Shailesh Kumar
-
పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ మంచి పరిణామం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు పక్కా గృహాల కల్పనలో భాగంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం మంచి పరిణామమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని గ్రామీణ గృహ నిర్మాణ డైరెక్టర్(రూరల్ హౌసింగ్) శైలేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు పట్ల శైలేష్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–గ్రామీణ్) పురోగతిని పరిశీలించడంలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన శైలేష్‌కుమార్ విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సబ్సిడీపై నిర్మాణ సామగ్రి, పావలా వడ్డీకి రూ.35 వేలు సాయం వంటి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. పీఎంఏవై–గ్రామీణ్ కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పథకం అమల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా చెప్పడంతో సచివాలయాల వ్యవస్థ గురించి శైలేష్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. జేఎండీ ఎం.శివప్రసాద్, చీఫ్ ఇంజినీర్ జీవీ ప్రసాద్, ఎస్ఈలు జయరామాచారి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ వీరంగం : తప్పు చేశా నన్ను క్షమించండి !
అగర్తలా: ఓ పెళ్లి మంటపానికి వెళ్లి వీరంగం సృష్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ శైలేష్ కుమార్ తనను విధుల నుంచి వైదొలగించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్ నాథ్ మీడియాకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిష్పక్షపాతంగాగా జరగాలంటే తనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ శైలేష్ కుమార్ సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు రతన్‌లాల్ తెలిపారు. త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ శైలేష్‌కుమార్ యాదవ్ ఏప్రిల్ 26న అగర్తాలాలో ఓ వివాహం జరగాల్సి ఉండగా.. అక్కడకు వెళ్లి వీరంగం సృష్టించారు. వరుడు, వధువు, అతిథులతో పాటు, అక్కడే ఉన్న పురోహితులపై చేయిచేసుకున్నారు. కనిపించిన వారిపై చిర్రుబుర్రులాడారు. కలెక్టర్ చిందులు తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బ్రాహ్మణ సమాజ్ సంఘం నేతలు, వివిధ సామాజిక సంస్థలు, మానవ హక్కుల నేతలు, ప్రముఖ సింగర్ సోను నిగంలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. శైలేష్ కుమార్ యాదవ్‌ను సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. విచారణకు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విచారణకు హాజరైన శైలేష్ కుమార్ మాట్లాడుతూ.. 'కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినందుకే చర్యలు తీసుకున్నా. చట్టాన్ని అమలు చేయడం నా కర్తవ్యం. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి’’ అంటూ యూటర్న్ తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ గా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డైరెక్టర్ రావెల్ హమేంద్ర కుమార్ డీఎమ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వైరల్: అతిథిలా వచ్చిన కలెక్టర్.. వధూవరులపై కేసు నమోదు -
‘రిషబ్’ స్కామ్ నిందితుల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముసుగులో చిట్టీలు, ఫిక్సిడ్ డిపాజిట్ల పేరుతో వందల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితులు శైలేశ్‌కుమార్ గుజ్జర్, అతడి భార్య నందినిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కుంభకోణం విలువ రూ.70 కోట్లు ఉంటుందని అధికారికంగా తేలినా.. బాధితులు మొత్తం బయటకు వస్తే రూ.200 కోట్లు దాటుతుందని తెలుస్తోంది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామని, తదుపరి విచారణకు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరతామని అదనపు డీసీపీ జోగయ్య వెల్లడించారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు విలువైన చిట్టీలు నిర్వహించడంతోపాటు మెచ్యురిటీ పూర్తయిన, పాడుకున్న వారికి నెలకు రూ.2 వడ్డీ ఆశచూపి ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లుగా తమ వద్దే ఉంచుకున్నారు. కొన్నాళ్లు వడ్డీ చెల్లించిన శైలేశ్ హఠాత్తుగా కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పరారీలో ఉన్న వారిద్దరినీ పట్టుకునేందుకు సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చివరకు గురువారం సమీప బంధువు ఇంట్లో తలదాచుకున్న ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిని రిషబ్ సంస్థ కార్యాలయంతోపాటు ఇంటికి తీసుకెళ్లి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారాల్లో పెట్టుబడులు.. చిట్టీలు, డిపాజిట్ల రూపంలో కాజేసిన డబ్బును హైదారాబాద్‌తోపాటు రాష్ట్రాల్లో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టానంటూ శైలేశ్ వివరించాడు. ఆ వ్యాపారాల్లో నష్టాలే మిగిలాయని చెప్పాడు. నిందితుడు చెప్పిన వివరాల్లో నిజానిజాలు తేల్చాలని పోలీసులు నిర్ణయించారు. కాగా, నిందితులపై బాధితులు దాడికి యత్నించారు. డబ్బులు ఇప్పించాలని సీసీఎస్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. -
