంగంబండ కాలువ నీరు దిగువకు చేరడంతో పత్తిపంట నీట మునిగింది. - గద్వాల నియోజకవర్గంలోని ధరూరు మండలంలో భారీ వర్షాల వల్ల నెట్టెంపాడు ప్రధాన కాలువ నీటిని చెరువులకు మళ్లించడంతో మన్నాపురం, సోంపురం, పారుచర్ల, పెద్దపాడు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. - జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో కురుస్తున్న వర్షానికి దుందుబీ వాగు ఉప్పొంగింది.