లాలూ కుమార్తెపై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, ఆమె భర్త శైలేశ్ కుమార్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక కోర్డు జడ్జి ఎన్కే మల్హోత్రా ఎదుట ఈడీ న్యాయవాది నితేశ్ రాణా శనివారం చార్జిషీటు దాఖలు చేశారు. మీసా, శైలేశ్‌లపై నమోదైన మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే ఢిల్లీలోని వారి ఫామ్ హౌస్‌ను అటాచ్ చేసింది. ‘ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద దక్షిణ ఢిల్లీలోని ఫామ్ హౌస్‌ను అటాచ్ చేశాం. ఆ ఫామ్ హౌస్ మీసా, శైలేశ్‌లకు చెందినది. మిషైల్ ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద నమోదైంది. 2008–09లో మనీ ల్యాండరింగ్‌లో భాగంగా రూ.1.2 కోట్లతో దాన్ని కొనుగోలు చేశారు’ అని ఈడీ పేర్కొంది. మీసా భారతి, శైలేశ్ ఈ కంపెనీకి డైరెక్టర్లుగా కూడా పని చేశారని ఆరోపించింది. -
లాలూ కుటుంబానికి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ మరో షాకిచ్చింది. ఢిల్లీ, పాట్నలోని కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక లాలూ కూతురు మిసాభారతి, భర్త శైలేష్ కుమార్ ఆస్తులకు తుది అటాచ్మెంట్ ఆర్డర్‌ను జారీచేసింది. బినామి ఆస్తుల కేసు విచారణలో భాగంగా ఐటీ ఈ చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే లాలూ ప్రసాద్‌పై ఐటీ ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 5నే సౌత్ వెస్ట్ ఢిల్లీలోని బిజ్వాసాన్ ప్రాంతంలో మిసాభారతి ఫామ్‌హౌజ్‌ను ఈడీ అటాచ్ చేసింది. బినామి ఆస్తుల విచారణలో భాగంగా లాలూ భార్య రబ్రీదేవిని కూడా ఐటీ ఆగస్టులో విచారించింది. -
లాలూ కుమార్తెకు జరిమానా
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతికి ఆదాయపన్ను శాఖ తాజాగా సమన్లు జారీ చేసింది. జూన్ 12న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మిసా భారతి భర్త శైలేశ్‌కుమార్ రేపు ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు అధికారి ముందు హాజరుకానున్నారు. రూ.1000 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఈరోజు విచారణ అధికారి ముందు మిసాభారతి హాజరుకావాల్సివుంది. అయితే ఆమె హాజరుకాకపోవడంతో రూ. 10 వేలు జరిమానా విధించింది. వ్యక్తిగత హాజరు నుంచి మిసా భారతికి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరగా దర్యాప్తు అధికారి తిరస్కరించారు. లాలూ తనయ, అల్లుడు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో గత నెలలో ఆదాయపన్ను శాఖ అధికారులు వారి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. వీరి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రాజేశ్ కుమార్ అగర్వాల్‌ను ఈడీ అధికారులు మే 22న అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా భారతి, శైలేశ్‌లకు ఆదాయపన్ను శాఖ సమన్లు జారీ చేసింది. -
లాలూ కూతురికి ఐటీ సమన్లు
-
లాలూ కూతురు, అల్లుడికి ఐటీ సమన్లు
న్యూఢిల్లీ: రూ.వెయ్యి కోట్లు బినామీ ఆస్తులు, పన్ను ఎగవేత కేసులకు సంబంధించి ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కూతురు మిసా భారతి, అల్లుడు శైలేశ్‌కుమార్‌కు ఆదాయపు పన్ను శాఖ సమన్లు జారీ చేసింది. మే 22న వీరి అకౌంటెంట్ రాజేశ్‌కుమార్ అగర్వాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగా జూన్ మొదటి వారంలో ఎంపీ భారతి, శైలేశ్‌కుమార్ తమ ముందు హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఐటీ దాడులతో తనను మాట్లాడకుండా ఆపడం బీజేపీకి సాధ్యం కాదని లాలూ ట్వీటర్లో పేర్కొన్నారు. -
షాబుద్దీన్ నేరస్తుడు కాదు సంఘసేవకుడు
పట్నా: జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ క్రిమినల్ కాదట. సంఘసేవకుడట. ఈ మాటలన్నది కోర్టు కాదు.. ఆర్జేడీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ శైలేష్ కుమార్ అలియాస్ బులో మండల్. షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదల అయినందుకు వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. శివాన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షాబుద్దీన్ నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, నేరస్తుడు కాదని శైలేష్ చెప్పారు. 'శివాన్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా షాబుద్దీన్‌కు పాపులారిటి ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు' అని అన్నారు. షాబుద్దీన్ విడుదలపై బీజేపీ, మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. షాబుద్దీన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఇది ప్రభుత్వ నిర్ణయంకాదని అన్నారు. గతంలో 300 మందిని హత్య చేసిన కేసులో రణవీర్ సేన చీఫ్ బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియాకు ఇదే కోర్టు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వాన్ని నిందించడం తగదని శైలేష్ చెప్పారు.